ఇండియా యాత్రకి సన్నాహాలు పూర్తయ్యాయి. ఎప్పుడెప్పుడు బయల్దేరుదామా అని నావికులంతా తహతహలాడుతున్నారు. రాజుగారి ఆనతి కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంగా మాంటెమో ఓ నోరో అనే ఊళ్లో రాజుగారు విందు ఏర్పాటు చేశారు. వేడుకలో పాల్గొనడానికి ఎంతో మంది ప్రభుత్వ అధికారులు, చర్చిఅధికారులు, సంఘంలో గొప్ప పరపతి గల వారు ఎంతో మంది విచ్చేశారు. “అసమాన నావికుడు, విశ్వాసపూరితుడైన ప్రభుత్వ సేవకుడు అయిన వాస్కో ద గామాని ఈ మహాయాత్రకి సారథిగా ఈ సందర్భంలో ప్రకటిస్తున్నాను,” అంటూ రాజుగారు వాస్కో గురించి ఎంతో పొగుడుతూ మాట్లాడారు. “మహారాజా! ఇండియా కి దారి కనుక్కునే లక్ష్య సాధన కోసం నేటి నుండి నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటున్నాను,” అంటూ వాస్కో కూడా తన విశ్వాసాన్ని, ధృఢసంకల్పాన్ని వ్యక్తం చేస్తూ మాట్లాడాడు. విందు ఘనంగా జరిగింది.
జులై 8, 1497, నాడు ఆ మహాయత్ర మొదలయ్యింది. మూడు ఓడలూ లిస్బన్ రేవు నుండి బయల్దేరాయి. నగర వాసులంతా రేవుకి విచ్చేసి ఆ వీర నావికులకి వీడ్కోలు చెప్పారు. నెమ్మదిగా తీరం కనుమరుగు కాసాగింది. ఓడ డెక్ మీద నించుని వాస్కో ద గామా తన ఎదురుగా విస్తరించి ఉన్న అనంత సాగరం కేసి రెప్ప వేయకుండా చూస్తున్నాడు. తాను తలకెత్తుకున్న కార్యభారం నెమ్మదిగా తెలిసి వస్తోంది. ఇన్నేళ్ల తన అనుభవంలో తన నేతృత్వం లో ఉన్న ఒక్క ఓడ కూడా పోలేదు. ఈసారి కూడా అలాగే అన్ని ఓడలని, అందులోని సిబ్బందిని సురక్షితంగా స్వదేశానికి తిరిగి తీసుకురావాలి. తన పట్టుదలకి ప్రకృతి కూడా మద్దతు తెలపాలని సంకల్పించింది కాబోలు! అంతలోనే ఓ బలమైన గాలి వీచగా తెరచాపలు పొంగి ఓడలు వడిగా నీటికి కోసుకుంటూ ముందుకి దూసుకుపోయాయి.
ఓ వారం తరువాత ఆ నౌకాదళం ఆఫ్రికా పశ్చిమ తీరం వద్ద ఉన్న కానరీ దీవులని చేరుకున్నాయి. గతంలో కొలంబస్ కూడా ఈ దీవులని సందర్శించిన విషయం మనకి గుర్తు. ఆ ప్రాంతంలో కాస్త మత్స్య సంపద సేకరించి ఆహారం నిలువలు పెంచుకుందాం అని నావికులు నీట్లోకి వలలు విసిరారు. ఆయితే ఆ రాత్రి ఓ అనుకోని సంఘటన జరిగింది. దట్టంగా పొగమంచు కమ్మింది. అంతేకాక ఆగాగి బలమైన గాలులు కూడా వీచాయి. దాంతో ఓడలు చెల్లాచెదురు అయ్యాయి. పెద్ద ఓడ అయిన సావో గాబ్రియెల్ లో వాస్కో ద గామా ఉన్నాడు. తను తమ్ముడు పాలో ఉన్న ఓడ, సావో రఫాయెల్, తప్పిపోయింది. మిగతా రెండు ఓడల కెప్టెన్లకి ఏంచెయ్యాలో అర్థం కాలేదు. తప్పిపోయిన ఓడ కోసం గాలించకుండా ముందుకు సాగిపోవాలని వాస్కో ద గామా నిర్ణయించాడు. తప్పిపోయిన ఓడ ఎప్పుడో ఒకప్పుడు తక్కిన ఓడలని కలుసుకుంటుందని తన నమ్మకం. బయటికి ధీమాగా అన్నాడే గాని లోపల తనకి ఒక పక్క గుబులుగానే ఉంది. మిగతా రెండు ఓడలు ముందుకి సాగిపోయాయి. కొన్నాళ్ళ తరువత జులై 22 నాడు పోయిన ఓడ మళ్లీ కనిపించింది. వాస్కో మనసు తేలికపడింది. పోయిన తమ్ముడు మళ్లీ కనిపించినందుకు లోలోన సంతోషించాడు.

(ఇంకా వుంది)
0 comments