శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

ఈ రసాయనిక సూత్రాల సహాయంతో రసాయనిక చర్యలని వర్ణించే రసాయనిక సమీకరణాలని వ్యక్తం చెయ్యొచ్చు.ఉదాహరణకి కార్బన్ ఆక్సిజన్ తో కలిసినప్పుడు కార్బన్ డయాక్సయిడ్ ఉత్పన్నం అవుతుంది అన్న సత్యాన్ని ఈ విధంగా వ్యక్తం చెయ్యొచ్చు.

C + O2 à CO2

లెవోషియే సూచించిన ద్రవ్య నిత్యత్వ సూత్రాన్ని పై సమీకరణం తృప్తిపరచాలంటే సమీకరణానికి ఇరుపక్కలా ఉండే పరమాణువుల లెక్క సరిపోవాలి. ఉదాహరణకి పై సమీకరణంలో ఒక  C  పరమాణువు, రెండు  O  పరమాణువులతో కలిసినప్పుడు ఒక  C  రెండు O  లు గల CO2  ఏర్పడుతుంది.
అలాగే హైడ్రోజన్, క్లోరైడ్ లు కలిస్తే హైడ్రోజన్ క్లోరైడ్ ఏర్పడుతుంది అన్న విషయాన్ని వ్యక్తం చెయ్యదలచుకున్నారు అనుకోండి. దాన్ని ఈ విధంగా వ్యక్తం చెయ్యొచ్చు.
H2 + Cl2 à HCl

కాని పైన చూపించిన చర్యలో ముందు రెండు హైడ్రోజన్ పరమాణువులు, రెండు క్లోరైడ్ పరమాణువులు ఉన్నా చర్య జరిగాక ఒక హైడ్రోజన్, ఒక క్లోరైడ్ పరమాణువు ఉండడం కనిపిస్తుంది. ఈ దోషాన్ని సవరించడానికి పై చర్యని మనం సంతులిత రసాయన చర్య (balanced chemical reaction) గా మార్చుకోవాలి.
H2 + Cl2 à 2HCl
అప్పుడు చర్యకి కుడి ఎడమ పక్కల పరమాణువుల సంఖ్య సరిపోతుంది.
అదే విధంగా హైడ్రోజన్, ఆక్సిజన్ లు కలిసి నీటిని ఏర్పరచే చర్యని కూడా ఈ విధంగా ఓ సంతులిత చర్యగా వ్యక్తం చేయవచ్చు.
2 H2 + O2 à 2H2O

విద్యుత్ విశ్లేషణ

లోగడ నికోల్సన్, కార్లైల్ లు విద్యుత్ శక్తిని ఉపయోగించి ముఖ్యమైన రసాయన శాస్త్ర పరిశోధనలు చేసిన సంగతి చూశాం. విద్యుత్ శక్తిని ఉపయోగించి కొన్ని మూలకాల శుద్ధీకరణలో మరింత సంచలనాత్మక ఫలితాలు సాధించడానికి వీలయ్యింది.

ఒకటిన్నర శతాబ్ద కాలం క్రితం బాయిల్ మూలకాలని నిర్వచించిన నాటి నుండి ఆ నిర్వచనానికి సరిపోయే మూలకాలని గణనీయ సంఖ్యలో కనుక్కున్నారు. శాస్త్రవేత్తలని ఇబ్బంది పెట్టిన మరో విషయం ఏమిటంటే కొన్ని పదార్థాలు మూలకాలు కావని తెలుసు, వాటిలో అంతవరకు తెలియని కొత్త మూలకాలు ఏవో ఉన్నాయని కూడా తెలుసు. కాని ఆ మూలకాలని వెలికితీయడం ఎలాగో తెలియలేదు.

ఎన్నో సందర్భాలలో మూలకాలు ఆక్సిజన్ తో కలిసి ఆక్సయిడ్ ల రూపంలో  లభ్యం అవుతాయి. ఆక్సిజన్ తో మరింత బలమైన అనుబంధం (affinity)  గల మరో మూలకాన్ని ప్రవేశపెడితే, ఆక్సిజన్ మొదటి మూలకాన్ని వొదిలిపెట్టి రెండవ మూలకాన్ని ఆశ్రయించవచ్చు. ప్రయోగంలో ఆ విషయం నిర్ధారితం అయ్యింది. అలాంటి రెండవ మూలకం పాత్ర కార్బన్ చక్కగా పోషించింది. ఉదాహరణకి ముడి ఇనుములో ఉండేది అధికశాతం ఐరన్ ఆక్సయిడ్. దీన్ని కార్బన్ యొక్క శుద్ధరూపం అయిన కోక్ తో కలిపి వేడిచేస్తారు. కార్బన్ ఆక్సిజన్ తో కలిసి కార్బన్ మోనాక్సయిడ్, కాఅర్బన్ డయాక్సయిడ్ లు ఏర్పడతాయి. ఇవి వాయువులు కనుక పైకి ఎగిరిపోతాయి. ఇక లోహరూపంలో వున్న ఇనుము అడుగున మిగులుతుంది.

ఇప్పుడు సున్నాన్ని (lime) తీసుకుందాం. దాని లక్షణాల బట్టి చూస్తే సున్నం కూడా ఒక రకమైన ఆక్సయిడే ననిపిస్తుంది. కాని మనకి మనకి తెలిసిన మూలకాలు ఏవీ కూడా ఆక్సిజన్ తో కలిసి సున్నాన్ని ఏర్పాటు చెయ్యటం మనకి తెలియదు. ఆ అజ్ఞాత మూలకాన్ని శుద్ధి చెయ్యడం కోసం సున్నాన్ని, కోక్ తో కలిపి వేడి చేసి చూడొచ్చు. కాని అలా చేసినందువల్ల ఏమీ జరగలేదు. ఆ అజ్ఞాత మూలకం ఏదో ఆక్సిజన్ కి ఎంత బలంగా అతుక్కుపోయింది అంటే కార్బన్ దాన్ని దాని స్థానం నుంచి కదిలించలేక పోయింది. కార్బనే కాక మరే ఇతర రసాయనం కూడా సున్నం నుండి ఆక్సిజన్ ని వేరు చెయ్యలేకపోయింది.

(ఇంకా వుంది)

2 comments

  1. ఎంతో విజ్ఞానదాయకమైన శాస్త్రీయవిషయాలను తేట తెలుగులో వివరిస్తున్నారు. అనేకానేక అభినందనలు.

    రసాయనిక శాస్త్రసమీకరణాలను ఇచ్చారు కాని అవి ఇక్కడ సరిగా రాలేదు. ఉదాహరణకు H20 అని కాక అందులో 2 అనే సంఖ్య subscript (క్రిందికి వచ్చేది) గా రావలసి ఉంది. HTML లో ఇలాగు చేయటం సులభమే. బ్లాగర్‌లో వ్రాసేటప్పుడు H '<'sub'>'2'<'/sub'>'O అని HTML tabలో వ్రాయాలి అంతే. (never mind the quotes shown here - they are needed here for commenting only)

     
  2. Syamaliyam garu Thank you. Sorry. తొందరలో పట్టించుకోలేదు. అంత సులభంగా subscripts వస్తాయని తెలియదు. ఈ సారి ఆ జాగ్రత్త తీసుకుంటాను.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts