స్నేహితుడి
ఆరోగ్యంలో పెద్దగా మార్పు లేకపోవడం చూసి రామానుజన్
ని ఇండియాకి పంపడం శ్రేయస్కరం
అంటూ హార్డీ మద్రాసులో ఉన్న ఓ
రామానుజన్ శ్రేయోభిలాషికి ఉత్తరం రాశాడు.
రామానుజన్
తిరుగు ప్రయాణానికి సన్నాహాలు మొదలయ్యాయి. మద్రాసు
లో ప్రొఫెసర్ గా రామానుజన్
కి నెలకి రూ.
400 జీతంతో ఉద్యోగం ఏర్పాటయ్యింది. ఇది కాకుండా
ఏడాదికి 250
పౌన్ల
పారితోషకం కూడా మంజూరు
అయ్యింది. ఇంచుమించు అంతే స్థాయిలో
ట్రినిటీ కాలేజి కూడా పారితోషకం
మంజూరు చేసింది. ఈ
ధనంతో అతడికి కావలసినప్పుటు ఇంగ్లండ్ సందర్శించే అవకాశం కూడా ఏర్పడింది.
1919 ఫిబ్రవరి 24 నాడు రామానుజన్ పాస్పోర్ట్ కోసమని ఓ ఫోటో
తియ్యించుకున్నాడు. ప్రస్తుతం మనకి ప్రతీ
చోటా దర్శనమిచ్చే ‘రామానుజన్
ఫోటో’ ఇదే.
ఇండియాలో ఉన్నప్పటి రామానుజన్ కి,
ఈ ఫోటోలోని రామానుజన్ కి మధ్య
పోలిక లేదు.
మనిషి బాగా చిక్కిపోయాడు.
అనారోగ్యం వల్ల దేహం
బాగా శుష్కించిపోయింది. కాని చూపులోని
ఆ పదును,
తేజం మాత్రం మారలేదు.
జన్మభూమికి తిరిగి
రాక
మార్చ్
13, 1919 నాడు బొంబాయికి పయనవుతున్న ఓ జపనీస్
ఓడలో ఇండియాకి బయల్దేరాడు. మార్చ్
27, 1999 న
ఓడ బొంబాయి చేరింది. రామానుజన్
కి ఎదురుకోలు చెప్పడానికి తల్లి,
తమ్ముడు లక్ష్మీ నరసింహన్ వచ్చారు.
దిగీ
దిగగానే “జానకి ఏది?”
అని అడిగాడు.
“రాలేదులే, అయినా ఇప్పుడు
ఆ సంగతి ఎందుకు?”
కసురుకుంది తల్లి.
ఆ రాత్రే తల్లి కొడుకులు
మద్రాస్ వెళ్లే రైలెక్కారు.
జానకి
ఎక్కడుందో కూడా రామానుజన్
పరివారానికి తెలీదు.
నిజానికి ఆ సమయంలో
జానకి రాజేంద్రంలోనే వుంది.
కరాచీ నుండి అన్నయ్యతో
పాటు తిరిగి రాజేంద్రానికి వచ్చేసింది. రామానుజన్
ఇండియాకి తిరిగి వస్తున్న సంగతి పత్రికలలో
చదివింది. వెళ్లి చూడాలని మనసు ఆరాటపడుతోంది.
కాని వెళ్తే ఏం జరుగుతుందో
తెలుసు. అన్న శ్రీనివాస
అయ్యంగారు వద్దని వారించాడు. కనుక
వెళ్లే ప్రయత్నం మానుకుంది. ఇంతలో
రామనుజన్ ఇంటి నుండి
రమ్మని ఆహ్వానిస్తూ ఉత్తరం వచ్చింది. రాసింది
అత్తగారు కాదు,
రామానుజన్ తమ్ముడు లక్ష్మీ నరసింహన్. జానకి
తన అన్నయ్య తో పాటు
మద్రాస్ కి బయల్దేరింది.
మద్రాస్
లో సెంట్రల్ స్టేషన్ లో రామానుజన్
కి స్వాగతం చెప్పడానికి వచ్చిన రామచంద్రరావు నీరుగారి పోయాడు. రామానుజన్
కి ఇవి చివరి
రోజులు అనిపించి మనస్తాపం చెందాడు. రామానుజన్
పరివారం ముందు కొంత
కాలం ఎలియట్ రోడ్డు మీద ఓ
ఇంట్లో బస చేశారు.
రామానుజన్ ని చూడడానికి
తన చిన్న నాటి
నేస్తం అయిన విశ్వనాథ
శాస్త్రి వచ్చాడు. ఆ
సమయంలో రామానుజన్ తనకి అత్యంత
ప్రియమైన ‘సాంబారు అన్నం
(సాంబార్ సాదం),
పెరుగు అన్నం
(తైర్ సాదం)’
జుర్రుతున్నాడు. “ఇంగ్లండ్ లో గనక
నాకు ఇవన్నీ దొరికి ఉంటే,
నా ఆరోగ్యం పాడయ్యేది కాదు,”
అన్నాట్ట రామనుజన్.
మద్రాస్
లో ఎంతో మంది
నగర ప్రముఖులు రామానుజన్ ని చూడడానికి
తండోపతండాలుగా వచ్చారు. ఇంతమంది
బిలబిల మంటూ ఇంటికి
రావడం రామానుజన్ ఆరోగ్యానికి మంచిది కాదని డా॥ నంజుండ రావు చేసిన
సూచన మీదట రామానుజన్
ని లజ్ చర్చ్
రోడ్డు మీద ఓ
ఇంటికి మార్చారు.
ఈ
ఇంట్లో రామానుజన్ మూడు నెలలు
ఉన్నాడు. అతిథుల రాకని కట్టడి
చెయ్యడం వల్ల ఈ
దశలో తనకి ఎంతో
అవసరమైన ప్రశాంతత కొంత దొరికింది.
అంతే కాక ఇన్నేళ్ల
తరువాత మళ్లీ కలుసుకున్న
భార్య జానకి తో
కొంత సమయం గడపడానికి
వీలయ్యింది. రామానుజన్ ఇంగ్లండ్ వెళ్లిన నాటికి జానకి వయసు
13. పెళ్లి అంటే ఏంటో,
భర్త అంటే ఏంటో
తెలీని పసి వయసు.
పైగా అత్తగారు చేసే నిర్బంధం
వల్ల భర్త గురించి
తెలుసుకునే అవకాశం లేకపోయింది. ఇప్పుడు
జానకి వయసు
18. ఆమెకి ఇప్పుడు భర్త పట్ల
సహజంగా భార్యకి ఉండే ప్రేమానురాగాలు మాత్రమే
కాదు. తన భర్త
ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఓ గణిత
వేత్త అని తెలిశాక,
పెద్దగా చదువుకోని జానకి అతడి
పట్ల అపారమైన గౌరవం కూడా
ఏర్పడింది. అలాంటి మనిషి ఇంగ్లండ్
లో ఒంటరి అయిపోయేడే,
తను తోడుగా ఉండలేకపోయిందే, తన
తోడుగా ఉండి భర్త
ఆలనా పాలనా చూసుకుని
ఉంటే అతడి ఆరోగ్యం
ఇలా ఉండేది కాదన్న బాధ ఆమె
మనసుని కలచివేస్తోంది. భార్య
భర్తల మధ్య మొదటి
సారిగా ఓ తీయని
అన్యోన్యం, అనురాగం అంకురించాయి. మాటల్లో
తాము రాసుకున్న ఉత్తరాలకి ఏ గతి
పట్టింది, అత్తగారు (తల్లి)
ఎలా ఒకరి ఉత్తరాలు
ఒకరికి అందకుండా చేసిందీ అర్థమయ్యింది.
ఈ
కొత్త ఇంట్లో దొరికిన ప్రశాంతతని భంగం చేస్తూ
ఇక్కడ కూడా అత్త
కోడళ్లు ఘర్షణ పడేవారు.
మద్రాసులో వేసవి ఎండ
తీవ్రంగా ఉంటుంది. కనుక
కాస్త చల్లగా ఉండే ప్రాంతానికి
తరలిస్తే మేలని డాక్టర్లు
సూచించారు. రామానుజన్ తల్లి కొడుముడి
అనే ఊరు ఎంచుకుంది.
రామనుజన్ ఒప్పుకున్నాడు. కాని
జానకి తమతో రాకూడదని
అంక్ష పెట్టింది. మొట్టమొదటి
సారిగా రామానుజన్ తల్లిని ఎదిరించి మాట్లాడాడు.
“జానకి మనతో వస్తుంది.”
తల్లి
అవాక్కయ్యింది.
(ఇంకా వుంది)
కొత్తగ వస్తున రాజకియ వార్తలు సినీమ వార్తలు celebrities గొస్సిప్స్, videos, photographs, అన్నీ సినీమ trailers, మరియు interviews అన్నీటి గురించి తెలుసుకొవలి అనుకొంటె ఇప్పుడె చదవండి మీ Spice Andhra News