నిజజీవితంలో నిర్మాణాలు
బరువులని మోసేది ఏదైనా నిర్మాణమే. ఓ వంతెన, ఓ భవంతి, ఓ కొమ్మ, ఓ శరీరం – అన్నీ నిర్మాణాలే. నిర్మాణాలని విఫలమైతే ప్రమాదాలు జరుగుతాయి. ప్రాణనష్టం జరుగుతుంది. కనుక నిర్మాణాలు విఫలమైనా, విజయవంతం అయినా అవి మనుషుల జీవితాల మీద ప్రభావం చూపిస్తాయి. బరువులని సుస్థిరంగా నిలపగల నిర్మాణాలని రూపకల్పన చెయ్యడం, నిర్మించడం ఇంజినీర్ల పని. అలాంటి నిర్మాణాలు ఇంజినీర్లు ఎలా చేస్తారో తెలుసుకోవాలని అందరికీ ఉంటుంది. కాని ఇంజినీర్లు వారి వృత్తి రహస్యాల గురించి బయటి వారికి చెప్తున్నప్పుడు అదేదో చిత్రమైన పరిభాష వాడుతారు. అది సామాన్యులకి అర్థం కాని భాష. అది విన్నవారికి విషయం స్పష్టం కాకపోగా మరింత అయోమయంలో పడతారు. నిర్మాణాలతో మనం అందరం అనుక్షణం వ్యవహరిస్తుంటాం. అలాంటి ముఖ్యమైన వస్తువుల గురించి అయోమయమైన అవగాహన ఉండడం అంత హర్షనీయం కాదు.
ఆయుర్వేదంలో ఒక కథ వుంది. ఓ గురువు వద్ద ఓ శిష్యుడు ఆయుర్వేదం ఎన్నో ఏళ్ళు కష్టపడి చదివి పూర్తి చేసాడు. చివరికి ఓ పరీక్షని ఎదుర్కుని తన పాండిత్యాన్ని నిరూపించుకోవాల్సిన తరుణం వచ్చింది. గురువు ఓ చిత్రమైన పరీక్ష పెట్టాడు. చుట్టుపక్కల కొండలన్నీ వెతికి ఎలాంటి వైద్య ప్రయోజనం లేని మొక్క ఏదైనా ఉంటే తీసుకు రమ్మని పంపాడు గురువు. శిష్యుడు ఓ రెండు నెలల పాటు చుట్టుపక్కల కొండలన్నీ వెతికి వెతికి, కోరుకున్న మూలిక దొరక్క, విచారంగా ఆశ్రమానికి తిరిగొచ్చాడు. గురువుగారి ముందు మొహం వేలాడేసి ‘గురువుగారూ! నేను ఓడిపాయాను. బొత్తిగా వైద్య ప్రయోజనం లేని మొక్కే దొరకలేదు నాకు,” అన్నాడట. అందుకు ఆ గురువు శిష్యుణ్ణి కౌగిలించుకుని, “ఈ రోజుతో నీ చదువు పూర్తయ్యింది” అన్నాట్ట.
నిర్మాణాల గురించి తెలుసుకునే ముందు అసలు నిర్మాణం అంటే ఏంటి అని ఓ సారి ఆలోచించాలి. కాని ఆలోచించి చూడగా ఏది నిర్మాణం కాదు? అని ప్రశ్నించుకోవలసి వస్తుంది. మనకి కంటపడే ప్రతీ వస్తువు ఓ నిర్మాణమే, ఏదో విధంగా దాన్ని నిర్మాణంగా అన్వయించుకోవచ్చు. కావాలంటే మామూలుగా నిర్మాణాలు అని మనం అనుకోని వస్తువులు కొన్ని తీసుకుందాం. ఓ సెల్ ఫోన్ – కిందపడినా, భావావేశంలో గట్టిగా నొక్కినా, పెంపుడు కుక్క నాకినా పగిలిపోకూడదు, పాడైపోకూడదు. ఓ పుస్తకం – కాగితాలు సులభంగా చిరిగిపోకూడదు, కాండం నుండి సులభంగా ఊడి రాకూడదు. పుస్తకాన్ని ఓ బుక్ ర్యాక్ లో నిలబెడితే వంగిపోకూడదు. అరిటాకు విస్తరి – స్వయంగా ముల్లే వచ్చి మీద పడ్డా సర్రున చిరిగిపోకూడదు! ఈ ఉదాహరణల బట్టి నిర్మాణాలలో మనం కొన్ని ప్రత్యేక లక్షణాలు ఆశిస్తామని అర్థమవుతుంది.
నిర్మాణాల గురించి మనం ప్రశ్నలు వేసేటప్పుడు భవనాలు, వంతెనలు ఎందుకు కూలిపోతాయి, యంత్రాలు, విమానాలు ఎందుకు పాడైపోతుంటాయి? మొదలైన సాంప్రదాయబద్ధమైన ప్రశ్నలు మాత్రమే అడగం. ఇలా కొన్ని సాంప్రదాయేతర ప్రశ్నలు కూడా అడుగుతుంటాం.
కీటకాలకి వాటి వాటి ఆకారాలు ఎలా సంతరించాయి?
ముళ్ల పొదలోకి ఎగురుతున్న గబ్బిలం ముళ్ళు గుచ్చుకుని రెక్కలు చిరిగిపోకుండా ఎలా జాగ్రత్త పడుతుంది?
పెద్దవాళ్లకి వెన్నులో నొప్పి (back ache) ఎందుకు కలుగుతుంది?
కండరాలు ఎలా పని చేస్తాయి?
పక్షులకి రెక్కల్లో ఈకలు ఎందుకు ఉంటాయి?
అంగవైకల్యం గల పిల్లలకి ఇంకా ఎలాంటి సౌకర్యాలు అందివ్వగలం?
గ్రీకు రాజు ఒడిసెస్ యొక్క వింటి నారిని సంధించడం ఎందుకంత కష్టం?
ప్రాచీనులు రథ చక్రాలని రాత్రి వేళల్లో ఎందుకు ఊడదీసి పెట్టేవారు?
గాలికి వెదురు బొంగు ఎందుకు ఊగులాడుతుంది?
గ్రీకుల పార్థెనాన్ మందిరం ఎందుకంత అందంగా ఉంటుంది?
జీవలోకపు సహజ నిర్మాణాల నుండి ఇంజినీర్లు ఏం నేర్చుకోగలరు? అలాగే వైద్యులు, జీవశాస్త్రవేత్తలు, కళాకారులు, పురావస్తు పరిశోధకులు ఇంజినీర్ల నుండి ఏం నేర్చుకోగలరు?
నిర్మాణాలు ఎలా పని చేస్తాయి, ఎందుకు విఫలమవుతాయి అన్న ప్రశ్నలకి కారణాలు క్షుణ్ణంగా అర్థం కావడానికి ఎన్నో శతాబ్దాలు పట్టింది. నిర్మాణాలకి సంబంధించి మన పరిజ్ఞానంలో ఎన్నో ఖాళీలు గత శతాబ్దంలోనే పూరించబడ్డాయి. అలా నెలకొన్న పరిజ్ఞానం వల్ల నిర్మాణాల రూపకల్పనలో, వినియోగంలో దక్షత ఎంతో పెరిగింది. అలాంటి పరిస్థితుల్లో నిజ జీవితంలో అందరికీ రోజూ ఎదురయ్యే నిర్మాణాల గురించిన పరిజ్ఞానం - కనీసం కొన్ని మౌలిక సూత్రాలు – కేవలం కొందరు నిపుణుల సొత్తు కాకూడదు. అవి అందరికీ తెలియాల్సిన విలువైన విషయాలు.
(ఇంకా వుంది)

So nice sir, every one has to Know this information.
Regards,
Pardhu