శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

హైగెన్స్ నాటి విశ్వదర్శనం

Posted by V Srinivasa Chakravarthy Sunday, August 28, 2022 0 comments

 

సూర్యుడి చుట్టూ తిరిగే గ్రహాలలో భూమి కూడా ఒకటి అనే కోపర్నికస్ సిద్ధాంతాన్ని హోలాండ్ లో సామాన్యులు కూడా నమ్ముతున్నారన్న విషయం హైగెన్స్ కి సంతోషం కలిగించింది. “మందబుద్ధులు, మనుషులు కల్పించిన మూఢాచారాల ప్రభావంలో ఉన్న వాళ్లు తప్పఇంచుమించు ఖగోళశాస్త్రవేత్తలు అందరూ కోపర్నికస్ సిద్ధాంతాన్ని ఒప్పుకున్నారు. మధ్యయుగాలలో క్రయిస్తవ తాత్వికులు విశ్వం యొక్క పరిమితి గురించి చిత్రంగా వాదించేవారు. విశ్వం అంతా భూమి చుట్టూ రోజుకొక సారి పరిభ్రమిస్తుంది కనుక విశ్వం అనంతం కాలేదని వారి వాదన. అందుకే లెక్కించరాని సంఖ్యలో మాత్రమే కాక పెద్ద సంఖ్యలో ప్రపంచాలు ఉండడం అనేది అసంభవం. ఆకాశమంతా కదులుతోందన్న నమ్మకానికి బదులు భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది అన్న భావన భూమిని విశ్వంలో తన ప్రత్యేక హోదా నుండీ తొలగించింది. భూమి మీద ఉన్నట్లే ఇతర ప్రపంచాల మీద కూడా జీవం ఉండొచ్చునన్న భావనకి ఊపిరి పోసింది. ఒక్క సౌరమండలం మాత్రమే కాక మొత్తం విశ్వమంతా సూర్యుడి చుట్టూ తిరుగుతోందని భావించాడు కోపర్నికస్. కాని తారల చుట్టూ గ్రహ వ్యవస్థలు ఉండవని కెప్లర్ నమ్మాడు. ఇతర సూర్యుళ్ల చుట్టూ తిరిగే ఇతర ప్రపంచాలు అనంతంగా విశ్వమంతా విస్తరించి ఉన్నాయన్న భావనని మొట్టమొదట ప్రతిపాదించినవాడు జోర్డానో బ్రూనో. కాని కోపర్నికస్, కెప్లర్ సిద్ధాంతాలకి పర్యవసానంగా అనేక ప్రపంచాలు ఉండి తీరాలని అర్థం చేసుకున్న వారు ఖంగుతిన్నారు. పదిహేడవ శతాబ్దపు తొలిదశలలో రాబర్ట్ మెర్టన్ అనే శాస్త్రవేత్త సూర్యసిద్ధాంతానికి,  అనేక ప్రపంచాలు ఉంటాయన్న సిద్ధాంతం పర్యవసానం అవుతోందని వాదించాడు. వాదన ఏంటో తన సొంత మాటల్లోనే విందాం.

కోపర్నికస్ అనుయూయులు చెప్పినట్టు విశ్వం నిజంగానే అంత అసమాన పరిమాణం గలదైతేఅసంఖ్యాకమైన తారలతో, అనంతమైన విస్తృతి గలదే అయితే,… ఆకాశంలో మెరిసే అసంఖ్యాక తారలు అనేక సూర్యుళ్లు అనుకోవాల్సి ఉంటుందిసూర్యుడి చుట్టూ ఎన్నో గ్రహాలు నాట్యాలాడినట్టే వాటి చుట్టూ కూడా ఎన్నో ప్రపంచాలు తిరుగుతూ ఉండాలి. అలా అనుకుంటే అసంఖ్యాకమైన జీవసహిత ప్రపంచాలు ఉండాలి. అలా అనుకోవడానికి అభ్యంతరం ఏముంటుంది? ఒకసారి కెప్లర్ తదితరులు భూమి చలనం గురించి అన్నది నిజమని నమ్మాక, ఎన్నో ధీరోదాత్తమైన భావనలని, గొప్ప అంతర్వైరుధ్యాలని వరుసగా ఒప్పుకోవలసి ఉంటుంది.”

 

కాని మరి భూమి నిజంగానే కదులుతోంది. మెర్టన్ నాడు బతికుంటేఅసంఖ్యాకమైన, జీవసహిత ప్రపంచాలుఉన్నాయని నమ్మేవాడేమో. హైగెన్స్ కూడా అలాంటీ భావన నుండీ వెనుకాడలేదు. నిజానికి భావనని మనసారా స్వాగతించాడు. అంతరిక్షమనే సముద్రపు సుదూర తీరాల్లో తారలే ఇతర సూర్యుళ్ళు. మన సౌరమండలాన్ని పోలికగా తీసుకుంటూ, అన్య తారల చుట్టూ కూడా గ్రహాలు తిరుగుతూ ఉండి తీరాలని, వాటి మీద జీవం విలసిల్లి ఉండొచ్చని భావించాడు. “” గ్రహాల మీద విశాలమైన ఎడారులు తప్ప మరేమీ లేకపోయినట్టు అయితేవాటి దివ్యమూలాలని బట్టబయలు చేస్తే వాటి మీద జీవజాతుల సంచారం కనిపించకపోతే, అందంలో, అధికారంలో అవి భూమి కన్నా అధమమైనవని అనుకోవలసి ఉంటుందికాని అలా తలపోయడం సమంజసం కాదనిపిస్తుంది.”

 

భావాలన్నీ అసాధారణమైన పుస్తకంలో, కాస్త గంభీరమైన పేరుతో ప్రచురించడం జరిగింది. “ఆవిష్కృత ఆకాశ ప్రపంచాలుగ్రహ సీమల మీద విలసిల్లే ప్రపంచాలకి చెందిన జీవుల, మొక్కల, ఉత్పత్తులకి సంబంధించిన సిద్ధాంతాలు.” 1690 లో హైగెన్స్ మరణానికి కొంచెం ముందు ఇది వెలువడింది. పుస్తకం ఎంతో మందిని ప్రభావితం చేసింది. రష్యన్ రాజు పీటర్ గ్రేట్ దాన్ని రష్యాలో ప్రచురింపజేశాడు. విధంగా అది రష్యాలో అచ్చయిన మొట్టమొదటి పాశ్చాత్య వైజ్ఞానిక  రచన అన్న ఘనత దక్కించుకుంది.  పుస్తకంలో ఉన్నది చాలా మటుకు ఇతర గ్రహాలలో ప్రకృతి, వాతావరణాలకి చెందిన ఊహాగానమే. చక్కని చిత్రాలతో అలంకృతమైన మొదటి ముద్రణలో సూర్యుడి పక్కన, పరిమాణాల నిష్పత్తిని పాటిస్తూ, జూపిటర్, సాటర్న్ చిత్రాలు ఉన్నాయి. అంత పెద్ద గ్రహాలు కూడా సూర్యుడి పక్కన చిన్నగా కనిపిస్తాయి. అలాగే భూమి పక్కన సాటర్న్ ఉన్న చిత్రం కూడా వుంది. అందులో సాటర్న్ పక్కన భూమి చిన్ని చుక్క.

హైగెన్స్ ఊహించుకున్న ఇతర గ్రహాల పర్యావరణాలు ఇంచుమించుగా పదిహేడవ శతాబ్దపు భూమి లాగానే ఉన్నాయి. ఇతర గ్రహాల మీద ఉండేగ్రహవాసుల’ (“planetarians”) “శరీరాలు పూర్తిగా అయినా, పాక్షికంగా అయినా మన శరీరాల కన్నా చాలా భిన్నంగా ఉంటాయిప్రతిభ గల జీవులు మన లాంటి ఆకారంలో తప్ప మరే విధంగానూ ఉండరని అనుకోవడంవట్టి అర్థంలేని అభిప్రాయం.” రూపం తేడాగా ఉన్నా తెలివితేటల్లో కొరత లేకపోవచ్చు అంటున్నాడు. కాని ఇక్కడ ఇంకా ఇలా వాదిస్తాడు. వాళ్లు మరీ విడ్డూరంగా కూడా ఉండరని అంటాడు. వాళ్లకీ చేతులు, కాళ్లు ఉంటాయని, రెండు పాదాల మీద నిటారుగా నించుంటారని, రెండు కాళ్ల మీద నడుస్తారని అంటాడు. వాళ్లకీ వ్రాత ఉంటుందని, జ్యామితి తెలిసి ఉంటుందని వాదిస్తాడు. జూపిటర్ చుట్టూ ఉండే నాలుగు ఉపగ్రహాలు ఉన్నది ప్రాంతంలో సంచరించే అంతరిక్ష నావికులకి దారి చూపించడం కోసమేనని వాదిస్తాడు. హైగెన్స్ తన సాంస్కృతిక నేపథ్యపు ప్రభావం బలంగా ఉన్న పౌరుడు. నిజానికి మనమూ అంతే. సామాజిక నేపథ్యపు ప్రభావానికి లోను కానిదెవరు? విజ్ఞానమే తన మతం అన్నాడు. ఇతర గ్రహాల మీద కూడా జీవులు ఉంటారన్నాడు. లేకుంటే ప్రపంచాలన్నిటినీ దేవుడు నిష్కారణంగా సృష్టించినట్టు అవుతుంది అన్నాడు. అతడి డార్విన్ కి ముందరి వాడు కనుక అన్యధరా జీవుల గురించి అతడి చేసిన ఊహాగానాల మీద పరిణామ సిద్ధాంతపు ప్రభావం పడలేదు. అయితే కాలంలో లభ్యమైన పరిశీలనా సమాచారాన్ని ఆధారంగా తీసుకుని ఆధునిక విశ్వదర్శనానికి చాలా సన్నిహితంగా వచ్చాడు

ఇంత బృహత్తరమైన, బ్రహ్మాండమైన విశ్వం వెనుక ఉన్న విశ్వరచన ఎంత అద్భుతమైనదిఎన్నెన్ని సూర్యుళ్లు, ఎన్నెన్ని భూములు లోకాల మీద కిక్కిరిసి వున్న మూలికలు, మొక్కలు, మెకాలు,  భూములని అలంకరించిన సాగరాలు, నగాలుఇక కొలువరాని దూరాలలో వెల్లివిరిసి అపార తారావళిని తలచుకుంటే మనసంతా చెప్పరాని అబ్బురపాటుతో, ఆరాధనతో నిండిపోతుంది.”

 

(ఇంకా వుంది)

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts