ఆక్సిజన్ మనకు ఎంతగా హాని చేయగలదో చెప్పడానికి సాధారణంగా మన అనుభవం లోనున్న మరో సంగతిని గుర్తు తెచ్చుకోవచ్చు. లిన్సీడ్ ఆయిల్ ని కర్ర
సామనులకు మెరుగు పెట్టడానికి వాడుతారుకదా’! ఆయిల్ పైన్ట్ లలో ఈ నూనెను కలిపి పూతలు పూస్తూంటారు. పూతపూసిన
కొన్నిగంటలలో ఈ నూనెను గాలిలోని ఆక్సిజన్ ఆక్సీకరణం చెందించి ఒక ఘనస్థితిలోవుండే పాలిమర్
గా మార్చేస్తుంది . ఇటువంటి చర్య కర్రసామనులకీ, పేంట్ లకీ
మంచిదే. కానీ మన గుండె గోడలపై ఆక్సీకరణచర్య జరుపతూ గట్టిపూతలు ఏర్పరచే ఆక్సీజన్ బారినుండి మనలని మనం రక్షించుకోవాలి
కదా! కొవ్వు, కొలస్ట్రాల్ ధమనులలో చేరుతూ వుండడం వల్ల
వాటిగోడలపై ప్లేక్స్ (plaques) ఏర్పడతాయి. ఇవి
గట్టిపధార్ధాలు. వీటివల్ల ధమని కాఠిన్యత పెర్గుతుంది. గుండె పోటుకి దారితీస్తుంది. ర్యాన్సిడ్ కొవ్వులు తింటే గుండెజబ్బులు,
కాన్సర్ వచ్చేఅవకాశాలు ఎక్కువవుతాయి మన శరీరం లోని మాంసకృత్తు పదార్ధాలతో ఆక్సీజన్
చర్య పొంది కణజాలాన్ని దెబ్బతీస్తుంది. ముఖ్యంగా కంటిలోని ప్రోటీన్లకి ఈప్రమాదం మరీ ఎక్కువ. ఎందుకంటే
కాంతి ఆక్సీకరణచర్య ను వేగవంతం చేస్తుంది. మనశరీరంలోని డి.యన్.ఎ అణువులను
ఆక్సీజన్ తెంపేస్తుంది. ఫలితంగా కాన్సర్ వస్తుంది.
ఆక్సీజన్ జరిపే ఈ ప్రమాదకర మైన చర్యను అడ్డుకోవడానికి ఆంటి ఆక్సిడెంట్లను వాడు
కోవాలి. మనతో సహా జీవరాశులన్నింటి శరీరాలలోని
సి, ఇ
విటమిన్లు సమర్ధవంతమైన ఆంటీ ఆక్సిడెట్లు గా ఆక్సిజన్ నుండి రక్షణకల్పిస్తాయి. అటువంటి రక్షణ వ్యవస్థను జీవరాశులలో ప్రకృతే ఏర్పాటు చేసింది. సి
విటమిన్ కాన్సర్ కారకమైన నైట్రసొ
అమీన్ లు తయారు కాకుండా అడ్దుకొంటుంది. మన శరీరం లోని ఆంటీఆక్సిడెంట్ రక్షణవ్యవస్థ లో భాగంగా సి విటమిన్ క్రోమోజోమ్ లు తెగిపోకుండా వాటికి
రక్షణకల్పిస్తూ ఇ విటమిన్ శరీరం లో తిరిగి తెరిగి ఏర్పడెలా చేస్తూ
వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.
పండ్లు,
కూరగాయల లో సి, ఇ
విటమిన్లు వుంటాయి. ఇవేకాక వీటిలో వుండే
ఇతర రసాయనాలు అయిన ఫ్లావనాయడ్ లు (flavonoids) ఆంటీఆక్సీడెంట్లుగా పనిచేయడమే కాక మన ఆహారానికి రంగును కూడా సమకూరుస్తాయి. కొసిన
ఆపిల్ ముక్కలపై, ఆలూ ముక్కలపై నిమ్మరసాన్ని పిండితే బ్రౌన్
గామారవు. నిమ్మలోని సి విటమిన్
ఆక్సీకరణచర్యను జరగనీయదు. ఆపిల్ లోనూ ఉల్లిపాయలలోనూ వున్న “క్వెర్సిటిన్” (quercitin), టీలోని
ఎపికల్ కటెచిన్ (catechins) అనే రసాయనాలు ఆంటీఆక్సీడెంట్లు. టొమాటాపండు తొక్క ఎర్రగా వుండడానికి
కారణం దానిలో వుండే లైకొపిన్ (lycopene) అనే ఎర్రని వర్ణదం. ఇది
చాలా సమర్ధవంతమైన ఆంటీఆక్సిడెంట్. వీటితొక్కలనుండి వేరుచేసిన లైకొపిన్ వర్ణదాన్ని
ఆహారసంకలితంగా మన ఆహారపధార్ధాలలో రంగు
కోసమే గాక ఆంటీఆక్సిడెంట్ గా కూడా ఉపయోగించుకొంటున్నాం. మన ఆహారంలో కూరగాయలూ, పండ్లు వుండేలా మన ఆహారపుటలవాట్లను సరిచేసుకోవాలి.
