శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

మార్స్ పట్ల అపోహలు, వాస్తవాలు

Posted by V Srinivasa Chakravarthy Sunday, October 10, 2021

  

మనం పంపిన నిఘా ఉపగ్రహాలు ప్రస్తుతం మార్స్ చుట్టూ కక్ష్యలో తిరుగుతున్నాయి. గ్రహోపరితలం మొత్తం మ్యాప్ చెయ్యబడింది. గ్రహం ఉపరితలం మీద రెండు మానవరహిత ప్రయోగశాలలని కూడా దింపాం. లొవెల్ నాటి నుండి నేటికి మార్స్ రహస్యాలు మరింత ప్రగాఢమయ్యాయి. లొవెల్ చూసిన చిత్రాల కన్నా మరింత వివరమైన మార్స్ చిత్రాలని పరిశీలించిన మీదట అక్కడ బ్యారేజిలు, ఆనకట్టలు మొదలైనవేవీ లేదని, మహానదుల మాట అటుంచి, అక్కడ పిల్ల కాలువ కూడా లేదని నిశ్చయంగా తేలింది. లొవెల్, షియాపరెల్లీ తదితరులు, పరికరాలలోని దోషం వల్ల, అసంపూర్ణమైన సమాచారాన్ని వాడుకుంటూ, తప్పుడు నిర్ణయాలకి వచ్చారు. మార్స్ మీద జీవం ఉంటుందన్న గాఢమైన విశ్వాసం నమ్మకానికి దన్నుగా నిలిచి వుంటుంది.

 

పార్సివల్ లొవెల్ రాసిన నోట్సు పుస్తకాలు చూస్తే ఏళ్ల తరబడి తన టెలిస్కోప్ వద్ద అతడు చేసిన కృషి కనిపిస్తుంది. రోజుల్లో ఇతర ఖగోళశాస్త్రవేత్తలు మార్స్ కాలువల పట్ల వ్యక్తం చేసిన సందేహాలన్నీ అతడికి బాగా తెలుసని నోట్సు పుస్తకాల నుండి తెలుస్తుంది. తానేదో గొప్ప సత్యాన్ని కనుగొన్నాడని, తక్కిన వారే దాని గొప్పదనాన్ని ఇంకా గుర్తించడం లేదన్న అపోహలో ఒక మనిషి బతకడం కనిపిస్తుంది. 1905 నాటి నోట్బుక్ లో, జనవరి 21 నాడు రాసుకున్న సమాచారం ఇలా ఉంది – “జంటకాలువలు అప్పుడప్పుడు మెరుపుల్లా కనిపిస్తాయి. దాన్ని యదార్థం రూఢి అవుతోంది.” లొవెల్ నోట్సు పుస్తకాలు చదువుతుంటే అతగాడు నిజంగానే ఏదో చూసి వుంటాడనే ఇబ్బందికరమైన భావన మనసులో పుడుతుంది. ఇంతకీ అతడు చూసిందేంటి?

కార్నెల్ విశ్వవిద్యాలయంలో నా సహోద్యోగి పాల్ ఫాక్స్, నేను కలిసి సమస్య మీద కొన్ని అధ్యయనాలు చేశాం. లొవెల్ గీసిన మార్స్ పటాలని మారినర్ 9 అంతరిక్ష నౌక మార్స్ కక్ష్య నుండి తీసిన చిత్రాలతో పోల్చి చూశాం. లొవెల్ భూమి నుండి చేసిన పరిశీలనల కోసం వాడిన 24 ఇంచిల వక్రీభవన టెలిస్కోప్ ఇచ్చే చిత్రాల కన్నా మారినర్ 9 చిత్రాల సునిశితత్వం (resolution)  వెయ్యి రెట్ల కన్నా ఎక్కువ. రెండిటి మధ్య ఎక్కడా పోలికే కనిపించలేదు! మార్స్ ఉపరితలం మీద కనిపించే సూక్ష్మమైన రూపురేఖలని చూచాయగా చూసిన లొవెల్ వాటి మీద లేని సరళరేఖలని ఊహించుకుని భ్రమపడ్డాడని అనడం లేదు. అతడు కాలువలు అని నిర్దేశించిన చోట్ల ఉల్కాబిలాల వరుసల వంటివేవీ లేవు. అసలక్కడ ఏవీ లేవు. మరి ఏటేటే ఆదే స్థానలలో కాలువలు ఎలా గీయగలిగాడు? మారినస్ 9 చేసిన గొప్ప ఆవిష్కరణ ఏమిటంటే మార్స్ ముఖం మీద కాలానుగతంగా మారే గాట్లు, మచ్చలు ఎన్నో ఉన్నాయి. కొన్ని చోట్ల గాట్లు ఉల్కాబిలాల చుట్టూ ఉండే ఎత్తైన గోడలతో అనుసంధానమై ఉన్నాయి. రూపురేఖలన్నీ  మార్స్ రుతువుల బట్టి మారుతూ ఉంటాయి. దుమారాలు మోసుకొచ్చే దుమ్ము వల్ల ఏర్పడ్డ ఆకృతులవి. రుతుచక్రాల బట్టి రూపాలు మారుతూ పోతాయి. కాని కాలువలకి ఉండాల్సిన లక్షణాలేవీ గీతలకి లేవు. కాలువలు ఉండాల్సిన స్థానంలో కూడా అవి లేవు. పైగా భూమి నుండి చూస్తే కనిపించేటంత పెద్దవి కూడా కావు. కాబట్టి గత శతాబ్దపు మొదటి కొన్ని దశాబ్దాలలో లొవెల్ చూసిన భౌగోళిక విశేషాల లాంటివి మార్స్ ఉపరితలం మీద ఉండే అవకాశం చాలా తక్కువ. అలాంటివి అసలంటూ ఉంటే పూర్తిగా నామరూపాలు లేకుండా మాయమయ్యే అవకాశం మరీ తక్కువ.

మార్స్ మీద కనిపించిన కాలువలకి కారణం మనిషి యొక్క చేయి, కన్ను, మెదడుల సంయోగంలో వచ్చిన దోషమే కావచ్చు. అది అందరిలో కాకపోయినా కొంతమందిలో అలాంటి దోషం ఏర్పడవచ్చు. ఎందుకంటే లొవెల్ కాలంలోనే ఎంతో మంది ఇతర ఖగోళశాస్త్రవేత్తలు తమకి అలాంటి కాలువలు ఏవీ కనిపించలేదని ప్రకటించారు. కాని ఇదంత బలమైన హేతువు కాదు. నన్నడిగితే మార్స్ కాలువలకి సంబంధించి ఏదో మూల రహస్యం మనకి ఇంకా పట్టుబడలేదు అంటాను. మార్స్ కాలువలలో కనిపించే క్రమబద్ధత కచ్చితంగా ప్రజ్ఞకి సంకేతం అని లొవెల్ తరచు అంటూ ఉండేవాడు. అది నిజమే. అయితే ప్రజ్ఞ టెలిస్కోప్ లో కొసన ఉంది అన్నదే ఇంకా తేలని ప్రశ్నగా మిగిలిపోయింది.

లొవెల్ ఊహించిన మార్షియన్లు మంచి వాళ్లు, శాంతికాముకులు, దివ్యులు. హెచ్.జి. వెల్స్ నవల The War of the Worlds లోనో, అదే పేరుతో ఆర్సన్ వెలెస్ సృష్టించిన  రేడియో నాటికలోనో కనిపించే ముష్కరుల వంటి వారు కారు. ఇద్దరి భావాలు సైఫై  నవలా సాహిత్యం ద్వార, వార్తాపత్రికల్లో ఆదివారం అనుబంధాల ద్వార ప్రజల మనసుల్లోకి జొరబడ్డాయి. చిన్నప్పుడు ఎడ్గర్ రైస్ బరోస్ రాసిన మార్స్ నవళ్లు గొప్ప ఉత్కంఠతో చదివిన అనుభూతులు ఇంకా గుర్తు. నవళ్లలో కథానాయకుడు జాన్ కార్టర్ తో పాటు వర్జీనియా నుండిబార్సూమ్’’కి (ఇది మార్స్ గ్రహానికి నవల్లో ఇచ్చిన పేరు) నేనూ ప్రయాణించాను. థోట్ అనబడే ఎనిమిది కాళ్ల మహామృగాలని అనుసరించాను. అక్కడ హీలియమ్ రాజ్యానికి రాకుమార్తె, అతిలోక సుందరి అయిన డేజా తోరియా మనసు దోచాను, మనువాడాను. నాలుగు మీటర్ల ఎత్తుండే యోధుడు టార్స్ టార్కాస్ తో జట్టు కలిపానుఎత్తయిన సౌధాలతో శోభిల్లే బార్సూమ్ నగరాలలో సంచరించాను. నైలోసిర్టిస్, నెపెంతెస్ కాలువల పక్కన పచ్చని తీరాల వెంట ఒంటరిగా నడిచాను.
మార్స్ మీద హీలియమ్ రాజ్యంలో జాన్ కార్టర్ తో పాటు మనం కూడా సంచరిద్దామా? బార్సూమ్ ఆకాశంలో వెలిగే జంట చందమామల వెన్నెల కాంతులలో, ఎండాకాలపు రాత్రి వేళ్ల అద్భుత వైజ్ఞానిక సాహసం తలపెడదామా? మార్స్ గురించి లొవెల్ సిద్ధాంతాలన్నీ తప్పే కానివ్వండి. మార్స్ మీద అతడు ఊహించుకున్న కాలువలన్నీ కల్లలే కానివ్వండి. అయితే అతడు చేసిన మంచి ఒకటుంది తరతరాల పిల్లలకి (వారిలో నేనూ ఒకణ్ణి) అది గొప్ప స్ఫూర్తి నిచ్చింది. ఇతర గ్రహాల అన్వేషణ వట్టి ఊహాగానం కాదని, అది నిశ్చయంగా నిజం కాగలదని, ఏదో ఒకనాడు మనం కూడా మార్స్ కి ప్రయాణించగలం అన్న భావబీజాన్ని అది నాటింది. విశాలమైన మైదానం మీద చేతులు చాచి నించుని జాన్ కార్టర్ మార్స్ ని చేరుకోవాలని బలంగా మనసులో అనుకుంటాడు సంకల్పబలమే అతణ్ణి మార్స్ కి చేరుస్తుంది. నా చిన్నప్పుడు ఎన్నో సార్లు ఖాళీ మైదానంలో నించుని మార్స్ కి వెళ్లాలని బలంగా మనసులో అనుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాని నా నివేదనలు ఎప్పుడూ నిజం కాలేదు. అందుకు మరేదో పద్ధతి ఉండాలి.

జంతువుల లాగానే యంత్రాలకి కూడా వాటి పరిణామ క్రమం వాటికి ఉంటుంది. రాకెట్ మాత్రమే కాక, దాన్ని అదిలించే మందుపాతర కూడా, ప్రాచీన చైనాలో పుట్టింది. చైనాలో అనాదిగా ఉత్సవాలలో టపాకాయలు వేడుకాగా వాడేవారు. పద్నాలుగవ శతాబ్దంలో అవి యూరప్ లో దిగుమతి అయ్యాయి. యుద్ధ ప్రయోజనాల కోసం వాటిని వాడడం మొదలెట్టారు. పందొమ్మిదవ శతాబ్దపు చివరి దశలో రష్యాకి చెందిన కాంస్టాంటిన్ త్సియాల్కోవ్ స్కీ రాకెట్లని ఇతర గ్రహాలకి మోసుకుపోగల వాహనాలుగా వాడొచ్చని సూచించాడు. సూచనని విస్తృతమైన సిద్ధాంతంగా విపులీకరించాడు. అమెరికన్ శాస్త్రవేత్త రాబర్ట్ గోడార్డ్ దాన్ని ఉన్నత ఎత్తుల వరకు ఎగరగలిగే సాధనంగా  మొట్టమొదటి సారిగా దాన్ని తీర్చి దిద్దాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మన్లు  ప్రయోగించిన V-2  యుద్ధ రాకెట్, గోడార్డ్ చేసిన ఆవిష్కరణల ఆధారంగా రూపొందించబడింది. 1948 లో V-2  రాకెట్  V-2/WAC కార్పొరల్ అనే రెండు దశల రాకెట్ సృష్టికి ఊపిరి పోసింది. V-2/WAC కార్పొరల్ రాకెట్ గతంలో రాకెట్టూ సాధించలేనంతగా 400 కిమీల ఎత్తుకి ఎగిరింది. 1950 లలో, అటు సోవియెట్ యూనియన్ లో సర్గేయ్ కోరొలోవ్, ఇటు అమెరికాలో వెర్నర్ ఫాన్ బ్రౌన్ లు దారుణ మారణాయుధాల ప్రయోగం కోసం తయారుచేసిన రాకెట్ల నిర్మాణం మొట్టమొదటి కృత్రిమ ఉపగ్రహాల నిర్మాణానికి దారితీసింది. అప్పట్నుంచి రాకెట్ల పరిశోధన వేగం పుంజుకుందిమానవసహిత కక్ష్యగత యానం; మనుషులు చందమామ చుట్టూ కక్ష్యలోకి ప్రవేశించడమే కాక చందమామ మీద వాలడం; మనవరహిత అంతరిక్షనౌక సౌరమండలాన్ని దాటి పోవడం మొ. బ్రిటన్, ఫ్రాన్స్, కెనడా, జపాన్, చైనా మొదలుకొని ఇప్పుడు ఎన్నో ఇతర దేశాలు అంతరిక్షనౌకలని లాంచ్ చెయ్యగలుగుతున్నాయి.

 

గోడార్డ్ చిన్నతనంలో వెల్స్ రచనలు చదివి, పార్సివల్ లొవెల్ ఉపన్యాసాలు విని ఎంతో స్ఫూర్తి పొందాడు. రాకెట్ యుగానికి మూలకర్తలైన గోడార్డ్, త్సియాల్కోవ్ స్కీ లు ఇద్దరూ కలలు గన్న రాకెట్ ప్రయోజనాలలో రెండు ముఖ్యమైనవి ఉన్నాయి. ఒకటి ఆకాశంలో ఎంతో ఎత్తు నుండి భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ భూమిని పరిశీలించే ఒక వ్యోమనౌక. రెండవది మార్స్ మీద జీవం కోసం గాలించే ప్రోబ్. రెండు కలలూ నేడు నిజమయ్యాయి.

 

మీరు మరో గ్రహం నుండి ఒక సందర్శకుడిగా భూమిని సమీపిస్తున్నారు అనుకోండి. భూమి మీద పరిస్థితుల గురించి మీకు ముందుగా ఎలాంటి అవగాహన లేదనుకుందాం. మీరు భూమికి దగ్గర పడుతున్న కొద్ది దృశ్యం ఇంకా ఇంకా స్పష్టం అవుతుంటుంది గ్రహం నివాసితమా కాదా? గ్రహానికి ఎంత దగ్గరగా వస్తే మీకు  ప్రశ్నకి సమాధానం తెలుస్తుంది? భూమి మీద ప్రజ్ఞగల జీవులే ఉంటే వాళ్లు పెద్ద పెద్ద ఇంజినీరింగ్ నిర్మాణాలు సృష్టించి ఉంటారు. కిలోమీటర్ల స్థాయిలో వాటిని నేపథ్యానికి మధ్య తేడా స్పష్టంగా తెలుస్తుందేమో. కిలోమీటర్ల స్థాయిలో దూరభేదాలు పట్టుకోగల కెమేరాలు ఉంటే అది సాధ్యమవుతుందిఅయితే కొన్ని కిలోమీటర్ల స్థాయిలో చూసినప్పుడు భూమి అవిశేషంగా, ఊసరక్షేత్రంలా కనిపిస్తుంది. వాషింగ్టన్, న్యూయార్క్, బాస్టన్, మాస్కో, లండన్, పారిస్, బెర్లిన్, టోక్యో, బేజింగ్ లాంటి ప్రదేశాలలో కూడా జీవచిహ్నాలు (ప్రజ్ఞ కలిగినా, లేకున్నా) పెద్దగా కనిపించవు. భూమి మీద ప్రజ్ఞ గల జీవులు ఉన్నా కూడా వాళ్లు కొన్ని కిలోమీటర్ల స్థాయిలో భూమి ఉపరితలం మీద క్రమబద్ధమైన, జ్యామితిబద్ధమైన నిర్మాణాలు చేసి పృథ్వీ ముఖాన్ని గణనీయంగా రూపాంతరం గావించలేదు.

కిలోమీటర్ల స్థాయి కన్నా కింది స్థాయికి కొన్ని వందల మీటర్ల స్థాయికి వచ్చి పరిస్థితి మారిపోతుంది. భూమి మీద ఎన్నో చోట్ల ఉన్నట్లుండి ఆకృతిలో గొప్ప క్రమబద్ధత కనిపిస్తుంది. చదరాలతో, దీర్ఘచతురస్రాలతో, సరళ రేఖలతో, వృత్తాలతో సంక్లిష్టమైన ఆకారాల జాలాలు బహిర్గతమౌతాయి. ఇవన్నీ ప్రజ్ఞ గల జీవులు చేసే ఇంజినీరింగ్ నిర్మాణాలకి ప్రతిరూపాలు. రాదారులకి, కాలువలకి, పొలాలకి, పురవీధులకి అవి చిహ్నాలు. యూక్లిడీయన్ జ్యామితి పట్ల మనిషి పడ్డ మోజుకి, స్థలాధిపత్యానికి (territoriality)  అవి సంకేతాలు. స్థాయిలో ప్రజ్ఞ గల జీవుల ఉనికిని బాస్టన్ లోనో, వాషింగ్టన్ లోనో, న్యూ యార్క్ లోనో గుర్తించొచ్చు. ఇంకా కింది స్థాయికి, అంటే మీటర్ల స్థాయికి దిగి పరిశీలిస్తే, భూమి ఉపరితలం ఎంత ప్రగాఢంగా మలచబడిందో అర్థమవుతుంది స్థాయిలో మనుషులు ముమ్మరంగా పని చేస్తున్నారని తెలుస్తుంది. ఫోటోలు పట్టపగలు తీసినవే కావచ్చు. కాని సంధ్యవేళ, చీకటి వేళ తీసినా ఎన్నో విశేషాలు కనిపిస్తాయి. లిబ్యాలోనో, గల్ఫ్ లోనో చమురు బావులు కక్కుతున్న అగ్నులు; స్క్విడ్ జలచరాల కోసం గాలించే జపనీస్ నౌకలు జలగర్భంలో సృష్టించిన కాంతులు; మహానగరాల విరాజమాన వీధులు. ఇక పగటి పూట కెమేరాల సునిశితత్వాన్ని మరింత మెరుగుపరచుకుని మీటర్ల స్థాయిలో చూస్తే మొట్టమొదటి సారిగా వ్యక్తిగత జీవరాశులని గుర్తుపట్టగలుగుతాము. తిమింగలాలు, ఆవులు, ఫ్లామింగో పక్షులు, మనుషులు కళ్లకి కనపడతారు.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts