శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

రాష్ట్రంలో అక్షరాస్యత అంత తక్కువా?

ఈ రోజు సాక్షి పత్రికలో ప్రచురించబడ్డ మన రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో అక్షరాస్యతకి సంబంధించిన వివరాలు బాధాకరంగా ఉన్నాయి. ఇటీవలే విడుదల అయిన Statistical Abstract – 2009 అనే ప్రభుత్వ నివేదికలో వెల్లడైన సమాచారం ఇది.

అక్షరాస్యతలో టాప్-5 జిల్లాలు:
హైదరాబాద్ - 78.8%
పశ్చిమగోదావరి - 73.5%
కృష్ణా - 68.8%
చిత్తూరు - 66.8%
రంగారెడ్డి - 66.2%

60% శాతం కన్నా తక్కువ అక్షరాస్యత ఉన్న 13 జిల్లాలు:
మహబూబ్ నగర్ - 44%
విజయనగరం - 51.1%
మెదక్ - 51.6%
నిజామాబాద్ - 52.0%
అదిలాబాద్ - 52.7%
కర్నూల్ - 53.2%
కరీమ్ నగర్ -54.9%
శ్రీకాకుళం - 55.3%
అనంతపురం - 56.1%
ఖమ్మం - 56.9%
వరంగల్ - 57.1%
నల్లగొండ - 57.2%
ప్రకాశం - 57.4%

2007 గణాంకాల ప్రకారం ఇండియా సగటు అక్షరాస్యత 67.6% అయితే, ఏ.పీ. సగటు అక్షరాస్యత 72.5% అని వెల్లడి అయ్యింది. (http://en.wikipedia.org/wiki/Indian_states_ranking_by_literacy_rate)
కాని పైన ’సాక్షి’ వ్యాసం ఇచ్చే సమాచారం ప్రకారం రాష్ట్రంలో అక్షరాస్యత ఇంకా తక్కువే (65% దరిదాపుల్లో) ఉండాలని అనిపిస్తోంది. ఏదేమైనా ఎన్నో జిల్లాలలో అక్షరాస్యత 50 ల ప్రాంతాల్లో ఉందన్నది స్పష్టం. ఇది చాలా తక్కువ అని వేరే చెప్పనక్కర్లేదు.
మనం పోల్చుకోదగ్గ కొన్ని ఇతర దేశాలలో అక్షరాస్యత ఎంత ఎక్కువో అంతకు ముందు ఒక పోస్ట్ లో వివరించడం జరిగింది. (http://scienceintelugu.blogspot.com/2009/07/65-90.html)
“అక్షరాస్యతలో మన దేశం ప్రపంచ దేశాలలో 144 వ స్థానంలో ఉంది. అక్షరాస్యత 99% పైగా గల దేశాలు 40 ఉన్నాయి. 90% కన్నా అక్షరాస్యత ఎక్కువ ఉన్న దేశాలు 88 ఉన్నాయి. అభివృద్ధి చెందిన దేశాలని పక్కన పెట్టినా, మనం పోల్చుకోదగ్గ దేశాలు – చైనా, మెక్సికో, థాయ్లాండ్ మొదలైన దేశాలు కూడా 90 ని మించిపోయాయి. బ్రెజిల్ కూడా ఆ దరిదాపుల్లోనే ఉంది. మొన్నమొన్నటి దాకా అగ్రరాజ్యాల మధ్య ఘర్షణలో పడి నలిగి, బాగా చితికోపోయిన వియట్నాం అక్షరాస్యత 90.3%. అంతస్సమరంతో యాతన పడుతున్న పొరుగుదేశం – శ్రీ లంకలో కూడా అక్షరాస్యత 90.7%. పై సమాచారాన్ని బట్టి 90% దరిదాపుల్లో అక్షరాస్యత గలిగి ఉండటం అంత విశేషమేమీ కాదన్నమాట. కానీ ఆ పాటి వైభవం కూడా ప్రస్తుతం మనకి లేదు.”

ఇటీవలి కాలంలో విద్యావ్యాప్తికి కావలసిన ఐ.టి. సాంకేతిక వనరులు బాగా పెరిగాయి. నిరక్షరాస్యత మీద యుద్ధం ప్రకటించడానికి ఇదే మంచి సమయం.ఆక్షరాస్యత అసలు విలువ నలభయ్యా, యాభయ్యా, అరవై అయిదా అన్నది ముఖ్యం కాదు. అది 90% కన్నా చాలా తక్కువ అన్నది మాత్రం వాస్తవం. చదువొచ్చిన సగం మందీ, రాని సగానికి ఏదో విధంగా సహాయం చెయ్యగలిగితే ఒక దశాబ్దంలో అక్షరాస్యత 90% చేరుకుంటుంది. అలా చేరుకునేలా చెయ్యాలి.

కొన్ని చిన్న ఉపాయాలు:
1. మీ ఇంట్లో పని చేసే పిల్లలకి చదువు చెప్పడం
2. చదువుకుంటున్న పేద పిల్లలకి పుస్తకాలు కొనివ్వడం
3. పల్లెటూళ్లలో గ్రంథాయాల నిర్మాణం, లేదా అలాంటి నిర్మాణానికి తగ్గ సహాయం చెయ్యడం
4. మీకు నైపుణ్యం ఉన్న రంగంలో స్కూళ్లలో ఉపన్యాసాలు ఇవ్వడం
5. పత్రికల్లో చదువుకి సంబంధించిన వ్యాసాల రచన
6. చదువుకి సంబంధించిన పుస్తకాలు రాయడం
7. అలాంటి పుస్తకాలు ప్రచురించడం
8. ఆటపాటల సహాయంతో నేర్చుకోవడానికి కొత్త పద్ధతుల సృజన
9. చదువుని అందించే వెబ్సైట్లు, బ్లాగ్ లు నడిపించడం
10. పేద పిల్లల స్కూలు ఫీజులో ధనసహాయం
11. విద్యారంగంలో స్ఫూర్తినిచ్చే సినిమాలు నిర్మించడం
12. విద్యారంగంలో పని చేసే ఎన్.జీ.వో.ల స్థాపన
...
ఉపాయాలకి అంతు లేదు. వాటిని ఎంత వరకు ఆచరణలో పెట్టగలుగుతాం అన్న దాని మీద మన భవిష్యత్తు ఆధారపడుతుంది.


“కోటి సంకల్పాల కన్నా, శతకోటి శపథాల కన్నా ఒక్క చిన్న నిర్మాణాత్మక చర్య మేలు.” – శ్రీమాత.

5 comments

  1. Anonymous Says:
  2. మంచి సమాచారం అందించేరండీ. నేను కొంతకాలంగా అనుకుంటున్నాను ఈవివరాలు ఎక్కడ దొరుకుతాయా అని. ధవ్యవాదాలు.

     
  3. This comment has been removed by the author.  
  4. మీ బ్లాగ్ చదివాను. ఎన్నో వైవిధ్యమైన విషయాలగురించి మంచి మంచి వ్యాసాలు పెట్టారు.
    ఈ మధ్య నా ఆలోచనలోకి వచ్చిన ఒక విషయాన్ని మీ అందరితో పంచుకోవాలని ఈ మెయిల్....

    గత 1 సంవత్సరం లో కొందరు స్నేహితులను, పిల్లలను, సహా ఉద్యోగులను ఈ చిన్న ప్రశ్న అడిగి చూసాను.
    " మీకు తెలిసిన పది మంది స్వతంత్ర సమర యోధుల పేర్లు చెప్పండి. వారిలో ముగ్గురి గురించి 5 వాక్యాలు చెప్పండి" అని.

    కనీసం నేను అడిగిన 20 మంది లో ఒక్కరు కూడా చెప్పలేక పోయారు.
    మీలో ఎంత మంది ఈ ప్రశ్నకు సమాధానం చెప్ప గలరు?
    ఇది మన విద్య బోధనా లో లోపమా? విద్య వ్యవస్థ లో లోపమా?
    లేక మన విద్యావేత్తలకు మన చరిత్ర మన సంస్కృతి పైనున్న చులకన భావమా?
    మన పిల్లలు మన దేశ చరిత్ర తెలుసుకోవాలని, మన భాషనూ సంస్కృతి ని మర్చిపో కూడదని,
    ఆ దిశలో మన బోధనా విధానాలు, సిలబస్ మార్చుకోవాలని ఆశతో,
    డా. రాజశేఖర్.

     
  5. suryaprakash Says:
  6. మీ ఉపాయాలు కొందరికైనా మేలుకొలుపు స్పూర్తి దాయకం కావాలి. ధన్యవాదలు.

     
  7. భావన Says:
  8. Very thoughtful and informative post.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts