యురేనస్ గ్రహాన్ని కనుక్కున్న వాడిగా విలియమ్ హెర్షెల్ కి ఖగోళశాస్త్రచరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంతే కాకుండా మన పాలపుంత ఒక కందిగింజ ఆకారంలో ఉందని ఊహించి, దాని పరిమాణం గురించి మొట్టమొదటి అంచనాలు వేసిన వాడు కూడా ఇతడే. ఇతగాడికి మంచి నాణ్యమైన దూరదర్శినుల నిర్మాతగా కూడా మంచి పేరు ఉంది. ఈ రోజుల్లో ఖరీదైన కార్లు సొంతం చేసుకున్నట్టు, ఆ రోజుల్లో దూరదర్శినులు కలిగి ఉండడం ఒక గొప్ప. సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేవారు ఓ దూరదర్శినిని - దాన్ని ఎలా వాడాలో తెలీకపోయినా, అది చూపించే చిత్రాలు అర్థం కాకపోయినా, - కొని జాగ్రత్తగా ఇంట్లో పెట్టుకోవడం ఓ రివాజు.
ఆ రోజుల్లో కింగ్ జార్జ్ – III నాలుగు వేల పౌన్లు వెచ్చించి ఓ పెద్ద దూరదర్శినిని తయారుచేయించాడు. దాన్ని గర్వంగా అందరికీ చూపిస్తూ ఉండేవాడు. ఒక సారి అలాగే కాంటర్బరీకి చెందిన ఆర్క్ బిషప్ ని, హెర్షెల్ ఇంట్లో తయారవుతున్న దూరదర్శినిని చూపించడానికి తీసుకెళ్ళాడు రాజు. 12-మీటర్ల గొట్టం లోంచి పైకెక్కడానికి ఇబ్బంది పడ్డాడు కాస్త వయసుమళ్లిన ఆర్క్ బిషప్. ఆ విషయమే విసుక్కుంటూ రాజుకి విన్నవించాడు.
అది విన్న హెర్షెల్ ఆర్క్ బిషప్ ని కాస్త ఉత్సాహ పరుస్తూ, “అయ్యో! బిషప్ గారూ! అప్పుడే డీలా పడిపోతే ఎలా? కాస్త నా చెయ్యి అందుకోండి. స్వర్గానికి దారి చూపిస్తా!” అన్నాట్ట.
Reference:
K. Krishnamurthy, Spice in Science.
అది విన్న హెర్షెల్ ఆర్క్ బిషప్ ని కాస్త ఉత్సాహ పరుస్తూ, “అయ్యో! బిషప్ గారూ! అప్పుడే డీలా పడిపోతే ఎలా? కాస్త నా చెయ్యి అందుకోండి. స్వర్గానికి దారి చూపిస్తా!” అన్నాట్ట.
Reference:
K. Krishnamurthy, Spice in Science.
కొద్ది వారాల క్రితమే ఒక స్నేహితుడికి గ్రీనిచ్ అబ్జర్వేటరీ చూపించడానికి తీసికెళ్ళాను. అక్కడ కొత్తగా కట్టిన అబ్జర్వేటరీలో హెర్షల్ వాడిన వస్తువులు, కింగ్ జార్జ్ డబ్బిచ్చి నిర్మింపజేసిన టెలిస్కోప్ తాలూకు అవశేషాలు ఉన్నాయి. హెర్షల్ దాన్ని పెద్దగా ఉపయోగించలేదుట కూడాను. ఆయన పోయాకా పెద్ద గాలివానకి విరిగి పాడైపోయిందని అక్కడ చదివినట్టు గుర్తు.
హెర్షెల్ నిర్మించిన దూరదర్శిని కి చెందిన అవశేషాలు ఇప్పటికీ ఎక్కడో మ్యూజియమ్ లో ఉన్నాయంటే ఆశ్చర్యంగా ఉంది. పైగా ఇటీవలే దాన్ని మీరు చూడడం కాకతాళీయం. కామెంట్ కి ధన్యవాదాలు.