
యురేనస్ గ్రహాన్ని కనుక్కున్న వాడిగా విలియమ్ హెర్షెల్ కి ఖగోళశాస్త్రచరిత్రలో ఓ ప్రత్యేక స్థానం ఉంది. అంతే కాకుండా మన పాలపుంత ఒక కందిగింజ ఆకారంలో ఉందని ఊహించి, దాని పరిమాణం గురించి మొట్టమొదటి అంచనాలు వేసిన వాడు కూడా ఇతడే. ఇతగాడికి మంచి నాణ్యమైన దూరదర్శినుల నిర్మాతగా కూడా మంచి పేరు ఉంది. ఈ రోజుల్లో ఖరీదైన కార్లు సొంతం చేసుకున్నట్టు, ఆ రోజుల్లో దూరదర్శినులు కలిగి ఉండడం ఒక గొప్ప. సంఘంలో పెద్ద మనుషులుగా చెలామణి అయ్యేవారు ఓ దూరదర్శినిని - దాన్ని...

పందొమ్మిదేళ్ల వయసులో గౌస్ జ్యామితికి సంబంధించిన ఓ అత్యంత జటిలమైన సమస్యని పరిష్కరించాడు.కేవలం ఓ రూళ్లకర్రని (straightedge), కంపాస్ (compass) ని ఉపయోగించి పదిహేడు భుజాలు గల క్రమ సప్తదశభుజిని ఎలా నిర్మించాలో కనుక్కున్నాడు. జ్యామితికారులకి అందమైన, మంచి సౌష్టవమైన ఆకారాలు అంటే ఇష్టం. క్రమబహుభుజులు (regular polygons) అలాంటి అందానికి మచ్చుతునకలు. క్రమబహుభుజులలో మనకి బాగా తెలిసిన ఉదాహరణలు సమబాహు త్రిభుజం (మూడు భుజాలు గల క్రమబహుభుజి), చతురస్రం...

ద్విపద సిద్ధాంతాన్ని ఇలా వ్యక్తం చెయ్యొచ్చు:(1+x)^n = 1 + n x + n(n-1) x^2 /(1*2) + n(n-1)(n-3) x^3 /(1*2*3) + …పై గణిత సూత్రంలో n (>౦) పూర్ణసంఖ్య అయితే సమీకరణంలో కుడి పక్కన ఉన్న కూడిక కొన్ని పదాల తరువాత అంతం అవుతుంది. అయితే పై సూత్రం n ధన పూర్ణసంఖ్య కాకపోయినా వర్తిస్తుంది. అలాంటప్పుడు కుడి పక్కన ఉన్న శ్రేణి అనంతంగా సాగిపోతుంది. ఉదాహరణకి n = -1, అయినప్పుడు పై సూత్రాన్ని ఇలా వ్యక్తం చెయ్యొచ్చు:(1+x)^(-1) = 1 - x + x^2 - x^3 + …కాని చిక్కేంటంటే...

పూవు పుట్టగనే అన్నట్టు మూడేళ్ల నాటి నుంచే గౌస్ తన ప్రతాపాన్ని చూపించసాగాడు. ఒక సారి గౌస్ తండ్రి తన వద్ద పని చేసే కూలి వాళ్లకి నెలసరి జీతాలు అందజేస్తూ లెక్క చూస్తున్నాడు. అంతలో అక్కడే నించుని ఈ వ్యవహారాన్ని శ్రద్ధగా చూస్తున్న చిన్నారి గౌస్ ఉన్నట్టుండి, “ఈ విలువ తప్పు, అసలు విలువ ఇలా ఉండాలి,” అంటూ సవరణ సూచించాడు. తండ్రి ముందు ఆశ్చర్యపోయినా తరువాత లెక్కంతా సరిచూసి కొడుకు చెప్పింది నిజమేనని గుర్తించాడు.అప్పటికే ఆ చిన్నోడు తల్లిదండ్రుల నుండి,...

