స్ఫటికల విషయంలో
ఈ సిద్ధాంతం బాగానే పని చేసింది కాని, ద్రావణాల విషయంలో మాత్రం ఒక విధంగా విఫలం అయ్యింది.
ఎందుకంటే ద్రావణంలో ఇక స్ఫటికాకృతి వుండదు. స్ఫటికలన్నీ ద్రావణంలో కరిగిపోయి ఇష్టం
వచ్చినట్టు తేలుతూ ఉంటాయి. కాంతీయ ప్రవృత్తికి కారణం అసౌష్టవమే అయితే ఆ అసౌష్టవం స్ఫటిక
స్థాయిలో కాక, అణు విన్యాసం స్థాయిలో ఉండాలని అనిపించింది.
కేకులే ప్రతిపాదించిన
నిర్మాణ సూత్రాలు ఈ అసౌష్టవాన్ని వ్యక్తం చెయ్యలేకపోవచ్చు గాక. అలాగని అసౌష్టవానికి
కాంతీయ ప్రవృత్తికి సంబంధం లేదని కాదు. ఆలోచించి చూస్తే ఈ నిర్మాణ సూత్రాలలో ఒక విషయం
అర్థమవుతుంది. ఇవన్నీ ఒక తలం మీద, అంటే ఒక కాగితం మీదనో, లేక బోర్డు మీదనో రాసే ద్విమితీయ
(two-dimensional) సూత్రాలు. సూత్రాలు ద్విమితీయాలే కావచ్చు గాని, వాస్తవంలో అవి వ్యక్తపరిచే
అణువులు ద్విమితీయ నిర్మాణాలు కావాలని నియమం ఏమీ లేదే?
క్రమంగా అణువులలోని
పరమాణువులు త్రిమితీయ ఆకాశంలో (three-dimensional space) విస్తరించి వుంటాయని అర్థమయ్యింది.
అదే నిజమైతే ఆ విస్తరణలో వుండే అసౌష్టవంలో కాంతీయ ప్రవృత్తికి కారణాలు వెతకొచ్చు. కాని అణువు యొక్క త్రిమితీయ విన్యాసాన్ని తెలుసుకోవడం
ఎలా?
మొదటి నుంచి
కూడా మనుషులు పరమాణువులని రసాయన చర్యలని వివరించడానికి అనువైన ఊహావస్తువులుగానే పరిగణిస్తూ
వచ్చారు. కాని వాటిని వాస్తవ వస్తువులుగాని, త్రిమితీయ ఆకాశంలో ఓ ప్రత్యేకమైన విన్యాసం
గల వస్తువులుగా పరిగణించడం సమంజసమేనా?
ఈ ప్రశ్నకి సమాధానం
చెప్పడం ఒక యువకుడి వల్ల, ఓ దుడుకువాడి వల్ల సాధ్యం అయ్యింది. ఎందుకంటే వయసుతో వచ్చే
వివేకం, నెమ్మది ఆ కుర్రాడిలో లేకపోయింది.
మూడు మితులలో
అణువులు
ఆ యువకుడు జాకోబస్
హెన్రికస్ వాంట్ హోఫ్ అనే డచ్ రసాయన శాస్త్రవేత్త. 1874 లో ఆ యువకుడు పీ.హెచ్.డి. చేస్తున్నాడు. అప్పటికి
తన పరిశోధన ఇంకా పూర్తి కాలేదు. అణువిన్యాసాల గురించి ఆలోచిస్తూ అతడు ఓ విప్లవాత్మకమైన
సూచన చేశాడు. కార్బన్ పరమాణువు యొక్క నాలుగు బంధాలు మూడు మితులలో విస్తరించి వుంటాయని,
ఒక టెట్రహెడ్రన్ యొక్క నాలుగు మొనల దిశగా తిరిగి ఉంటాయని అతడు సూచించాడు.
టెట్రహెడ్రన్
0 comments