సహజంగా దొరికే
ఆంటీఆక్సిడెంట్లను ఆంటీఆక్సీడెంట్ విటమిన్ లు, ఆంటీఆక్సీడెంట్
ఎంజైమ్ లుగా విభజించి చెప్పుకొంటాం.
ఆంటీఆక్సీడెం ట్ విటమిన్లు-
ఈ ఆంటీఆక్సీడెం ట్ లలో ఆల్ఫాటొకొఫిరొల్ అంటే
విటమిన్ ఇ,బీటాకరొటిన్ అంటే విటమిన్ ఎ ,
ఆస్క్రొబిక్ఆమ్లం అంటే సి విటమిన్ లు రకాలున్నాయి. కారెట్, గుమ్మడి,ఆప్రికాట్, మామిడి వంటి ఆరెంజ్ రంగున్న పండ్లు ,కూరగాయలలొని బీట కరొటిన్, మనకి సులువుగాదొరికే ఎ
విటమిన్. సిట్రస్ జాతికి చెందిన నిమ్మ,ఆరెంజ్,నారింజ,దబ్బ,మొదలైనవి, బ్రొసిలి,ఆకుపచ్చ
ఆకు కూరలలోనూ స్ట్రాబెర్రీలు, లలోనూవుండే ఆస్క్రోబిక్ఆమ్లం
సహజంగామనం తీసికొనగలిగే సి విటమిన్.
ఆల్మండ్, గింజలు,శాకజనూనెలు,సొయబీన్
ఆయిల్ ,మొలకేత్తినవిత్తనాలు మొదలైనవాటిని తినడంద్వారా ఇ విటమిన్ పొందిన వారమవుతాము.
ఆంటీఆక్సీడెంట్ఎంజైమ్
లు
శరీరమే ఆంటీఆక్సీడెంట్ ఎంజైమ్ లను తయారుచేసికొంటుంది అవి సూపరాక్సైడ్ డిస్ముటే
జ్ గ్లుటథైయోన్ పెరొక్సిడేజ్, కటలేజ్ లు. సిలీనియం ఆంటీఆక్సీడెంట్ ఎంజైమ్ విభాగానికే చెందిన ఖనిజం. ఇది వెళ్ళుల్లి,
చేపలు,
కోడిగుడ్లలలొ వుంటుంది.
ఆక్సీకరణచర్య వల్ల మనకి జరిగే హాని గురించి తెలిసాక దీని
నుండి రక్షణ కల్పించు కోవడానికి చాలాతీవ్రస్థాయిలో పరిశోధనలు
జరుగుతున్నాయి. కృత్రిమంగా శాస్త్రవేత్తలు
ఆంటీఆక్సీడెంట్లను తయారు
చేస్తున్నారు. వీటిని సింథటిక్ ఆంటీఆక్సిడెంట్లు అని అంటాం. బుటైల్
హైడ్రాక్సీఅనిసోల్,బుటైల్ హైడ్రాక్సీ టొలీన్, ప్రొపైల్ గాలేట్, టెర్షిరరీ
బుటైల్హిడొక్సిక్వినొన్టొకొప్ఫిరొల్ అనే
అయిదు ఈ రకానికి చెందుతాయి. వీటిని ఆహార
సంకలితాలుగా వాడడం ఆరోగ్యానికి క్షేమదాయకమేనా?
అనే విషయనిర్ధారణకి పరిశోధనలు జరపాల్సి వుంది. ఇంటర్నేషనల్ జర్నల్
ఆఫ్ ఫుడ్ సై న్స్ అండ్ టెక్నాలజీ లొ ప్రచురించబడిన ఒక పరిశోధనావ్యాసం
లో ఆలీవ్ ఆకుల నుండి తీసిన కషాయంలొ చలా
ఎక్కువగా పాలి ఫినొల్ లు వుంటాయనీ అవి
సింథటిక్ ఆంటీ ఆక్సిడెంట్లు కంటె పలు రెట్లు ఎక్కువ సమర్ధవంత మైనవి అని
పేర్కొన్నారు . ప్రకృతి ప్రసాదించిన మనకు మేలు చేసే వాటిని ఎప్పుడూ తగిన మోతాదులో
తీసికొంటె మేలేచేస్తాయి కానీ హానిచేయవు. మధుమేహానికి ఆక్కీకరణచర్యకి సంబంధం వుందని
శ్సాస్త్రవేత్తలు చెపుతారు. ఈవిషయం లో విటమిన్ ఇ రక్షణ కల్పిస్తుంది. రోజుకి
400గ్రాముల కూరగాయలను ఆహారంలో అధికంగా చేర్చుకోవడం ద్వారా గుండెజబ్బు రావడానికి గల అవకాశాన్ని42 శాతం
తగ్గించుకోవచ్చునని వీరు చెపుతారు.
ఆక్సిజన్ చేయగల హాని గురించిన, తీసికోవలసిన జాగ్రత్తల విషయమై
అవగాహనను జనాలలో పెంచవలసిన
అవసరంఉంది. ఆక్సీకరణ చర్యనుండి
రక్షణపొందడానికి మనఆహారపు అలవాట్లలో తగిన మార్పులు చేసుకొంటూ జాగ్రత్తలు తీసికొనడం
ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకొనగలిగిన
వారమవుతాము.
(వ్యాసం సమాప్తం)
1 Responses to ఏంటీ ఆక్సిడంట్ల గురించి మరి కొన్ని విషయాలు - రచన - డా॥ చాగంటి కృష్ణకుమారి