శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
ప్రియమైన బ్లాగర్లారా,

చెన్నై బి (AM 1017 kHz) స్టేషన్లో 5/3/16 నాడు సైన్స్ అంశం మీద తీసిన 'అక్టోబర్ స్కై  సినిమా' కథ మీద నా రేడియో ప్రసంగం ప్రసారం కాబోతోంది. సమయం - ఉదయం 8:15  కి.
రేడియో ఉన్న వాళ్లు వినగలరు.

అక్టోబర్ స్కై సినిమా కథని ఇంతకు ముందు ఈ బ్లాగ్ లో సీరియల్ గా చెప్పడం జరిగింది. దానికి సంక్షిప్త రూపమే ఈ ప్రసంగం.

---



 
October Sky (రాకెట్ కుర్రాళ్లు)
కథనం -  వి. శ్రీనివాస చక్రవర్తి
(ఎలాంటి వసతులూ లేని ఓ కుగ్రామానికి చెందిన కొందరు స్కూలు పిల్లలు ఎంతో ప్రయాస పడి ఓ రాకెట్ నిర్మించి దాంతో అమెరికాలో జాతీయ స్థాయిలో సైన్స్ ప్రాజెక్ట్ ల పోటీలో ఎలా గెలిచారో చెప్పే ఓ అత్యంత స్ఫూర్తిదాయకమైన కథ).
ఈ కథ పేరు అక్టోబర్ స్కై. అంటే అక్టోబర్ ఆకాశం.  ఇది నిజంగా జరిగిన కథ. కథ జరిగిన కాలం 1957. కథాస్థలం అమెరికాలో ఓ గ్రామం. ఓ బొగ్గు గని తప్ప మరే ఇతర అభివృద్ధికి నోచుకోని ఓ చిన్ని కుగ్రామం. దాని పేరు కోల్ వుడ్. ఆ గ్రామంలో నలుగురు కుర్రాళ్లకి కొన్ని కారణాల వల్ల ఓ రాకెట్ నిర్మించాలని ఆలోచన వస్తుంది. ఆ రాకెట్ నిర్మించడం కోసం వాళ్లు ఎదుర్కున్న సవాళ్లు, అనుభవించిన ఎదురుదెబ్బల వృత్తాంతమే ఈ కథ. స్కూలు పిల్లలకి స్ఫూర్తి దాయకంగా ఉంటుందని నవలా రూపంలో వచ్చిన ఈ కథని అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలో పిల్లలు తప్పనిసరిగా చదవలసిన పుస్తకాల జాబితాలోకి చేర్చారు. ఈ కథ హాలీవుడ్ సినిమాగా కూడా విడుదల అయ్యింది. ఇక కథ మొదలెడదామా?
.
1957 అక్టోబర్ 4, లో రష్యా స్పుట్నిక్ ఉపగ్రహాన్ని విజయవంతంగా అంతరిక్షంలోకి పంపించింది. ప్రపంచంలో అదే మొట్టమొదటి ఉపగ్రహం. ఆ వార్త అమెరికాలో గొప్ప సంచలనం కలిగిస్తుంది.
మన కోల్ వుడ్ గ్రామంలో కూడా స్పుట్నిక్ గురించి జనం రకరకాలుగా మాట్లాడుకుంటుంటారు.
స్పుట్నిక్ లో ప్రత్యేకత ఏంటంటే దాన్ని భూమి నుండి ప్రత్యక్షంగా కళ్లతో చూడచ్చు. చీకటి ఆకాశంలో చిన్న కదిలే తారలా అందంగా మెరుస్తూ కనిపిస్తుంది. 

ఆ వింత చూడడానికి ఓ రోజు సాయంతం కోల్ వుడ్ ప్రజలంతా ఒక చూట గుమిగూడుతారు.

బృందంలో పిల్లవాడు కూడా ఉన్నాడు. దృశ్యాన్ని చూసి బాగా ప్రభావితం అయిన ఆ పిల్లవాడి పేరు హోమర్. ఎలాగైనా ఓ నిజం రాకెట్ నిర్మించాలని ఆ రోజే తన మనసులో ఓ బలమైన కోరిక నాటుకుంటుంది.

హోమర్ కి ఇద్దరు స్నేహితులు. ఒకడి పేరు రాయ్ లీ. ఇతగాడి తండ్రి బొగ్గు గని ప్రమాదంలో మరణిస్తాడు. రెండవ మిత్రుడు షర్మాన్ డెల్. ఇతగాడి తండ్రి కూడా బొగ్గు గని ప్రమాదంలో పోయిన వాడే. 
హోమర్ నేస్తాలకి తన ఆలోచన గురించి చెప్తాడు.
అయితే  ముగ్గురికీ రాకెట్ గురించి పెద్దగా తెలీదు.