రాష్ట్రంలో అక్షరాస్యత అంత తక్కువా?ఈ రోజు సాక్షి పత్రికలో ప్రచురించబడ్డ మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అక్షరాస్యతకి సంబంధించిన వివరాలు బాధాకరంగా ఉన్నాయి. ఇటీవలే విడుదల అయిన Statistical Abstract – 2009 అనే ప్రభుత్వ నివేదికలో వెల్లడైన సమాచారం ఇది.అక్షరాస్యతలో టాప్-5 జిల్లాలు:హైదరాబాద్ - 78.8%పశ్చిమగోదావరి - 73.5%కృష్ణా - 68.8%చిత్తూరు - 66.8%రంగారెడ్డి - 66.2%60% శాతం కన్నా తక్కువ అక్షరాస్యత ఉన్న 13 జిల్లాలు:మహబూబ్ నగర్ - 44%విజయనగరం - 51.1%మెదక్...

ఆర్కిమిడీస్, న్యూటన్, గౌస్ – వీరు ముగ్గురూ పాశ్చాత్య గణితలోకంలో త్రిమూర్తులు అని చెప్పుకుంటారు. ముగ్గురిలో ఎవరు గొప్ప అన్న ప్రశ్న అడగరానిది. ముగ్గురూ ఎవరికి వారే సాటి. శుద్ధ (pure), ప్రయోజనాత్మక (applied) గణితరంగాల్లో సంచలనం సృష్టించిన మహామహులు వీళ్లు. ఆర్కిమిడీస్ ప్రయోజనాత్మక గణితం కన్నా శుద్ధ గణితాన్నే ఎక్కువగా ఆరాధించాడు. కవి ఛందస్సుని వాడినట్టు, న్యూటన్ గణిత భాషతో ప్రకృతి గతులని అధ్బుతంగా వర్ణించి, శుద్ధ గణితానికి ఓ కొత్త అర్థాన్ని,...

న్యూట్రాన్ తారలకి, మైక్రోవేవ్ తరంగాలకి మధ్య సంబంధం ఉండొచ్చన్న ఆలోచన మొట్టమొదటి సారిగా 1964 లో జరిగిన ఒక పరిశీలనతో మొదలయ్యింది. అంతరిక్షంలో కొన్ని దిశల నుండి వస్తున్న రేడియో తరంగాలలో అత్యంత వేగవంతమైన ఆటుపోట్లు (fluctuations) ఉండడం కనిపించింది. ఆకాశంలో అక్కడక్కడ కనిపించే ఈ “రేడియో తళుకుల” గురించి అప్పట్నుంచి చాలా పరిశీలనలు జరిగాయి. బ్రిటిష్ ఖగోళశాస్త్రవేత్త ఆంటొనీ హెవిష్ నిర్మించిన ఒక ప్రత్యేకమైన రేడియో దూరదర్శినితో మైక్రోవేవ్ తరంగాలలోని...

బలహీనమైన మైక్రోవేవ్ తరంగాలని ఎలా గ్రహించాలో తెలుసుకున్న శాస్త్రవేత్తలకి ఆ తరంగాలకి రెండు అనువైన లక్షణాలు ఉన్నాయని తెలిసింది. మొదటి లక్షణం ఏంటంటే ఆ తరంగాలు భూ వాతావరణ పొరని భేదించగలవు. మొత్తం విద్యుదయస్కాంత వర్ణమాలలో రెండు రకాల తరంగాలకి మాత్రమే పృథ్వీ వాతావరణం పారదర్శకంగా ఉంటుంది. అవి – కాంతి తరంగాలు, మైక్రోవేవ్ తరంగాలు. అంటే వాతావరణాకికి ఒక ’కాంతి గవాక్షం’ (light window), ఒక మైక్రోవేవ్ గవాక్షం (microwave window) ఉన్నాయన్నమాట.రెండవ లక్షణం...

రేడియో ఖగోళ విజ్ఞానం అంటే ఏమిటి?తారల ఉన్కి తెలిపేది వాటి నుండి వెలువడే కాంతి మాత్రమే కాదు. తారలు శక్తివంతమైన రేడియో తరంగాలని కూడా వెలువరిస్తాయి. వాటి సహాయంతో తారల గురించి ఎన్నో విషయాలు తెలుసుకోవచ్చు. తారలు రేడియోతరంగాలని వెలువరిస్తాయన్న విషయం యాదృచ్ఛికంగా తెలిసింది.1931 లో అమెరికాలో బెల్ టెలిఫోన్ లాబొరేటరీస్ కి చెందిన కార్ల్ గూథ్ జాన్స్కీ అనే రేడియో ఇంజినీరు ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుక్కున్నాడు. రేడియో తరంగాలని ఉపయోగించి సమాచార ప్రసారం...

హిందీ సినిమాలు మనకు ఈ (పోనీ ఇలాంటివి!) రసవత్తర సన్నివేశాన్ని పదే పదే చూపిస్తుంటాయి. హీరో ఊబిలో పడిపోతాడు. అల్లంత దూరం నుండి హీరోయిన్ పరుగెత్తుకుంటూ వచ్చి, కెవ్వున అరచి, చివ్వున చీర చింపి, హీరోకి విసిరి బయటికి లాగుతుంది. పోనీ హీరోయిన్ కాకపోతే హీరో గుర్రమో, కుక్కో, మరోటో వచ్చి బయటికి ఈడ్చుతుంది. లేకపోతే హీరోని ఊబిలోకి నెట్టబోయిన విలన్ తానే ఊబిలో కూరుకుపోయి ... పోతాడు. వీటిలో ఎంత వరకు సత్యం ఉంది? మన సినిమాలకి, సత్యానికి చుక్కెదురు కనుక ’ఆ...
మనదేశంలో ఆంగ్లేయుల ద్వారా ప్రచారం చేయబడిన భ్రమలలో ఇదొకటి. ఇందులో వాస్కోడగామా భారత్ రావడం మాత్రమే సత్యం. కాని ఆయన ఎలా వచ్చాడనేది తెలిసికొంటేనే మనకు సత్యం ఏమిటో తెలుస్తుంది.సుప్రసిద్ధ పురాతత్వ వేత్త, పద్మశ్రీ డా. విష్ణు శ్రీధర వాకణ్‌కర్ ఇలా తెలిపినారు: "నేను నా పర్యటనలో భాగంగా ఒకసారి స్పెయిన్ వెళ్ళినాను. అక్కడ నాకు వాస్కోడగామా డైరీ లభించింది. దానిలో వాస్కోడగామా భారత్‌కు ఎలా వచ్చాడో వివరంగా ఉంది. అందులో ఆయనిలా వ్రాసినాడు: నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకొన్నప్పుడు నా ఓడ కన్నా మూడురెట్లు పెద్దగా ఉన్న ఓడను అక్కడ నేను చూసినాను....

తేటి నాట్య రహస్యాలుసూర్యుణ్ణి, తారలని ఆధారంగా చేసుకుని కొన్ని జాతుల పక్షులు ఎలా వలసపోతాయో కొన్ని పోస్ట్ లలో చూశాం. వేల మైళ్ళ దూరాలలో ఉన్న గమ్యాలని ఈ ఆకాశపు కొండగుర్తుల సహాయంతో ఎలా కొలవగలుగుతున్నాయో చూశాం. కాని దూరాలని కొలవడం అంటే ఖండాలని, మహానదులని కొలవడమే కానక్కర్లేదు. గూటికి దరిదాపుల్లో ఎక్కడెక్కడ ఆహారవనరులు ఉన్నాయో, ఎక్కడెక్కడ ప్రమాదాలు పొంచి ఉన్నాయో తెలుసుకోగలుగుతే, ఆ సమాచారాన్ని తోటి జీవాలని అందించగలిగితే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.చుట్టుపక్కల...

చీకటి ఆకాశంలో తారలని చూసి సముద్రయానం చేసే సాంప్రదాయం మనిషికి సహస్రాబ్దాలుగా తెలుసు. కాని పడవలు, తెడ్లు, తెరచాపలు ఇవేవీ లేకముందు, అసలు మనిషే లేకముందు నుంచి కూడా తారకలని చూసి దారి తెలుసుకునే ఒడుపు కొన్ని పక్షులకి ఉండేది. ఎన్నో జాతుల పక్షులు చీకటి ఇచ్చే చక్కని రక్షణలో వలస పోవడానికి బయలుదేరుతాయి. అసలు రాడార్ సహాయంతో చీకటి ఆకాశాన్ని ప్రర్యవేక్షిస్తే, పగలు కన్నా రాత్రి సమయంలోనే మరిన్ని పక్షులు వలస పోతుంటాయని తెలిసింది. ఉదాహరణకి వార్బ్లర్ పక్షులు...
postlink