శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.
భూగ్రహానికి స్వాగతంనీలి నైట్రోజెన్ నింగితోద్రవ్య జలాల సాగరాలతోచల్లని వనాలతోపచ్చని పచ్చికతోజీవకళతో తొణికిసలాడే ప్రపంచానికి సుస్వాగతంవిశ్వదృక్కుతో చూస్తే ఇది అతిసుందరమైనఅరుదైన ప్రపంచంప్రస్తుతానికి చాలా ప్రత్యేకమైన ప్రపంచంవిశాలమైన దేశకాలాలలో ఇంతవరకు మనం చేసిన యాత్రల వల్ల మనకి తెలిసిన దాంట్లో మహావిశ్వంలోసజీవమైసచేతనమైన పదార్థం మరెక్కడా లేదు.  మనలాంటి ప్రపంచాలు విశ్వమంతా విస్తరించి ఉండొచ్చుకాని వాటి కోసం మన అన్వేషణ ఇక్కడే మొదలవుతుందికోట్ల సంవత్సరాల సుదీర్ఘ పరిణామానికి అంతంలోమన పూర్వ తరాలు సాధించిన అనుభవంపరిజ్ఞానం అంతా ఆన్వేషణకి మద్దతు నిస్తోందిగొప్ప జీవనోత్సాహంతోప్రతిభతోతెలుసుకోవాలన్న తీరని దాహంతో ఉర్రూతలూగే వ్యక్తులు మన చూట్టూ ఉన్నారుజ్ఞానాన్వేషణకి విలువనిచ్చే యుగం మనదిమన వేళ్లు తారలలో ఉన్నాయిఇంతకాలమూ  భూమి మీద మజిలీ చేశాముఇక సొంతింటికి తిరిగెళ్లే సుదీర్ఘ యాత్ర ఇప్పుడిప్పుడే మొదలౌతోంది.

ఎన్నో ఇతర మానవ ఆవిష్కరణల లాగానేభూమి ఒక చిన్ని ప్రపంచం అన్న ఆవిష్కరణ మధ్య ప్రాచ్య ప్రాంతంలో జరిగిందిఅది జరిగిన కాలం క్రీ.పూమూడవ శతాబ్దం అంటారుజరిగిన స్థలం  కాలంలో  మహానగరంగా పరిగణించబడే ఈజిప్షియన్ నగరమైన అలెగ్జాండ్రియా ఊళ్లో ఎరటోస్తినిస్ అనే వ్యక్తి జీవించేవాడుఅతడి పట్ల అసూయతో అతడి సమకాలికుడు ఒకడు అతడికి “బీటా” అని పేరు పెట్టాడుగ్రీకు అక్షరమాలలో అది రెండవ అక్షరంఎరటోస్తినిస్ అన్నిట్లోను ద్వితీయ స్థానంలో  ఉంటాడని సూచించేలా  పేరు ఎంచుకున్నాడా పెద్దమనిషికాని నిజానికి ఎరటోస్తినిస్ అన్నిట్లోను “ఆల్ఫా” గానే నిలిచాడుఅతడొక ఖగోళవేత్తచరిత్రకారుడుభౌగోళికుడుకవినాటక విమర్శకుడుగణితవేత్త కూడా. ‘’ఖగోళశాస్త్రం’’, 
బాధ నుండి విముక్తి” మొదలుకొని ఎన్నో విస్తృత అంశాల మీద పుస్తకాలు రాశాడు

అలెగ్జాండ్రియాలోని ప్రఖ్యాత గ్రంథాలయానికి అతడు దర్శడుగా ఉండేవాడు గ్రంథాలయంలో ఒక రోజు అతడికి  తాళపత్ర గ్రంథం కంటబడిందిఈజిప్షియన్ రాజ్యానికి దక్షిణ సరిహద్దుల వద్దనైలు నది యొక్క మొట్టమొదటి జలపాతానికి సమీపంలోఉండే సీన్ నగరంలోప్రతీ ఏడాది జూన్ 21  తారీఖు నాడు నిలువుగా పాతిన కట్టెలకి నీడ పడదని  గ్రంథంలో వుంది. ఉత్తరాయణ విషువత్తు (summer solstice) 
కాలంలోదీర్ఘతమ పగలు గల రోజునమధ్యాహ్నం దగ్గర పడుతుంటే గుడి గోపురాల నీడలు ఇంకా ఇంకా కుంచించుకుంటూ ఉంటాయిసరిగ్గా మిట్టమధ్యాహ్న సమయంలో నీడలు పూర్తిగా మాయమవుతాయి సమయంలో బాగా లోతైన నూతులలో కూడా సూర్యబింబపు ప్రతిబింబం కనిపిస్తుందిఅప్పుడు సూర్యుడు సరిగ్గా నడినెత్తిన ఉంటాడు.

