ఈ కారణం చేతనే
అకర్బన రసాయనాలు ప్రకృతిలో విరివిగా దొరుకుతాయని మనుషులు భావించేవారు. జీవరహిత ప్రపంచంలోను,
జీవ ప్రపంచం లోను కూడా అవి దొరుకుతాయి. ఉదాహరణకి నీరు సముద్రాలలో ఉంటుంది, రక్తం లో
కూడా ఉంటుంది. ఇందుకు భిన్నంగా కర్బన రసాయనాలు మాత్రం కేవలం జీవప్రపంచానికే పరిమితమై
ఉంటాయి.
ఈ రకమైన దృక్పథాన్ని
1828 లో ఫ్రెడెరిక్ వోలర్ (1800-1882) చేసిన
కృషి సవాలు చేసింది. జర్మనీకి చెందిన ఈ రసాయన శాస్త్రవేత్త బెర్జీలియస్ కి శిష్యుడు.
సయనైడ్లు, వాటికి సంబంధించిన ఇతర రసాయనాల మీదకి వోలర్ దృష్టి సారించాడు. ఒక రోజు అమ్మోనియం
సయనేట్ అనే సమ్మేళనాన్ని వేడి చేస్తున్నాడు. (ఆ రోజుల్లో దీన్ని అందరూ అకర్బన రసాయనం
అనుకునేవారు. దీనికి జీవపదార్థానికి ఏ సంబంధమూ లేదని అనుకునేవారు). అల వేడి చేస్తున్నప్పుడు
ఏర్పడ్డ స్ఫటికలు యూరియాని పోలి వున్నాయని గుర్తించాడు వోలర్. ఈ యూరియా మనుషుల, జంతువుల
మూత్రంలో అధిక మోతాదులో దొరికే ఒక పదార్థం. అంటే ఒక కర్బన రసాయనం. ఆ స్ఫటికాలని నిశితంగా
పరీక్షిస్తే అవి నిజంగానే యూరియా స్ఫటికాలని తెలిసింది.
వోలర్ ఈ ప్రయోగాన్ని
మళ్లీ మళ్లీ చేసి నిర్ధారించాడు. అమ్మోనియమ్ సయనేట్ లాంటి అకర్బన రసాయనాన్ని యూరియా
వంటి కర్బన రసాయనంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకోవచ్చు నని గుర్తించాడు. తను
కనుక్కున్న విషయాన్ని గురువైన బెర్జీలియస్ కి మనవి చేసుకుంటూ ఉత్తరం రాశాడు. ఈ బెర్జీలియస్
నూతన భావాలని సులభంగా ఒప్పుకునే రకం కాడు. కాని పదే పదే చెయ్యబడ్డ ప్రయోగ ఫలితాలని
పరిశీలించిన మీదట జీవ, జీవరహిత రసాయనాలు అంటూ తను చేసిన విభజన అంత సరైనది కాదని ఒప్పుకున్నాడు.
అయితే వోలర్
సాధించిన విజయాన్ని ఆకాశానికి ఎత్తనక్కర్లేదు. నిజానికి ఇది అంత గొప్ప ఫలితమేమీ కాదు.
అసలు అమ్మోనియమ్ సయనేట్ అకర్బన రసాయనమే కాదని వాదించడానికి కొన్ని ఆధారాలు వున్నాయి.
పోనీ కర్బన రసాయనమే అనుకున్నా కూడా అమ్మోనియమ్ సయనేట్ యూరియాగా మారడానికి కారణం ఆ అణువులోని
పరమాణువుల స్థానాలలో కాస్త మార్పు రావడమే కవచ్చు. యూరియా అణువు లో పూర్తిగా కొత్త అంశాలు
కావు.
అలాగని వోలర్
సాధించిన ఫలితాన్ని పూర్తిగా కొట్టేయడానికి కూడా లేదు. ఎందుకంటే ఎంతైనా అది మనుషుల
మనసుల మీద ప్రాణవాదపు పట్టు సడలేలా చేసింది.
ఆ ఫలితం రసాయన శాస్త్రవేత్తలకి కర్బన రసాయనాలని సంయోజించే దిశగా ప్రోత్సాహాన్నిచ్చింది.
1845 లో వోలర్ శిష్యుడైన అడోల్ఫ్ విల్హెల్మ్ హర్మన్ కోల్బ్
(1818-1884) అసెటిక్ ఆసిడ్ ని సంయోజించడంలో
కృతకృత్యుడు అయ్యాడు. ఈ అసెటిక్ ఆసిడ్ కర్బన రసాయనం అనటంలో సందేహం లేదు. అంతేకాక తను
వినియోగించిన విధానంలో మూలాంశాలైన కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ ల నుండి క్రమబద్ధంగా
జరిగే రసాయన చర్యల ఫలితంగా చివరిలో అసెటిక్ ఆసిడ్ ఎలా ఉత్పన్నం అవుతుందో కనిపిస్తుంది.
ఈ రకంగా మూలకాలతో మొదలుపెట్టి ఒక పదార్థాన్ని సంయోజించడానిన్ని ‘పూర్ణ సంయోజనం’ అంటారు.
ఒక రసాయన శాస్త్రవేత్త ఇంతకన్నా కోరుకునేది మరేమీ ఉండదు. యూరియాని సంయోజించటంలో వోలర్
సాధించిన విజయం వల్ల పని కాలేదు అనుకుంటే, కోల్బ్ సాధించిన అసెటిక్ ఆసిడ్ సంయోజనం వల్ల
మాత్రం ప్రాణవాదం భూస్థాపితం అయిపోయింది.
ఈ విజయాన్ని
మరింత ముందుకు తీసుకు వెళ్లిన ఓ ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త ఉన్నాడు. అతడి పేరు పియర్ యూజీన్ మార్సెలొన్ బెర్తెలొ
(1827-1907). 1850 లలో ఇతడు అధిక సంఖ్యలో కర్బన
రసాయనాలని సంయోజిస్తూ వచ్చాడు. మిథైల్ ఆల్కహాల్, ఇథైల్ ఆల్కహాల్, మీథేన్, బెంజీన్,
అసెటిలిన్ మొదలుకొని ఎన్నో ముఖ్యమైన కర్బన రసాయనాలని సంయోజించాడు. ఈ దెబ్బతో అకర్బన
రసాయన ప్రపంచం నుండి కర్బన రసాయన ప్రపంచంలోకి ప్రవేశించడం ఓ విశేషంలా తోచడం మానేసింది.
అదొక సర్వసామాన్యమైన విషయం అయిపోయింది.
(ఇంకా వుంది)
0 comments