శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

అనంతం అంచుల దాకా - జార్జ్ గామోవ్

Posted by V Srinivasa Chakravarthy Thursday, February 28, 2013
జార్జ్ గామోవ్ (చిత్రం) గత శతాబ్దానికి చెందిన ఓ ప్రఖ్యాత సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త, ఖగోళశాస్త్రవేత్త. లమేత్ర్ మొదట ప్రతిపాదించిన ‘బిగ్ బాంగ్’ సిద్ధాంతాన్ని ఇతడు పెంచి పోషించాడు. Quantum tunneling ద్వారా Alpha decay ని వివరిస్తూ ఇతడు ఓ సిద్ధాంతాన్ని రూపొందించాడు.


గామోవ్ గొప్ప జనవిజ్ఞాన (పాపులర్ సైన్స్) రచయిత కూడా. లోగడ జార్జ్ గామోవ్ రాసిన ‘Mr Tompkins in wonderland’ అన్న పుస్తకంలో ఓ భాగాన్ని ‘సుబ్బారావు సాపేక్ష వాదం’ అన్న పేరుతో అనువదించి ఈ బ్లాగ్ లో పోస్ట్ చెయ్యడం జరిగింది.

గామోవ్ రాసిన మరో అద్భుతమైన పుస్తకం ‘One, two, three… infinity.’ ఆ పుస్తకం అనువాదాన్ని సీరియల్ గా ఈనాటి నుండి పోస్ట్ చేద్దామని ఉద్దేశం.





అనంతం అంచుల దాకా

జార్జ్ గామోవ్



అధ్యాయం 1

మహమ్మారి సంఖ్యలు

1. నువ్వు ఎంత వరకు లెక్కించగలవు?

హంగరీ దేశంలో రాచకుటుంబానికి చెందిన ఇద్దరు పెద్దమనుషుల గురించి ఓ కథ వుంది. ఇద్దరూ ఓ రోజు ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇద్దరిలో ఎవరు పెద్ద సంఖ్య చెప్తే వాళ్లు గెలిచినట్టు.

“ముందు నువ్వు మొదలెట్టు,” అన్నాడొకడు.

కొన్ని నిమిషాలు దీర్ఘంగా ఆలోచించి రెండోవాడు వాడికి చేతనైన అతి పెద్ద సంఖ్య చెప్పాడు.

“మూడు.”

ఇప్పుడు మొదటి వాడి వంతు వచ్చింది. ఓ పావుగంట లోతుగా ఆలోచించి,

“లాభం లేదు. నువ్వే గెలిచావ్,” అని ఓటమి ఒప్పుకున్నాడు.

పై కథలోని హంగేరియన్లు ప్రత్యేకించి ప్రతిభావంతుల కోవలోకి రారని చెప్పకనే తెలుస్తోంది. హంగరీ దేశస్థులంటే గిట్టని వాళ్ళెవరో అల్లిన కథ అయ్యుంటుంది. ఇలాంటి సంభాషణ హంగరీ దేశస్థుల మధ్య కాదు గాని, హాటెంటాట్ ల మధ్య అయితే నిజంగా జరిగి ఉండేదేమో. ఈ హాటెన్ టాట్ లు ఆఫ్రికాకి చెందిన ఆదిమ జాతులు. ఆఫ్రికాని అన్వేషించిన అన్వేషుల కథనాల బట్టి ఈ హాటెన్టాట్ ల పదకోశంలో మూడు కన్నా పెద్ద అంకెలకి పేర్లు లేవని తెలుస్తోంది. కావాలంటే ఆ జాతి వాళ్లలో ఒకణ్ణి పట్టుకుని ‘నీకు ఎంత మంది పిల్లలు అనో, నువ్వు ఎంత మంది శత్రువుల తలలు నరికావనో అడగండి. ఆ సంఖ్య మూడు కన్నా పెద్దది అయితే “బోలెడు” అని సమాధానం వస్తుందంతే. అంటే ఈ హాటెన్టాట్ జాతి వారిలో వీరాధి వీరులు కూడా అంకెలు లెక్కెట్టే కళలో ఎల్. కె. జి. పిల్లల ముందు కూడా ఎందుకూ పనికి రారు!



ఈ రోజుల్లో మనక ఎంత పెద్ద అంకె కావలిస్తే అంత పెద్ద అంకెని రాయగలం అన్న నమ్మకం వుంది. అది ఒక దేశపు ఆదాయాన్ని అణా పైసలలో లెక్కెట్టడం కావచ్చు, తారల మధ్య దూరాలని ఇంచిలలో కొలవడం కావచ్చు. ఓ అంకె రాసి దాని పక్కన కావలసినన్ని సున్నాలు రాస్తే సరిపోతుందని మనకి తెలుసు. మీ చెయ్యి నొప్పి పుట్టిందాకా సున్నాలు రాస్తూ పోతే ఇంతలోనే విశ్వంలో మొత్తం పరమాణువుల సంఖ్య కన్నా పెద్ద సంఖ్యని రాసేయొచ్చు. నిజానికి ఆ సంఖ్య విలువ –

300,000,000,000, 000,000,000, 000,000,000, 000,000,000, 000,000,000, 000,000,000, 000,000,000, 000,000,000.

మూడు పక్కన 74 సున్నాలు. దీన్నే మరింత సంక్షిప్తంగా ఇలా వ్యక్తం చెయ్యొచ్చు. 3 X 10^74.

10 పైన చిన్న పరిమాణంలో సూచించిన సంఖ్య 74. ఇది 3 తరువాత ఎన్ని సున్నాలు ఉండాలో చెప్తుంది.

కాని ఈ రకమైన “అంకగణితంలో సులభ సూత్రాల” గురించి ప్రాచీన కాలంలో తెలిసేది కాదు. నిజానికి ఈ పద్ధతిని సుమారు రెండు వేల ఏళ్ల క్రితం ఓ భారతీయ గణితవేత్త కనిపెట్టాడు. అలవాటు పడిపోవడం వల్ల గుర్తించం గాని ఇది నిజంగా చాలా ఘనమైన ఆవిష్కరణ.

(ఇంకా వుంది)







3 comments

  1. బాగుంది, చక్కగా రాశారు, జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు,..

     
  2. dhupam abhi Says:
  3. విదేశీయులు చెబితేగానీ మన గొప్పదనం తెలుసుకోలేని స్థితిలో వున్నాము. ఎనీవే థ్యాంక్స్ జార్జ్ గామోవ్. శ్రినివాసచక్రవర్తి గారికి కూడా...

     
  4. Thanks for sharing, nice post! Post really provice useful information!

    Giaonhan247 chuyên dịch vụ vận chuyển hàng đi mỹ cũng như dịch vụ ship hàng mỹ từ dịch vụ nhận mua hộ hàng mỹ từ trang ebay vn cùng với dịch vụ mua hàng amazon về VN uy tín, giá rẻ.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts