శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
బ్లాగర్లకి స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!

ఈ సందర్భంగా ఒక విషయాన్ని మనవి చేసుకోదలచుకున్నాను.

తెలుగులో సైన్స్ ని సరదాగా సామాన్య పాఠకులకి అందించడం లక్ష్యంగా గల ఈ బ్లాగ్ సుమారు ఐదేళ్లుగా సాగుతోంది. బ్లాగ్ తో పాటు తెలుగులో సైన్స్ పుస్తకాలు రాయటం/అనువదించటం కూడా జరుగుతోంది. ఇప్పటికి యాభై పుస్తకాల దాకా ప్రచురితం అయ్యాయి (కింద జాబితా ఇవ్వబడింది).

ఈ సైన్స్ పుస్తకాలని  ఆరు, ఏడు ఏళ్లుగా తెలుగు మీడియమ్ స్కూళ్లకి ఉచితంగా పంపుతూ రావడం జరుగుతోంది. కొన్ని వందల స్కూళ్లకి మా పుస్తకాలు పంపి వుంటాము. అయితే అన్ని స్కూళ్ళకి పంపినా చాలా తక్కువ స్కూళ్ల వద్ద నుండే స్పందన (feedback)  వచ్చింది. ఆ పుస్తకాలు ఏమయ్యాయో, అవి పిల్లలకి అందాయో లేదో, అవి ఎలా వాడుబడుతున్నాయో – వీటి గురించిన సమాచారం పెద్దగా లేదు. ఇలా గుడ్డిగా పుస్తకాలు పంపి ఊరుకునే పద్ధతి లాభం లేదని అనిపిస్తోంది.

ఇప్పటి నుంచి “స్కూళ్లకి పుస్తకాలు పంపే కార్యక్రమాన్ని” కాస్త క్రమబద్ధంగా చెయ్యాలని ఉద్దేశం.
-       
  • -    కొన్ని ప్రత్యేక స్కూళ్లని ఎంచుకోవాలి. (ప్రస్తుతానికి 300  స్కూళ్లని ఎంచుకోదలచుకున్నాం).
  • -       ప్రతీ స్కూలు నుండి ఒక సైన్స్ టీచర్  భాగస్వామిగా ముందుకు రావాలి.
  • -      మా పుస్తకాలు నేరుగా ఆ టీచర్ కి పంపబడతాయి.
  • -      ఆ టీచర్ ఆ పుస్తకాలని వారి స్కూల్ లైబ్రరీలో చేర్చాలి.
  • -      పుస్తకాలు సముచిత రీతిలో పిల్లలకి అందేలా చూడాలి.
  • -      పుస్తకాలలో విషయాలని ఆ టీచరుగాని (తోటి టీచర్లు గాని) తామే చదివి, పిల్లలతో ఆ విషయాలని సరదాగా పంచుకోవాలి.
  • -      పుస్తకాల పట్ల పిల్లల స్పందన, వాళ్లు అడిగే ప్రశ్నలు మొదలైనవి మాకు తెలియజేస్తే, అందుకు తగ్గట్టుగా ఇతర పుస్తకాలు పంపడం గాని, కొత్త పుస్తకాలు రాయటం గాని చేయడం జరుగుతుంది.
  •  


  • అందుచేత మీలో ఎవరైనా తెలుగు మీడియం స్కూళ్లలో సైన్స్ టీచర్లుగా పని చేస్తున్నవారు ఉంటే, మీకు పైన చెప్పుకున్న కార్యక్రమాలలో పాల్గొనే ఉత్సాహం ఉంటే దయచేసి నన్ను ఈ కింది ఈమెయిల్ వద్ద సంప్రదించండి. అలాగే మీ స్నేహితులు గాని, బంధువులు గాని సైన్స్ టీచర్లు అయ్యుంటే వారికి కూడా ఈ కార్యక్రమాల గురించి తెలియజేయవలసింది.


ఇట్లు
వి. శ్రీనివాస చక్రవర్తి
srinivasa.chakravarthy@gmail.com
ప్రొఫెసర్,
డిపార్ట్ మెంట్ ఆఫ్ బయోటెక్నాలజి
ఐ.ఐ.టి, మద్రాస్.




