
“ఏంటి నువ్వనేది?”
“ఇదుగో చూడండి” అంటూ పొరలు పొరలుగా అమరి వున్న సాండ్ స్టోన్, లైమ్ స్టోన్ శిలా స్తరాలని చూపించాను. నెమ్మదిగా స్లేట్ శిల యొక్క తొలి సూచనలు కనిపించడం కూడా చూపించాను.
“అయితే?”
“మొట్టమొదటి మొక్కలు, జంతువులు ఆవిర్భవించిన దశలో ఉన్నాం అంటాను.”
“కావాలంటే దగ్గర్నుండి చూడండి.”
లాంతరుని సొరంగం గోడలకి దగ్గరిగా పెట్టి చూడమన్నాను. మామయ్య అలాగే చూశాడు కాని ముఖంలో ఆశ్చర్యపు ఛాయలైనా లేవు. ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకి నడిచాడు.
నేను...

మానవుడు నిర్మించిన కృత్రిమ నిర్మాణాలకి మునుపే జీవలోకంలో ఎన్నో నిర్మాణాలు ఉద్భవించాయి. జీవలోకపు నిర్మాణాలకి ముందు ప్రకృతిలో ఏవో కొండలు, గుట్టలు తప్ప చెప్పుకోదగ్గ నిర్మాణాలేవీ లేవనే చెప్పాలి. జీవరాశి యొక్క ప్రప్రథమ దశలలో కూడా దాని మనుగడ కోసం ఏదో ఒక రకమైన నిర్మాణం అవసరం అయ్యింది. చుట్టూ ఉండే జీవరహిత పదార్థాన్ని, ప్రాణి లోపల ఉండే జీవపదార్థం నుండి వేరు చేస్తూ ఏదో ఒక విధమైన పాత్ర అవసరం అయ్యింది. ప్రాణిని బాహ్య ప్రాపంచం నుండి వేరు చేసే ఒక రకమైన...

ఆఫ్రికా నడిబొడ్డులోనో, నవ్య ప్రపంచంలోనో (అమెరికా ఖండాలు) ప్రయాణించే యాత్రికులు, రాత్రి వేళ్లల విశ్రమించేటప్పుడు ఒకరికొకరు కాపలా కాస్తారని అంటారు. కాని మేం అలాంటి జాగ్రత్తలేవీ తీసుకోలేవు. జీవ ఛాయలే లేని ఈ పాతాళ బిలంలో ఇక క్రూర మృగాలకి తావెక్కడిది?
మర్నాడు ఉదయం లేచేసరికి అందరికీ మళ్లీ ఓపిక వచ్చి ఉత్సాహం పెరిగింది. మా యాత్ర మళ్లీ కొనసాగించాం. లావా ప్రవహించిన మార్గానే మళ్లీ ముందుకి సాగిపోయాం. మా చుట్టూ కనిపించే రాళ్ల జాతులని పోల్చుకోవడం...

గత రెండేళ్ల మూడు నెలల కాలం నా జీవితం అత్యంత ప్రయాసతో కూడుకున్న దశ అని చెప్పగలను. ఆ దశలో అస్వస్థత వల్ల కొంత సమయాన్ని పోగొట్టుకున్నాను. ష్రూస్ బరీ, మాయర్, కేంబ్రిడ్జ్, లండన్ నగరాలలో కొంత కాలం మారి మారి జీవించాక చివరికి డిసెంబర్ 13 నాడు లండన్ లో స్థిరపడ్డాను. నేను సేకరించిన సామగ్రి అంతా అక్కడ హెన్స్లో రక్షణలో భద్రంగా వుంది. అక్కడ మూడు నెలలు మకాం పెట్టాను. నేను సేకరించిన రాళ్లని, ఖనిజాలని ప్రొ. మిల్లర్ చేత పరీక్ష చేయించాను.
నా యాత్రా పత్రికకి...

అధ్యాయం 19
భౌగోళిక అధ్యయనాలు… భూగర్భంలో
మర్నాడు మంగళవారం, జూన్ 30. ఉదయం 6 గంటలకి అవరోహణ మళ్ళీ మొదలయ్యింది.
లావా ఏర్పరిచిన వాలు దారిని అనుసరిస్తూ కిందికి సాగిపోయాం. కొన్ని పాతకాలపు ఇళ్ళలో మెట్లదారికి బదులు ఈ రకమైన వాలుదారి కనిపిస్తుంటుంది. మధ్యాహ్నం 12:17 వరకు మా నడక సాగింది. అంతలో హన్స్ ఎందుకో ఠక్కున ఆగిపోయాడు. అతడి వెనకే మేమూ ఆగాం.
“అబ్బ వచ్చేశాం,” అన్నాడు మామయ్య. “పొగగొట్టం కొసకి వచ్చేశాం.”
నా చుట్టూ ఓ సారి చూశాను. అది రెండు...

నిజజీవితంలో నిర్మాణాలు
బరువులని మోసేది ఏదైనా నిర్మాణమే. ఓ వంతెన, ఓ భవంతి, ఓ కొమ్మ, ఓ శరీరం – అన్నీ నిర్మాణాలే. నిర్మాణాలని విఫలమైతే ప్రమాదాలు జరుగుతాయి. ప్రాణనష్టం జరుగుతుంది. కనుక నిర్మాణాలు విఫలమైనా, విజయవంతం అయినా అవి మనుషుల జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. బరువులని సుస్థిరంగా నిలపగల నిర్మాణాలని రూపకల్పన చెయ్యడం, నిర్మించడం ఇంజినీర్ల పని. అలాంటి నిర్మాణాలు ఇంజినీర్లు ఎలా చేస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కాని ఇంజినీర్లు వారి...
నడవమనే కన్నా ముందుకు జారమని వుంటే సబబుగా ఉండేదేమో. ఇంత విపరీతమైన వాలు దారిలో ఇంచుమించు జారినట్టుగానే ముందుకు సాగాము. ఇటాలియన్ కవి వర్జిల్ ఒక చోట అంటాడు - facilis est descensus Averni అని. ‘ఇంత కన్నా నరకంలోకి దిగడం సులభం’ అని ఆ వాక్యానికి అర్థం. మా పరిస్థితి ఇంచుమించు అలాగే వుంది. మా దిక్సూచి స్థిరంగా దక్షిణ-తూర్పు దిశనే సూచిస్తోంది. అలనాటి లావాప్రవాహం అటు ఇటు చూడకుండా నేరుగా దూసుకుపోయింది అన్నమాట.
కాని లోపలికి పోతున్న కొద్ది ఉష్ణోగ్రత పెద్దగా పెరుగుతున్నట్టు అనిపించలేదు. కనుక డేవీస్ సిద్ధాంతానికి సమర్థింపు దొరికినట్టు...
ప్రొ॥ జె. ఇ. గోర్డన్ ఆధునిక బయోమెకానిక్స్ (biomechanics), పదార్థ విజ్ఞాన (material science) రంగాల పితామహులలో ఒకరని చెప్పుకోవచ్చు.
1913 లో పుట్టిన ఈయన గ్లాస్గో విశ్వవిద్యాలయం నుండి నేవల్ ఆర్కిటెక్చర్ లో పట్టం పుచ్చుకున్నారు.
స్కాట్లాండ్ షిప్ యార్డ్ లలో పని చేస్తూ తొలిదశలలోనే ఓడల రూపకల్పనలో తన అసామాన్య నైపుణ్యం నిరూపించుకున్నారు. ఓడలు నిర్మించడమే కాక వాటిలో విస్తృతంగా ప్రయాణించి రూపకల్పనకి, ప్రవర్తనకి మధ్య సంబంధాన్ని లోతుగా అర్థంచేసుకున్నారు....
ఇందాక మామయ్య తీసుకున్న పరిశీలనలలో చివర్లో కొలిచిన దిశ మా ఎదుట ఉన్న వాలు సొరంగానికి వర్తిస్తుంది.
“ఇక చూసుకో ఏక్సెల్,” మామయ్య ఉత్సాహంగా అన్నాడు. “ఇప్పట్నుంచి మనం నిజంగా భూగర్భంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ క్షణమే మన యాత్ర మొదలవుతుంది.”
ఆ మాటలంటూ మామయ్య అంత వరకు తన మెడకి వేలాడుతున్న రుమ్ కోర్ఫ్ పరికరాన్ని చేతిలోకి తీసుకున్నాడు. రెండవ చేత్తో ఆ పరికరానికి లాంతరలో ఉన్న చుట్టతీగకి మధ్య విద్యుత్ సంపర్కాన్ని కల్పించాడు. లాంతరు లోంచి పెల్లుబికిన...
అధ్యాయం 18
భూగర్భంలో రెండు వింతలు
మర్నాడు ఉదయం ఓ ఒంటరి రవికిరణం మమ్మల్ని మేలుకొలిపింది.
సొరంగంలోకి ఎలాగో చొచ్చుకొచ్చిన ఆ కిరణం గరుకైన లావా శిలల కోటి ముఖాల మీద పడి నలు దిశలా చిందడం వల్ల సొరంగం అంతా సున్నితమైన మెరుపులు కురిపించింది.
ఆ పాటి కాంతి సహాయంతో చుట్టూ ఉన్న వస్తువులని పోల్చుకోడానికి వీలయ్యింది.
“ఏవంటావ్ ఏక్సెల్,” అన్నాడు మామయ్య మెల్లగా సంభాషణ మొదలెడుతూ. “కోనిగ్స్ బర్గ్ లో మన బుల్లి ఇంట్లో ఇంత ప్రశాంతంగా ఎప్పుడైనా ఉందంటావా?...

సురేష్ కొసరాజు, మంచిపుస్తకం ప్రచురణలు,
kosaraju.suresh@gmail.com...

సౌరశక్తి చరిత్రని ఎంతో ఆసక్తి కరంగా వర్ణించే కార్టూన్ పుస్తకం...
ప్రచురణ - సురేష్ కొసరాజు, మంచి పుస్తకం పబ్లిషర్స్.
kosaraju.suresh@gmail.com
...
postlink