శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.




సుదీర్ఘమైన, సుదీప్తమైన గతం గల భారతానికి గణితం కొత్తేమీ కాదు.

మనకి తెలిసిన అత్యంత ప్రాచీన భారతీయ కృతులు వేదాలు.  వేదకాలం నుండి కూడా అంటే కనీసం నాలుగు వేల ఏళ్ల క్రితమే భారతంలో ఓ సజీవ గణిత సాంప్రదాయం ఉండేదని చారిత్రకులు చెప్తారు. యజుర్వేదంలోనే పెద్ద పెద్ద సంఖ్యలతో సులభంగా వ్యవహరించేందుకు గాను వాటికి ప్రత్యేకమైన పేర్లు ఇవ్వబడ్డాయని తెలుస్తోంది.
యజుర్వేద సంహితలోని ఓ శ్లోకంలో “శతం” (అంటే నూరు, 100), “సహస్రం” (వేయి), “అయుత” (పది వేలు), “నియుత” (లక్ష లేదా 1,00,000), “ప్రయుత” (10,00,000), “అర్బుద” (1,00,00,000), “న్యర్బుద” (10,00,00,000), “సముద్ర” (1,00,00,00,000), “మధ్య” (10,00,00,00,000), “అంత” (1011), “పరార్ధ” (1012) – మొదలైన మహా సంఖ్యల పేర్లు ప్రస్తావించడం జరిగింది.

అంత విస్తారమైన సంఖ్యా వ్యవస్థని స్థాపించిన వేదాలలో అంతే విస్తారమైన కాలమానం కూడా వర్ణించబడింది.  అతి క్లుప్తమైన వ్యవధుల దగ్గరి నుండి ఊహించరానంత దీర్ఘమైన యుగాల వరకు భారతీయ కాలమానం  విస్తరించి ఉంటుంది. ఉదాహరణకి మనం సామాన్య సంభాషణల్లో ‘తృటిలో జరిగిపోయింది’ అంటుంటాం. ఆ తృటి విలువ ఆధునిక కాలమానంలో సెకనులో 3290 వంతు. అంత కన్నా చిన్న వ్యవధి ‘పరమాణు’. దీని విలువ 16.8 మైక్రోసెకన్లు (1 మైక్రోసెకను = సెకనులో వెయ్యోవంతులో వెయ్యోవంతు).  ఇక వ్యవధుల్లో కెల్లా అతి దీర్ఘమైనది  మహాకల్పం. దీని విలువ 311.04 ట్రిలియన్ సంవత్సరాలు (1 ట్రిలియన్= 1 పక్కన పన్నెండు సున్నాలు)! అంటే మన ప్రచీన కాలమానం మైక్రోసెకన్ల వద్ద నుండి ట్రిలియన్ల సంవత్సరాల వరకు కాలాన్ని కొలిచింది.  భారతీయ కాలమానం యొక్క ఈ లక్షణం గురించి ప్రఖ్యాత ఖగోళశాస్త్రవేత్త, పాపులర్ సైన్స్ రచయిత కార్ల్ సాగన్ కూడా మెచ్చుకుంటాడు. ప్రాచీన సాంప్రదాయాలలో అంత సుదీర్ఘమైన కాలవ్యవధులతో వ్యవహరించిన సాంప్రదాయం భారతీయ సాంప్రదాయం కాక మరొకటి లేదంటాడు.

యజ్ఞం చేసే ఋషులు జ్యామితికి (geometry), త్రికోణమితికి (trigonometry) చెందిన ఎన్నో ఫలితాలు వాడేవారు. సుమారు మూడు వేల ఏళ్ల నాటి ‘సుల్బ సూత్రాల’లో వేదకాలంలో వాడే గణితానికి చెందిన ఎన్నో సంగతులు వర్ణించబడ్డాయి. ‘బౌధాయన సుల్బ సూత్రం’లో ఒక శ్లోకానికి తాత్పర్యం ఇలా వుంది -
“ఓ దీర్ఘచతురస్రం యొక్క పొడవు మీద, వెడల్పు మీద, చదరాలని నిలిపి, వాటి విస్తీర్ణతలని కలిపితే వచ్చే ఫలితం, ఆ దీర్ఘచతురస్రం యొక్క కర్ణం (diagonal) మీద నిలిపిన చదరం యొక్క విస్తీర్ణతతో సమానం.”
ఇది ఆధునిక పైథాగరస్ సిద్ధాంతం యొక్క ఆదిమ రూపంగా చెప్పుకోవచ్చు.
క్రీ.పూ. 800  కి చెందిన అదే కృతిలో కృతి రచయిత అయిన బౌధాయనుడు  2  కి వర్గమూలాన్ని (square root of 2) లెక్కించడానికి ఈ ఫలితాన్ని కూడా ఇస్తాడు –


ఈ విలువ అసలు విలువ అయిన 1.41421356 తో ఐదవ దశాంశ స్థానం వరకు సరిపోతోంది. అంటే ఆ నాటికే  కరణీయ సంఖ్యల (irrational numbers) గురించిన పరిజ్ఞానం ఉండేదన్నమాట.

క్రీ.పూ. 400 నుండి క్రీ.శ.200 వరకు గల కాలంలో జైన మతానికి చెందిన ఎందరో గొప్ప గణితవేత్తలు వేదకాలానికి చెందిన గణిత సాంప్రదాయాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్లారు. గణితంలో సున్నా (శూన్యం) అన్న భావనని మొట్టమొదట ఈ జైన గణితవేత్తలే ప్రవేశపెట్టారని అంటారు. సున్నాతో పాటు అనంతం (infinity)  అన్న భావనని కూడా ప్రవేశపెట్టి, అనంతతలో పలు రకాలని కూడ వర్ణించారు. ఈ దశకి చెందిన పింగళుడు అనే గణితవేత్తకి ఆధునిక ‘ద్విపద సిద్ధాంతం’ (binomial theorem) కి చెందిన ఎన్నో ఫలితాలు తెలుసట.

ప్రాచీన భారత గణిత చరిత్రలో ఆ తరువాత వచ్చిన దశని సాంప్రదాయక దశ  (classical period)  అంటారు.
క్రీ.శ. 400-1200  నడిమి కాలానికి చెందిన ఈ దశలో ఆర్యభటుడు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు, (ఒకటవ మరియు రెండవ) భాస్కరాచార్యుడు  మొదలైన మహా గణితజ్ఞుల కృషి వల్ల భారతీయ గణితం గణనీయంగా ఎదిగింది. అంకగణితంలో ‘కూడిక, తీసివేత, గుణకారం, భాగహారం’ అనే నాలుగు మౌలిక పద్ధతులని కచ్చితంగా నిర్వచించి క్రీ.శ. ఏడవ శతాబ్దంలో అంకగణితానికి పునాదులు వేశాడు బ్రహ్మగుప్తుడు. యూరప్ లో మధ్య యుగం (క్రీ.శ 5వ శతాబ్దం నుండి 15వ శతాబ్దం వరకు) నడుస్తున్న రోజుల్లో ఈ విధానాలే ‘Modus Indorum’  (ఇటాలియన్ భాషలో ‘భారతీయ విధానాలు’) గా యూరప్ లో చలామణి అయ్యాయి. క్రీ.శ. తొమ్మిదవ శతాబ్దానికి మన దేశంలో బాగా అభివృద్ధి చెందిన దశాంశ వ్యవస్థ (decimal system)   ఉందని, మన దేశం నుండి అది యూరప్ తదితర ప్రాంతాలకి పాకిందని చారిత్రకులు అభిప్రాయపడుతున్నారు.

సాంప్రదాయక దశ తరువాత భారతీయ గణితంలో  ముఖ్యమైన దశ కేరళ గణిత దశ (క్రీ.శ. 1300-1600).  కేరళకి చెందిన ఎందరో గణితవేత్తలు ఈ దశలో గొప్ప ప్రగతి సాధించారు. వీరిలో ఓ ప్రముఖ గణితవేత్త పేరు మాధవుడు . పదహారవ శతాబ్దం వరకు కూడా ఓ వెలుగు వెలిగిన కేరళకి చెందిన గణిత, ఖగోళవిజ్ఞాన సాంప్రదాయానికి ఇతడే మూలకర్త అని చెప్పుకుంటారు. కేరళ గణితవేత్తల ప్రత్యేకత అనంత శ్రేణులకి సంబంధించిన పరిజ్ఞానం. పరిమితమైన సంఖ్యలో రాశులని కలిపితే వచ్చే ఫలితం పరిమితంగానే ఉంటుంది. కాని అపరిమిత సంఖ్యలో రాశులని కలిపినా కొన్ని పరిస్థితుల్లో పరిమితమైన ఫలితం వస్తుందని గణితం చెప్తుంది. అది అర్థం చేసుకోడానికి కాల్క్యులస్ కి చెందిన పరిమితి (limit) మొదలైన భావనలు అవసరం అవుతాయి. ఉదాహరణకి త్రికోణమితికి చెందిన ప్రమేయాలని అనంత శ్రేణులుగా వ్యక్తం చేయడం ఎలాగో మాధవుడు తెలుసుకున్నాడు. అలాంటి ఫలితానికి ఓ తర్కాణం –


మాధవుడు సాధించిన గణిత ఫలితాలని పరిశీలించిన నిపుణులు, కాల్కులస్ ని మొదట కనిపెట్టింది న్యూటన్, లీబ్నిజ్ లు కారని, కేరణకి చెందిన మాధవుడని నిర్ణయించారు.

ఆ విధంగా నాలుగు వేల ఏళ్లకి పైగా సుదీర్ఘమైన, వైభవోపేతమైన చరిత్ర గల భారతీయ గణితం  మరి ఎందుచేతనో కేరళ దశ తరువాత స్తబ్దుగా ఉండిపోయింది. గణిత రంగంలోనే కాదు, అసలు వైజ్ఞానిక రంగంలోనే భారతీయుల గమనం ఈ దశలో మందగించడానికి  కారణం విదేశీయుల పాలన కావచ్చు. ‘స్థానిక అనాగరిక భారతీయులకి బ్రిటిష్ సంస్కృతి నేర్పాలనే’ ఉద్దేశంతో లార్డ్ మాకలే ప్రవేశపెట్టిన విద్యావిధానం కావచ్చు. 1931  లో బ్రిటిష్ వారితో ఓ సమావేశంలో మాట్లాడుతూ గాంధీ మహాత్ముడు  – “మీ బ్రిటిష్ వాళ్లు మా విద్యావ్యవస్థని మొదలంటా నరికేశారు. అందుకే నేటి భారతంలో నూరేళ్ల క్రితం కన్నా ఎక్కువ నిరక్ష్రాస్యత ఉంది,” అంటూ తెల్ల దొరల మీద దుమ్మెత్తిపోశాడు.

 ‘సంస్కృతి అంటే పాశ్చాత్య సంస్కృతి, భారతీయులది అసంస్కృతి, కుసంస్కృతి’ – శతాబ్దాల పాటు ఈ మాటని మంత్రంలా జపించిన మన తెల్ల పాలకుల మాట నమ్మాం. పదే పదే పలికితే అబద్ధం కూడా  నిజంలా వినిపిస్తుందంటారు. వారి మాయమాటల సమ్మోహనంలో పడి మన ఘనత మనం మర్చిపోయాం. అనాదిగా మనకి తెలిసిన చదువులు మరిచాం.

ఆ సమ్మోహనాన్ని వమ్ము చేసి, పూర్వం మన దేశంలో వెలిగిన అపూర్వమైన గణిత సాంప్రదాయాన్ని పునరజ్జీవింపజేయడానికి ఒక్కడు పుట్టాడు. అతడి పేరు శ్రీనివాస రామానుజన్.

*        *        *

15 comments

  1. మంచి ప్రయత్నం.
    అభినందనలు.

     
  2. Unknown Says:
  3. thank you, keep going on..all the very best

     
  4. Anonymous Says:
  5. Very good effort

     
  6. Taara Says:
  7. This is funny and useless. What is the use in learning about Ramanujan? I don't think Ramanujan can get admission into any University even now. IITM has notorious policies regarding admissions esp Maths dept. IITK, IITKGP are also have equally stupid rules , stupid policies and stupid people too. IITKGP, IITM they dont even bother to respond to emails.

     
  8. Anonymous Says:
  9. Very nice article. Please go on.

     
  10. Taara! An absolutely vacuous rant! Dont expect from you:-)

     
  11. తార Says:
  12. చక్రవర్తిగారు, నాది కడుపుమంట, ఆక్రోశం.
    యూరప్లో పెద్ద పెద్ద మేథమేటిషియన్లతో చాలా దగ్గిర సంబంధాలు ఉన్నా, ఆ రోజుల్లో రామానుజన్ గురించి ఒక్కరు పట్టించుకున్న పాపాన పోలేదు, మద్రాస్ యూనివర్సిటీలో చెయ్యగలిగి ఉన్నా ఒక్కరు కుడా రామానుజన్ కి చిన్న సహాయం ఐనా చేశారా? ఎక్కడో ఉన్న హార్డీ పట్టించుకున్నాడు తప్ప, దేశంలో ఒక్కరు పట్టించుకోలేదు.

    సరే ఇప్పుడు ఏమి చేశ్తున్నాం? రామానుజన్ ఇప్పుడు పుడీతే? లెక్కలు తప్ప ఇంకేమీ రావు ఐతే ఎక్కడైనా ఉద్యోగం వస్తుందా? చదువుకి సీట్ వస్తుందా? రాదు, ఎందుకంటే మనోల్లకి లెక్కలు అంటే చిన్న చూపు, అవి ఎందుకు పనికి వస్తాయో కుడా తెలియదు, లెక్కలు అంటే కూడికలు తీసివేతలే అనుకునే మూర్ఖత్వం, అజ్ఞానం. అంతెందుకు, రఘునాథన్, శ్రీక్రిష్ణ, దాని, వీళ్ళు రామానుజన్ స్థాయి వాళ్ళే, కనీసం పద్మశ్రీ ఐనా వచ్చిందా?

    ఇక ఐ.ఐ.టి. మద్రాసు కి వస్తే, లెక్కల డిపార్ట్మెంట్ పేరు "రామానుజన్" పేరు. బాగుంది. మొన్నామధ్య, నా సీనియర్, బీటెక్ మధ్యలో తల్లిదండ్రులు ఇద్దరు చచ్చిపోయారు, ఎమ్మటే తాతా అమ్మమ్మ కుడా, ఒక్క సారిగా అనాధ అయ్యాడు. చదువుకోవడానికి డబ్బులు లేక మానేసి బార్లో బేరర్‌గా చేరితే క్లాస్మేట్స్ చందాలేసుకొని చదివించారు, కానీ ఈ దెబ్బతో మార్కులు 89% నుంచి 65% కి వచ్చింది, మెల్లగా కోలుకొని ఫైనల్ ఈయర్లో గేట్లో 7 ర్యాంకు తెచ్చుకున్నాడు, కానీ ఒక్క ఐ.ఐ.టీ ఐనా సీట్ ఇచ్చిందా? కనీసం ఇంటర్యూకి పిలిచిందా? కనీసం బ్రతిమిలాడుతూ ఉత్తరాలు రాస్తే ఒక్కడు ఐనా రిప్లై ఇవ్వలేదు. ఎందుకయ్యా అంటే సదరు ఐ.ఐ.టీల్లొ చదవాలి అంటే అధమం 75% మార్కులు ఉండాలి. మరప్పుడు గేట్ ఎందుకు సార్? ఐ.ఐటి. మద్రాస్ కి డిపార్ట్‌మెంట్‌కి ఇలాంటి అప్లికేషన్స్‌ని కన్సిడర్ చేసే పవర్ ఉన్నది, కానీ పట్టించుకుంటారా? కనీసం మెయిల్స్‌కి రిప్లైలు ఇస్తే నష్టం ఏంటీ? క్రిక్ ఇంఫో మాత్రం గంటలు గంటలు చూస్తుంటారు. కడుపు మండదా? (ఒకటా రెండా ఇలాంటివి నేను వందల్లో చూసాను, ఇప్పుడు కొన్ని చోట్ల 75% ని మార్చి 85% చేసారు, నిజ్జంగా చదివితే 85% రావడం ఎంట కష్టం? అదే పాతపేపర్లని బట్టీవేస్తే, కాపీలు కొడితే సుబ్బరంగా వాస్తాయి).

    మొన్న హార్వర్డ్ యూనివర్సిటీ స్టాట్స్ ప్రొఫెసర్ ఒకతను చెబుతున్నారు, అతనికి ఇలాంటి అనుభవమే ఎదురు అయ్యింది అట చైనాలో, ఏదో చిన్న ప్రొగ్రాం పెట్టారు హార్వర్డోళ్ళు చైనాలో, అప్పుడు ఇతను దాన్లో అందరిని తోసి మొదటి స్థానంలో వస్తే, హార్వర్డ్లో సీట్ ఇచ్చారు, కానీ ఇతనికి ఇంగ్లీషు రాదు, టోఫెల్ ఫెయిల్, అప్పుడు FSAS సీట్ రిజెక్ట్ చేస్తే, సగం డిపార్ట్‌మెంట్ రాజీనామే చేస్తాం అని సిద్దపడితే అతనికి సీట్ ఇచ్చారు, ఇప్పుడు అక్కడే అతను ప్రెఫెసర్. మరి మన దేశం, స్టూడెంట్ పోతే పోనీ, మా పాలెసీలు మాత్రం మార్చం. చెయ్యగలిగి ఉన్నా మినిమం కుడా పట్టించుకోరు.

    రామానుజన్ కి ఏమి జరిగిందో ఇప్పుడూ అదే జరుగుతున్నది. ఆ అనుభవాలనుంచి మనం నేర్చుకున్నది ఏమైనా ఉన్నదా? ఏమి లేదు, ఇంక మనకి రామానుజన్ చరిత్ర ఎందుకు? ఏమీ నేర్చుకోము కదా, చదివి చెత్తలో పారెయ్యడమే. మన పక్కన రామానుజన్ ఉంటే ఏమి చేస్తాం? వాడ్నో పిచ్చోడి కింద లెక్కేసి, బారులో బేరర్ కింద పెట్టుకుందాం.

    మొన్నే UT AUstin ప్రొఫెసర్ ఒకతను రాసారు, తను కూడా ఐ.ఐ.టి. డిల్లీ ఇంటర్యూకి వెళితే, తన ఇంగ్లీషుని హేళన చేసారని, అప్పుడు ఇంటర్యూ సరిగా చెయ్యలేకపొయ్యాను, తరువాత అత్మన్యూన్యత కుడా చాలా కాలం పోలేదు అని, కానీ ఇప్పటికి తనకి ఇంగ్లీషు సరిగా రాదు, ఇంగ్లీషు దేశంలో కుడా తన ఇంగ్లీషుకి ప్రాధాన్యత కుడా ఇవ్వరు, కానీ ఇప్పటికీ ఇండియాలో తన ఇంగ్లీషు మీద కామెంట్స్ వస్తూనే ఉంటాయి, ఇంగ్లీషే సరిగా రాదు అమెరికాలో పాఠాలు ఏమి చెప్టాడొ అన్నారట మొన్న ఎవరో, కానీ అమెరికాలో మనిషికి విలువ ఉంటుంది, బాషకి వేషానికి కాదు అని రాసుకున్నారు. గేట్లో ఇంగ్లీషు ఏంటి సార్? ప్రపంచంలో ఎక్కడైనా ఉన్నాదా? సబ్జెక్ట్ టెస్ట్లో ఇంగ్లీషు?

     
  13. తారగారి ఆక్రోశం అర్థవంతమైనదే. నిస్సందేహంగా. ఒక్క మాట నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, చరిత్రచెప్పే గొప్ప సత్యాల్లో మొట్టమొదటిది ఏమిటంటే చరిత్రనుండి మనుషులు ఏపాఠమూ నేర్చుకోరు అని. ఇప్పుడూ అదే వినిపిస్తున్నారు తారగారు. ఆణిముత్యాలను గుర్తించలేని మన జనం నకిలీముత్యాలనేకానేకానికి నీరాజనాలు పడుతోంది. మన జాతిరత్నాలను మనం ఇంకా అనేకానేక వడపోతల ఆధారంగా గుర్తిస్తున్నాం కాని ఆ వడపోతల్లో జాతిరత్నాలను మాత్రం కొంత జాగ్రత్తగానే దూరంపెట్టటం అనే వడపోతనూ ముఖ్యభాగంగా చేర్చుకున్నాం. క్రికెట్లో ఒకటిరెండు సీజన్లు బాగాఆడితే పద్మశ్రీఖరారు. బాలాంత్రపునళినీకాంతారావుగారెవరో మనవాళ్ళకు కనీసం తెలుసా నేడు? ఆయనకు పద్మశ్రీ అన్నా ఇచ్చామా? మనకు కావలసినది వినోదపరిశ్రమ - దానిలో ఉన్నది రాజకీయులు, ఆటగాళ్ళు, సినిమాలవాళ్ళు. మిగతావాళ్ళంతా అలగాజనమే ఈ ప్రతిభావంతుల్ని ఎన్నికచేసేవాళ్ళకి.

     
  14. మేము చదువుకొనే రోజుల్లో నన్నయ్య వచ్చి వ్రాసినా నలబై వేసేవారు కాదు తెలుగు పేపర్లో నూటికి. ఇప్పుడు పొట్టచింపితే అక్షరమ్ముక్క లేకపోయినా నూటితి తొంభైయ్యైదు పైనేను. రామశబ్దం కూడా రాకపోయినా సంస్కృతాన్ని ఇంగ్లీషులో వ్రాసేసి నూటికి నూరూ తెచ్చుకోవచ్చునట. ఇవా చదువులు.

    దేశంలో ఏటా వేలకొద్దీ మందికి డాక్టరేట్లు అందుతాయి గొప్పగొప్ప పరిశోధనలకు. వాళ్ళు ఏ శాస్త్రపురోగతికి చేసినదీ మళ్ళీ ఏమీ‌ ఉండదు. ఇండియానుండి వచ్చే పరిశోధనావ్యాసాలు అంతర్జాతీయంగా ఎంతశాతం అండీ? చెప్పుకుంటే సిగ్గుచేటు.

     
  15. అయ్యా తారగారు, శ్యామలీయం గారు, నేనూ ఒప్పుకుంటాను. కాని ఎంతకని ఏడుస్తాం? ఎంతకాలమని ఏడుస్తాం?
    చాతనైతే కచ్చితంగా ఏదైనా పని చేసి సాధించాలి. మనకి నచ్చని దాన్ని మార్చాలి. లేదా మూసుకోవాలి.
    ఊరికే ఏడిస్తే ఏడ్చినట్టు ఉంటుంది!!!

     
  16. Taara Says:
  17. Dear Dr. Chakravarthy,

    I don't like your comment. I wrote my comment so as to let people that there are infact great mathematicians of Ramanujan stature like Dani, Srikrishna, Narasimhan, Raghunathan. But we ourself ignore them because they are in India.
    And I did what ever I can regarding admission process. Do you think people are going to listen to me? And you dont know how much I suffered in return. Do you think people or govt. listen to me when I talk about research at IITs?

    Do you think some one from IITs/Govt. accepts the fact that some high schools in US, UK doing better research to our IITs? "Highschools", can you find some one who can teach Hartshorne in India? None, there are 1,2 people who can teach with some effort. But I can show tens of high schools where people regularly teach "Algebraic Geometry from Hartshorne" outside India.

    But don't think I am going to let this loose, I will fight again when I gather enough powers to. And please dont think I am crying out about IITs, you my relation with them.

    Best,

     
  18. Dear Tara

    Have gone thro your long comment.
    I felt it deserves a more considered response since my last response probably came out of a foul mood.
    I will essentially say the same thing but in more moderate terms.

    In my simplistic world view there are two types of peoples – talkers and doers. Thanks to the social media, the tribe of talkers is growing enormously. They comment on everything that’s happening in the country, on what shouldn’t happen, and how things ought to be done. They yap and yap and, when tired, log out their fb and go to bed.
    There are others, the quiet workers. They work silently for years and decades and may even depart the world without people acknowledging their effort. But ironically these are the ‘salt of the humanity.’ We can rant about the injustice society had done to them. We can form lakes of tears. But the fact remains.

    We must be clear about one thing. There are serious injustices in this world. Life is full of bitter ironies. Life is pitiless. Anyone who wishes to work and change things should understand this first lesson of life well. Now that we understand that that’s the true, ugly face of life, what do we do?

    Do you quietly get down to the work of transforming it? Which means long years of patient, intelligent, well-thought-out, concerted exertion… You may not have any rewards. On the contrary, those for whom you have set out to work, will, out of sheer stupidity, work against you. If you believe in the goodness and greatness of the goal, you must hide your ire, swallow your pain, and march on.

    Or do you allow yourself to be filled with incurable bitterness and negativity. Actually the majority of those who come face to face with the Problem go down this path. You can bitch about everything in the universe. You can wallow in self-pity. You can swim in a vale of tears. Nothing is going to change.

    Coming to the specific issue of the sad state of affairs in Indian academic world… As a part of this system, I think I know the reality fairly well. But like I said there is no point going boohoo! One has to just work, which is what I’m trying to do. Naturally I don’t have any delusions about the scope of my humble and simple work. But this is what I can do, and I do it and hope for the best.
    As for results, they depend on many things. Moreover, weren’t we told wisely that “you have a right to work, but not for the results thereof”?

    I will not get into the specifics of the problems you mentioned, or your specific criticisms. Because then this comment becomes a “counter-rant”!
    I will sign off with a few quotes from Sri Aurobindo:

    264. If thy aim be great and thy means small, still act; for by action alone these can increase to thee.

    265. Care not for time and success. Act out thy part, whether it be to fail or to prosper.

    270. All is not settled when a cause is humanly lost and hopeless; all is settled, only when the soul renounces its effort.


    307. Men labour only after success and if they are fortunate enough to fail, it is because the wisdom and force of Nature overbear their intellectual cleverness. God alone knows when & how to blunder wisely and fail effectively.

    308. Distrust the man who has never failed and suffered; follow not his fortunes, fight not under his banner.

    310. Fix not the time and the way in which the ideal shall be fulfilled. Work and leave time and way to God all-knowing.


    313. Stride swiftly for the goal is far; rest not unduly, for thy Master is waiting for thee at the end of thy journey.

    314. I am weary of the childish impatience which cries & blasphemes and denies the ideal because the Golden Mountains cannot be reached in our little day or in a few momentary centuries.



     
  19. Anonymous Says:
  20. అయ్యా/అమ్మా మనం ఆంగ్ల భాష కు అంత ప్రాధాన్యం ఇవ్వడం అవసరమా ఒక సారి ఆలోచించండి దాని బదులు సంస్కృత భాష మాధ్యమానికి ప్రాధాన్యం కలిగిస్తే మనుషుల ఆలోచనా సరళి కొంచం వరకు మార వచ్చు

     
  21. Anonymous Says:
  22. సంస్కృత భాషలో చెప్పలేని నిర్వచించలేని శాస్త్రం ఉండదు. భౌతిక శాస్త్రం దగ్గరినుంచి ఆది భౌతిక శాస్త్రం వరకు అన్నియును సంస్కృతం లో వచించ వచ్చు నిర్వచించ వచ్చు

     
  23. అనానిమస్ గారు. నిజమే సంస్కృతం గొప్ప భాష. అందులో సైన్స్ ని చాలా చక్కగా వ్యక్తం చెయ్యొచ్చు. రేపట్నుంచి ఆ పని మీదే వుండండి...

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts