శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

భారతి లిపి - ఒక దేశం, ఒకే లిపి.

Posted by V Srinivasa Chakravarthy Tuesday, November 1, 2016





భారతి లిపి గురించి ఈ మధ్య సాక్షి టీవీ లో ఇచ్చిన ముఖాముఖి లో కొన్ని ముఖ్యాంశాలు...
 
ఉపోద్ఘాతం


మన దేశం సాంస్కృతికంగా గొప్ప వైవిధ్యంతో కూడుకున్న దేశం. ఇన్ని భాషలతో, మతాలతో, జాతులతో ఇంత సామాజిక వైవిధ్యం గల దేశం మరొకటి లేదేమో. ఒక్క భాషలనే తీసుకుంటే మన దేశంలో 22 అధికార భాషలు ఉన్నాయి. ఇవి కాక 2001 నాటి జనాభా లెక్కల ప్రకారం 122 ప్రధాన భాషలు ఉన్నాయి. అంటే వీటిలో ఒక్కక్క దాన్ని కనీసం 10,000 మాట్లాడుతారు అన్నమాట. ఇవి కాక మన దేశంలో కాస్త చిన్న చిన్న బృందాల చేత వాడబడే భాషల సంఖ్య 1,599. విధంగా భాషలలో ఉండే వైవిధ్యం చాలనట్టు భాషల యొక్క లిఖిత రూపంలో కూడా గొప్ప వైవిధ్యం వుంది. మన దేశంలో ప్రధానంగా 11 లిపులు (ఇంగ్లీష్ లిపిని కూడా కలుపుకుంటే) వాడడం జరుగుతుంది.

ఎన్నో ఇతర ప్రపంచ దేశాలలో లాగా మన దేశంలో కూడా దేశం అంతటా ఒకే భాష ప్రాచుర్యంలో ఉంటే దాని వల్ల ఎంతో మేలు జరుగుతుంది. కాని హిందీ, ఇంగ్లీష్ అనుసంధాన భాషలలాగా ఎంతో ఉపయోగపడుతున్నా, దేశం మొత్తం సహజంగా ఒకే భాష ని స్వీకరించడం కాస్త జటిలమైన సమస్యే. పోనీ భాష స్థాయిలో ఐక్యత సాధించలేకపోయినా, లిపి స్థాయిలో ఏకత్వాన్ని సాధించగలమా?

ప్ర. పలు భాషలకి ఒకే లిపి అనేది ప్రపంచంలో ఎక్కడైనా వుందా?
.
భాషలు వేరైనా లిపి ఒక్కటే కావడం అనే పరిస్థితి చాలా మందికి ఆశ్చర్యకరంగా అనిపించవచ్చు. ఎందుకంటే మన దేశంలో అధికంగా భాషకి లిపి (తెలుగు భాషకి తెలుగు లిపి, హిందీ భాషకి దేవనాగరి లిపి మొ) అనే ఏర్పాటే మనకి అలవాటు. కాని నిజానికి ఆలోచిస్తే భాషకి లిపికి మధ్య అవినాభావ సంబంధం ఏమీ లేదు. చూడడానికి కాస్త ఎబ్బెట్టుగా ఉంటుందన్న మాటే గాని, కావాలనుకుంటే హిందీ భాషని తెలుగు లిపిలో రాసుకోవచ్చు, తెలుగు భాషని కన్నడ లిపిలో రాసుకోవచ్చు

మన దేశంలో ఇలా భాషకి లిపికి మధ్య గాఢమైన సంబంధం ఉండడం మనకి అలవాటైపోయింది గాని, పాశ్చాత్య యూరప్ లోని పరిస్థితి చూస్తే భాషకి లిపి మధ్య సంబంధం ఎంత బలహీనమో అర్థమవుతుంది. పాశ్చాత్య యూరప్ లో ఇంగ్లీష్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్, పోర్చుగీస్, స్పానిష్, డచ్, ఫిన్నిష్, స్వీడిష్  మొదలుకుని ఎన్నో భాషలని ఏకైక లిపిలో రాస్తారు. అదే మనకి తెలిసినఇంగ్లీష్” (లేదా రోమన్) లిపి. భాషని బట్టి అక్షరాలలో అక్కడక్కడ చిన్న చిన్న మార్పులు చేర్పులు చేసుకోవాల్సి రావచ్చునేమో గాని, మొత్తం మీద భాషలన్నిట్లోను అక్షరమాల ఒక్కటే. ఇలాంటి పరిస్థితి వల్ల ఆయా దేశాల మధ్య సమాచార వినియమనం అంత మేరకు సుగమం అవుతుంది. భాష అనే అవరోధం అప్పటీకీ ఉంటుంది. కాని లిపి అనే అవరోధం తొలగించబడుతుంది. అందుకే ఒక పర్యాటకుడు పశ్చిమ యూరప్ లో దేశానికి వెళ్లినా (ఇంగ్లీష్ లిపి తెలిస్తే చాలు) ఊరి పేర్లు, వీధి పేర్లు మొదలైనవి సులభంగా చదువుకోలడు.

ఒకే దేశం అయినా మన దేశంలో అలాంటి వెసులుబాటు లేదు. ఒక తెలుగు వాడు కేరళకి ప్రయాణిస్తే మలయాళం లిపి తెలిస్తే గాని స్థానిక ఊరి పేర్లు, వీధి పేర్లు చదువుకోలేడు. ఒక గుజరాతి వ్యక్తి తెలంగాణలోనో, ఆంధ్ర రాష్ట్రంలోనో పల్లె ప్రాంతాల్లో ప్రాయాణిస్తే తెలుగు లిపి తెలియకపోతే ఇబ్బంది పడతాడు. ఇలా కాకుండా దేశం అంతటా భాషలు వేరైనా ఒకే లిపి వాడుకలో ఉంటే దేశంలో వివిధ ప్రాంతాల్లో సంచారం మరింత సులభం అవుతుంది.
దేశం అంతటా ఒకే లిపి యొక్క ఒక అవసరం మునుపటి కాలంలో కన్నా ఇటీవలి కాలం మరింత ఎక్కువగా అనుభవం అవుతోంది. రోజుల్లో ఉద్యోగ రీత్యా ఒక రాష్ట్రంలో వారు ఇతర రాష్ట్రాలకి వలస పోవడం తరచు జరుగుతోంది. ముఖ్యంగా .టి. రంగంలోని వారు కొన్నేళ్ళకి ఒక రాష్ట్రాన్ని మారుతూ పని చేసే పరిస్థితి ఏర్పడుతోంది. మనం కొత్త రాష్ట్రానికి ప్రయాణించిన ప్రతి సారి అక్కడి లిపి ని నేర్చుకోవాలి  అంటే అంత సులభమైన పని కాదు. ఒక కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడి స్థానికులతో మాట్లాడి కొత్త భాషని మౌఖికంగా నేర్చుకోవచ్చు. కాని ఒక వయసు వచ్చాక కొత్త లిపిని నేర్చుకోవడం అంత సులభం కాదు. దృష్ట్యా చూసినా దేశం అంతటా ఎన్ని భాషలు ఉన్నా, లిపి మాత్రం ఒక్కటే  ఉంటే ఎంతో ఉపకరిస్తుంది.

అలాంటి ఏకైక లిపి ఉండాలనే ఆలోచనతో భారతి లిపి ని రూపొందించడం జరిగింది.

ప్ర. ఉన్న లిపులలోనే ఏదో ఒక దాన్ని వాడొచ్చు కదా? మళ్ళీ కొత్త లిపి ఎందుకు?
. నిజమే. ఇక్కడ రెండు సమస్యలు ఉన్నాయి

ఒకటి సాంఘిక సమస్య. ఉన్న లిపులలోనే ఏదో ఒకటి ఎంచుకుని, దాంతోనే అన్ని భాషలు రాయాలి అన్నప్పుడు అది లిపి అన్న ప్రశ్న వస్తుంది. ఎవరికి వారు తమ లిపే తక్కిన అందరూ వాడాలని పట్టు పడతారు.  అది తక్కిన వర్గాలకి నచ్చకపోవచ్చు.

రెండవ సమస్య కాస్త సాంకేతిక సమస్య. మన లిపులు చాలా సంక్లిష్టమైనవి. అవసరమైన దాని కన్నా చాలా సంక్లిష్టమైనవి అంటాను.  ఉన్న లిపులు అన్నిటికన్నా భారతి లిపి ఎంతో సులభమైనది. భారతి లిపిని స్కూలు పిల్లలకి నేర్పించే ప్రయత్నం చేస్తున్నాం. కేవలం 30-40 నిముషాల వివరణతోనే హై స్కూలు పిల్లలు భారతిలో పదాలు రాయగలుతున్నారు. దానికి కారణం భారతి చాలా తర్కబద్ధంగా రూపొందించబడింది.

ప్ర. భారతి ప్రత్యేకత ఏమిటి? అది సులభమైన లిపి అని ఎలా అంటున్నారు?
. భారతి యొక్క రూపకల్పన అర్థం కావాలంటే మన దేశంలో వివిధ లిపులలో అక్షర కూర్పుని ఒక సారి పరిశీలించాలి. మన దేశంలో కింది భాషలు అన్నిట్లోను అక్షరాల కూర్పులో ఎంతో పోలిక ఉంటుంది. భాషలు (లిపులు) – దక్షిణ భారతంలో తెలుగు, కన్నడం, తమిళం, మలయాళం, ఉత్తర భారతంలో హిందీ/దేవనాగరి, గుజరాతి, పంజాబి (దీన్నిగురుముఖి లిపిలో రాస్తారు), బెంగాలి, ఒరియా.  మొత్తం తొమ్మిది లిపులు. తెలుగు లిపిలో లాగానే వీటిలో అక్షరాలని అచ్చులు, హల్లులు, గుణింతం, ఒత్తు అక్షరాలు విధంగా వర్గీకరిస్తారు.
అయితే వీటన్నిట్లోను అక్షరాలు అవసరమైన దాని కన్నా మరింత సంక్లిష్టంగా ఉంటాయి. అది ఎందువల్లనో కొన్ని ఉదాహరణలు చూద్దాం.

తెలుగులో మొదటి అక్షరాలైన అచ్చులతో మొదలుపెడదాం

, , , , , , , , , , , , , అం, అః

అచ్చుల క్రమంలోఅచ్చు- దాని దీర్ఘ రూపంఇలా వరుసగా వస్తాయి. ఒక అచ్చుకి, దాని దీర్ఘ రూపానికి మధ్య సంబంధం ఎలా ఉంటుందో చూడండి.’ని ఒక కొసన కాస్తవెనక్కి మెలిపెట్టిరాస్తేవస్తుంది. అలాగేలోని మధ్య గీతని కాస్త ముందుకి సాగదీసి పైకి మెలిపెట్టి, దాంతో పాటు నెత్తిన రెండు నిలువు గీతలు పెడితేవస్తోంది. కానికిమద్య అలాంటి పోలికే కనిపించదు. అలాగేమీద ఒకచాపంని గీస్తేవస్తుంది. ‘మీద ఒక చిన్న నిలువు గీత గీస్తేవస్తోంది. పై ఉదాహరణలలో మనకి కనిపించేది ఏంటంటే, ‘దీర్ఘంఅనే ఒకే భావనని, దృశ్య రూపంలో వ్యక్తం చెయ్యడానికి అనేక రకాల ప్రక్రియలని వాడుతున్నాం. దీర్ఘం ఉన్న ప్రతీ చోట ఒకే విధంగా దృశ్య రూపంలో దాన్ని వ్యక్తం చేస్తే అక్షరాలు మరింత సులభంగా అవుతాయి కదా? మన అక్షర మాల అవసరమైన దాని కన్నా సంక్లిష్టం కావడానికి ఇదొక కారణం.

ఇక హల్లులని తీసుకుంటే, హల్లులని అడ్డు, నిలువు వరుసలలో ఒక పట్టికలా వ్యకం చేస్తాము. అడ్డు వరుసలలో , , .. , .. మొదలైన వర్గాలు ఉంటాయి. , , , లని కంఠ్యాలు అంటాము. ఎందుకంటే అవి కంఠం లోంచి పుడతాయి. , మొదలైనవాటిని తాళవ్యాలు అంటాము. ఎందుకంటే అవి తాళం (palate)   నుంచి పుడతాయి. అలాగే, , , మొదలైనవి ఓష్ఠ్యాలు అంటాము. ఎందుకంటే అవి పెదాలు (ఓష్ఠాలు) మూయగా పుట్టే శబ్దాలు. అలాగే నిలువు వరుసలలో ఉండే అక్షరాలని అల్పప్రాణాలు, మహాప్రాణాలు అని, ఘోష, అఘోష అని వర్గీకరించడం జరుగుతుంది.  అంటే హల్లుల పట్టికలో ఒక అక్షరం యొక్క స్థానం బట్టి అక్షరం ఏమిటో చెప్పొచ్చు. ఒక విధంగా  కెమిస్ట్రీ లో periodic table   ఉన్నంత శాస్త్రీయత మన లిపుల హల్లుల పట్టికలో కనిపిస్తుంది

అక్షరానికి రెండు ముఖాలు ఉంటాయిఒకటి రూపం, మరొకటి శబ్దం. నిజానికైతే రూపానికి, శబ్దానికి మధ్య లోతైన సంబంధం ఉండాలి. శబ్దం తెలిస్తే రూపం ఎలా ఉంటుందో ఊహించగలగాలి. రూపం కనిపించగానే దాని శబ్దం ఎలా ఉంటుందో స్ఫురించాలి. శబ్దం బట్టి ఒకేలా ఉండే అక్షరాల మధ్య రూపం బట్టి కూడా పోలిక ఉండాలి. అయితే వాస్తవంలో మన లిపులలో నియమాలు అంతగా పాటించబడవు. అందుకే వాటిని నేర్చుకోవడంలో ఎన్నో ఇబ్బందులు ఎదురవుతాయి.
సమస్యలని అధిగమించేలా భారతి లిపిని రూపొందించడం జరిగింది. భారతి లిపి రూపకల్పనలో కింది సూత్రాలని అనుసరించడం జరిగింది.

-      అచ్చులన్నిటికి ఒక సామాన్య ఆధారరూపం ఉంటుంది. సామాన్య ఆధారానికి పైన పెట్టే  గుర్తుల బట్టి అచ్చు ఏమిటో తెలుస్తుంది.
-      అలాగే హల్లులలో కూడా ప్రతీ వర్గానికి ఒక సామాన్య ఆధారరూపం ఉంటుంది. దాని కింద పెట్టే గుర్తుల బట్టి వర్గంలో వివిధ అక్షరాలు ఏర్పడతాయి. ఉదాహరణకి భారతిలోఅక్షరం కింది కొన్ని ప్రత్యేక గుర్తులు పెడుతూ పోతే , , మొదలైన అక్షరాలు ఏర్పడతాయి.
-      ఒక అతి సులభమైన ప్రక్రియతో అచ్చుని,హల్లుని కలపగా గుణింతం ఏర్పడుతుంది.
-      భారతిలోపొల్లుని పోలిన గుర్తు ఒకటి ఉంటుంది. పొల్లుని ఉపయోగించి వత్తు అక్షరాలు రాయడం జరుగుతుంది.


 
భారతి లిపిలో అచ్చులు

 

భారతి లిపిలో హల్లులు


 
భారతి లిపిలో గుణింతం


ప్ర. భారతి లిపిని సమాజంలోకి తీసుకెళ్లడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారు?

. భారతి లిపితో ప్రస్తుతం చేపడుతున్న కార్యక్రమాలు

-      భారతి లిపికి సులభంగా అలవాటు పడేలా వివిధ భాషల్లో వాచకాలని తయారుచేస్తున్నాం.
-      చిన్న పిల్లల కథల పుస్తకాలని ప్రతీ పేజిలోను ఒక పక్క తెలుగు (లేదా ఇతర భాషా లిపి) లిపి, మరోపక్క భారతి లిపిలో వ్యక్తం చేస్తూ ప్రచురించే ప్రయత్నం చేస్తున్నాం
-      భారతి అక్షరాలతోపదకూర్పుకి సంబంధించిన క్రీడలు తయారు చేస్తున్నాం.
ఉదాహరణకి కింది చిత్రం చూడండి.

 

భారతి లిపిని సులభంగా వినియోగించ గలిగేలా  వివిధ సాంకేతిక వనరులు:
-      భారతి లిపిలో టైప్ చేసేందుకు గాని ఫాంట్లు రూపొందించడం జరిగింది.
-      తెలుగులో (లేదా ఇతర భారతీయ భాషల్లో) ఉన్న ఫైల్ ని, ఒకే బటన్ నొక్కి, భారతి లిపిలోకి మార్చగలిగేలా సాఫ్ట్ వేర్ రూపొందించడం జరిగింది.
-      భారతి లిపిలో ఎస్.ఎమ్.ఎస్. లు పంపేందుకు గాను ఆప్ ను రూపొందించడం జరిగింది. స్మార్ట్ ఫోన్ లో స్టయిలస్ తో భారతి లిపిలో రాస్తే, ఆప్ రాసిన అక్షరాలు గుర్తుపట్టి ఔట్ పుట్ ని మనకి కావలసిన భారతీయ లిపిలో వ్యక్తం చేస్తుంది. భాషను మాట్లాడడం మాత్రమే వచ్చి, రాయడం చదవడం తెలియని వారికి ఆప్ బాగా పనికొస్తుంది.
దీని పేరు Bharati Handwriting Keyboard. దాని logo ఇలా ఉంటుంది.

 

ప్ర. భారతి వల్ల కలిగే సత్ప్రయోజనాలు ఏమిటి?
. భారతి వల్ల కింది సత్ప్రయోజనాలు కలుగుతాయని ఆశిస్తున్నాం.
-      భారతి లిపి సరళంగా ఉంటుంది గనుక, నేర్చుకోవడం సులభం కనుక, లిపిని వాడితే అక్షరాస్యత మరింత వేగంగా పెరిగే అవకాశం వుంది.
-      దేశం అంతటా ఒకే లిపి వాడితే, ఒక రాష్ట్రం నుండి మరో రాష్ట్రానికి వలస పోయేవారికి పనికొస్తుంది.
-      దేశంలో వివిధ భాషా సంఘాలని వేరు చేసే లిపి అనే అవరోధం తొలగిపోతుంది
-      నవతరం వారికి భారతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. నవతరం పిల్లల్లో చాలా మందికి తమ మాతృభాష చదవడం, రాయడం రాకపోవడం విచారకరం. ఇంట్లో మాట్లాడడం ద్వార భాషని మౌఖికంగా నేర్చుకుంటారు. భారతి లిపిని నేర్చుకుంటే, దాని ద్వార, దానితో వచ్చే సాంకేతిక వనరుల సహాయంతో, మాతృభాషలో ఉండే సమాచారాన్ని భారతి లిపిలో చదవగల్గుతారు. విధంగా నవతరానికి మాతృభాషలో ఉండే సాహిత్యంతో పరిచయం ఏర్పడుతుంది.
-      దేశం అంతటా ఒకే లిపి వినియోగంలో ఉంటే పర్యాటకులకి అనువుగా ఉంటుంది. దాంతో పర్యాటక రంగం వృధ్ధి చెందుతుంది.
-      దేశం అంతటా ఏకైక లిపి యొక్క వినియోగం దేశాన్ని సహజంగా సమైక్యపరుస్తుంది.





6 comments

  1. ramakrishna Says:
  2. లిపిలోని అక్షరాలు సులభంగా ఉన్నాయ్. కాని చుక్క, డాష్, గీతలు అక్షరాల మధ్య భేదాలు నిర్ణయిస్తూ ఉన్నాయి.ఇవి వేగంగా రాసేటప్పుడు
    అడ్డంకి అవుతాయి. ఒక అక్షర గుర్తు పక్క అక్షరానికి చెందిందిగా పొరపడే అవకాశం ఎక్కువ.


     
  3. ramakrishna Says:
  4. లిపిలోని అక్షరాలు సులభంగా ఉన్నాయ్. కాని చుక్క, డాష్, గీతలు అక్షరాల మధ్య భేదాలు నిర్ణయిస్తూ ఉన్నాయి.ఇవి వేగంగా రాసేటప్పుడు
    అడ్డంకి అవుతాయి. ఒక అక్షర గుర్తు పక్క అక్షరానికి చెందిందిగా పొరపడే అవకాశం ఎక్కువ.


     
  5. రామకృష్ణ గారు మీరు మంచి పాయింట్ చెప్పారు. ఆ సమస్యని ఊహించే చుక్క, డాష్ లు వాడడం జరిగింది. చుక్క ఎప్పుడు అక్షరానికి కింద, కుడి పక్క మాత్రమే వస్తుంది. చుక్క కాస్త జరిగి అవతలి అక్షరం కిందకి వచ్చినట్టు కనిపించినా అది ఆ అక్షరానికి కింద ఎడమ పక్కకి వస్తుంది కనుక ఆ చుక్క అంతకు ముందరి అక్షరానికి చెందినది అని కచ్చితంగా అన్వయించుకోగలము. అలాంటి పరిష్కారమే డాష్ కి కూడా వస్తుంది. భారతి లిపి గురించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే తప్పకుండా అడగండి. అలాగే వీలైతే Bharati Handwriting Keyboard ఆప్ ని డౌన్ లోడ్ చేసుకుని వాడి చూడండి.

     
  6. meda Says:
  7. సర్, నమస్తే. మీ ప్రయత్నం భారతదేశ లిపుల చరిత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలకబోతుంది. ఆదిలో కొన్ని చిక్కులు ఎదురైనా తుదికి చక్కని లిపిగా నిలుస్తుoదని విశ్వసిస్తూ, మీ ఈ "వన్ నేషన్ - వన్ స్క్రిప్ట్" ఉద్యమంలో నన్ను భాగస్వామ్యునిగా చేసినందుకు ధన్యవాదాలు సర్.

     
  8. meda Says:
  9. This comment has been removed by the author.  
  10. అయ్యా,
    ఒక అక్కరాన్ని రాశాక వెనుకకు వచ్చి చుక్కలు గీతలు పెట్టటం సరిఐనది కాదు. దానితో రాత, కంప్యూటర్ ముందుకు సాగవు.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts