శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

ఇంగ్లీష్ లో బాల సాహిత్యం

Posted by శ్రీనివాస చక్రవర్తి Thursday, August 30, 2012
ఇంగ్లీష్ లో బాల సాహిత్యం


ఇంగ్లీష్ లో బాలసాహిత్యంలో ఎన్నో సాహితీ విభాగాలు కనిపిస్తాయి. వాటిలో కొన్ని – 1) ఊహా సాహిత్యం లేదా fantasy సాహిత్యం, 2) అన్వేషకుల గాథలు, 3) సైన్స్ సాహిత్యం, 3) సైన్స్ ఫిక్షన్ సాహిత్యం, 4) భయానక సాహిత్యం, 5) అపరాధ పరిశోధన, 6) సాహసగాధలు, 7) వృత్తులు, క్రీడలకి సంబంధించిన సాహిత్యం. ఈ రకమైన వర్గీకరణ తెలుగు బాలసాహిత్యంలో ఉందనుకోను.1) ఊహా సాహిత్యం –

పిల్లల మానసిక జివితానికి ఊహే ఊపిరి. ఆ ఊహని పోషించే సాహిత్యానికి మరి బాలసాహిత్యంలో ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. గత దశకంలో ఇంగ్లీష్ లో బాల సాహిత్యానికి కొత్త ఊపిరి పోసిన పుస్తకమాల ‘హారీ పాటర్’ అనుకోవచ్చు. పట్టున ఐదేళ్లు కూడా లేని పిల్లలు కూడా అంతంతలేసి గ్రంథరాజాల్ని సునాయాసంగా చదువుతుంటే ఆ పుస్తకంలో ఏం మహత్తు ఉందో అని ఆశ్చర్యం కలుగుతుంది. టీవీ ప్రభావానికి లోనవుతున్న బాలతరాన్ని మళ్లీ పుస్తక పఠనం వైపుకి తిప్పాయి జె.కె. రౌలింగ్ రచనలు అని చెప్పుకుంటారు.

మాయా చీపురుకట్ట మీద షికార్లు కొడుతున్న హారీ పాటర్హారీ పాటర్ విజయం తరువాత ఆ ఫక్కీలో ఇంగ్లీష్ లో మరెందరో పిల్లల పుస్తకాలు రాశారు. అంతే కాక గత శతాబ్దానికి చెందిన కొంత ‘ఫాంటసీ’ బాల సాహిత్యం కూడా పునర్జన్మించి కొత్త ఊపిరి పోసుకుంది. గత శతాబ్దపు తొలి సగంలో సి.ఎస్. లువిస్ రాసిన నార్నియా (Narnia) కథలు, సుమారు అదే కాలంలో జె.ఆర్. ఆర్. టోల్కీన్స్ రాసిన హాబిట్ (Hobbit) కథలు ఆ వర్గానికి చెందినవే. మన దేశంలో కూడా ఈ పుస్తకాలు పిల్లల మనసుల్ని దోచాయి.ఈ మధ్యకాలంలో వస్తున్న ఫాంటసీ కథలు/నవళ్లలో కొన్ని ప్రాచీన గ్రీకు దేవతలని సమకాలీన ప్రపంచంలోకి ప్రవేశపెట్టి, ఆ పాత కొత్తల మేళవింపునే అంశంగా తీసుకున్నాయి. రిక్ రియోర్డెన్ నవళ్లు ఈ రకమైన ప్రయత్నానికి తార్కాణాలు. ఈ రకమైన ప్రయత్నాలు మన దేశంలో కొత్త కాదు. టీవీ లోకంలో ‘ఛోటా భీమ్,’ ‘బాల్ గణేశ్’, ‘వీర్ హనుమాన్’ మొదలైన వన్నీ ఆ రకమైన సృజనలే.2. అన్వేషుల సాహస కథలు (Stories of explorers)- మానవ ప్రగతికి కారణం సాహసంతో కూడిన అన్వేషణ. అన్వేషుల కథలు పిల్లల మనసుల్లో గాఢమైన ముద్ర వేస్తాయి. మార్కో పోలో, కొలంబస్, వాస్కో ద గామా, మెగాలెన్, జేమ్స్ కుక్, అముండ్ సెన్ మొదలైన ధీరులు భూమి మీద దిశదిశలా పర్యటించి కొత్త ప్రాంతాలని కనుక్కోవడం వల్ల ఆ వీరులు చెందిన సమాజాలు ఎంతో పురోగమించాయి. వీళ్ల మీద పుస్తకాలు ఇంగ్లీష్ లో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.

అన్వేషణ కేవలం భూమికే పరిమితం కానక్కర్లేదు కనుక అంతరిక్షంలో కి ప్రవేశించే సాహసం చేసిన ఎడ్విన్ ఆల్డ్రిన్, వెలెంతినా తెరిష్కోవా మొదలైన అన్వేషుల కథలు కూడా ఎన్నో ఉన్నాయి. కొత్త విషయాలని తెలుసుకోవాలనే స్ఫూర్తి పాశ్చాత్య సంస్కృతిలో బలంగా కనిపిస్తుంది. కనుక వారి సంస్కృతిలో, సాహిత్యంలో అన్వేషుల గాధలకి అంత ప్రాధాన్యత ఇవ్వడంలో ఆశ్చర్యం లేదు. ఆ స్ఫూర్తి మనలో కొంచెం తక్కువ కావడమే ఆ రకమైన సాహిత్యం మన సంస్కృతిలో కొరవడడానికి కారణమేమో. ఇంగ్లీష్ లో బాల సాహిత్యంలో అన్వేషుల కథలకి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలియడానికి ఈ లింక్ చూడండి.

http://www.enchantedlearning.com/explorers/అయితే అన్వేషణా స్ఫూర్తి అడుగంటిన విషయం గత రెండు మూడు శతాబ్దాల భారతానికి మాత్రమే పరిమితం కావచ్చు. మన పూర్వీకులు కూడా దక్షిణ-తూర్పు ఆసియాలో సామ్రాజ్యాలు స్థాపించారు (శ్రీ విజయ సామ్రాజ్యం). మరి జావా, సుమత్రా మొదలైన దీవులని వాళ్ళు ఎలా కనుక్కున్నారు? ఆ వివరాలన్నీ ప్రస్తుతం లభ్యమైతే చదువుకోడానికి ఎంతో ఆసక్తికరంగా, తెలుసుకోడానికి ఎంతో గర్వంగాను ఉంటుంది. అలాగే మన పూర్వీకులు బౌధ్ధ మత ప్రచారం కోసం హిమాలయలు దాటి చైనా, జపాన్ భూములకి ప్రయాణించారు. ఆ యాత్రలు ఎలా చేశారు? సిల్కు దారుల వెంట మన పూర్వీకులు యూరప్, పర్శియా మొదలైన ప్రాంతాలతో ఎలాంటి సంబంధాలు పెట్టుకునేవారు? ఇలాంటి వివరాలు కొన్ని చరిత్ర పుస్తకాల్లో ఉన్నాయేమో మరి నాకు తెలీదు. కాని ఆ విశేషాలని పిల్లలకి అర్థమయ్యే భాషలో, భారతీయ భాషలలోకి తీసుకొస్తే ఎంతో బావుంటుంది. మన బాలసాహిత్యానికి మంచి పోషణ అందుతుంది.

(ఈ సందర్భంలో 2007 లో వెలువడ్డ ఓ అరుదైన పుస్తకం గురించి చెప్పాలి. సురవి, ఋషి అనే ఇద్దరు భారతీయ టీనేజ్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులు ఒకసారి క్రిస్మస్ కి ఓ అపురూపమైన బహుమానం ఇచ్చారు. అందురూ ఇచ్చే బొమ్మలో, పుస్తకాలో కాదు. అంటార్కిటికా ఖండాన్ని సందర్శించే సువర్ణావకాశం ఆ బహుమానం! చిలీ దేశపు నౌకాదళానికి చెందిన ఓ పర్యాటక నౌకలో పిల్లలు ఇద్దరూ వారి తల్లిదండ్రులతో అంటార్కిటికా ఖండానికి పయనించి, ఆ యాత్రలో వాళ్ల అనుభవాలన్నీ పొందుపరుస్తూ ఓ అద్భుతమైన పుస్తకాన్ని రాశారు. దాని పేరు ‘Adventures in Antarctica.’ ఈ పుస్తకాన్ని ఎవరైనా తెలుగులోకి అనువదిస్తే బావుంటుంది.)


(ఇంకా వుంది)
1 Responses to ఇంగ్లీష్ లో బాల సాహిత్యం

  1. vij Says:
  2. http://e-bookstore4u.blogspot.in/2012/08/swathi-weekly-31st-august-2012-pdf.html

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email