ఈ రోజు (మార్చ్
14) ఐన్ స్టయిన్ పుట్టిన రోజు. ఆ మహాశాస్త్రవేత్త మార్చ్ 14, 1879 నాడు పుట్టాడు.
ఐన్ స్టయిన్
కి పుట్టిన రోజు పండుగలు జరుపుకోవడం అంటే గిట్టేది కాదట. పుట్టిన రోజు పండుగలు “పసి
పిల్లలకి” అని త్రోసి పుచ్చేవాడు.
అయితే 1953 లో
తన 74 వ పుట్టిన రోజు మాత్రం అభ్యంతరం చెప్పకుండా బుద్ధిగా తన పుట్టిన రోజు పండుగలో
పాల్గొన్నాడు. ఆ సందర్భంలో న్యూ యార్క్ రాష్ట్రం లోని యేషివా విశ్వవిద్యాలయం వాళ్లు
ఐన్ స్టయిన్ గౌరవార్థం ఆయన పేరుతో ఓ వైద్యవిశ్వవిద్యాలయానికి ప్రారంభోత్సవం చెయ్యాలని
తలపెట్టారు. ఆ ఒక్క సారి మాత్రం ఎందుకో ఆ శాస్త్రవేత్త ఒప్పుకున్నాడు.
ఎప్పట్లాగే వొదులైన
పాంటు, వదులైన స్వెట్టరు కాకుండా చక్కగా సూటు వేసుకుని వేడుకకి హాజరు అయ్యాడు. వేషం
మారినా నడతలో మాత్రం పెద్దగా మార్పులేదు. పెద్దగా ఎవరితోనూ మాట్లాడకుండా ఓ మూల కూర్చుకున్నాడు.
తన కోసం ఓ స్థానిక బేకరీ వాళ్లు ఎంతో ప్రేమగా
తయారు చేసిన “మూడు అంతస్థుల” కేకుని గమనించను కూడా లేదు. విందులో వేయించిన బీఫ్ చూసి
“అది సింహాలకి సరిపోతుంది” అని చిరునవ్వు నవ్వాడట!
మొత్తం మోద ఐన్
స్టయిన్ గౌరవార్థం నిర్వహించిన ఆ విందులో వైద్యవిశ్వవిద్యాలయ నిర్మాణం కోసం మూడున్నర
మిలియన్ డాలర్ల విరాళాలు పోగయ్యాయి. విందు ముగిశాక ఆ సందర్భంలో ముఖ్య అతిథిగా ఏదైనా
మాట్లాడమన్నారు. ఐన్ స్టయిన్ నోటి వెంట ముచ్చటగా
రెండే ముక్కలు వెలువడ్డాయి – “హమ్మయ్య! అయిపోయింది!”
http://time.com/4228178/albert-einstein-birthday/
Cool info sir...
ఐన్ స్టయిన్ కి జన్మదిన శుభాకాంక్షలు- ? ? ?ప్చ్