Published Books
Original books:
1.మూడడుగుల్లో విశ్వం  (A book on how scientists measure very large distances in the universe) (Translated into Kannada)
2. భూమి గుండ్రంగా ఉంది – హాస్యభరిత సైన్స్ నాటిక
3. The earth is round (a science drama)
4. భూమి తరువాత ఎక్కడ? (A book on exploration and colonization of Mars) (Translated into Kannada)
5. అంకెల మాంత్రికుడు – శ్రీనివాస రామానుజన్, ఇతర గణితవ్యాసాలు. (a series of historical anecdotes on mathematics)
6. శ్రీనివాస రామానుజన్ (జీవితకథ)
7. చార్లెస్ డార్విన్ చెప్పిన పరిణామ సిధ్ధాంతం
8. గెలీలియో గెలీలీ (జీవిత కథ)
9.  కొలంబస్ సాహస యాత్రలు
10. వాస్కో ద గామా
11. జంతు సమాజాలు (మనకు నేర్పే పాఠాలు)

Translations:
1. “Learning all the time” by John Holt.
 నేర్చుకోవడం పిలల్ల నైజం
2. “How children learn” by John Holt
పిల్లలు నేర్చుకునే విధానము. - 4 volumes
2.1. ఆటలు, ప్రయోగాలు
2.2. మాట్లాడటం, చదవడం
2.3. క్రీడలు, కళలు, గణితం
2.4. ఊహాగానం

3. “A chemical history of candle” by Michael Faraday
కొవ్వొత్తి రసాయన చరిత్ర
4. “The Story of Physics” by T. Padmanabhan (cartoon book on history of physics)
భౌతిక శాస్త్రం ఎలా మారింది?
5. Story of Astronomy by Uday Patil. బొమ్మలలో ఖగోళ శాస్త్రం. (cartoon book on astronomy)
6. Mr. Tompkins in Wonderland by George Gamow. సుబ్బారావు సాపేక్ష లోకం.
7. Jupiter Five (short story) by Arthur C. Clarke. బృహస్పతి పంచమం.
8. Solar Energy, by Arvind Gupta. సౌరశక్తి కథ. (cartoon book)
9. Heat and temperature by Isaac Asimov, ఉష్ణం – ఉష్ణోగ్రత
10. భూమి – Isaac Asimov.
11. A SHORT HISTORY OF CHEMISTRY, Isaac Asimov, - రసాయన శాస్త్ర చరిత్ర – 1 వ భాగం (లోహ యుగం నుండి లెవోషియే దాక)

12. రెమ్మలు రమ్మన్నాయి – జగదీశ్ చంద్రబోస్ జీవిత చరిత్ర (Life of Jagadish Chandra Bose)






Isaac Asimov's "Science Fact" Masterpieces :
How did we find out” series:
  1. THE EARTH IS ROUND, భూమి గుండ్రంగా ఉంది.   
  2. ANTARCTICA, అంటార్కిటికా            
  3. LIFE IN DEEP SEA, సముద్రపు లోతుల్లో సజీవ ప్రపంచం           
  4. EARTHQUAKES,   భూకంపాలు                 
  5. GERMS, సూక్ష్మక్రిములు         
  6. OIL, చమురు           
  7. OUTER SPACE, రోదసి            
  8. SOLAR POWER, సౌరశక్తి       
  9. ATMOSPHERE   వాతావరణం         
  10. PHOTOSYNTHESIS   కిరణజన్య సంయోగ క్రియ     
  11. OUR HUMAN ROOTS, మన మానవ మూలాలు         
  12. DINOSAURS, డైనోసార్లు     
  13. BEGINNING OF LIFE, జీవం పుట్టుక     
  14. VITAMINS, విటమిన్లు           
  15. COMETS   తోకచుక్క         
  16. NEPTUNE   నెప్ట్యూన్         
  17. PLUTO   ప్లూటో              
  18. BLACK HOLES   నల్లబిలాలు          
  19. BRAIN   మెదడు                   
  20. DNA   డీ.ఎన్.ఏ.                
  21. BLOOD   రక్తం                     
  22. GENES   జన్యువులు             
  23. ROBOTS   రోబోలు                
  24. COAL   బొగ్గు                  
  25.  SUPERCONDUCTIVITY   అతివాహకత         
  26.  VOLCANOES   అగ్నిపర్వతాలు       
  27.  LASERS   లేసర్లు   
  28. SPEED OF LIGHT కాంతి వేగం               




10 comments

  1. Anonymous Says:
  2. Sir nenu telugu blog aggregators chaduvuthaanu andhulo baaganga mee blog kooda chaduvuthaanu kani computer saukaryam veelukaanandhuna mobile lo chaduvuthaanu kaabatti telugu lipi lo raaya leka pothunnanu
    *******************-*******************
    Sir chinna salaha maa abbai 6 th class chaduvuthunnaadu scince ante chaala intrest scince books evi chadivincha mantaaru viswam goorchi mariyu guruthvaakarsana goorchi chaala sandhehaalu vyaktham chestbaadu dhayachesi salahaa ivvagalaru mee samaadhaanam kosam edhiri choosthu mee paatakudu ramesh

     
  3. Suresh Says:
  4. Sir, I want to distribute these books in my village school on behalf of you. How to do it.

     
  5. Suresh garu, Pl send your school address to me by mail. Will send the books.

     
  6. Anonymous Says:
  7. సార్, నా పేరు సంతోష్, నేను చేసాను..నేను ఇంటిదగ్గర వుండి జాబ్స్ కొసం ప్రిపేర్ అవుతున్నాను, అలానే ఇంటి దగ్గర స్కూల్ పిల్లలకి ట్యూషన్లు చెబుతున్నాను,వీళ్ళకి(పిల్లలకి) రొజంతా స్కూల్లో వినే పాఠాలే మళ్ళీ నేను చేబుతుంటే మాకు కొత్త పాఠాలు చెప్పండి అని అడుగుతున్నారు ...నేను మీ పాఠాలు చెప్పాలని అనుకుంటున్నాను.. కాని నేను రొజు నెట్ సెంటర్ కి వచ్చి డబ్బులు కట్టి పాఠాలు చదివే పరిస్తితి నాకు లేదు..కనుక నాకు మీ పుస్తకాలు పంపి మా పిల్లలకు బడి చదువును మించిన విజ్ఞానంను ,పిల్లలకు చదువు పట్ల మరింత ఆసక్తిని పెంచుతారని ఆశిస్తున్నాను .

     
  8. Anonymous Says:
  9. సార్, నా పేరు సంతోష్, నేను B.Sc,B.Ed చేసాను..నేను ఇంటిదగ్గర వుండి జాబ్స్ కొసం ప్రిపేర్ అవుతున్నాను, అలానే ఇంటి దగ్గర స్కూల్ పిల్లలకి ట్యూషన్లు చెబుతున్నాను,వీళ్ళకి(పిల్లలకి) రొజంతా స్కూల్లో వినే పాఠాలే మళ్ళీ నేను చేబుతుంటే మాకు కొత్త పాఠాలు చెప్పండి అని అడుగుతున్నారు ...నేను మీ పాఠాలు చెప్పాలని అనుకుంటున్నాను.. కాని నేను రొజు నెట్ సెంటర్ కి వచ్చి డబ్బులు కట్టి పాఠాలు చదివే పరిస్తితి నాకు లేదు..కనుక నాకు మీ పుస్తకాలు పంపి మా పిల్లలకు బడి చదువును మించిన విజ్ఞానంను ,పిల్లలకు చదువు పట్ల మరింత ఆసక్తిని పెంచుతారని ఆశిస్తున్నాను .

     
  10. అనానిమస్ గారు, మీ అడ్రసు పంపండి. పుస్తకాలు తప్పక పంపుతాను.

     
  11. నేను సంతొష్ ని సార్..నా విన్నపానికి స్పందిచినందుకు నా తరుపున మా పిల్లల తరుపునా మీకు చాలా చాలా ధన్యవాధాలు సార్..నా మెయిల్ santosh.karimi@gmail.com .మీకు నా అడ్రస్ ను మెయిల్ చేసాను చూడండి సార్.

     
  12. Anonymous Says:
  13. సార్ నేను సంతొష్ ని..ముందుగా మీ పుస్తకాలు మాకు పంపినందుకు నా తరుపున మా పిల్లల తరుపున మీకు చాలా చాలా ధన్యవాధాలు .మీరు పంపిన మీ పుస్తకాలు మాకు చేరినాయి..మీ పుస్తకాలు చూసి,వాటిని చదువుతూ పిల్లలు చాలా ఆనందిస్తున్నారు.. మీరు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టి పిల్లలకు పుస్తకాలను ఉచితంగా అందిస్తున్న మీకు మరొక్కసారి మా హ్రుదయపూర్వక ధన్యవాధాలు

     
  14. ramakrishna Says:
  15. received the books of asimov very interesting. Thank you so much. I will post the comments of my pupils very soon as promised.

     
  16. Thank you Ramakrishna garu. Waiting for your students' feedback.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts