
జార్జ్ గామోవ్ (చిత్రం) గత శతాబ్దానికి చెందిన ఓ ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ఖగోళశాస్త్రవేత్త. లమేత్ర్ మొదట ప్రతిపాదించిన ‘బిగ్ బాంగ్’ సిద్ధాంతాన్ని ఇతడు పెంచి పోషించాడు. Quantum tunneling ద్వారా Alpha decay ని వివరిస్తూ ఇతడు ఓ సిద్ధాంతాన్ని రూపొందించాడు.
గామోవ్ గొప్ప జనవిజ్ఞాన (పాపులర్ సైన్స్) రచయిత కూడా. లోగడ జార్జ్ గామోవ్ రాసిన ‘Mr Tompkins in wonderland’ అన్న పుస్తకంలో ఓ భాగాన్ని ‘సుబ్బారావు సాపేక్ష వాదం’ అన్న పేరుతో...
కొలంబియాలో ని గువచారా గుహని హంబోల్ట్ మహాశయుడు సందర్శించాడు గాని ఆ గుహ ఎంత లోతు వుందో పూర్తిగా తెలుసుకోలేకపోయాడు. 2500 అడుగుల లోతుకి వెళ్ళాడు గాని అంత కన్నా లోతుకి పోలేకపోయాడు. అలాగే కెంటకీ లో కూడా అతి విశాలమైన గుహ ఒకటుంది. అందులో పెద్ద సరస్సు ఉంది. సరస్సు మీద ఐదొందల అడుగుల ఎత్తున గుహ యొక్క చూరు ఉంటుంది. అందులోని సొరంగాల శాఖల పొడవు నలభై మైళ్ల పొడవు ఉంటుందని దాన్ని చూసిన యాత్రికులు చెప్తారు. కాని నా ఎదుట ప్రస్తుతం కనిపిస్తున్న విశాలమైన గుహ్య ప్రాంతంతో పోల్చితే అవన్నీ చిన్నపాటి బొరియలు. పైన మెరిసే మేఘాలు, చుట్టూ తుళ్ళిపడే విద్యుల్లతలు,...

వైరస్ లు కణాలని ఎలా ఇన్ఫెక్ట్ చేస్తాయి అన్న విషయం మీద ఎంతో సవివరమైన సమాచారం ఓ ప్రత్యేకమైన వైరస్ ల మీద జరిగిన అధ్యయనాల వల్ల తెలిసింది. ఆ వైరస్ ల పేరు బాక్టీరియో ఫేజ్ (bacteriophage). వీటి గురించి ఫ్రెడెరిక్ విలియం ట్వార్ట్ అనే శాస్త్రవేత్త 1915 లో కనుక్కున్నాడు. 1917 లో కెనడా కి చెందిన ఫెలిక్స్ హుబర్ట్ ద హెరెల్ కూడా స్వతంత్రంగా ఈ వైరస్ ల మీద అధ్యయనాలు జరిపాడు. చిత్రం ఏంటంటే ఈ వైరస్ లు బాక్టీరియాలని నాశనం చేస్తాయి. అంటే క్రిములని చంపే...
మొదట్లో నాకు ఏమీ కనిపించలేదు. ఒక్కసారిగా అంత కాంతి కనిపించేసరికి కళ్లు బైర్లు కమ్మాయి. తిరిగి కళ్లు తెరిచేసరికి ఎదుట కనిపించిన దృశ్యం చూసి అదిరిపోయాను.
“సముద్రం!” గట్టిగా అరిచేశాను.
“అవును” అన్నాడు మామయ్య సమర్ధిస్తూ. “ఇది లీడెన్ బ్రాక్ సముద్రం. దీన్ని మొట్టమొదట కనుక్కున్నది నేనే నని ఒప్పుకోడానికి మరే ఇతర అన్వేషకుడికి అభ్యంతరం ఉండదేమో.”
ఎదురుగా ఓ విశాలమైన జలాశయం. దీన్ని సముద్రం అనాలో, సరస్సు అనాలో అర్థం కావడం లేదు. దాని ఆవలి గట్టు కనిపించడం లేదు. ఈ దృశ్యం చూస్తే గ్రీకు ఇతిహాసంలో ఓ సన్నివేశం గుర్తొస్తోంది. యుద్ధంలో ఓడిపోయి...

వైరస్ యొక్క పరిమాణం గురించి కొంత ప్రాథమిక అవగాహన ఏర్పడ్డాక శాస్త్రవేత్తలు వైరస్ ల అంతరంగ నిర్మాణం మీద దృష్టి సారించారు. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా కి చెందిన హైన్జ్ ఫ్రెంకెల్-కాన్రాట్ మరియు రాబ్లీ విలియమ్స్ లు కలిసి టోబాకో మొసాయిక్ వైరస్ లోని ప్రోటీన్ అంశాలని శోధించారు. వైరస్ పదార్థాన్ని తగు రసాయనిక సంస్కారాలకి గురి చేస్తే అందులోని ప్రోటీన్ పదార్థం 2,200 శకలాలుగా విరిగిపోయింది. ఒక్కొక్క శకలంలో సుమారు 158 అమినో ఆసిడ్లు ఉన్న ప్రోటీన్...
నా ముఖంలో ఆశ్చర్యం చూసి మామయ్య అడిగాడు –
“ఏవయ్యింది ఏక్సెల్?”
“నిన్నో ప్రశ్న అడగాలి? నేనిప్పుడు ఆరోగ్యంగానే ఉన్నానంటావా?”
“అందులో సందేహం ఏవుంది?”
“నా ఎముకలన్నీ కుదురుగానే ఉన్నాయా?”
“నిశ్చయంగా.”
“మరి నా తల?”
“ఏవో కొన్ని దెబ్బలు తగిలాయి గాని, ఉండాల్సిన చోటే భుజాల మీదే కుదురుగా వుంది.”
“కాని ఏమో నా తలకి ఏదో అయినట్టు అనిపిస్తోంది.”
“తలకి ఏమీ కాలేదు. కాని కాస్త మతిస్థిమితం తప్పింది.”
“అంతే అయ్యుంటుంది. మరైతే మనం తిరిగి ఉపరితలానికి వచ్చేశామా?”
“ముమ్మాటికీ లేదు.”
“కాని మరి నాకు ఎక్కడో వెలుగు కనిపిస్తోంది, గాలి ఊలలు...

రచన - రసజ్ఞ
1910లో Drosophila melanogaster (fruit fly) ఈగల మీద మోర్గాన్ కొన్ని ప్రయోగాలను జరిపాడు. అయితే వీటిలో ముఖ్యమయిన విషయం లింగ వివక్ష. ఆడ (జన్యు పరిభాషలో ఆడవారిని ♀ గుర్తుతో సూచిస్తారు) ఈగలు, మగ (జన్యు పరిభాషలో మగవారిని ♂ గుర్తుతో సూచిస్తారు) ఈగలు అని రెండు రకాలుగా ఉంటాయి. X, Y అనే క్రోమోజోముల మీదే లింగ నిర్ధారణ ఆధారపడి ఉంటుంది. ఆడ ఈగలకి XX అనే క్రోమోజోములు వుంటే, మగ ఈగలకి మాత్రం XY ఉంటాయి. వీటిల్లో మళ్ళీ పసుపురంగు శరీరం (yellow...
postlink