శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

యుగాంతం వరకు సాగిన ఆట

Posted by శ్రీనివాస చక్రవర్తి Saturday, April 6, 2013
మహమ్మారి సంఖ్యలకి సంబంధించిన మరో కథ కూడా భారతంలోనే పుట్టింది. ఈ సమస్య పేరు “లోకాంతం.” W.W.R. బాల్ అనే గణిత చారిత్రకుడు ఈ సమస్యని ఇలా వర్ణిస్తాడు.కాశీలో ఓ గొప్ప ఆలయం వుంది. ఆ ఆలయం లోకానికి కేంద్రంలో వుందని ఓ నమ్మకం. ఆ ఆలయానికి అడుగున ఓ ఇత్తడి ఫలకం మీద మూడు వజ్రపు మేకులు గుచి ఉన్నాయట. ఒక్కొక్క మేకు సుమారు ఇరవై అంగుళాల పొడవు ఉంటుందట. మేకుల మందం ఓ తేనెటీగ శరీరం యొక్క మందాన్ని పోలి వుంటుందట. సృష్టి కార్యం పూర్తయ్యాక దేవుడు ఈ మేకులలో ఒక దాని మీద అరవై నాలుగు బంగారు పళ్లేలని ఉంచాడట. వాటిలో అతి పెద్ద పళ్లెం ఇత్తడి ఫలకం మీద ఉంచబడింది. దాని మీద వరుసగా ఇంకా ఇంకా చిన్న పళ్లేలు అమర్చబడ్డాయట. పైనున్న పళ్లెం అడుగున ఉన్న పళ్లెం కన్నే ఎప్పుడూ చిన్నదే అయ్యేలా అమర్చబడ్డాయి. ఈ పళ్లేల ఏర్పాటుకి బ్రహ్మ స్తంభం అని పేరు. కొన్ని కచ్చితమైన, చిరంతనమైన బ్రహ్మ సూత్రాలని అనుసరిస్తూ ఆ గుళ్లోని పూజారి బంగారు పళ్లేలని ఒక మేకు నుండి మరో మేకుకు మార్చుతూ పోతుంటాడు. ఈ కొత్త మేకు లో కూడా ఎప్పుడూ ఓ పెద్ద పళ్లెం కింద చిన్న పళ్లెం రాకుండా చూసుకోవాలి అన్నది నియమం. ఈ విధంగా మొత్తం అరవై నాలుగు పళ్లేలని ఒక మేకు నుండి మరో మేకుకి మార్చగలిగిన రోజు ఆ మేకులు, పళ్లేలు, ఆలయం, అందులోని పూజార్లు మాత్రమే కాక ఈ సమస్త విశ్వం లిప్తలో నాశనం అవుతుంది.చిత్రం 3 లో కథలో చెప్పిన పళ్లేల ఏర్పాటు కనిపిస్తోంది. అయితే చిత్రంలో మొత్తం అరవై నాలుగు పళ్లేలు కనిపించడం లేదని గుర్తించాలి. కావాలంటే ఈ సరదా ఆటని మీరే ఇంట్లో తయారుచేసుకోవచ్చు. బంగారు పళ్లేలకి బదులు అట్ట పళ్లేల తోను, వజ్రపు మేకులకి బదులు సాధారణ మేకులతోను ఈ ఆట ఆడుకోవచ్చు. పళ్లేలని మార్చడానికి అవలంబించవలసిన సరైన పద్ధతి ఏంటో సులభంగానే తెలుసుకోవచ్చు. ఒక పళ్లేన్ని మార్చడానికి పట్టే సమయం దాని ముందు పళ్లేన్ని మార్చే సమయానికి రెండింతలు ఉంటుంది. మొదటి పళ్ళేన్ని మార్చడానికి ఒక్క మెట్టు చాలు. రెండవ పళ్లేన్ని మార్చడానికి రెండు మెట్లు. అలా పోతుంటే అరవై నాలుగవ పళ్ళేన్ని మార్చడానికి పట్టే మెట్ల సంఖ్య ఇందాక సిస్సా బెన్ డాహిర్ కథలో గోధుమ గింజల సంఖ్యతో సమానం అవుతుంది!బ్రహ్మ స్తంభంలో ఒక మేకు నుండి మరో మేకుకి పళ్లేలని మార్చడానికి మొత్తం ఎంత సమయం పడుతుంది? గుళ్ళో పూజార్లు విసుగు విరామం లేకుండా, రాత్రనక పగలనక, క్షణానికో మెట్టు చెప్పున వేస్తూ ఈ ఆట ఆడుతూ పోయారని అనుకుందాం. ఏడాదిలో 31,558,000 క్షణాలు ఉంటాయనుకుంటే ఈ ఆట పూర్తి కావడానికి యాభై ఎనిమిది వేల బిలియన్ల సంవత్సరాలు పడుతుందని గమనించాలి!