మరొకరైతే  విషయాన్ని ఇట్టే మర్చిపోయేవారునిలువు కట్టెలునీడలునూతుల్లో ప్రతిబింబాలునింగిలో సూర్యుడి కదలికలు –
  సర్వసామాన్యమైన సంగతులకి ఏం ప్రాముఖ్యత ఉంటుందికాని ఎరొటోస్తినిస్ ఒక శాస్త్రవేత్తసర్వసామాన్య విషయాల మీద అతడి ఆలోచనలు ప్రపంచాన్నే మార్చాయిలేదుప్రపంచాన్ని నిర్వచించాయితన మనసులో మెదిలిన ఆలోచనని నిర్ధారించుకోడానికి  ప్రయోగం చేసి చూడాలని అనిపించింది.  అలెగ్జాండ్రియాలో జూన్ 21 నాడు మిట్టమధ్యాహ్న సమయంలో  ట్టెని పాతి దానికి నీడ పడుతోందో లేదో చూశాడునిజంగానే పడుతోంది.

ఒకే సమయంలో సీన్ నగరంలోనే కట్టెకి నీడ పడకఅందుకు బాగా ఉత్తరంగా ఉన్న అలెగ్జాండ్రియాలో నీడ పడడం ఎలా సంభవంఅని ఆలోచించాడు ఎరటోస్తినిస్ప్రాచీన ఈజిప్ట్ కి చెందిన ఒక పటాన్ని ఊహించుకోండిఒకే పొడవు ఉన్న రెండు కట్టెలుఒకటి అలెగ్జాండ్రియాలోనుమరొకటి సీన్ నగరంలోను నిలువుగా పాతబడి ఉన్నాయనుకోండిఒక ప్రత్యేక సమయంలో రెండు కట్టెలకి నీడ పడలేదు అనుకుందాంభూమి చదునుగా ఉందనుకుంటే అది సాధ్యం అవుతుందిఅప్పుడు సూర్యుడు రెండు కట్టెలకి సరిగ్గా నడినెత్తిన ఉన్నాడన్నమాటరెండు కట్టెలకి ఒకే పొడవు ఉన్న నీడలు పడినప్పుడు కూడా భూమి చదునుగా ఉన్నట్టు ఊహించుకోవాల్సి ఉంటుందిఅప్పుడు సూర్యకిరణాలు రెండు కట్టెల మీద ఒకే వాలుతో పడుతున్నట్టు అవుతుందికాని ఒకే సమయంలో సీన్ వద్ద నీడ పడకఅలెగ్జాండ్రియాలో బారైన నీడ పడడం ఎలా సంభవం?

భూమి వంపుగా ఉంటుందని అనుకుంటేనే  పరిణామం సాధ్యమవుతుందని అర్థం చేసుకున్నాడు ఎరటోస్తినిస్అంతేకాక వంపు ఎంత ఎక్కువగా ఉంటేనీడల పొడవులో అంత ఎక్కువ తేడా కనిపిస్తుందని కూడా అతడు గుర్తించాడుభూమి నుండి సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడంటే సూర్యకిరణాలు సమాంతరంగా ఉన్నట్టు అనుకోవచ్చుసూర్యకిరణాల బట్టి వేరు వేరు కోణాల వద్ద పాతబడిన కట్టెల నీడలు కూడా వేరు వేరుగా ఉంటాయిభూమి ఉపరితలం మీదుగా చూస్తే అలెగ్జాండ్రియాకిసీన్ నగరానికి మధ్య వారడి ఏడు డిగ్రీలు ఉంటుందిఅంటే  రెండు నగరాలలో పాతిన కట్టెలని భూమి కేంద్రం వరకు విస్తరించ నిస్తేఅవి కలుసుకునే చోటవాటి మధ్య ఏర్పడ్డ కోణం ఏడు డిగ్రీలు ఉంటుందిఏడు డిగ్రీలు అంటే 360 డిగ్రీలలో సుమారు 50  భాగం అన్నమాటసీన్ కిఅలెగ్జాండ్రియాకి మధ్య దూరం 800 కిమీలు అని తనకి తెలుసు దూరాన్ని కొలవడానికి  మనిషిని నియమించాడు ఎరటోస్తినిస్. 800 కిమీలు X 50 = 40,000 కిమీలుఅదే భూమి యొక్క చుట్టుకొలత కావాలి.

(ఇంకా వుంది)

12 comments

 1. "భూమి ఉపరితలం మీదుగా చూస్తే అలెగ్జాండ్రియాకి, సీన్ నగరానికి మధ్య వారడి ఏడు డిగ్రీలు ఉంటుంది. "
  ఈ విషయం అప్పటికే నిర్ధారణగా తెలుసా? అదెలాగో ముందు వివరించవలసి ఉంది కదా మీరు? ఎందుకంటే ఈ వారడి - డిగ్రీలు అనగానే భూమి గోళత్వం యొక్క వివరాలు అప్పటికే - దాని వ్యాసంతో సహా తెలిస ఉండాలి కదా అన్న అనుమానం కలుగుతున్నది.

   
 2. Unknown Says:
 3. పుస్తక పఠనము అంటే ఏదైన ఒక అంశంతో మనసు కొంత సేపు ఏకాగ్రతతో ప్రయాణం చేయడం! పుస్తకములు చరిత్రను తెలియజేస్తాయి, సామాజిక పరిస్థితులపై అవగాహన ఏర్పరుస్తాయి. గొప్పవారి భావనలను అక్షరరూపంలో కలిగి ఉంటాయి. పుస్తకపఠనం మనకు ఊహా శక్తిని కలుగజేస్తాయి! దర్శించండి తెలుగురీడ్స్.కామ్

  https://telugureads.com/vijnanam-telugureads-knowledge-book-reading/

   
 4. hari.S.babu Says:
 5. నాకూ శ్యామలీయం గారికి వచ్చిన అనుమానమే వచ్చింది.వ్యాసకర్త సందేహనివృత్తి చేస్తే బాగుంటుంది!

   
 6. సీన్ నగరానికి, అలెగ్జాండ్రియా కి మధ్య దూరం 800 కిమీలు అన్న విషయం మాత్రమే అతడికి ముందే తెలుసు. ఈ ప్రయోగం చేశాక కోణీయ దూరం 7 డిగ్రీలు అని తెలిసింది. 7 డిగ్రీలు = 800 కిమీలు అయితే, 360 డిగ్రీలు = ? 800 * 360/7 = 41,142 కిమీలు. ఇది ఉజ్జాయింపుగా భూమి చుట్టుకొలతతో సరిపోతుంది.

   
 7. hari.S.babu Says:
 8. "సీన్ నగరానికి, అలెగ్జాండ్రియా కి మధ్య దూరం 800 కిమీలు అన్న విషయం మాత్రమే అతడికి ముందే తెలుసు. ఈ ప్రయోగం చేశాక కోణీయ దూరం 7 డిగ్రీలు అని తెలిసింది."

  hari.S.babu
  "linar distance" 800 కిమీలు అన్నది మాత్రమే తెలిసి దానినుంచి "angular distance" తెలియాలంటే "radius" కావాలి కదా!7 డిగ్రీలు అనేది "కోణీయ దూరం" అనటంలో పొరపాటు పడ్డారేమో!అది ప్రయోగం చేశాక తెలిసిందని మీరే అంటున్నారు.అది సరి చూసుకోండి.కానీ "linar distance" 800 కిమీలు అన్నది మాత్రమే తెలిసి దానినుంచి "angular distance" తెలియాలంటే "radius" అవసరం కదా!

   
 9. hari.S.babu Says:
 10. https://thonyc.wordpress.com/2017/06/29/did-eratosthenes-really-measure-the-size-of-the-earth/https://thonyc.wordpress.com/2017/06/29/did-eratosthenes-really-measure-the-size-of-the-earth/

   
 11. hari.S.babu Says:
 12. The idea of a spherical Earth was floated around by Pythagoras around 500 BC and validated by Aristotle a couple centuries later. If the Earth really was a sphere, Eratosthenes could use his observations to estimate the circumference of the entire planet.

   
 13. కోణీయ దూరం తెలియడానికి వ్యాసం తెలియనక్కర్లేదు. పైన చిత్రంలో చూడండి. నీడ పొడవు/కట్టెపుడవు తెలిస్తే అది tan(theta) అవుతుంది. theta = కోణీయ దూరం.

   
 14. Chiru Dreams Says:
 15. tanΘ was mentioned in 1583 by T. Fincke who introduced the word "tangens" in Latin. But this gentleman lived in 300 B.C...

   
 16. hari.S.babu Says:
 17. 1.Eratosthenes of Cyrene was the chief librarian at the great library of Alexandria in the third century BC.

  2.Eratosthenes knew that the Earth’s surface was curved, as did every educated Greek scholar in the third century BCE.

  3.The first to realise that the Earth was a sphere were the Pythagoreans in the sixth century BCE. Aristotle had summarised the empirical evidence that showed that the Earth is a sphere in the fourth century BCE.

  4.Eratosthenes, as chief librarian in Alexandria, would have been well acquainted with above details. Put simply, Eratosthenes knew that he could, using trigonometry, calculate the diameter of the Earth’s sphere with the data he had accumulated, because he already knew that it was a sphere.

  5.Eratosthenes may or may not have calculated the tilt of the Earth’s axis but this is of no real historical significance, as the obliquity of the ecliptic, as it is also known, was, like the spherical shape of the Earth, known well before his times.

   
 18. hari.S.babu Says:
 19. I think the story of Eratosthenes calculating the circumference of the earth with the help of two sticks and by a simple cross multiplication is a fiction and not an authentic fact by the above observations

   
 20. Anonymous Says:
 21. ఈ బ్లాగు కూడా మాలికలో మూసేపియ్యడానికి "ల..." బుజానేసుకొచ్చిన హరిబాబుకి స్వాగతం.

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email