శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

జీవ పదార్థాన్ని నిర్వచించిన కేకులే

Posted by V Srinivasa Chakravarthy Thursday, September 4, 2014
ఈ రకమైన సంయోజనా ప్రయత్నాల వల్ల ఒక విషయం అర్థమయ్యింది. జీవ పదార్థపు ఉత్పత్తులని కృత్రిమంగా ప్రయోగశాలలో సృష్టించడంతో రసాయన శాస్త్రవేత్త పని అయిపోలేదు. కర్బన రసాయనాలని పోలిన లక్షణాలు కలిగినా, జీవ పదార్థంలోని లేని సమ్మేళనాలని కూడా సంయోజించడానికి వీలవుతుందని అర్థమయ్యింది. పందొమ్మిదవ శతాబ్దపు రెండవ అర్థభాగంలో ఈ పద్ధతిలో కర్బన రసాయనాలని కృత్రిమంగా సంయోజించే ప్రయత్నం  మహత్తర స్థాయిలో జరిగింది.

మూలాలు జీవపదార్థంలో వున్నాయా లేదా అన్న ప్రవేశార్హతను బట్టి సమ్మేళనాలని కర్బనం, అకర్బనం అని వర్గీకరించే పద్ధతి పందొమ్మిదవ శతాబ్దపు నడిమి కాలానికల్లా నిరర్థకం అని తెలిసింది. ఏ జీవ శరీరంలోను దొరకని కొత్త కర్బన రసాయనాలని సృజించడానికి వీలయ్యింది. అయినా కూడా అలాంటి విభజన పూర్తిగా నిరుపయోగంగా తోచలేదు. ఎందుకంటే ఈ రెండు వర్గాల సమ్మేళనాల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలు వున్నాయి. ఆ తేడాలు ఎంత ముఖ్యమైనవి అంటే ఒక కర్బన రసాయన శాస్త్రవేత్త వాడే రసాయన విధానాలకి ఒక అకర్బన రసాయన శాస్త్రవేత్త వాడే రసాయన విధానాలకి మధ్య ఎంతో తేడా వుంది.

పోగా పోగా ఈ రెండు రసాయన వర్గాలకి మధ్య రసాయనిక విన్యాసంలోనే ఎంతో తేడా వుందని అర్థమయ్యింది. రెండిట్లో ఉండే అణువులు వేరనిపించింది. పందొమ్మిదవ శతాబ్దపు రసాయన శాస్త్రవేత్తలు వ్యవహరించిన అకర్బన రసాయనాలలో అధిక శాతం చిన్న అణువులే ఉండేవి. అణువుకి రెండు నుండి ఎనిమిది పరమాణువులకి మించి వుండేవి కావు. డజనుకి పైగా పరమాణువులు వుండి అంతో ఇంతో ప్రాముఖ్యత గల అకర్బన రసాయనాలు బహు తక్కువ.

కాని కర్బన రసాయనాలలో అతి సామాన్యమైన వాటిలో కూడా డజనుకి పైగా పరమాణువులు ఉంటాయి. ఇక పిండి పదార్థం, ప్రోటీన్లు మొదలైన రసాయనాల విషయంలో అయితే, వాటిలో వుండే బృహత్తర అణువులలో వేల, లక్షల సంఖ్యలో పరమాణువులు ఉంటాయి.

అందుచేతనే ఎంతో సంక్లిష్టమైన కర్బన రసాయనాలని అతి సులభంగా, పూర్వ స్థితికి మరల్చలేని విధంగా బద్దలు కొట్టొచ్చు. కొద్దిగా వెచ్చజేయడం లాంటి అతి సున్నితమైన విఘాతకారక ప్రభావాలకే అవి ఛిన్నాభిన్నం అయిపోతాయి.
అందుకు విరుద్ధంగా అతి కఠినమైన పరిస్థితులని కూడా అకర్బన రసాయనాలు తట్టుకోగలుగుతాయి.

క్రమంగా కర్బన రసాయనాల విషయంలో మరో సత్యం తేటతెల్లం కాసాగింది. ప్రతి కర్బన రసాయనంలోను మినహాయింపు లేకుండా ఒకటి, లేక అనేక కార్బన్ పరమాణువులు ఉన్నట్టు తెలిసింది. ఇంచుమించు అన్నిట్లోను కార్బన్ తో పాటు హైడ్రోజన్ కూడా వుంటుంది. కార్బన్, హైడ్రోజన్ మూలకాలు జ్వలనీయాలు కనుక అవి ముఖ్యాంశాలుగా గల కర్బన రసాయనాలు కూడా మండే లక్షణం కలిగి ఉండడంలో ఆశ్చర్యం లేదు.


ఇలా ఉండగా ఫ్రెడెరిక్ ఆగస్ట్ కేకులే ఫాన్ స్ట్రాడోనిట్జ్ (ఇతణ్ణి సామాన్యంగా కేకులే అని పిలుస్తారు) అనే  ఓ జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఓ సహేతుకమైన కార్యాన్ని చేపట్టాడు. 1861  లో ప్రచురించబడ్డ ఓ కర్బన రసాయన శాస్త్ర పాఠ్య  పుస్తకంలో ఇతడు కర్బన రసాయనాలని ‘కార్బన్ సమ్మేళనాలకి చెందిన రసాయన శాస్త్రం’ గా నిర్వచించాడు. దాన్ని బట్టి అకర్బన రసాయన శాస్త్రం అంటే కార్బన్ లేని సమ్మేళనాల శాస్త్రం అని అర్థమయ్యింది. ఈ నిర్వచనాన్ని అందరూ సమ్మతించారు. అయితే కొన్ని కర్బన సమ్మేళనాలు (ఉదాహరణకి కార్బన్ డయాక్సయిడ్, కాల్షియమ్ కార్బనేట్) సామాన్యమైన కర్బన  సమ్మేళనాల కన్నా సామాన్య అకర్బన సమ్మేళనాలని పోలి ఉండడం కనిపించింది. అలాంటి కర్బన సమ్మేళనాలని అకర్బన రసాయన శాస్త్ర పాఠ్యపుస్తకాలలోనే విపులంగా చర్చించడం జరుగుతుంది.

3 comments

  1. కార్బన్ డయాక్సయిడ్, కాల్షియమ్ కార్బనేట్ వంటి వాటిలో ఉదజని ఉండదు. అలాగే సైనోజన్ రాడికల్‌లో కర్బనం ఉన్నా ఉదజని లేదు కదా. ఇవన్నీ అకర్బనసమ్మేళనాలతో పాటే మూటకట్టేస్తాము సాధారణంగా.

    అందుచేత, కర్బనం మరియు ఉదజని రెండూ ఉన్నవే కర్బనరసాయనాలు అనుకోవచ్చునని అనిపిస్తోంది. అంతే నంటారా?

     
  2. Organic chemistry is defined as:
    the branch of chemistry that deals with carbon compounds (other than simple salts such as carbonates, oxides, and carbides). (web)
    మీ ప్రశ్నకి ఈ సమాధానం సరిపోతుంది అనుకుంటా...

     
  3. Unknown Says:
  4. నిజానికి జీవం పదార్ధం కానే కాదు జీవం అంటే భావ శక్తీ. ఒక రాయి, ఒక మట్టి ముద్ద , లేదా ఏదైనా ఇనార్గానిక్ వస్తువుల లాంటివే ఈ దేహం కూడా ఈయన కేకులే జ్ఞానంలో ఒక భాగం ఐన కేవలం రసాయన శాస్త్రానికి చెందిన వ్యక్తి

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts