అవొగాడ్రో ప్రతిపాదన
కార్లైల్, నికోల్సన్
ల ప్రయోగ ఫలితాలు ఒక ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త చేసిన కృషికి మద్దతు నిచ్చాయి.జోసెఫ్
లూయీ గే లుసాక్ (1778-1850) అనబడే ఇతడు పరిస్థితులని పూర్తిగా తలక్రిందులు చేశాడు.రెండు
ఘనపరిమాణాల హైడ్రోజన్, ఒక ఘనపరిమాణపు ఆక్సిజన్ తో కలిసి నీటిని ఏర్పరుస్తుందని ఇతడు
గమనించాడు.అక్కడితో ఆగక వాయువులు కలిసి సమ్మేళనాలు ఏర్పడినప్పుడు ఎప్పుడూ ఆ వాయువులు
సరళమైన, పూర్ణ సంఖ్యలతో కూడుకున్న నిష్పత్తులలోనే కలుస్తాయని ఇతడు గుర్తించాడు.తన ప్రయోగాల
ఆధారంగా ఘనపరిమాణాల కలయిక నియమం (law of combining volumes) అనే నియమాన్ని
1808 లో ప్రతిపాదించాడు.
హైడ్రోజన్, ఆక్సిజన్
లు కలిసి నీటిన్ని ఏర్పరచిన పూర్ణసంఖ్యాతక నిష్పత్తిని గమనిస్తే ఒక నీటి అణువులో రెండు
హైడ్రోజన్ పరమాణువులు, ఒక ఆక్సిజన్ పరమాణువులు ఉన్నట్టు కనిపించింది. అదే విధంగా అమ్మోనియా
పరమాణువు లో వున్నది ఒక హైడ్రోజన్, ఒక నైట్రోజన్ పరమాణువులు కావని, మూడు హైడ్రోజన్,
ఒక నైట్రోజన్ పరమాణువులు ఉంటాయని ఒప్పుకోవలసి వుంటుంది.ఆ విధంగా నైట్రోజన్ యొక్క అణుభారం 5 కాదని,
దాని అసలు విలువ 14 కావాలని అర్థమవుతుంది.
ఇప్పుడు హైడ్రోజెన్
ని, క్లోరిన్ ని తీసుకుందాం.ఈ రెండు వాయువులు కలిస్తే మరో వాయువు పుడుతుంది.దాని పేరు
హైడ్రోజెన్ క్లోరైడ్.ఒక భాగం హైడ్రోజెన్, ఒక భాగం క్లోరిన్ తో కలుస్తుంది.అందుచేత ఒక
హైడ్రోజెన్ క్లోరైడ్ అణువులో ఒక హైడ్రోజెన్ పరమాణువు, ఒక క్లోరిన్ పరమాణువు కలుస్తాయని
అనుకోవచ్చు.
ఇప్పుడు హైడ్రోజెన్
వాయువులో హైడ్రోజెన్ పరమాణువులు విడివిడిగా దూర దూరంగా ఉంటాయని అనుకుందాం.అలాగే క్లోరిన్
వాయువులులో క్లోరిన్ పరమాణువులు వేరు వేరుగా, దూరదూరంగా ఉన్నాయని అనుకుందాం.ఇప్పుడు
ఈ రెండు వాయువులు కలియగా ఏర్పడ్డ హైడ్రోజెన్ క్లోరైడ్ లో కూడా హైడ్రోజెన్ క్లోరైడ్
అణువులు వేరు వేరుగ్ దూర దూరంగా ఉన్నాయని అనుకుందాం.
ఉదాహరణకి
100 హైడ్రోజెన్ పరమాణువులు, 100 క్లోరైడ్ పరమాణువులని
తీసుకుంటే మొత్తం 200 రేణువులు ఉంటాయి. ఇవి 100 హైడ్రోజెన్
క్లోరైడ్ అణువులుగా ఏర్పడతాయి. దూర దూరంగా ఉన్న 200 రేణువులు (పరమాణువులు), దూర దూరంగా
ఉన్న 100 రేణువులు (అణువులు)గా ఏర్పడ్డాయి. రెండు సందర్భాల్లోను రేణువుల మధ్య దూరం
మారలేదు అనుకుంటే ఒక ఘనపరిమాణం హైడ్రోజెన్, ఒక ఘనపరిమాణం క్లోరైడ్ తో కలిసినప్పుడు
ఒక ఘనపరిమాణం హైడ్రోజెన్ క్లోరైడ్ ఏర్పడాలి. కాని వాస్తవంలో అలా జరగదు.
వాస్తవంలో కొలిచి
చూస్తే ఒక ఘనపరిమాణం హైడ్రోజెన్, ఒక ఘనపరిమాణం క్లోరైడ్ తో కలిసినప్పుడు రెండు ఘనపరిమాణాల
హైడ్రోజెన్ క్లోరైడ్ ఏర్పడుతుంది.మొదట్లోను చివర్లోను కూడా రెండు ఘనపరిమాణాల వాయువు
ఉంది కనుక రెండు సందర్భాలలోను ఒకే సంఖ్యలో రేణువులు ఉండాలని అనిపిస్తుంది.
కాని ఇప్పుడు
మరో విధంగా ఆలోచిద్దాం.హైడ్రోజన్ వాయువులో హైడ్రోజన్ వేరు వేరు పరమాణువులుగా కాక రెండేసి
పరమాణువులు కలిసిన అణువులుగా ఉన్నాయని అనుకుందాం.అదే విధంగా క్లోరిన్ లో కూడా రెండేసి
క్లోరిన్ పరమాణువులు కలిసిన క్లోరిన్ అణువులు ఉన్నాయని అనుకుందాం.అప్పుడు 100 హైడ్రోజన్
పరమాణువులు 50 అణువులుగా దూర దూరంగా ఉంటాయి.అలాగే 100 క్లోరిన్ పరమాణువులు 50 క్లోరిన్
అణువులుగా దూరదూరంగా ఉంటాయి.ఇవి రెండూ కలిసినప్పుడు ఉండే 100 రేణువులలో
సగం హైడ్రోజన్-హైడ్రోజన్ రూపంలోను, సగం క్లోరిన్-క్లోరిన్ రూపంలోను ఉంటాయి.
ఈ రెండు వాయువులు
కలిసినప్పుడు అణువులలో పరమాణు విన్యాసం మారి హైడ్రోజన్ క్లోరైడ్ అణువులు ఏర్పడతాయి.
100 హైడ్రోజన్ పరమాణువులు 100 క్లోరైడ్ పరమాణువులతో కలిసినప్పుడు 100 హైడ్రోజన్
క్లోరైడ్ అణువులు ఏర్పడతాయి.
అంటే 50 హైడ్రోజన్ అణువులు, 50 క్లోరైడ్ అణువులతో కలిసినప్పుడు
100 హైడ్రోజన్ క్లోరైడ్ అణువులు ఏర్పడతాయి. దీన్ని బట్టి ఒక ఘనపరిమాణం హైడ్రోజన్ ఒక
ఘనపరిమాణం క్లోరైడ్ తో కలిసినప్పుడు ఒక ఘనపరిమాణం హైడ్రోజన్ క్లోరైడ్ ఎలా ఏర్పడుతుందో
అర్థమవుతుంది.
(ఇంకా వుంది)
0 comments