శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

లాంగ్ జంప్ లో గెలిచిన న్యూటన్

Posted by V Srinivasa Chakravarthy Friday, August 28, 2015



ఐసాక్ ప్రాథమిక విద్య ఎక్కడ జరిగింది అన్న విషయం గురించి పెద్దగా సమాచారం లేదు. 1655 లో పన్నెండేళ్ళ వయసులో పది కిలోమీటర్ల దూరంలో వున్న గ్రంథామ్ అనే ఊళ్లో ఉన్నకింగ్స్ స్కూల్అనే బళ్లో చేరాడు. వూల్స్ థార్ప్ నుండి అక్కడి దాకా రోజు నడవడం కష్టం కనుక ఊళ్లోనే ఒక ఇంట్లో ఉంటూ  చదువుకునే వాడు. ఉన్న ఇల్లు గలాయన పేరు విలియమ్ క్లార్క్. అతడో  రసాయనికుడు (apothecary). ( రోజుల్లో మందులు తయారు చేసేవారు, మందులు అమ్మేవారు, మందులు రాసిచ్చేవారు అందరూ ఒక్కరే. వారిని అపోతకారీ (apothecary)  అంటారు. వీళ్లు ఇంట్లోనే రసాయనాలు కలిపి, మందులు తయారు చేసి రోగులకి ఇస్తుంటారు.) అతడు చదువుకున్న వాడు. అతడి భార్యకి ఐసాక్ తల్లితో పరిచయం  ఉండేది.  అతడి  ఇంట్లో బోలెడు పుస్తకాలు ఉండేవి. అవకాశం దొరికినప్పుడు ఐసాక్ వాళ్ల ఇంటికి వెళ్లి పుస్తకాలు చదువుకునేవాడు. అంతే కాక అప్పుడప్పుడు రసాయనాలు కలిపే పనిలో అతడికి సహాయం చేసేవాడు. విధంగా రసాయన శాస్త్రంతో  ఐసాక్ కి  మొదటి పరిచయం ఏర్పడింది. రసాయన శాస్త్రం మీద విధంగా ఏర్పడ్డ మక్కువ అతణ్ణి జీవితాతం విడువలేదు.



(గ్రంథామ్ లో న్యూటన్ చదువుకున్న కింగ్స్ బడి)


కాలంలో The mysteries of Nature and Art (ప్రకృతికి, కళకి చెందిన అద్భుత రహస్యాలు)  అనే చక్కని పుస్తకం ఐసాక్ చేతిలో పడింది. బహుశ పుస్తకం గ్రంథామ్ లో తన ఇంటి ఓనరు ఇంట్లోని పుస్తకాల్లో ఒకటి అయ్యుండవచ్చు. కప్పీలు, గేర్లు, సరళ యంత్రాలు మొదలైన చిన్న చిన్న యాంత్రిక పరికరాలు ఎలా పని చేస్తాయో, వాటిని ఎలా తయారు చేస్తారో పుస్తకంలో వివరించబడింది. పుస్తకంలో వర్ణించబడ్డ నమూనాలలో ఎన్నో ఐసాక్ స్వయంగా నిర్మించి చూసుకున్నాడు. గాలిపటాలు చేసి వాటి తోకలకి బాణా సంచా అంటించి, వాటికి నిప్పంటించి, గాల్లోకి వదిలి, దృశ్యాన్ని చూసి ఆనందించేవాడు.  కాని రాత్రి పూట చీకట్లో మెరిసే నిప్పులు చూసి అవి తోకచుక్కలనుకుని, అదేదో దుశ్శకునాన్ని సూచిస్తున్నాయి అనుకుని ఊళ్లో వాళ్లు భయపడేవారు!

సారి ఐసాక్ గాలిమర (windmill)  ని నిర్మిస్తున్న స్థలానికి వెళ్లి దాన్ని ఎలా నిర్మిస్తున్నారో చూసి వచ్చాడు. తనకి కూడా అలాంటిదే చిన్న నమూనా గాలిమర నిర్మించాలని అనిపించింది. అలాగే తన వద్ద ఉన్న పనిముట్లతో చిన్న గాలిమర నిర్మించాడు. మర నిర్మాణం పూర్తయ్యాక అందులో ఎలుకని ప్రవేశపెట్టాడు. ఎలుకకి అందేలా ఒక చోట కొన్ని జొన్న గింజలు  పోశాడు. గింజలు కావాలంటే ఎలుక చక్రం మీద ఎక్కి తొక్కాలి. ఎలుక కాళ్ల కదలికల వళ్ల చక్రం కదులుతుంది. విధంగా ఎలుక శక్తి మీద మర పని చేస్తుంది.

ఎప్పుడూ ఒంటరిగా చదువుకుంటూ, ఏవేవో ప్రయోగాలు చేసుకుంటూ కాలం గడపడం వల్ల ఐసాక్ పెద్దగా ఆటపాటల మీద గాని, వ్యాయామం మీద గాని శ్రద్ధ చూపించేవాడు కాడు. కనుక ఆటల్లో సామాన్యంగా వెనుకబడి వుండేవాడు. అయితే ఐసాక్ కి పరిస్థితి అంతగా నచ్చలేదు. దేహబలం కొరవడినా బుద్ధిబలంతో ఆటల పోటీల్లో గెలవాలనుకున్నాడు. అలాంటి అవకాశం ఒకటి 1658  లో దొరికింది.

సంవత్సరం సెప్టెంబర్ నెలలో పెనుతుఫాను ఇంగ్లండ్ ని అతలాకుతలం చేసింది. ఎప్పుడు చూసినా బలమైన ఈదురుగాలులు వీచేవి. ఇదే అదను అనుకుని ఐసాక్ దూరపు గంతులాటలో (long jump) పాల్గొన్నాడు. ఎప్పుడూ ఆటల ముఖమే చూడని అర్భకుడు రోజు పోటీలో పాల్గొనడం చూసి తోటి పిల్లలు నవ్వుకున్నారు. కాని ఐసాక్ పన్నాగం వాళ్లకి తెలీదు.  సరిగ్గా బలమైన గాలి వీచినప్పుడే గెంతడానికి ముందుకు ఉరికేవాడు. అసలే బక్క ప్రాణం గనుక, గాలి తోసిన తోపుకు మామూలుగా కన్నా ఎక్కువ దూరం గెంతగలిగాడు. తన కన్నా సామాన్యంగా ఎక్కువ దూరం గెంతగలిగే ఎంతో మంది అబ్బాయిల కన్నా విధంగా ఎక్కువ దూరం గెంతగలిగాడు. ఐసాక్  గంతుల వెనుక దాగిన భౌతిక శాస్త్రం అర్థం కాని అతడి చిట్టి నేస్తాలు అదేదో మహత్యం అనుకుని అదిరిపోయారు.

చిన్నప్పట్నుంచి చలనం అన్నా, చలనానికి ఆధారభూతమైన కాలం అన్నా ఐసాక్ కి ప్రత్యేక ఆకర్షణ. సూర్యుడు తన దినసరి యాత్రలో ఆకాశంలో ఒక కొస నుండి మరొక కొసకి ప్రయాణిస్తున్నప్పుడు, అందుకు అనుగుణంగా స్థిరమైన వస్తువుల నీడలు ప్రత్యేక రేఖలో కదులుతాయని మనకి తెలుసు. అదే సూత్రంగా సౌరగడియారాలు లేదా నీడగడియారాలు పని చేస్తాయి. వూల్స్ థార్ప్ లో ఐసాక్ వాళ్లు ఉండే ఇంటి పై కప్పు  కొస యొక్క నీడ నేల మీద పగలంతా ఎలా కదులుతుందో జాగ్రత్తగా పరిశీలించేవాడు. వాడి పరికరంతో నీడ కదిలిన బాటలోనే గీత గీసి సౌరగడియారాన్ని ఏర్పాటు చేశాడు. తరువాత గ్రంథామ్ లో ఉండే రోజుల్లో కూడా తను ఉంటున్న విలియమ్ క్లార్క్ ఇంటి గోడ మీద గీతలు గీసి సౌరగడియారం ఏర్పాటు చేశాడు. దాని మీద నీడ స్థానం బట్టి రోజులో వేళ అయ్యిందో తెలుసుకోవచ్చు. అది చూసిన ఇరుగుపొరుగు వాళ్లు దానికిఐసాక్ గడియారంఅని పేరు పెట్టారు.



(ఐసాక్ న్యూటన్ రూపొందించిన సౌరగడియారం యొక్క నమూనా. దీన్ని రాయల్ సొసయిటీలో భద్రపరిచారు.)

(ఇంకా వుంది)

5 comments

  1. Anonymous Says:
  2. Very happy to know about a rare and great scientist's life history.Waiting for the next part.Thank you.

     
  3. నచ్చినందుకు సంతోషం అనానిమస్ గారు!

     
  4. you are doing a great work srinavas garu

     
  5. you are doing a great work srinavas garu

     
  6. Thank you!

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts