శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

కొన్ని సార్లు గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో కూడా అదే గదిలో మరెవరో కూడా ఉన్నారనిపిస్తుంది. మనకి తెలియకుండా గదిలో మరెవరో అదృశ్య వ్యక్తి ఉన్నారన్న ఊహకే ఒళ్లు జలదరిస్తుంది. కొందరు ఇది వట్టి భ్రాంతి అని కొట్టిపారేస్తే, మరి కొందరు ఇది దయ్యాలు, భూతాలు ఉన్నాయని తెలిపే ఆధారం అనుకుని బెదురుతుంటారు.

కాని ఈ విచిత్రమైన అనుభూతిని అర్థం చేసుకునే విషయంలో నాడీవిజ్ఞానం కొంత పురోగతి సాధించింది. స్విట్జర్లాండ్ లో ‘ఎకోల్ పాలితెక్నీక్ ఫెదరాల్ ద లోసాన్’ (EPFL) అనే విశ్వవిద్యాలయంలో, దాని సంబంధిత ఆసుపత్రిలోను, నాడీ విజ్ఞాన విభాగానికి చెందిన ఒక బృందం చేసిన ప్రయోగాలలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి.

ఎపిలెప్సీ (మూర్చరోగం)తో బాధపడుతున్న ఒక రోగికి ఈ బృందం శస్త్రచికిత్సకి కావలసిన పరీక్షలు చేస్తున్న సమయంలో అనుకోకుండా ఈ విషయాలు బయటపడ్డాయి. ఎపిలెప్సీ రోగుల మెదళ్లలో కొన్ని ప్రత్యేక స్థానల నుండి నాడీ కణాల విద్యుత్ చర్య విపరీతంగా పెరిగి, ఇరుగు పొరుగు మెదడు ప్రాంతాలకి ఓ కార్చిచ్చులా పాకుతుంది. అలా వ్యాపించిన అసాధారణ నాడీ విద్యుత్ చర్య కొన్ని సార్లు మొదణ్ణి పూర్తిగా ఆక్రమించుకుంటుంది. అలాంటి సమయంలో ఇక స్పృహ కోల్పోవడం, కొంద పడి కొట్టుకోవడం మొదలైన బాహ్య చిహ్నాలు కనిపిస్తాయి. మందులతో లొంగని సందర్భాలలో శస్త్రచికిత్స చేసి, మెదడులో ఈ అసాధారణ సంకేతాలని కారకమైన ప్రాంతాన్ని తొలగిస్తారు. అలాంటి స్థానాన్ని epileptic focus అంటారు. అలా శస్త్రచికిత్స చేసే ముందుగా, రోగి మెదడుకి విద్యుత్ పేరణలు ఇచ్చి వివిధ ప్రాంతాలు ఆ ప్రేరణకి ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తారు. సమస్య ఉన్న స్థానం అయితే ప్రేరణ ఇచ్చినప్పుడు seizure కలుగజేస్తుంది.

ఎపిలెప్సీతో బాధపడుతున్న ఓ 22 ఏళ్ల స్త్రీ రోగి మెదడుకి ప్రేరణనిచ్చి పరీక్షిస్తున్న సమయంలో ఈ కొత్త సత్యాలు తెలిసొచ్చాయి. మెదడులో ఎడమ పక్క, టెంపొరల్ లోబ్ కి, పెరైటల్ లోబ్ కి మధ్య సరిహద్దు వద్ద (దీన్ని temporo-parietal junction అంటారు – కింద చిత్రంలో బాణం సూచిస్తున్న ప్రాంతం) ప్రేరణ నిచ్చినప్పుడు రోగి తనకి చెంతనే మరెవరో ఉన్నట్టు అనిపిస్తోందని చెప్పింది.


రోగి యొక్క భంగిమకి, విద్యుత్ ప్రేరణ వల్ల కలిగిన అనుభూతికి మధ్య సంబంధం ఉన్నట్టు తెలిసింది.

రోగి పూర్తిగా వెల్లకిలా పడుకుని ఉన్న సమయంలో ప్రేరణ నిస్తే, రోగికి వెనుక ఎవరో ఉన్న అనుభూతి కలిగింది (చిత్రం b). ఆ “వెనుక ఉన్న వ్యక్తి” ఎలా ఉంటాడు అని అడిగితే, “వయసులో చిన్న వ్యక్తే” నని, అయితే మగో, ఆడో చెప్పడం కష్టంగా ఉందని చెప్పింది!

ఈ సారి రోగి కూర్చుని తన మోకాళ్ళని గట్టిగా చేతులతో పట్టుకుని కూర్చున్న సమయంలో మెదడుకి అదే స్థానంలో ప్రేరణ ఇచ్చారు (చిత్రం c). ఈ సారి “వెనుక ఉన్న వ్యక్తి” కూడా కూర్చునే ఉన్నాడని, పైగా తనని పట్టుకుని కూర్చున్నాడని, ఇది కాస్త ఇబ్బందికరంగా ఉందని రోగి చెప్పింది!
ఇక మూడవ సందర్భంలో రోగి చేతిలో కొన్ని కార్డులు ఉంచి, వాటి మీద ఉన బొమ్మల పేర్లు చెప్పమన్నారు నిపుణులు. ఈ పనిలో రోగి నిమగ్నమై ఉండగా ప్రేరణ ఇచ్చినప్పుడు ఆమె స్పందన ఇంకా విచిత్రంగా ఉంది. వెనుక ఉన్న వ్యక్తి ఈ సారి తన “చేతిలో ఉన్న కార్డు కావాలంటున్నాడ”ని, “చదవనివ్వడం లేద”ని ఆ రోగి చెప్పింది.

ఇలా ఎందుకు జరుగుతోంది అన్న ప్రశ్నకి ఈ అధ్యయనం చేసిన నిపుణులు ఇలా వివరణ ఇస్తున్నారు. Temporo-parietal junction మెదడులో చాలా ముఖ్యమైన ప్రాంతం. దృశ్య, శ్రవణ, స్పర్శ ఇంద్రియాలకి సంబంధించిన సమాచారం ఇక్కడ సంయోజించబడుతుంది. వెర్నికీ ప్రాంతం అని పిలువబడే భాషని అర్థం చేసుకునే ప్రాంతం కూడా ఇక్కడికి దగ్గర్లోనే ఉంటుంది. మనలో ‘నేను’ అన్న భావన కలగడానికి ఆధారభూతమైన మెదడు ప్రాంతాలలో ఈ Temporo-parietal junction ఒకటి. కనుక ఈ ప్రాంతానికి ప్రేరణ ఇచ్చినప్పుడు నేను అన్న భావన వికారం చెంది, మరొకరు అన్న భావన చోటుచేసుకుంది.

ఈ అధ్యయనం ప్రఖ్యాత ‘నేచర్’ పత్రికలో 2006 లో ప్రచురితం అయ్యింది.
Reference:
Arzy et al, Induction of an illusory shadow person, Nature, vol 443, no. 21, 2006.

7 comments

  1. చాలా మంచి విషయం ప్రస్తావించారు. ఒక న్యూరాలజిస్ట్గా నాకు తెలిసినది అసలు ఈ పార్ట్ థియరీ అఫ్ మైండ్కి చాలా ముఖ్యం. అలానే నేను, నా శరీరం వేరు వేరు అనే ఆలోచన మనిషికి నిద్రలోనో, ఇంకెప్పుడయినా కలుగుతూ ఉంటుంది అది కూడా ఈ పార్టులో ఏదయినా లోపం ఉండటం వలనే! ఒక్కోసారి మనం కలలో ఏదయినా బాగా కాయ కష్టం చేసి అలసిపోతే నిద్ర లేచాక కూడా మనకి అదే భావన ఉంటుంది. ఆ భావనకి కారణం కూడా ఈ Temporoparietal junction ముఖ్య కారణం. కనుక ఈ ప్రాంతానికి ప్రేరణ ఇచ్చినప్పుడు నేను అన్న భావన వికారం చెంది, మరొకరు అన్న భావన చోటుచేసుకుంది అని మీరన్నట్టు దీనినే out of body experience అంటారు

     
  2. రసజ్ఞ గారు

    మీరు చెప్పింది చాల నిజం. పైన నేచర్ వ్యాసంలో ఇవ్వబడ్డ ఈ కింది రెఫెరెన్స్ లో,

    Blanke, O., Landis, T., Spinelli, L. & Seeck, M.
    Out‐of‐body experience and autoscopy of neurological origin, Brain 127,243–258 (2004)

    సరిగ్గా ఆ విషయమే చెప్తారు. OBE మరియు AS తో బాధపడుతున్న ఐదు మంది పేషంట్లలో సమస్య TPJ లో ఉన్నట్టు ఈ అధ్యయనం చెప్తుంది.

    ఇంగ్లీష్ లో సైన్స్ బ్లాగ్ లలో బ్లాగ్ పోస్ట్ ని లోతుగా చర్చిస్తూ ఎన్నో శాస్త్ర సంబంధమైన కామెంట్లు వస్తుంటాయి. తెలుగులో అలా ఎక్కువగా రావు అనిపిస్తుంది.
    కాని ఇలా శాస్త్రీయమైన కామెంట్లు వచ్చినప్పుడు సంతోషంగా ఉంటుంది. ధన్యవాదాలు.

     
  3. sree Says:
  4. meeru cheppina experiment lo rogini vellakila uncharu. mana peddalu kooda padukunetapudu vellakila padukunte dayyalu vaalutaayani, pakkaku tirigi padukomani cheptaru. chitranga undi kadoo !!

     
  5. శ్రీ గారు
    మీ కామెంట్ చదివి తేరుకుని స్పందించడానికి ఇంత సేపు పట్టింది. కాకులో గద్దలో వాలినట్టు దెయ్యాలు వాలుతాయని అంత సునాయాసంగా మీరు అంటుంటే అవాక్కయ్యాను. అందుకు ఎలా స్పందించాలో కూడా అర్థం కావడం లేదు :-)

    అయినా పైన ప్రయోగంలో రోగిని వెల్లకిలా మాత్రమే కాదు ఇతర భంగిమల్లో కూడా ఉంచారు. ప్రతీ భంగిమ లోను వెనుక ఎవరో ఉన్న అనుభూతి కలిగింది. కాని మీ వాదన తప్పని చెప్పాల్సి ఉంటుంది.

    అయినా ఆధునిక వైజ్ఞానిక విషయాలని, మన "పెద్దలు చెప్పిన విషయాల"తో ముడిపెట్టి, సమర్థింపుగా వాడుకునే తతంగం నాకు ఎప్పుడూ చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది. కాని మన దేశంలో ఇది చాలా మాములుగా జరిగే భాగోతం. ఇది చాలా పెద్ద టాపిక్. ఈ సారి ఇంకా విస్తారంగా దాని గురించి ఓ పోస్ట్ రాయాలని ఉంది.

     
  6. Anonymous Says:
  7. Good information, thanks for sharing.

    I have a question:
    How was the response of others, say different ethinic, social background to the same experiment? Did it give same results? If not, how it can be concluded as a Scientiffic experiment?

    /వాడుకునే తతంగం నాకు ఎప్పుడూ చాలా ప్రమాదకరంగా అనిపిస్తుంది./
    Why?! Is that unscientiffic to correlate to experiences of others?!

     
  8. Thanks for the comment.

    The study mentioned involved only one patient. (It is a short, 1 page paper.) Its a case study.

    The different conditions considered are postures of the patient. In every posture, the patient felt that the illusory person too was in a uniquely different posture.

    It makes sense because it can connected to studies done by others on the temporoparietal junction and its link to out-of-body experience.
    Perhaps others looked at the effect of ethnic and social background.

    A scientific study often seeks to control one variable at a time and understand its effects. In the above study it is the posture, which seems to give an insight into the phenomenon.

    BTW, why would you expect ethnic, social background to affect the results of the experiment?

    It is ok to correlate with experiences of others, but in the above example, if you consider the way the blogger was trying to correlate the study with our experience of "ghosts", one would like to know if it is a common "experience of others" in India to find "ghosts" landing on their faces whenever they slept in supine position.

    An objective, intelligent, rigorous correlation with experience is ok but that rarely happens. We all have this huge mass of ... whatever it is that we inherit from our "పెద్దలు." People strongly believe that most of it is true, and keeping trying to USE scientific results for justification. (Like the chap who wanted to know if a graph of sounds of Lalitasahasra namam looked like the Sri Chakra :-)) This is what Im cautioning against.

     
  9. Anonymous Says:
  10. /why would you expect ethnic, social background to affect the results of the experiment? /

    I don't know. It just a guess. How would an animal respond to similar experiment? Would it feel presence of some other animal/human behind it? The information presented invoked different thought in different people. I wonder, is that the only part that is responsible for such illusions or is that making use of data stored in other corners of the same brain?

    Those who thought of atomic model got inspired by the solar system described by their elders say Keplar, Galileo.. so on. Nothing wrong if one tries to find similarities between SriChakra and model of an atom i.e. if one makes use of available data/information.
    /keeping trying to USE scientific results for justification/
    Yes, I believe he is in that process... and it is within the scientiffic thinking, generated in the same brain we are talking about.

    Who knows tomorrow some other researcher may contradict the above experiment...
    /An objective, intelligent, rigorous correlation with experience is ok /
    How would we know that at the start? How can we conclude he is wrong and only we are right?
    From wiki:
    "Oppenheimer later recalled that, while witnessing the explosion, he thought of a verse from the Hindu holy book, the Bhagavad Gita:
    If the radiance of a thousand suns were to burst at once into the sky, that would be like the splendor of the mighty one ..."

    Was he scientiffic/unscientiffic/pseudoscintiffic?! Why didn't the same sight(experiment) trigger similar thoughts with other people? May be because they had no knowledge of Gita or it is not necessary that different minds with different backgrounds invoke similar responses. :)

    I agree with you that open mind is essential element of scientiffic thinking. Who knows, 2012 is end of this worlds as per Mayan calendar! I would keep my baggage ready, before thinking whether they are scientiffic or not! :))
    Ok Sir, I pause here.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts