శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

 

ఈ బ్లాగ్ లో లోగడ చేసిన ‘భారతీయ సంస్కృతి – ఆధునిక విజ్ఞానం’ అనే పోర్ట్ కి మంచి స్పందన వచ్చింది.

http://scienceintelugu.blogspot.com/2011/12/blog-post_04.html

 

అందులో శ్రీ అరొబిందో వ్రాసిన ‘Foundations of Indian Culture’  అనే పుస్తకం నుండి కొన్నిఅంశాలని ఉదహరించడం జరిగింది. ఆ అంశాలు ఇంగ్లీష్ లో ఉన్నాయి గనుక, వాటిని తెలుగులోకి అనువదిస్తే బావుంటుందని కొందరు సూచించారు. అలాంటి ఒక అనువాద ప్రయత్నం ఇక్కడ ఇస్తున్నాను.

 

 

 

...For there are a plenty of Indians now who are for a stubbornly static defense [of ancient Indian culture], and whatever aggressiveness they put into it consists in a rather vulgar and unthinking cultural chauvinism which holds that whatever we have is good for us because it is Indian or even that whatever is in India is the best, because it is the creation of the Rishis. As if all the later clumsy and chaotic developments were laid down by those much misused, much misapplied and often very much forged founders of our culture. ... It [such defense] amounts to an attempt to sit stubbornly still while the Shakti of the world is rapidly moving on her way, and not only the Shakti of the world but the Shakti of India also. ...The past has to be used and spent as mobile and current capital for some larger profit, acquisition and development of the future: but to gain we must release, we must part with something in order to grow and live more richly, - that is thelaw of universal existence. Otherwise the life within us will stagnate and perish in its immobile torpor. Thus to shrink from enlargement and change is too a false confession of impotence. It is to hold that India's creative capacity in religion and in philosophy came to an end with Shankara, Ramanuja, Madhwa and Chaitanya and in social construction with Raghunandan and Vidyaranya. It is to rest in art and poetry either in a blank and uncreative void or in a vain and lifeless repetition of spent forms and motives. It is to cling to social forms that are crumbling and will continue to crumble in spite of our efforts and risk to be crushed in their collapse.

ఈ రోజుల్లో ఎంతో మంది భారతీయిలు [ప్రాచీన భారత సంస్కృతిని] మొండిగా సమర్థిస్తూ ఉంటారు. ఈ విషయంలో వాళ్లు చేసే పిడివాదం వెనుక ఒక విధమైన అసంగతమైన, అనాలోచితమైన సాంస్కృతిక దురహంకారం కనిపిస్తుంది. మనకి ఉన్నదంతా మంచిదేనని, ఎందుకంటే అది భారతీయమని అంటారు. లేదా మన దేశంలో ఉన్నదంతా మంచిదేనని ఎందుకంటే అది ఋషుల సృష్టి అని వాదిస్తారు. భారతీయ సంస్కృతికి పునాదులు వేసింది ఋషులే కావచ్చు.  కాని కాలానుగతంగా వారి బోధనలు నానా రకాల దుర్వినియోగానికి, దుష్ప్రయోగానికి గురై, లేని పోని కల్లలతో కలుషితమయ్యాయి. మరి ఆ కారణం చేత ఏర్పడ్డ  అవతవక, అల్లకల్లోల పరిణామాల మాటేమిటి? ఒక పక్క విశ్వశక్తి వేగంగా ముందుకు కదులుతుంటే, అంతేకాక దాంతో పాటు భారతీయ శక్తి కూడా మేలుకుని ముందుకు సాగుతుంటే,  అది [అలా సమర్ధించడం] మొండిగా, స్తబ్దుగా, జడంగా ఉండిపోవడంతో సమానం అవుతుంది. గతం నుండి వచ్చిన సాంస్కృతిక ఐశ్వర్యాన్ని పెట్టుబడిగా పెట్టి భవిష్యత్తులో గొప్ప వికాసం, లాభం ఒనగూరేలా పని చెయ్యాలి. కాని ఒక కొత్త దాన్ని పొందాలంటే పాతదాన్ని కొంత వదిలిపెట్టాలి. మరింత ఎత్తుకు ఎదగాలంటే, మరింత శోభాయమానంగా జీవించాలంటే కొన్ని వదులుకోవాలి. అది విశ్వజీవనం యొక్క ధర్మం. లేకుంటే మనలోని జీవశక్తి అచల తమస్సులో కుళ్లి, కృశించిపోతుంది. విస్తరణకి, పరిణతికి వెరచి స్తబ్దుగా ఉండిపోవడం కూడా ఒక విధంగా మన చేతకాని తనాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. మత, తాత్విక రంగాల్లో భారతీయ సృజనాత్మక శక్తి శంకర, రామానుజ, మధ్వ, చైతన్య దేవులతో అంతరించిపోయింది అనుకోవాలా? లేక సాంఘిక సంస్కరణలో ఆ శక్తి రఘునందనుడితో, విద్యారణ్యుడితో ఆగిపోయింది అనుకోవాలా? అదే నిజమని అనుకుంటే ఇక కళారంగంలో, కవిత్వ సాహితీ రంగాల్లో కూడా మనకి రెండే మార్గాలు కనిపిస్తాయి. ఒక పక్క రిక్తమైన, సృజనవిరహితమైన శూన్యంతో సరిపెట్టుకోవడం, లేదా గతానికి చెందిన శుష్క రూపాలని, భావజాలాన్ని పదే పదే నిరర్థకంగా, నిస్సారంగా, నిస్సహాయంగా వల్లెవేసుకోవడం – ఈ రెండే మనకిక గత్యంతరాలు. నిలువరించాలని ఎంత ప్రయత్నించినా కుప్పకూలిపోతున్న సాంఘిక ఆచారాలని పట్టుకుని వేలాడాలని చూస్తే ఏదో ఒక నాడు ఆ శిధిలాలలో మనమూ భూస్థాపితమయ్యే ప్రమాదం వుంది.

 


"The objection to any large change - for a large and bold change is needed and no peddling will serve our purpose - can be given a plausible turn only if we rest it on the contention that the forms of a culture are the right rhythm of its spirit and in breaking the rhythm we may expel the spirit and dissipate the harmony forever. Yes, but though the Spirit is eternal in its essence and in the fundamental principles of its harmony immutable, the actual rhythm of its self-expression inform is ever mutable...To recognize defect in the form is not to deny the inherent spirit; it is rather the condition for moving onward to a greater future amplitude, a more perfect realization, a happier outflow of the Truth we harbour. Whether we shall actually find a greater expression than the past gave us, depends on our own selves, on our capacity of response to the eternal Power and Wisdom and the illumination of the Shakti within us and on our skill in works, the skill that comes by unity with the eternal Spirit we are in the measure of our light labouring to express;yogah karmasu kaushalam.

ఒక విశాలమైన, ప్రగాఢమైన మార్పును మనం కోరుకుంటున్నప్పుడు (అవును మరి, ఇప్పుడు కావలసినది విశాలమైన, విప్లవాత్మకమైన మార్పు, తూతూమంత్రాలతో ఇక పని జరగదు) అందుకు ప్రతి సారి ఒక అభ్యంతరం ధ్వనిస్తూ ఉంటుంది. ఏ సంస్కృతిలోనైనా అందులో వాడుకలో ఉండే కట్టుబాట్లు, ఆచారాలు ఆ సంస్కృతిలోని మూలతత్వంతోను, ఆత్మతోను అనుసంధానమై ఉంటాయి. ఆచారాలని మార్చితే మూలతత్వాన్ని, ఆత్మని ఉల్లంఘించినట్టు అవుతుంది, అనాదిగా వస్తున్న సామరస్యాన్ని భంగపరిచినట్టు అవుతుంది. ఆ వాదనలో కొంత నిజం లేకపోలేదు. ఆత్మ దాని మూలతత్వంలో సనాతని అయినా, దాని సామరస్యాల వెనుక ఉండే మూలసూత్రాలు మారనివే అయినా, దాని అభివ్యక్తీకరణలో కాలానుగతమైన మార్పులు వస్తూ ఉండాలి… బాహ్య రూపంలో దోషాన్ని గుర్తించినంత మాత్రాన లోనున్న ఆత్మని తిరస్కరించినట్టు కాదు. మరింత ఘనమైన భవిష్యత్తు దిశగా, మరింత పరిపూర్ణమైన విజయాల దిశగా, మరింత ప్రజ్వలమైన, ప్రహ్లాదమైన సత్యావిష్కరణ దిశగా మనం ఎదగాలంటే, అలాంటి కాలానుగతమైన మార్పు తప్పనిసరి అవుతుంది. గతం మనకి అందించిన వ్యక్తరూపాల కన్నా ఘనమైన, ప్రగాఢమైన వ్యక్తరూపాలని మనం సాధించగలమా లేదా అన్నది మన మీదనే ఆధారపడి ఉంటుంది. మన లోనే ఉన్న మహాశక్తి యొక్క సనాతన ప్రాబల్యానికి, ప్రజ్ఞకి, ప్రకాశానికి మనం చూపించే ప్రతిస్పందన మీద ఆధారపడి ఉంటుంది. మన పనులలో మనం ప్రదర్శించే సృజన మీద, సామర్థం మీద ఆధారపడి ఉంటుంది. ఏ తేజాన్నయితే, ఆత్మనయితే మనం వ్యక్తం చెయ్యడానికి ప్రయత్నిస్తున్నామో, ఆ సనాతన ఆత్మతో మనం మమేకం అయినప్పుడు కలిగే అద్భుతమైన సామర్థ్యం అది. ‘యోగః కర్మసుకౌశలమ్’ అన్న వాక్యంలోని సారమే అది.

 


"This from the standpoint of Indian culture, and that must be always for us the first consideration and the intrinsic standpoint. But there is also the standpoint of the pressure of the Time Spirit upon us...Here too the policy of new creation imposes itself as the sure and only effective way. Even if to stand still and stiff within our well-defended gates were desirable, it is no longer possible. ...For good or ill the world is with us; the flood of modern ideas and forces are pouring in and will take no denial. There are two ways of meeting them, either to offer a forlorn and hopeless resistance or to seize and subjugate them. If we offer only an inert or stubborn passive resistance, they will still come in on us, break down our defenses where they are weakest, sap them where they are stiffer, and where they can do neither, steal in unknown or ill-apprehended by underground mine and tunnel. Entering unassimilated they will act as disruptive forces, and it will be only partly by outward attack but much more by an inward explosion that this ancient Indian civilisation be shattered to pieces. Ominous sparks are already beginning to run about which nobody knows how to extinguish, and if we could extinguish them we should not bebetter off, for we should yet have to deal with the source from which they are starting. Even the most rigid defenders of the present in the name of the past show in their every word how strongly they have been affected by the new ways of thinking. Many if not most are calling passionately,calling inevitably for innovations in certain fields, changes that are European in spirit and method which once admitted without some radical assimilation and Indianization, will end by breaking the social structure they are defending. That arises from confusion of thought and an incapacity ofpower. Because we are unable to think and create in certain fields, we are obliged to borrow without assimilation or with only an illusory pretence of assimilation. Because we cannot see the whole sense of what we are doing from a high inner and commanding point of vision, we are busy bringing together disparates without any saving reconciliation. A slow combustionand a swift explosion are likely to be the end of our efforts.

 

ఇంతవరకు భారతీయ సంస్కృతి కోణం నుండి చూస్తూ మాట్లాడడం జరిగింది. నిశ్చయంగా మనం ఆ కోణం నుండే ప్రారంభం కావాలి, ఆ దృక్పథాన్నే మూలంగా తీసుకోవాలి. కాని దాంతో సరిపెట్టుకోకుండా  కాలపురుషుడు మన మీద చేస్తున్న ఒత్తిడి దృష్ట్యా కూడా చూడాలి…దీన్ని బట్టి కూడా నవ్యసృజన అవసరం అని, అదే శ్రేష్ఠమైన మార్గమని అనిపిస్తోంది. పటిష్ఠమైన మన సాంస్కృతిక కోట గోడల వెనుక బిర్రబిగుసుకుని కూర్చోవడం వాంఛనీయం అని అనుకున్నా కూడా అది ఇక సాధ్యం కాదని తెలుస్తోంది. మంచికైనా, చెడుకైనా సమస్త ప్రపంచం మన భూమిక లోనికి చొచ్చుకు వస్తోంది. ఆధునిక భావాలు, బలాలు మనని ఉప్పెనలా ముంచెత్తుతున్నాయి. వాటిని ఇక త్రోసిపుచ్చలేము. వాటిని ఎదుర్కోవడానికి రెండే మార్గాలు. నిస్సహాయంగా, నిరర్థకంగా వాటికి అడ్డుపడే ప్రయత్నం చెయ్యడం. లేదా వాటిని చేజేతులా ఒడిసిపట్టి లొంగదీసుకోవడం. మొండిగా, జడంగా, స్తబ్దుగా వాటిని అడ్డుకోడానికి ప్రయత్నిస్తే మాత్రం అవి వాటి విజృంబణ మానవు. అంతేకాక బలహీనంగా ఉన్న చోట అవి మన రక్షక కవచాలని బద్దలుకొడతాయి. కాస్త గట్టిగా ఉన్నచోట నెమ్మదిగా తరుగదీస్తాయి. ఇవి రెండూ సాధ్యం కాని చోట గుట్టుగా, రహస్యమైన భూగర్భ సొరంగ మార్గాల ద్వార పట్టుబడకుండా చొరబడతాయి. వాటిని మనం ఆకళించుకోకుండా లోనికి తోసుకురానిస్తే అవి విచ్ఛిన్న శక్తులుగా దాపురిస్తాయి. బాహ్యమైన దాడుల వల్ల కొంతవరకు, ఆంతరికమైన విస్ఫోటం వల్ల చాలా వరకు మన ఈ ప్రాచీన భారత నాగరికత ఛిన్నాభిన్నమయ్యింది. ఇప్పటికే అశుభశూచకమైన రవ్వలు ఎగిరి పడుతున్నాయి. ఆ మంటలని ఆర్పటానికి ఎవరితరమూ కావడం లేదు. వాటిని ఆర్పటానికి సాధ్యమైనా మన సమస్య సమసిపోదు.  ఆ జ్వాలికల మూలాలు ఎక్కడున్నాయో ఆలోచించాలి. గతం పేరు చెప్పి వర్తమానాన్ని మొండిగా సమర్థించేవారు కూడా నవ్య భావనా ధోరణుల ప్రభావం వారి మాటల మీద ఎంతగా పడుతోందో ప్రదర్శిస్తూనే ఉన్నారు. వారిలో అందరూ కాకపోయినా కొందరు మాత్రం కొన్ని రంగాల్లో నవ్యసృష్టిని కోరుతూ పిలుపునిస్తున్నారు. అయితే మూలతత్వంలో, విధానంలో ఆ మార్పులు యూరొప్ కి చెందినవి. వాటిని మన సంస్కృతిలోకి లోతుగా ఆకళించుకోకపోతే, వాటి భారతీయకరణను సాధించలేకపోతే, ఏ సామాజిక వ్యవస్థనైతే వాళ్లు కాపాడాలని చూస్తున్నారో, ఆ వ్యవస్థని అవి కూలదోస్తాయి. ఇలాంటి పరిస్థితి అయోమయమైన ఆలోచన వల్ల అసమర్థమైన బలం వల్ల ఏర్పడుతుంది. కొన్ని రంగాల్లో సొంతంగా ఆలోచించలేకపోతున్నాం గనుక, సృజన చేయలేకపోతున్నాం గనుక, బయటి నుండి యదాతథంగా విషయాలని అరువు తెచ్చుకోవలసి వస్తోంది. ఇక కొన్ని సందర్భాల్లో అయితే ఆకళించుకుంటున్నామన్న మిథ్యలో ఉంటున్నాం. మన వ్యవహరాలలోని సంపూర్ణ అంతరార్థాన్ని ఒక ఉన్నతమైన, లోతైన దృక్కోణం నుండి చూసి అర్థం చేసుకోలేకపోతున్నాం గనుక, పొత్తు కుదరని వ్యతిరేకాలని దుడుకుగా ఒకదరికి చేర్చాలని చూస్తున్నాం గాని, వాటి మధ్య నిండైన సామరస్యాన్ని సాధించలేకపోతున్నాం. మన ప్రయత్నం ఇదే విధంగా అవకతవకగా ముందుకి సాగితే నెమ్మదిగా అగ్గిరాజుకుంటూ ఏదో ఒక రోజు ఒక బ్రహాండమైన విస్ఫోటంలో అంతా అంతమవుతుంది.

 

 "...What we have to do is to front the attack with new and more powerful formations which will not only throw it back, but even, where that is possible and helpful to the race, carry the war into the assailant's country. At the same time we must take by a strong creative assimilation whatever answers to our own needs and responds to the Indian spirit. In certain directions, as yet all too few, we have begun both these movements. In others we have simply created an unintelligent mixture or else have taken and are still taking over rash crude and undigested borrowings. Imitation, a rough and haphazard borrowing of the assilant's engines and methods may be temporarily useful, but by itself it is only another way of submitting to conquest. A stark appropriation is not sufficient; successful assimilation to the Indian spirit is the needed movement. The problem is one of great immediate difficulty and stupendous in its proportions and we have not approached it with wisdom and insight. All the more pressing is the need to awaken to the situation and meet it with original thinking and a conscious action wise and powerful in insight and sure in process. A mastering and helpful assimilation of new stuff into an eternal body has always been in the past a peculiar power of the genius of India."

 

“…  కాబట్టి మనం చెయ్యవలసింది ఏమిటంటే మీది కొస్తున్న దాడిని నవ్యమైన, మరింత శక్తివంతమైన సృజనతో అడ్డుకోవాలి. ఆ విధంగా ఆ దాడిని తిప్పికొట్టడమే కాకుండా, సాధ్యమైన చోట, మన జాతికి ఉపయుక్తమైన చోట, యుద్ధాన్ని ప్రత్యర్థి రంగంలోకి తీసుకుపోవాలి. అదే సమయంలో లోనికి వస్తున్న అంశాలని భారతీయ అవసరాలని తీర్చేలా, భారతీయ తత్వానికి సరిపోయేలా, స్పందించేలా, బలంగా, సృజనాత్మకంగా ఆకళించుకోవాలి. ఇలాంటి ప్రయత్నం ఇప్పటికే కొన్ని దిశలలో – అవి బహుకొద్ది దిశలే కావచ్చు గాక – మొదలయ్యింది. మరి కొన్ని రంగాలలో అసంగతమైన గందరగోళాన్ని సృష్టించుకున్నామంతే. ఇంకా కొన్ని సందర్భాల్లో దుడుకైన, కరుకైన, అజీర్ణమైన అంశాలనే అరువు తెచ్చుకుంటూ నెట్టుకొస్తున్నాం. ప్రత్యర్థి యొక్క విధివిధానాలని అస్తవ్యస్తంగా, అయమయంగా అనుకరించే పద్ధతికి తాత్కాలికమైన ప్రయోజనం ఉంటుందేమో. కాని మనం దాంతో సరిపెట్టుకుంటే, ఆక్రమణని సమ్మతించినట్టు అవుతుంది. పరుల పద్ధతులని మన సొంతం చేసుకుంటే సరిపోదు. భారతీయ తత్వానికి అనుగుణంగా వాటిని ఆకళింపు చేసుకోవడమే సరైన ప్రతిస్పందన అవుతుంది. ఇది అత్యవసరమైన, అతి కఠినమైన సమస్య. వైశాల్యంలో, పరిమాణంలో ఇది బ్రహాండమైన సమస్య. కాని ఇంతవరకు దాని పట్ల మనం వివేకంతో, గాఢమైన లోదృష్టితో వ్యవహరించలేదు. కాబట్టి తక్షణమే మేలుకుని, పరిస్థితిని అర్థం చేసుకుని, గొప్ప స్వచ్ఛందమైన ధీశక్తితో, చైతన్యవంతమైన కృషితో, వివేకంతో, శక్తివంతంగా, స్థిరంగా  దాన్ని ఎదుర్కోవాలి.  మన సనాతన శరీరంలోకి కొత్త విషయాలని ఒడుపుగా, ఒద్దికగా ఆకళించుకోవడం – ఇదే భరతీయ తత్వం యొక్క అసమాన ప్రతిభ,  ప్రత్యేక పాటవం.

 


Sri Aurobindo From "Foundations of Indian Culture"

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts