న్యూటన్ చేసిన మాహత్తర కృషికి తదనంతరం ఓ శతాబ్దం గడిచాక కూడా అలాంటి సంఖ్యాత్మక కొలమాన పద్ధతి రసాయన శాస్త్రంలో చోటుచేసుకోలేదు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అసలు న్యూటనే ఒక పక్క ఖగోళ శాస్త్రంలో, భౌతిక శాస్త్రంలో లోతైన సౌందర్యంతో, గొప్ప ధృడత్వంతో కూడుకున్న సైద్ధాంతిక నిర్మాణం చేస్తూ ప్రపంచాన్ని మురిపిస్తూనే, మరో పక్క తానే రహస్యంగా పరుసవేద పరిశోధనలని కొనసాగించేవాడు. నిమ్న లోహాల నుండి బంగారాన్ని తయారుచెయ్యడనికి పనికొచ్చే రూపాంతరీకరణ రహస్యాల కోసం యూరప్ అంతా ఆత్రంగా గాలించేవాడు.అలా అంత కాలంగా తప్పుదోవ నుండి మళ్లకుండా ముందుకు సాగుతున్నారంటే...

ఆ విధంగా వైజ్ఞానిక చింతన అంటే గిట్టని వాళ్లు కూడా కేవలం ఆర్థిక కారణాల వల్ల కొన్ని విషయాలని ఒప్పుకోవలసి వచ్చింది. బంగారం పట్ల అంతులేని, అర్థంలేని వ్యామోహాన్ని పక్కనపెట్టి ఖనిజాల, ఔషధాల విజ్ఞానాన్ని మరింత పెంపొందింపజేస్తే ఎంతో మేలని, లాభదాయకమని రసవాదులకి అర్థం కాసాగింది.అందుకేనేమో పదిహేడవ శతాబ్దం అంతానికల్లా పరుసవేదం యొక్క ప్రాముఖ్యత తగ్గడం కనిపిస్తుంది. పద్దెనిమిదవ శతాబ్దానికల్లా ఆ రంగం ప్రస్తుతం మనం రసాయనశాస్త్రం అని పిలుచుకునే రంగంగా రూపాంతరం...

’మంచి పుస్తకం’ ప్రచురణలుmanchipustakam.in...

ఉదాహరణకి 1597 లో ఆంద్రియాస్ లిబావ్ అనే జర్మన్ పరుసవేది (ఇతడికి లిబావియస్ అనే లాటిన్ పేరు కూడా ఉంది) ఆల్కెమియా అనే పుస్తకం రాశాడు. గతంలో పోగైన పరుసవేద సారం మొత్తాన్ని ఆ పుస్తకంలో పొందుపరిచాడు. రసాయన శాస్త్రంలో అది మొట్టమొదటి పాఠ్యగ్రంథం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఎలాంటి తత్వజ్ఞానాన్ని జోడించకుండా శుద్ధ వైజ్ఞానిక పరిభాషనే వాడాడు. పైగా పారాసెల్సస్ అనుయాయులు ప్రచారం చేసిన పాత, బూజుపట్టిన భావాల మీద దుమ్మెత్తి పోశాడు. అయితే పరుసవేదం యొక్క...

సుస్పష్టమైన శైలిలో రాయబడ్డ ఆ పుస్తకంలో గనులలో వాడే యంత్రాంగానికి సంబంధించిన చిత్రాలెన్నో ఉన్నాయి. త్వరలోనే ఆ పుస్తకానికి గొప్ప పేరొచ్చింది. వైజ్ఞానిక సాహితీ చరిత్రలో ఓ గొప్ప స్థానాన్ని ఆక్రమించింది. 1700 కి పూర్వం రసాయనిక సాంకేతిక విజ్ఞానం మీద రాయబడ్డ కృతులలో కెల్లా ముఖ్యమైనదైన De Re Metallica ఖనిజ విజ్ఞానాన్ని ఓ శాస్త్రవిభాగంగా స్థాపించింది. (అగ్రికోలాకి ముందు లోహవిజ్ఞానంలో, రసాయన శాస్త్రంలో అంత గొప్ప పుస్తకాన్ని రాసినవాడు థియోఫైలస్. ఇతగాడు...

ముద్రణ వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి. అంతకు పూర్వం పెద్దగా పేరులేని పుస్తకాల ప్రతులు తయారుచెయ్యడానికి ఎవరూ ముందుకు వచ్చేవారు కారు. కాని ముద్రణ వచ్చిన తరువాత పెద్ద ప్రాముఖ్యత లేని పుస్తకాలని కూడా సులభంగా అచ్చు వెయ్యడానికి వీలయ్యింది. ఆ కారణం చేతనే లుక్రెటియస్ రాసిన కావ్యం అచ్చయ్యింది. అందుచేతనే పరమాణు సిద్ధాంతానికి యూరప్ లో మంచి ప్రాచుర్యం లభించింది.1543 లో రెండు విప్లవాత్మక గ్రంథాలు వెలువడ్డాయి. ముద్రణ తెలియని కాలంలో అయితే ఇలాంటి పుస్తకాలని...

1261 లో ఆ నగరాన్ని గ్రీకులు తిరిగి హస్తగతం చేసుకున్నారు. నగరం అయితే చేజిక్కింది గాని మునుపటి శోభ ఇప్పుడు లేదు. రెండు శతాబ్దాల పాటు టర్కిష్ సేనల దాడులు ఈ నగరం మీద ఎడతెగకుండా జరుగుతూనే ఉన్నాయి. చివరికి 1453 లో ఆ దండయాత్రలకి కాన్స్టాంటినోపుల్ లొంగిపోయింది. ఇక అప్పట్నుంచి ఆ నగరం టార్కీ హయాంలోనే ఉండిపోయింది. కాన్స్టాంటినోపుల్ పతనం తరువాత, ముందు కూడా గ్రీకు పండితులు అక్కణ్ణుంచి పాశ్చాత్య యూరప్ కి పలాయనం అయ్యారు. వారితో పాటు వాళ్ళ గ్రంథాలయాల నుండి...
ఆ విధంగా శక్తివంతమైన ఖనిజపు ఆసిడ్ల సృష్టి రసాయనిక శాస్త్ర చరిత్ర లో ఓ మైలురాయి అని చెప్పొచ్చు. అంతకు మూడు వేల ఏళ్ల క్రితం, ముడి నుండి ఇనుమును వెలికి తీసిన నాటి నుండి రసాయన చరిత్రలో ఇంత ముఖ్యమైన ఘటన మరొకటి లేదంటే అతిశయోక్తి కదు. ఈ కొత్త ఆసిడ్ తో ఎన్నో కొత్త రసాయన చర్యలు సాధించడానికి వీలయ్యింది. ప్రాచీన గ్రీకులకి, అరబ్బులకి తెలిసిన అత్యంత శక్తివంతమైన ఆసిడ్ అయిన వెనిగార్ లో కరగని ఎన్నో పదార్థాలు ఈ కొత్త శక్తివంతమైన ఖనిజపు ఆసిడ్లలో కరిగించొచ్చని యూరొపియన్లు కనుక్కున్నారు.అసలు రూపాంతరీకరణ వల్ల బంగారాన్ని ఉత్పత్తి చేయడం సాధ్యమైనా...

ఆల్బర్టస్ మాగ్నస్ కి సమకాలీనుడైన ఓ గొప్ప ఇంగ్లీష్ పండితుడు ఉన్నాడు. క్రైస్తవ సాధువైన ఇతడి పేరు రోజర్ బాకన్ (1214-1292). వైజ్ఞానిక ప్రయాసకి ప్రయోగాత్మక పద్ధతి, గణిత పద్ధతుల వినియోగం జోడైతే గొప్ప ప్రగతి సాధ్యం అవుతుందని ఇతడు గాఢంగా నమ్మేవాడు. ఆ భావాలనే తన రచనల్లో కూడా ఎన్నో చోట్ల వ్యక్తం చేశాడు. కాని నాటి ప్రపంచం అతడి మాటలని అర్థం చేసుకోడానికి సిద్ధంగా లేదు.బాకన్ ఓ విజ్ఞాన సర్వస్వాన్ని రాయడానికి ప్రయత్నించాడు. తన రచనల్లో మందుపాతరకి సంబంధించిన...
అరబ్ సంస్కృతిలో గొప్ప గొప్ప గ్రంథాలు ఉండేవని యూరొపియన్లు తెలుసుకున్నారు. అరిస్టాటిల్ మొదలైన గొప్ప గ్రీక్ తాత్వికుల మూల రచనల అరబిక్ అనువాదాలు లభ్యమై ఉండేవి. అవి కాక అవిసెన్నా మొదలైన అరబిక్ పండితులు అరబిక్ లోనే రాసిన మూల గ్రంథాలు కుడా ఉండేవి.మొదట్లో బద్ధ శత్రువు రాసిన పుస్తకాల నుండి నేర్చుకోవడానికి అహం, ఆగ్రహం అడ్డొచ్చినా, త్వరలోనే ఆ మానసిక అవరోధాలన్నీ మాయమయ్యాయి. మహత్తరమైన ఈ అరబిక్ రచనలన్నీ లాటిన్ లోకి తర్జుమా అయ్యాయి. అలాంటి ఉద్యమానికి మంచి స్పూర్తి ఇచ్చినవాడిలో ఒకడు గెర్బెర్ట్ (క్రీ.శ. 940-1003) అనే ఫ్రెంచ్ పండితుడు. క్రీ.శ....

జబీర్ తరువాత పరుసవేదంలో మళ్లీ అంత గొప్ప పేరు సాధించిన పరో పర్షియన్ రసాయనికుడు ఉన్నాడు. అతడి పేరు అల్-రజీ (Al-Razi) (క్రీ.శ. 850-925). యూరొపియన్లు ఇతణ్ణి “రాజెస్” అని పిలిచేవారు. ఇతడు కూడా ఎన్నో రసాయనిక ప్రక్రియలని తన రచనల్లో వివరించాడు. ఉదాహరణకి ప్లాస్టర్ ఆఫ్ పారిస్ ఉపయోగించి పోత ఎలా పొయ్యాలో, విరిగిన ఎముకలని ఎలా అతికించాలో ఇతడు స్పష్టంగా వర్ణించాడు. మూలకమైన ఆంటిమొనీ యొక్క లక్షణాలని ఇతడు క్షుణ్ణంగా అధ్యయనం చేశాడు. సులభంగా ఆవిరయ్యే పాదరసానికి,...

బ్లాగర్లకి నూతన సంవత్సర శుభాకాంక్షలు!జబీర్ చేసిన ఆవిష్కరణలలో కెల్లా లోహాల రూపాంతరీకరణ (transmutation) కి సంబంధించిన అధ్యయనాలే అతి ముఖ్యమైనవి. పాదరసం ఓ అపురూమైన లోహంగా అతడు భావించేవాడు. మామూలు పరిస్థితుల్లో కూడా ద్రవరూపంలో ఉండే పాదరసంలో పార్థివ తత్వం అతి తక్కువగా ఉంటుంది అనేవాడు. సల్ఫర్ కి ఉండే ప్రత్యేక లక్షణం – జ్వలనీయత (combustibility) – అతణ్ణి ఆకట్టుకుంది. (సల్ఫర్ విషయంలో అతణ్ణి ఆకట్టుకున్న మరో లక్షణం బంగారం లాంటి దాని పచ్చని పసిమి)....
postlink