పైన చెప్పుకున్న గాధలో ఆట పూర్తయ్యేసరికి యుగాంతం వస్తుందని వుందని కనుక, ఆ ఆట విశ్వం యొక్క ఆయుర్దాయం ఎంతో తెలియజేస్తోంది. ఆధునిక విజ్ఞానం ప్రకారం విశ్వం వయసు యొక్క అంచనాతో ఈ సంఖ్యని పోల్చుదాం. విశ్వవికాసానికి చెందిన ప్రస్తుత సిద్ధాంతం ప్రకారం తారలు, సూర్యుడు, గ్రహాలు, మన ఈ భూమి, అన్నీ అరూపమైన ఆదిమ పదార్థం నుండి 3,000,000,000 ఏళ్ల క్రితం ఆవిర్భవించాయి. తారల తేజానికి కారణమైన “పరమాణు ఇంధనం” మన సూర్యుడి విషయంలో అయితే మరో 10,000,000,000 నుండి 15,000,000,000 ఏళ్ళ వరకు వస్తుందని అంచనా. కనుక ఎలా చూసినా విశ్వం యొక్క ఆయుర్దాయం 20,000,000,000 ఏళ్లకి మించి వుండదు. కథలో చెప్పుకున్నంత సుదీర్ఘమైన ఆయుర్దాయం (యాభై వేల బిలియన్ సంవత్సరాలు) మన విశ్వానికి లేదు. అయితే అది వట్టి కథే కదా!సాహిత్యంలో పేర్కొనబడ్డ సంఖ్యల్లో అతి పెద్ద సంఖ్య ప్రఖ్యాత “అచ్చు వాక్య సమస్య” అనే సమస్యలో ప్రస్తావించబడిందని అనిపిస్తుంది. ఓ ప్రత్యేకమైన ముద్రణాలయం వుందనుకుందాం. అందులోని ముద్రణ యంత్రం ఎడతెరిపి లేకుండా వాక్యాలని వరుసగా ముద్రిస్తూ పోతుంది. ప్రతీ వాక్యంలోను అక్షరాల, ఇతర చిహ్నాల కూర్పు ప్రత్యేకంగా ఉంటుంది. ఏ రెండు వాక్యలు ఒక్కలా వుండవు. అలాంటి యంత్రంలో పలు చక్రాలు ఓ దొంతరలా పేర్చబడి వుంటాయి (చూడు చిత్రం). ప్రతీ చక్రానికి దాని అంచు మీదుగా వివిధ అక్షరాలు, ఇతర వ్యాకరణ చిహ్నాలు అచ్చువేయబడి వుంటాయి. కారులో గేర్లు ఒకదానికొకటి తగులుకుని వున్నట్టు, ఈ చక్రాలు కూడా ఒకదాంతో ఒకటి సంధించబడి వుంటాయి. అంటే ఒక చక్రం ఒక పూర్తి చుట్టు వేసేసరికి, రెండవ చక్రం ఒక్క స్థానం ముందుకు జరుగుతుంది. అలాంటి ముద్రణ యంత్రాన్ని సులభంగానే నిర్మించొచ్చు.

ముద్రణ మొదలయ్యింది. ఏవేవో పిచ్చి వాక్యాలు ముద్రించబడ్డ కాగితం యంత్రం లోంచి బయటపడుతోంది. ఆ వాక్యాలలో చాలా వాటికి అర్థం పర్థం వుండదు.

“ఆఆఆఆఆఆఆఆ”

“భలెభలెభలెభలె….”

“కసరగహజిలగహళ్ళక్కుబనిసారట…”అయితే ఈ యంత్రం సాధ్యమైన ప్రతీ అక్షర కూర్పుని ముద్రిస్తుంది కనుక అక్కడక్కడ కొన్ని మామూలు పదాలు గల వాక్యాలు కూడా దొర్లవచ్చు. (అయితే వాటికి పెద్దగా అర్థం ఉండకపోవచ్చు…) ఉదాహరణకి –

“నిలుచున్న ఆవుకి ఆరు కాళ్లుండును.”

“ఈ చెప్పులన్నిటిని నూనెలో దోరగా వేయించిన పిమ్మట…”

ఇలాంటి వ్యర్థ పదార్థమే కాక,

“మందార మకరంద మాధుర్యమున దేలు మధుపంబు వోవునే…”

వంటి ఆణిముత్యాలు కూడా దొర్లవచ్చు.

ఇలాంటి ముద్రణ యంత్రం చరిత్రలో మనిషి రాసిన, ఊహించిన ప్రతీ పదాన్ని, వాక్యాన్ని (తగినంత సమయం వేచి చూస్తే) ముద్రిస్తుంది. ప్రతీ కథ, ప్రతీ పాఠం, ప్రతీ కవితారేఖ, ప్రతీ సద్గ్రంథం, ప్రతీ సంపాదకీయం, ప్రతీ వార్త, ప్రతీ ప్రేమ లేఖ, ప్రతీ పెళ్లి పుస్తకం… ఆ ముద్రణా యంత్రం యొక్క సత్తాకి అందని అక్షరమాలే లేదు.

(ఇంకా వుంది)

2 comments

  1. Suresh A Says:
  2. live samachar

    Nice Blog i will visit again

     
  3. sms take Says:
  4. its a good site science Telugu and we can improve our knowledge of this site.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email