ఈ రెండవ వ్యోమనౌక కొన్ని కిమీల దూరంలో దిగింది. దూరం నుండి చూస్తే అచ్చం మా నౌక లాగానే ఉంది. వీలైనంత వేగంగా అడుగులేసి, మా నౌక ఎయిర్లాక్ లోంచి మా నౌక లోకి ప్రవేశించాం. అక్కడ మా ప్రొఫెసర్ అప్పటికే ఎవరో ముగ్గురు కొత్తవాళ్లతో మాట్లాడుతున్నాడు. ఈ లోకం కాని లోకంలో వీళ్లెక్కడి నుండి దాపురించారు? అని తిట్టుకోబోతూ ఆగాను. వాళ్లలో ఒక పిల్ల కూడా ఉందని, ఆమె సామాన్యమైన ఆడపిల్ల కాదని, ఈ నిస్సార జగత్తుకి వన్నె తెచ్చే కన్నె అని ఇట్టే అర్థం చేసుకున్నాను.ప్రొఫెసర్ ఆ అనుకోని అతిథులని మాకు పరిచయం చేశాడు.“ఈయన పేరు అభినవ వర్మ. సైన్సు రచయిత. మీరంతా ఈయన...
పంచమంలో పర్యటిస్తున్న కొద్ది దాన్ని సృష్టించిన జాతి మీద మా గౌరవం పెరగ సాగింది. ఐదు మిలియన్ సంవత్సరాల పాటు నిక్షేపంలా ఉన్న వాళ్ల సంస్కృతికి చెందిన జ్ఞాపికలని మేం మొట్టమొదటి సారిగా స్పృశిస్తున్నాం. వాళ్లు మరో తారామండలం నుండి వచ్చిన వాళ్లే కావచ్చు. కొండంత కాయం వున్న మహాకాయులే కావచ్చు. కాని వారికి మన మానవజాతికి మధ్య ఎన్నో పోలికలు ఉన్నాయి. వాళ్లని కలుసుకునే మహాభాగ్యం, విశ్వవ్యవధుల ప్రమాణాలతో పోల్చితే, తృటిలో తప్పిపోవడం బాధకలిగిస్తుంది.కాని మామూలుగా పురావస్తు పరిశోధకులు ఎదుర్కునే ఇబ్బందులు మాకు ఎదురు కాకపోవడం ఒక విధంగా మా అదృష్టమే...
అరవడం అయితే అరిచేశా గాని మరీ అంత దద్దమ్మలా ఎలా మాట్లాడానా అని సిగ్గేసింది. తక్కిన వాళ్ల స్పందన ఎలా ఉందోనని ఓ సారి అటు ఇటు చూశాను. ఒక్క నిముషం అంతా నిశ్శబ్దం. అప్పుడిక గొడవ మొదలయ్యింది. అవునని కాదని అంతా వాదనలోకి దిగారు. ఈ వాదనని మొగ్గలోనే తెంపేస్తూ ప్రొఫెసర్ ఇలా అన్నాడు:“కిరీటి చెప్పింది నిజం. X-నాగరికతని మన సౌరమండలానికి తెచ్చిన వ్యోమనౌక ఇదే.”అది విని రాకేష్ అనుకుంటా, కెవ్వున అరిచినంత పని చేశాడు.“ఏంటి మీరనేది! ముప్పై కిలోమీటర్ల వ్యాసం గల నౌకా?”“ఆశ్చర్యం ఏవుంది రాకేష్. ఇంజినీరువి. ఓసారి నువ్వే ఆలోచించు,” తొణకకుండా తర్కం చెప్పుకొచ్చాడు...
డోమ్ చుట్టూ కొంత దూరం వరకు ప్రదక్షిణ చేశాక ఒక చోట ద్వారం లాంటిది కనిపించింది. చాలా చిన్న ద్వారమది. వెడల్పు రెండు మీటర్లే. అది వృత్తాకారంలో ఉండడం వల్ల అది ద్వారం అని గుర్తించడానికి సమయం పట్టింది.“జాగ్రత్త! అది ద్వారం కాదు” గౌరంగ్ స్వరం రేడియోలో వినిపించింది. “అదేదో ఉల్క చేసిన ఘనకార్యం.”“అసంభవం!” ప్రొఫెసర్ అరిచినంత పని చేశాడు. “దాని ఆకృతి మరీ తీరుగా ఎవరో గీసినట్టు ఉంది.”గౌరంగ్ ఒప్పుకోలేదు.“ఉల్కాపాతాలు జరిగినప్పుడు ఎప్పుడూ వృత్తాకారపు గోతులే పడతాయి. దాని అంచులు చూడండి. ఏదో విస్ఫోటం జరిగినట్టు స్పష్టంగా తెలుస్తోంది. ఆ దెబ్బకి ఉల్క...

“అంత చిన్న వస్తువుకి ఉండే ప్రకాశం కన్నా దీని ప్రకాశం కొంచెం ఎక్కువగా ఉంది. అది చూస్తే ఇదసలు నిజంగా ఉపగ్రహమేనా అన్న సందేహం కూడా కలుగుతుంది. అసలు దీని కాంతిని ప్రతిబింబించే గుణం ... దాన్నేమంటారూ...” పదం గుర్తు రాక అర్థోక్తిలో ఆపాడు ప్రొఫెసర్.“ఆల్బేడో.” గౌరంగ్ అందించాడు.“థాంక్యూ గౌరంగ్. దీనికి అంత ఎక్కువ ఆల్బేడో ఉండడం చూస్తే దాని ఉపరితలం మీద ఏదైనా లోహపు పూత ఉందేమో అనిపిస్తుంది.”“అర్థమయ్యిందోచ్!” ఉత్సాహంగా అరిచాను. “X-నాగరికతకి చెందిన వాళ్లు...

ప్రొఫెసర్ కథ విని మా శేషులో గాని, నాలో గాని ఆయన ఊహించిన స్పందన కలగలేదు. ఈ పంచమం మీద X-నాగరికత కి చెందిన జీవులు ఏవో జ్ఞాపికలు పొరపాట్న పారేసుకుని ఉండొచ్చుగాక. అంత మాత్రం చేత భూమి నుండి ఇలా ఎగేసుకు రావాల్సిన అవసరం నాకైతే కనిపించలేదు.ఓ వారం తరువాత బృహస్పతి ఉపగ్రహాల్లో కెల్లా అతి పెద్దదైన గానిమీడ్ మీద వాలాం. గురుడి ఉపగ్రహాలు అన్నిట్లో శాశ్వత మానవ స్థావరం ఉన్నది ఒక్క గానిమీడ్ మీదే. అక్కడ ఓ యాభై మంది సిబ్బందితో ఓ వేధశాల, ఓ భౌగోళిక పరిశోధనా కేంద్రం...
ఈ X-నాగరికత గురించి మా ప్రొఫెసర్ కి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. వీళ్లు అంతరిక్ష యానంలో ఆరితేరిన వాళ్లు. ఎందుకంటే మెర్క్యురీ మీద కూడా వీళ్ళ ఆనవాళ్లు దొరికాయి. జల్లెడ తీగల్లాంటి తీరైన వీధులున్న, X-నాగరికత కి చెందిన, నగరాల శిధిలాలు మెర్క్యురీ నేలలో దొరికాయి. ప్రొఫసర్ ఉద్దేశంలో ఆ జాతి వారు చిన్న గ్రహాలన్నిటినీ ఆక్రమించుకోవాలని చూశారు. భూమి, వీనస్ గ్రహాల మీద గురుత్వం మరీ ఎక్కువ కావడంతో ఈ రెండు గ్రహాల జోలికీ పోలేదట. కాని మరి మన చందమామ మీద వాళ్ల ఆచూకీ లేకపోవడం ప్రొఫెసర్ విశ్వనాథాన్ని కొంచెం నిరాశపరిచింది. ఏదో ఒక నాడు తప్పకుండా చందమామ...
“భూమిని విడిచి బయలుదేరిన దగ్గర్నుండి మీతో పెద్దగా మాట్లాడడానికే వీలుపడలేదు.” గొంతు సవరించుకుంటూ అన్నాడు ప్రొఫెసర్. “ఈ యాత్రకి లక్ష్యం ఏంటో మీకు వివరంగా చెప్పాలి.”ఎదురు ప్రశ్నలు వేసి చిత్రహింస పెట్టకుండా ఇలా మా ప్రొఫెసర్ సూటిగా విషయం చెప్పేస్తున్నాడేంటని మేము ఆశ్చర్యపడేటంతలో, ఆయనే మళ్లీ అన్నాడు:“పోనీ నేను చెప్పే బదులు మీరే ఊహించగలరా మన యాత్రకి లక్ష్యం ఏంటో?” “మీ మనసులో ఏవుందో మాకెలా తెలుస్తుంది .. కానీ” కాస్త సగౌరవంగా సణిగాడు శేషు. “బహుశ జూపిటర్ ఉపగ్రహాల మీద ఏవైనా కొత్త సంగతులు తెలుసుకోవచ్చేమో నన్న...”“భేష్ శేషూ!” ప్రొఫెసర్...

కాల్పనిక వైజ్ఞానిక సాహితీలోక పితామహుడు అని చెప్పుకోదగ్గ ఆర్థర్ సి. క్లార్క్ రాసిన ఓ కథకి అనువాదం ఇది. ఈ కథ పేరు Jupiter Five. జూపిటర్ ఉపగ్రహాల్లో అంతవరకు పెద్దగా ఎవరూ పట్టించుకోని, ఐదవ ఉపగ్రహం పేరు అది. ఆ ఉపగ్రహంలో మానవేతర సంస్కృతికి చెందిన అవశేషాలు, రహస్యాలు ఏవో ఉన్నాయన్న నమ్మకంతో, అదేదో తేల్చుకుందామని ఒక ప్రొఫెసర్ తన బృందాన్ని తీసుకుని బయలుదేరుతాడు. తీరా అక్కడికి చేరాక వాళ్లకి పోటీగా మరో ముఠా తయారవుతుంది. అప్పుడేం జరుగుతుందో ... కథ చదివితే...

కనుక ఖగోళశాస్త్రవేత్తలు ఉపద్రవాలని పక్కన పెట్టి మళ్లీ పరిణామాత్మక సిద్ధాంతాల వైపు మొగ్గు చూపారు. లాప్లాస్ ప్రతిపాదించిన నీహారికా సిద్ధాంతాన్ని మరొక్కసారి పరిశీలించసాగారు.అయితే అప్పటికే విశ్వం గురించిన వాళ్ల అవగాహన గణనీయంగా విస్తరించింది. గెలాక్సీల ఆవిర్భవాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే మన సౌరమండలం యొక్క ఆవిర్భవానికి అవసరమైన వాయు రాశుల కన్నా బృహత్తరమైన వాయు రాశుల గురించి మాట్లాడుతున్నాం అన్నమాట. అంత విస్తారమైన వాయురాశులు...

1905 లో థామస్ క్రౌడర్ చాంబర్లేన్ మరియు ఫారెస్ట్ రే మౌల్టన్ అనే ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు ఓ కొత్త సిద్ధాంతాన్ని రూపొందించారు. మన సూర్యుడితో మరో తార ఇంచుమించు ఢీ కొన్న పరిస్థితి ఏర్పడ్డప్పుడు, గ్రహాలు ఉద్భవించాయని వారి సిద్ధాంతం. ఆ సమాగామం వల్ల రెండు తారల నుండి ద్రవ్యరాశి బయటికి లాగబడింది. తదనంతరం మన సూర్యుడి చుట్టూ మిగిలిన ధూళిసందోహాలు సంఘనితమై అల్పగ్రహాలుగా (planetesimals) గా ఏర్పడి, తరువాత అవి గ్రహాలుగా ఏర్పడ్డాయి. దీన్నే ’అల్పగ్రహ...

సౌరమండలం యొక్క ఆవిర్భావాన్ని గురించిన సిద్ధాంతాల తీరు ఆ విధంగా ఉండేది. కాని ఈ సిద్ధాంతాలతో ఎన్నో చిక్కు సమస్యలు తలెత్తాయి. ఉదాహరణకి అత్యంత బలహీనమైన గురుత్వాకర్షణ యొక్క ప్రభావం వల్ల అంత విరళమైన వాయు రాశి సంఘనితం కావడం ఎలా సాధ్యమో అర్థం కాలేదు. తదనంతర కాలంలో ఈ సంఘననానికి కారణమైన మరో ప్రక్రియని కూడా శాస్త్రవేత్తలు ప్రతిపాదించారు. అదే కాంతి చేసే ఒత్తిడి. అంతరిక్షంలో ఉండే రేణువుల మీద అన్ని దిశల నుండి కిరణాలు పడుతుంటాయి. ఇప్పుడు రెండు రేణువులు...

సౌరమండలం ఆవిర్భావాన్ని గురించిన మొట్టమొదటి ఊహాగానాల గురించి ఈ వ్యాసం. ఈ విషయం గురించి రెండు విభిన్న సిద్ధాంతాల మధ్య సంఘర్షణని వర్ణిస్తుంది ఈ వ్యాసం. సౌరమండలం, అందులోని వివిధ అంశాలు ఉపద్రవాత్మకంగా పుట్టుకొచ్చాయని ఒక సిద్ధాంతం, కాదు క్రమమైన పరిణామానికి ఫలితంగా పుట్టాయని మరొక సిద్ధాంతం అంటుంది. భౌతిక శాస్త్రం అభివృద్ధి చెందుతున్న కొద్ది, సౌరమండలం గురించి మరింత సమాచారం పోగవుతున్న కొద్ది ఈ సిద్ధాంతాలలో స్పష్టత వచ్చిన తీరు ఇక్కడ వర్ణించబడుతుంది.ఐసాక్...

దారంతా ఫీరొమోన్ చల్లడం వల్ల ఒక చీమ కనుక్కున్న దారి ఇతర చీమలకి తెలిసిపోతుందని కిందటి పోస్ట్ లో చూశాం. ఈ చిన్న పద్ధతి సహాయంతో ఆహార వనరులకి అతిదగ్గరి దారులని చీమలు ఎలా కనుక్కుంటాయో చూద్దాం.A అనే బిందువు వద్ద రెండు చీమలు ఉన్నాయని అనుకుందాం. B అనే బిందువు వద్ద కొంత ఆహారం ఉంది. A, B లని కలుపుతూ ఒక దగ్గరి దారి, S, మరో చుట్టు దారి L ఉన్నాయని అనుకుందాం. S ని అనుసరించి ఒక చీమ A నుండి B కి వెళ్లి తిరిగి వచ్చే దారిలో ఫిరొమోన్ చల్లుకుంటూ వచ్చింది. రెండవ...

పొద్దున్నే కాఫీ కలుపుదామని వంటగదిలోకి అడుగుపెట్టిన అర్చనకి రాత్రికి రాత్రి మీద వంటింటి గోడల మీద ప్రత్యక్షమైన ఈ కొత్త గీతలు ఎక్కణ్ణుంచి వచ్చాయో అర్థం కాలేదు. చంటాడికి గోడ మీద పెన్సిల్ తో విసుర్లు విసిరే అలవాటు ఉంది గాని వాడి రేంజి రెండు అడుగుల ఎత్తుని మించి పోదు. కాని ఈ గీతలు చూరు నుండి నేల దాకా విస్తరించి ఉన్నాయి. కాస్త దగ్గరికెళ్లి చూసింది. గీతలు నిశ్చలంగా లేవు. సంచలనంగా కదులుతున్నాయి, సజీవంగా మసలుతున్నాయి. అయ్యబాబోయ్! చీమలు! రాత్రికి...
postlink