ఈ కారణం చేతనే
అకర్బన రసాయనాలు ప్రకృతిలో విరివిగా దొరుకుతాయని మనుషులు భావించేవారు. జీవరహిత ప్రపంచంలోను,
జీవ ప్రపంచం లోను కూడా అవి దొరుకుతాయి. ఉదాహరణకి నీరు సముద్రాలలో ఉంటుంది, రక్తం లో
కూడా ఉంటుంది. ఇందుకు భిన్నంగా కర్బన రసాయనాలు మాత్రం కేవలం జీవప్రపంచానికే పరిమితమై
ఉంటాయి.
ఈ రకమైన దృక్పథాన్ని
1828 లో ఫ్రెడెరిక్ వోలర్ (1800-1882) చేసిన
కృషి సవాలు చేసింది. జర్మనీకి చెందిన ఈ రసాయన శాస్త్రవేత్త బెర్జీలియస్ కి శిష్యుడు.
సయనైడ్లు, వాటికి సంబంధించిన ఇతర రసాయనాల మీదకి వోలర్ దృష్టి సారించాడు. ఒక రోజు అమ్మోనియం
సయనేట్ అనే సమ్మేళనాన్ని...
అధ్యాయం 6
కర్బన రసాయన
శాస్త్రం
ప్రాణవాదానికి
ఆయువు చెల్లు
అగ్నిని కనుక్కున్న
నాటి నుండి మనిషి పదార్థాలని మండేవి, మండనివి
అని రెండు వర్గాలుగా విభజిస్తూ వచ్చాడు. ఆ రోజుల్లో కలప, కొవ్వు, చమురు - వీటినే ప్రధానంగా ఇంధనాలుగా వాడేవారు. కలప వృక్షప్రపంచం
నుండి పుట్టిన ఉత్పత్తి అయితే, కొవ్వు, చమురు జీవప్రపంచం నుండి మాత్రమే కాక, వృక్షప్రపంచం
నుండి కూడా వచ్చిన ఉత్పత్తులు. ఖనిజ ప్రపంచానికి చెందిన పదార్థాలలో అధికశాతం – నీరు,
ఇసుక, రాళ్లు మొదలైనవి – మండేవి కావు. పైగా ఇవి నిప్పుని ఆర్పడానికి పనికొస్తాయి.
కనుక తొలి దశల్లో
మండేవి,...

అప్పుడు ఇంగ్లీష్
రసాయన శాస్త్రవేత్త హంఫ్రీ డేవీ కి (1778-1829) ఓ చిత్రమైన ఆలోచన వచ్చింది. రసాయనాల
వల్ల సాధ్యం కానిది విద్యుత్తు వల్ల అవుతుందేమో అని ఇతడు ఆలోచించాడు. ఎందుకంటే రసాయనాలు
ఏమీ చెయ్యలేకపోయిన కొన్ని సందర్భాలలో విద్యుచ్ఛక్తి యొక్క చిత్రమైన ప్రభావం వల్ల పదార్థాలలోని
నీటిని వెలికి తీయడానికి వీలయ్యింది.
ఆ కారణం చేత
డేవీ 250 లోహపు పళ్లాల దొంతరని ఏర్పాటు చేసి
ఓ పెద్ద విద్యుత్ బ్యాటరీని నిర్మించడానికి పూనుకున్నాడు. అంత పెద్ద...
ఈ రసాయనిక సూత్రాల
సహాయంతో రసాయనిక చర్యలని వర్ణించే రసాయనిక సమీకరణాలని వ్యక్తం చెయ్యొచ్చు.ఉదాహరణకి
కార్బన్ ఆక్సిజన్ తో కలిసినప్పుడు కార్బన్ డయాక్సయిడ్ ఉత్పన్నం అవుతుంది అన్న సత్యాన్ని
ఈ విధంగా వ్యక్తం చెయ్యొచ్చు.
C + O2 à CO2
లెవోషియే సూచించిన
ద్రవ్య నిత్యత్వ సూత్రాన్ని పై సమీకరణం తృప్తిపరచాలంటే సమీకరణానికి
ఇరుపక్కలా ఉండే పరమాణువుల లెక్క సరిపోవాలి. ఉదాహరణకి పై సమీకరణంలో ఒక C పరమాణువు,
రెండు O
పరమాణువులతో కలిసినప్పుడు ఒక
C రెండు O లు గల CO2
ఏర్పడుతుంది.
అలాగే హైడ్రోజన్,
క్లోరైడ్...

బ్లాగర్లకి స్వాతంత్ర్య
దినోత్సవ శుభాకాంక్షలు!
ఈ సందర్భంగా
ఒక విషయాన్ని మనవి చేసుకోదలచుకున్నాను.
తెలుగులో సైన్స్
ని సరదాగా సామాన్య పాఠకులకి అందించడం లక్ష్యంగా గల ఈ బ్లాగ్ సుమారు ఐదేళ్లుగా సాగుతోంది.
బ్లాగ్ తో పాటు తెలుగులో సైన్స్ పుస్తకాలు రాయటం/అనువదించటం కూడా జరుగుతోంది. ఇప్పటికి
యాభై పుస్తకాల దాకా ప్రచురితం అయ్యాయి (కింద జాబితా ఇవ్వబడింది).
ఈ సైన్స్ పుస్తకాలని ఆరు, ఏడు ఏళ్లుగా తెలుగు మీడియమ్ స్కూళ్లకి ఉచితంగా
పంపుతూ...

ప్రతుల కోసం
http://www.manchipustakam.in/
...
వివిధ మూలకాల
పరమాణు భారాల మధ్య సరళ పూర్ణాంక నిష్పత్తులు లేవన్న వాస్తవం పరమాణు భారాల కొలమాన విధానాలని
కొత్తగా సమీక్షించేలా చేసింది.హైడ్రోజన్ ని ప్రమాణంగా తీసుకుని పరమాణుభారాలని అంత వరకు
వ్యక్త చేస్తూ వచ్చారు కనుక ఆ ప్రమాణాన్ని మరో సారి పరిశీలించేలా చేసింది. తేలికైనది
కనుక హైడ్రోజన్ పరమాణు భారం 1 అనుకోవడం అత్యంత
సహజమైన విషయంలా తోచింది. డాల్టన్, బెర్జీలియస్ లు ఇద్దరూ ఆ ప్రమాణాన్ని స్వీకరించారు.
కాని ఆ ప్రమాణాన్ని స్వీకరించడం వల్ల ఆక్సిజన్ పరమాణు భారం 15.9 అని వచ్చింది. పరమాణు భారాల కొలతలలో ఆక్సిజన్ కి
ముఖ్య స్థానం...
భారాలు – చిహ్నాలు
మన కథలో తదుపరి
ముఖ్యమైన మలుపు స్వీడిష్ రసాయన శాస్త్రవేత్త జోన్స్ జేకబ్ బెర్జీలియస్ రంగప్రవేశం చెయ్యడంతో జరిగింది. డాల్టన్ తరువాత
పరమాణు సిద్ధాంతాన్ని కచ్చితంగా స్థాపించడంలో ఇతడు కీలకమైన పాత్ర పోషించాడు.1807 లో
బెర్జీలియస్ వివిధ సమ్మేళనాల పరమాణు విన్యాసాన్ని తెలుసుకునే ప్రయత్నంలో మునిగి వున్నాడు.వందలాని
విశ్లేషణలు చేసి ‘నియత నిష్పత్తుల నియమాని’కి ఎన్నో తార్కాణాలు కనుక్కున్నాడు.అన్ని
ఆధారాలు బయట పడ్డాక ఇక రసాయనిక సమాజాలు ఆ నియమాన్ని నిర్లక్ష్యం చెయ్యలేకపోయాయి.క్రమంగా
పరమాణు సిద్ధాంతానికి మద్దతు పెరిగింది.ఆ...
పైన ఇంత వరకు
మనం చెప్పుకున్న వాదనలలో ఒక విషయం గోచరిస్తోంది.వాయువు ఏదైనా, అందులో వున్నవి అణువులైనా,
పరమాణువులైనా వాటి మధ్య దూరాలు మాత్రం ఒక్కటే నన్న విషయం ప్రస్ఫుటం అవుతోంది.అంటే ఒక
నియత సంఖ్యలో రేణువులు ఉన్న వాయువు, ఆ వాయువు ఏదైనా సరే, దాని ఘనపరిమాణం ఒక్కటే కావాలి.
ఒకే సంఖ్యలో
రేణువులు ఉన్న వాయువు ఘనపరిమాణం ఎప్పుడూ ఒక్కటే కావాలి అని మొట్టమొదట సూచించిన వాడు
ఇటాలియన్ రసాయన శాస్త్రవేత్త అమేడియో అవొగాడ్రో (1776-1856).1811 లో చేయబడ్డ ఈ ప్రతిపాదనని అవొగాడ్రో ప్రతిపాదన అంటారు.
అవొగాడ్రో ప్రతిపాదనని కచ్చితంగా అర్థం...

అవొగాడ్రో ప్రతిపాదన
కార్లైల్, నికోల్సన్
ల ప్రయోగ ఫలితాలు ఒక ఫ్రెంచ్ రసాయన శాస్త్రవేత్త చేసిన కృషికి మద్దతు నిచ్చాయి.జోసెఫ్
లూయీ గే లుసాక్ (1778-1850) అనబడే ఇతడు పరిస్థితులని పూర్తిగా తలక్రిందులు చేశాడు.రెండు
ఘనపరిమాణాల హైడ్రోజన్, ఒక ఘనపరిమాణపు ఆక్సిజన్ తో కలిసి నీటిని ఏర్పరుస్తుందని ఇతడు
గమనించాడు.అక్కడితో ఆగక వాయువులు కలిసి సమ్మేళనాలు ఏర్పడినప్పుడు ఎప్పుడూ ఆ వాయువులు
సరళమైన, పూర్ణ సంఖ్యలతో కూడుకున్న నిష్పత్తులలోనే కలుస్తాయని ఇతడు...
Normal
0
false
false
false
EN-US
X-NONE
X-NONE
...
postlink