సంఖ్యల గురించిన ఏ చర్చలో అయినా, అందులో ఫ్రెంచ్ గణితవేత్త ఫర్మా ప్రతిపాదించిన మహత్తర సిద్ధాంతం యొక్క ప్రస్తావన రాకుంటే, ఆ చర్చ ఒక విధంగా అసంపూర్ణమే. అయితే ఈ సిద్ధాంతానికి ప్రధాన సంఖ్యలకి మధ్య సంబంధం లేదు. ఈ సమస్యకి వేళ్లు ప్రాచీన ఈజిప్ట్ లో వున్నాయి. ఒక త్రిభుజంలోని భుజాలు 3:4:5 నిష్పత్తిలో ఉన్నట్లయితే ఆ త్రిభుజంలో ఒక లంబ కోణం తప్పనిసరిగా ఉండాలని ప్రాచీన ఈజిప్ట్ కి చెందిన ప్రతీ వడ్రంగికీ తెలిసి వుంటుంది. ఆ రోజుల్లో వడ్రంగులు వాడే పరికరాలలో ఈ రకమైన త్రిభుజాలు ఉన్నాయని మనకిప్పుడు తెలుసు.
మూడవ శతాబ్దంలో అలెగ్జాండ్రియాకి చెందిన...
సోమవారం, ఆగస్టు 17
ఆదిమ యుగానికి చెందిన ఆ రాకాసి జీవాల ప్రత్యేక లక్షణాలని గుర్తుతెచ్చుకోడానికి ప్రయత్నించాను. పరిణామ క్రమంలో మాలస్క్ లు, క్రస్టేషియన్లు, చేపలకి తరువాత, స్తన్య జీవాలకి ముందు వచ్చిన జీవాలివి. అవి భూతలాన్ని సరీసృపాలు ఏలుతున్న రోజులు. రెండవ దశలో ఈ జీవాలు సముద్రాల మీద అధిపత్యం చేశాయి. కొండంత కాయాలు గల ఆ జీవాల బలం వర్ణనాతీతం. మనం నేడు చూసే మొసళ్లు ఆ మహాకాయాల యొక్క అల్పమైన ప్రతిరూపాలు.
ఆ రాకాసి జీవాల గురించి తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. వాటిని సజీవంగా చూసిన మానవుడు లేడు. మనిషి రాకకి వెయ్యి యుగాలకి ముందు...

సంఖ్యా శాస్త్రం లోకెల్లా ఆణిముత్యం లాంటి సిద్ధాంతం ఒకటుంది. దాన్ని ఇంతవరకు నిజమని గాని, తప్పని గాని నిరూపించడం సాధ్యపడలేదు. దాని పేరు గోల్డ్ బాక్ అనిర్ధారిత ప్రతిపాదన (Goldbach conjecture). 1742 లో చెయ్యబడ్డ ఈ ప్రతిపాదన యొక్క సారాంశం ఇది – “రెండు కన్నా పెద్దదైన ప్రతీ సరి సంఖ్యని రెండు ప్రధాన సంఖ్యల కూడికగా వ్యక్తం చెయ్యొచ్చు.” ఈ వాక్యాన్ని అర్థం చేసుకోడానికి కొన్ని సరళమైన ఉదాహరణలు – 12=7+5, 24=17+7, 32=29+3… (ఈ సూత్రం 4 X 10^18 వరకు వర్తిస్తుందని...
ఆదివారం ఆగస్టు 16.
అదే పరిస్థితి. అదే వాతావరణం. గాలిలో ఏదో కొత్తదనం. మెలకువ రాగానే మొట్టమొదట వెలుగులో ఏదైనా మార్పు ఉందేమో చూడాలన్న ఆలోచన వచ్చింది. పైన సాగుతున్న తటిల్లతా విన్యాసం ఏ కారణం చేతనైనా అణగారిపోతుందేమో నని, ఆగిపోతుందేమో నని ఎందుకో భయం. కాని ఆ భయాలని తరిమేస్తూ మా తెప్ప యొక్క నీడ పడిలేచే కెరటాల మీద స్పష్టంగా కనిపించింది.
చూడబోతే ఈ సముద్రానికి హద్దులు లేనట్టు ఉంది. మధ్యధరా సముద్రం అంత పెద్దదా? లేకపోతే అట్లాంటిక్ మహాసముద్రం అంతదా?
మామయ్య పదే పదే లోతు కొలుస్తున్నాడు. మా వద్ద ఉన్న గొడ్డళ్లలో ఓ బరువైన గొడ్డలికి ఓ పొడవాటి...
Demystifying the Brain - కొత్త పుస్తకం
పాపులర్ మీడియాలో మెదడు గురించి కొన్ని చిత్రవిచిత్రమైన కథనాలు చలామణిలో ఉంటాయి. ఉదాహరణకి “మన మెదడు సామర్థ్యంలో మనం 10% మాత్రమే వాడుతాము” అని తరచు అంటుంటారు. ఈ నమ్మకం ఎక్కణ్ణుంచి వచ్చిందో, దానికి ఆధారాలేమిటో ఎవరికీ తెలీదు. అలాగే “ఈ విశ్వంలో అత్యంత సంక్లిష్టమైన వస్తువు మెదడు” అని మరో విపరీత వాక్యం!
మెదడు నిజంగానే ఓ గొప్ప వస్తువు. కాని దాని గొప్పదనాన్ని అతిశయమైన అలంకారంతో, అర్థం చేసుకోకుండా, దాన్నొక మాటలకందని “మహత్యం”లా పరిగణిస్తూ భజన చేసే పద్ధతి శాస్త్రీయం కాదు. ఓ బోయింగ్ 787 లాగానే మెదడు...
postlink