ఓం ప్రథమంగా చిన్న ప్రయోగం చేస్తారు. ఎక్కడో కొన్నిదీపావళిపటాసుల లాంటి 30 పటాసులు సంపాదిస్తారు. అందులోని మందుగుండు తీసి, గొట్టంలోకి దట్టించి, చిన్న రాకెట్ లాంటిది తయారు చేస్తారు. అది గాల్లోకి ఎగరకపోగా బాంబులా మొహం మీదే పేలుతుంది. అది హోమర్ తల్లి చూస్తుంది.


ఒరేయ్! రాకెట్లతో ఆడుకోమన్నా గాని, ప్రాణాల మీదికి తెచ్చుకో మన్లేదుఅని ముగ్గుర్నీ దులిపేస్తుంది.

మొదటి ప్రయోగం అలాతుస్సుమన్నందుకు హోమర్ విచారపడతాడు.
కాని రాకెట్ నిర్మించాలన్న ఆలోచన మాత్రం వదులుకోడు. 

అయితే ప్రాణం మీదకి తెచ్చుకోకుండా రాకెట్ ని తయారు చెయ్యడం ఎలా?


హోమర్ బళ్లో ఓ విచిత్రమైన శాల్తీ ఉంటాడు. ఎప్పుడూ ఒంటరిగా ఓ మూల కూర్చుని చదువుకునే ఓ పుస్తకాల పురుగు. వీడి పేరు క్వెంటిన్ విల్సన్. సైన్స్ లో తన తోటి నేస్తాల కన్నా ఎంతో ఎక్కువ పరిజ్ఞానం ఉన్నవాడు. 

హోమర్ క్వెంటిన్ ని పరిచయం చేసుకుని రాకెట్ విషయం అడుగుతాడు. 


క్వెంటిన్ రాకెట్ల గురించి తనకి తెలిసినదంతా ఏకరువు పెట్టుకొస్తాడు. వెయ్యేళ్ల క్రితం చైనా వాళ్లు మొదట రాకెట్లు కనుక్కున్నారంటూ రాకెట్ల చరిత్ర చెప్పుకొస్తాడు. తన వద్ద ఉన్నసైంటిఫిక్ అమెరికన్పత్రికలో వ్యాసం తెచ్చి చూపిస్తాడు. అందులో రాకెట్ ఎలా తయారు చెయ్యాలో వివరంగా ఉంటుంది.


వ్యాసం చదివాక పిల్లలు ముగ్గిరికీ రాకెట్ నిర్మాణం గురించి కొన్ని విషయాలు అర్థమవుతాయి. రాకెట్ ఇంధనంలో ముఖ్య అంశాలు పొటాషియమ్ క్లోరేట్, మరియు సల్ఫర్. ఓ లోహపు గొట్టంలో ఆ పదార్థాలు కూరుతారు. గొట్టానికి ఒక కొసలో మూత పెడతారు. అవతలి కొసలో మంటలు బయటికి పోడానికి సన్నని ద్వారం ఏర్పాటు చెయ్యాలి. అంటే గొట్టాన్ని ఇంచుమించు మూస్తూ వాషర్ ని తెచ్చి అక్కడ వెల్డింగ్ (welding) చెయ్యాలి. 
కుర్రాళ్ళు ముగ్గురికీ మరి వెల్డింగ్ రాదు. కనుక హోమర్ తన తండ్రి వద్ద పని చేసే ఇసాక్ బైకోవ్‍స్కీ అనే ఉద్యోగి సహాయం అడుగుతాడు. హోమర్ తండ్రి పేరు మిస్టర్ హికమ్. ఇతడు గ్రామంలోని బొగ్గు గనికి మేనేజరు.
కంపెనీ సరంజామా ఉపయోగించి పిల్లలకి సాయం చేయడం హోమర్ తండ్రికి ఇష్టం వుండదని బైకోవ్‍స్కీ కి బాగా తెలుసు. అయినా పిల్లల ఉత్సాహం చూసి వాళ్ళు అడిగినట్టే గొట్టానికి ఒక కొసలో వాషర్ వెల్డ్ చేసి ఇస్తాడు.
అలా తయారైన రాకెట్ లో మందుగుండు పొడి బాగా దట్టించి మళ్లీ నిప్పు అంటిస్తారు.

వత్తి అంటించగానే రాకెట్ చివ్వున పైకి లేస్తుంది. కాని అలా పైకి లేచిన  రాకెట్ క్షణంలో మనసు మార్చుకుని పక్కకి తిరిగి ఊరి మీద విరుచుకు పడుతుంది. మీదకి దూసుకొస్తున్న రాకెట్ ని చూసిన జనం చెంగు చెంగున పక్కకి గెంతి ప్రాణాలు కాపాడుకుంటారు. అలా ఊరంతటినీ జడిపించిన రాకెట్ చివరికి పోయి పోయి హోమర్ తండ్రి ఆఫీసు కిటికీ అద్దాలు బద్దలుకొట్టుకుని ఆయన పాదాల వద్ద వాలుతుంది!

అది చూసిన హోమర్ తండ్రికి ఒళ్ళు మండిపోతుంది. కొడుకు చేసిన నిర్వాకానికి అందరి ముందు దులిపేస్తాడు. “మళ్లీ కంపెనీ పరిసరాల్లో చెత్తతో కనిపిస్తే ఊరుకునేదే లేదుఅని గట్టిగా మందలిస్తాడు.

విషయం హోమర్ నేస్తాలకి తెలిసి నీరుగారి పోతారు. అప్పుడు హోమర్ కి ఆలోచన వస్తుంది.
తన తండ్రి అసలు రాకెట్ తో ప్రయోగాలు చేసుకోమన్లేదు. కంపెనీ పరిసరాలలో చెయ్యొద్దన్నాడు అంతే. కనుక కంపెనీ సరిహద్దుల బయట ఎక్కడైనా మళ్లీ ప్రయోగాలు కొనసాగిద్దాం అంటాడు. జరిగే పని కాదంటారు మిత్రులు.

అప్పుడు హోమర్ అంటాడు – “చూడండి! ఊళ్లో పుట్టిన దౌర్భాగ్యానికి మనందరి జీవితాలు బొగ్గు గనిలోనే తెల్లారబోతున్నాయి. లేక లేక మంచి అవకాశం దొరికింది. జాతీయ స్థాయిలో సైన్స్ పోటీలో నెగ్గితే మనకి స్కాలర్షిప్ లు వస్తాయి. పై చదువులకి మంచి విశ్వవిద్యాలయాకి వెళ్ళొచ్చు. కొంచెం దూరదృష్టితో ఆలోచించండి. ఇది తప్ప మనకి వేరే దారి లేదు.” 

ముగ్గురు పిల్లలూ ఒప్పుకుంటారు. గ్రామం పొలిమేరల బయట  ఎనిమిది మైళ్ళ దూరంలో ఓ చోట విశాలమైన మైదానం కనిపిస్తుంది.
అక్కడో చక్కనిలాంచ్ పాడ్లాంటిది నిర్మిస్తారు. ఆ నిర్మాణంలో గ్రామస్థులు కూడా ఎంతో సహాయపడతారు.

మన రాకెట్ కుర్రాళ్లు మళ్లీ రాకెట్ ప్రయోగాలు కొనసాగిస్తారు. కాని అదేం ఖర్మమో గాని  ఎంత పకడ్బందీగా నిర్మించినా రాకెట్ మళ్లీ మళ్లీ పేలిపోవడం వాళ్లని కాస్త నిరుత్సాహ పరుస్తుంది. రాకెట్ నిర్మాణంలో ఎక్కడో పొరబాటు జరుగుతోంది. 
సారి ఇంధనంగా కొత్త మిశ్రమాన్ని వాడాలని అనుకుంటారు. పొటాషియమ్ క్లోరైడ్ ని పంచదారతో కలిపి వేడి చేస్తే మరింత శక్తి పుడుతుందని క్వెంటిన్ ఎక్కడో చదువుతాడు.

అలాగే మళ్లీ రాకెట్ తయారు చేస్తారు.  రెండవ లాంచ్ కి రంగం సిద్ధం అవుతుంది. లాంచ్ చూడ్డానికి కొంత మంది గ్రామస్థులు కూడా వస్తారు. వారిలో బోల్డెన్ అనే వ్యక్తి కూడా ఉంటాడు. ఇతడు కూడా వర్క్ షాప్ లో పని చేస్తాడు. 
వత్తి అంటించిన రాకెట్ ముందు జయ్c మని అంతెత్తు లేస్తుంది కాని అంతలో పక్కకి తిరిగి ప్రేక్షకుల మీద దండెత్తుతుంది. కుర్రాళ్ళని విడిచిపెట్టి కొత్తగా వచ్చిన బోల్డెన్ దిశగా దూసుకొస్తుంటుంది. హడలెత్తిన బోల్డెన్ పక్కకి గెంతి ప్రాణం కాపాడుకుంటాడు.

మట్టిలో కూరుకుపోయి పొగలు కక్కుతున్న రాకెట్ ని పరిక్షిస్తాడు  బోల్డెన్. అతడికి సమస్య ఎక్కడుందో అర్థమవుతుంది. 
ఇంధనం వేడికి కింద వెల్డ్ చేసిన వాషర్ బాగా కరిగిపోయింది. దాంతో జ్వాల సన్నని ధారగా రావడం మానేసింది. అందుకే రాకెట్ నేల మీద చేపలా ఎగిరెగిరిపడింది. 
వాషర్ ఎప్పుడూ బాగా వేడిని తట్టుకునే పదార్థంతో చేసింది అయ్యుండాలి. దానికి మరింత మేలు జాతి స్టీలు తెమ్మంటాడు బోల్డెన్

అలాంటి స్టీలు ఎక్కడ దొరుకుతుందో వాకబు చేస్తారు రాకెట్ కుర్రాళ్లు. రైలు పట్టాల్లో సరిగ్గా ఆరకమైన స్టీలే వాడతారని తెలుస్తుంది. ఊరికి కొంత దూరంలో ఒక చోట నిరుపయోగంగా పడి వున్న రైలు పట్టాలు కనిపిస్తాయి. వాటిని ఊడబెరుక్కుని తెచ్చి బోల్డెన్ కి ఇస్తారు

కొత్తరకం స్టీలుతో చేసిన వాషర్ తో మరో రాకెట్ ని తయారు చేసి లాంచి సిద్ధం చేస్తారు. దురదృష్టవశాత్తు సారి కూడా రాకెట్ దిక్కు తెన్ను లేకుండా ఎగిరి అర్థాంతరంగా పేలిపోతుంది.

సారి రాకెట్ నిర్మాణంలో మరో దోషాన్ని గుర్తిస్తాడు బోల్డెన్. 
రాకెట్ నుండి మంటలు బయటికి వచ్చే సన్నని రంధ్రాన్ని నాజిల్ (nozzle) అంటారు. రాకెట్లో ఆ నాజిల్ ఉన్న చోట పీక సన్నంగా ఉండాలి. దానికి ఇరుపక్కలా కాస్త వెడల్పుగా ఉండాలి. దాన్ని ద లవాల్ నాజిల్ (de Laval nozzle) అంటారు.
మార్పులన్నీ చేసి మళ్లీ రాకెట్ తయారు చేస్తారు రాకెట్ కుర్రాళ్లు.

ఎన్ని చేసినా పెటేలుమని పేలిపోయే ఆ రాకెట్ల ధోరణి మాత్రం మారదు.
అయినా నిరుత్సాహ పడకుండా మన రాకెట్ విక్రమార్కులు ఇంకా ఇంకా మేలైన రాకెట్లు రూపొందించుకుంటూ ముందుకు పోతారు. 

సారి క్వెంటిన్ దోషం గుర్తిస్తాడు. ఇంతవరకు తాము వాడిన ఇంధనంపొడి ఇంధనం’ (solid propellant). పొడి ఇంధనం తో వచ్చిన చిక్కేంటంటే పదార్థంలో అక్కడక్కడ గాలిబుడగలు (air pockets) చిక్కుకుపోవచ్చు. ఈ గాలిబుడగల వల్ల రాకెట్ పేలిపోయే ఆస్కారం ఎక్కువ. కనుక ఇంధనం ద్రవ రూపంలో ఉంటే మేలు. అందుకని పొడి ఇంధనంలో ఆల్కహాల్ కలిపి ద్రవ రూపంలో ఇంధనం తయారు చేస్తారు. 

కాని సారి రాకెట్ దారి తప్పకుండా సూటిగా బాణంలా నింగి లోకి దూసుకుపోతుంది.  సారి అనుకోకుండా లాంచ్ చూడడానికి బోలెడు మంది గ్రామస్థులు వస్తారు. హోమర్ నేస్తాల సంతోషానికి హద్దుల్లేవు.
రాకెట్ లాంచ్ విజయవంతం అయిన వార్త ఊరంతా పొక్కుతుంది. వార్త బళ్లో కూడా సంచలనం సృష్టిస్తుంది. ప్రయోగం విజయవంతం అయితే జాతీయ సైన్స్ పోటీ లో పాల్గొనచ్చని మిస్ రైలీ అని టీచరు ప్రోత్సహిస్తుంది.
పిల్లలు నలుగురూ సైన్స్ పోటీకి సన్నాహాలు మొదలుపెడతారు.  

అలా అంతా సజావుగా సాగుతోంది అనుకుంటుండగా కథ అడ్డం తిరుగుతుంది.
ఓ రోజు హోమర్ చదువుకుంటున్న బడికి పోలీసులు వచ్చి
హోమర్ కి, అతడి స్నేహితులకి బేడీలు వేసి బర బర లాక్కుపోతారు. ఇది తెలిసిన మిస్ రైలీ, హెడ్ మాస్టర్ తో మాట్లాడి, ఎక్కడో ఏదో పొరబాటు జరిగిందని ఒప్పించి, పిల్లలని విడిపిస్తుంది.

ఇంతకీ వాళ్లు చేసిన నేరం ఏంటని వాకబు చెయ్యగా విషయం తెలుస్తుంది. లాంచ్ జరిగిన ప్రదేశానికి పక్కనే అడవిలో పెద్ద అగ్ని ప్రమాదం జరుగుతుంది. దానికి కారణం హోమర్ నేస్తాలు లాంచ్ చేసిన రాకెట్టే అయ్యుంటుందని పోలీసులు భావిస్తారు.

జరిగిన దానికి హోమర్ తండ్రి కొడుక్కి తల వాచేలా చివాట్లు పెడతాడు.
ఆ నాటి నుండి రాకెట్ ప్రయోగాలు ఆగిపోతాయి.
ఇది జరిగిన కొన్నాళ్లకి హోమర్ తండ్రి బొగ్గు గనిలో ఓ ప్రమాదంలో ఇరుక్కుంటాడు. దాంతో కుటుంబాన్ని పోషించే బాధ్యత హోమర్ నెత్తిన పడుతుంది. చదువు మధ్యలో నిలిపి హోమర్ బొగ్గు గనిలో పన్లో చేరతాడు.
ఇలా ఉండగా ఓ రోజు హోమర్ బృందాన్ని అంతవరకు ప్రోత్సహించిన మిస్ రైలీకి అనారోగ్యంగా వుందన్న వార్త వస్తుంది. తమ ప్రియతమ టీచర్ ని చూడడానికి హోమర్ వెళ్తాడు.
నలుగురు కుర్రాళ్ళ మీద ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుందని, వాళ్లిలా తమ లక్ష్యాన్ని విస్మరించడం తనకి బాధగా ఉందని అంటుంది మిస్ రైలీ. 

చూడు హోమర్! జీవితంలో కొన్ని సార్లు మన చుట్టూ ఉన్నవాళ్లు ఒక్కొక్కరు ఒక్కోలా సలహా ఇస్తుంటారు. ఎవరేం చెప్పినా గుడ్డిగా వినకూడదు. నీ మనసు ఏం చెప్తుందో తెల్సుకుని దాని ప్రకారం నడచుకోవాలి”, అని ప్రోత్సహిస్తుంది.

హోమర్ కి జ్ఞానోదయం అవుతుంది. వెంటనే సైన్స్ లో దిట్ట అయిన క్వెంటిన్ వద్దకి వెళ్తాడు. ఇద్దరూ కలిసి తాము అంతకు ముందు లాంచ్ చేసిన రాకెట్ ఎక్కడ పడి వుంటుందో లెక్కలు వేస్తారు. అడవిలో జరిగిన అగ్ని ప్రమాదం తమ రాకెట్ వల్ల జరిగి వుండదని లెక్కలు వేసి శాస్త్రపరంగా నిరూపిస్తారు. రాకెట్ కుర్రాళ్లు నిరపరాధులు అని తేలుతుంది.

రాకెట్ కుర్రాళ్లు సైన్స్ పోటీలో పాల్గొనడానికి సన్నాహాలు చేసుకుంటారు.
ముందు జిల్లా పోటీలో గెలుస్తారు. ఇక జాతీయ పోటీకి వెళ్ళాలి. నలుగురిలో ఒక్కరే వెళ్లే వీలు ఉండడంతో అందరూ హోమర్ ని పంపిస్తారు.  

హోమర్ బృందానికి బంగారు పతకం దొరుకుతుంది. విజయుడై ఊరికి తిరిగొచ్చిన హోమర్ కి ఊరంతా ఘన స్వాగతం పలుకుతుంది. హోమర్ తను సాధించిన పతకాన్ని కోల్ వుడ్ గ్రామానికి అంకితం చేస్తాడు.
విధంగా చక్కని సైన్స్ ప్రాజెక్ట్ పేరు లేని కుగ్రామాన్ని సమూలంగా, శాశ్వతంగా మార్చేస్తుంది.

(ప్రసంగం సమాప్తం)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts