
ఫ్లాగిస్టాన్ సిద్ధాంతాన్ని నమ్మిన మరి ఇద్దరు రసాయన శాస్త్రవేత్తలు ఆ కాలంలో వాయువులకి సంబంధించిన మరింత ముందుకి తీసుకువెళ్లారు. వారిలో ఒకరు హెన్రీ కావెండిష్ (1731-1810). మనిషి మహా ప్రతిభావంతుడే గాని కాస్త తలతిక్క మనిషి. ఎన్నో రంగాలలో కృషి చేసినా తను కనుక్కున్న విషయాలని తనలోనే దాచుకునేవాడు. కనుక్కున్న ప్రతీ విషయాన్ని ప్రచురించేవాడు కాడు. అదృష్టవశాత్తు వాయువుల మీద తను సాధించిన ఫలితాలని మాత్రం ప్రచురించాడు. ఆమ్లాలు కొన్ని లోహాలతో చర్య జరిపినప్పుడు...
నిన్న ఆంధ్రభూమిలో ప్రచురించబడ్డ వ్యాసంhttp://www.andhrabhoomi.net/intelligent/egere-vehangalu-...

వివరాల కోసం:Manchipustakam.in...

నిన్న ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం - http://www.andhrabhoomi.net/intelligent/computer-075సృజనాత్మకత, అభినివేశం మొదలైన మానసిక లక్షణాల ప్రమేయం లేకుండా ఇచ్చిన ఆదేశాలని తుచ తప్పకుండా అనుసరిస్తూ, ఆ క్రియలని మానవసాధ్యం కానంత వేగంతో, స్థాయిలో అమలుచేస్తూ, వర్తమాన ప్రపంచంలో కంప్యూటర్ మనిషికి చేదోడువాదోడుగా ఉంటోంది. అయితే ఇచ్చిన పనినే కేవలం స్వామిభక్తితో చెయ్యకుండా, కంప్యూటర్ కి దానికంటూ ఒక బుద్ధి, వివేచన, మనసు ఉండి స్వతంత్రంగా వ్యవహరిస్తే ఏమవుతుంది?...
ప్రస్తుతం జపాన్ దేశం పడుతున నరక యాతన చూస్తే బాధ కలుగుతుంది. అంత సున్నితమైన, అందమైన జాతికి ఇలాంటి అధోగతి పట్టడం అన్యాయం అనిపిస్తుంది. గత రెండేళ్లలో రెండు సార్లు జపాన్ ని సందర్శించే అవకాశం కలిగింది. మొత్తం మూడు నెలల మకాం. ఇండియాలో ఎప్పుడూ మన బాహ్య వ్యవహారాలు, మన ప్రజా వ్యవస్థలు ఎందుకంత గందరగోళంగా ఉంటాయి? ఎందుకు అంత తరచు విఫలం అవుతూ ఉంటాయి? ఇంత జనాభా ఉంటే మరి ఇలాగే ఉంటుందేమో అని సరిపెట్టుకుంటూ ఉంటాను. కాని జపాన్ ని చూశాక ఆ అభిప్రాయం తప్పని అర్థమయ్యింది. అది కేవలం ఓ కుంటిసాకని తెలిసింది. జనాభా సాంద్రత చూస్తే జపాన్ లో చదరపు కి.మీ.కి...
కార్బన్ డయాక్సయిడ్ తో తన ప్రయోగాలు కొనసాగించాడు బ్లాక్. కొవ్వొత్తి కార్బన్ డయాక్సయిడ్ లో మండదని మొదట కనుక్కున్నాడు. మూసిన పాత్రలో మండే కొవ్వొత్తిని ఉంచితే అది కాసేపు అయ్యాక ఆరిపోతుంది. ఆ తరువాత పాత్రలో మిగిలిన గాలి జ్వలన క్రియని పోషించలేకపోతుంది. జ్వలనం వల్ల ఏర్పడ్డ కార్బన్ డయాక్సయిడే దానికి కారణం అన్నట్టు అనిపించింది. అయితే పాత్రలో మిగిలిన గాలి నుండి రసాయనాల సహాయంతో కార్బన్ డయాక్సయిడ్ ని తొలగించినా కూడా కొంత గాలి మిగిలిపోవడం కనిపించింది. కార్బన్ డయాక్సయిడ్ ని తొలగించినా మిగిలిన వాయువు కూడా జ్వలనాన్ని పోషించదని అర్థమయ్యింది.ఈ...
మొన్న సోమవారం ఆంధ్రభూమిలో అచ్చయిన వ్యాసం యొక్క లింక్http://www.andhrabhoomi.net/intelligent/einstein-medadu-rahasyam-151వ్యాసం v\:* {behavior:url(#default#VML);} o\:* {behavior:url(#default#VML);} w\:* {behavior:url(#default#VML);} .shape {behavior:url(#default#VML);} Normal 0 false false false false EN-US X-NONE X-NONE ...
ఈ దిశలో మరో అడుగు ముందుకు వెళ్లినవాడు జోసెఫ్ బ్లాక్ (1728-99) అనే స్కాటిష్ రసాయనికుడు. 1754 లో అతడు వైద్యంలో పట్టం పుచ్చుకునేందుకు గాను ఒక థీసిస్ వ్రాశాడు. ఒక రసాయనిక సమస్యని ఆ థీసిస్ లో అంశంగా తీసుకున్నాడు. (ఖనిజవిజ్ఞానం, వైద్యం బాగా సన్నిహితంగా ఉండే రోజులవి). 1756 లో అతడు తన పరిశీలనలని ప్రచురించాడు. బ్లాక్ సున్నపురాయిని (limestone, calcium carbonate) తీసుకుని దాన్ని బాగా వేడి చేశాడు. దాంతో కార్బనేట్ విభేదన చెంది ఏదో వాయువును వెలువరించింది. సున్నం (calcium oxide) మాత్రం మిగిలింది. అలా వెలువడ్డ వాయువుని మళ్లీ కాల్షియమ్ ఆక్సయిడ్...

ఇటీవల (మార్చ్ 7) ఆంధ్రభూమిలో అచ్చయిన మా వ్యాసానికి లింక్.http://www.andhrabhoomi.net/intelligent/lopala-883అచ్చయిన వ్యాసంలో కొన్ని దోషాలు ఉన్నాయి. కనుక ఆ దోషాలు లేకుండా వ్యాసాన్ని కింద ఇస్తున్నాం.)ఒక పొడవాటి (ఉదాహరణకి 20 cm X 3 cm) కాగితం బద్దని తీసుకోండి. ఇప్పుడు దాని రెండు కొసల అంచులు ఒక దగ్గరికి తెచ్చి అంటిస్తూ, అంటించే ముందు ఒక కొసని ఒకసారి మెలిక తిప్పి అంటించాలి (క్రింద చిత్రం). ఎన్నో అధ్బుతమైన గణిత లక్షణాలు, విచిత్రమైన ప్రయోజనాలు...

అధ్యాయం 4వాయువులుకార్బన్ డయాక్సయిడ్ – నైట్రోజెన్జ్వలన క్రియ జరిగేటప్పుడు పదార్థం యొక్క భారంలో కనిపించిన విడ్డూరమైన వ్యత్యాసాలకి కారణం ఆ ప్రక్రియలో పుట్టిన, లేక మాయమైన వాయువులేనని త్వరలోనే అర్థమయ్యింది. ఒక శతాబ్ద కాలం క్రితం, అంటే ఫాన్ హెల్మాంట్ తొలి ప్రయోగాలు చేసిన కాలం నుండి, వాయువులకి సంబంధించిన పరిజ్ఞానం నెమ్మదిగానే వృద్ధి చెందుతూ వచ్చింది. స్టాల్ కాలంలో కూడా వాయువులు ఉన్నాయని గుర్తించడం తప్ప, వాటిని ఎలా కొలవాలో, ఎలా పరిగణనలోకి తీసుకోవాలో...
తుప్పుకి, జ్వలన క్రియకి మధ్య ఒక తేడా అయితే తప్పకుండా ఉంది. జ్వలనంలో ఉండే జ్వాల తుప్పులో లేదు. కాని దానికి కారణం జ్వలనం జరిగేటప్పుడు మండే పదార్థం లోంచి ఫ్లాగిస్టాన్ ఎంత వేగంగా బయటికి పోతుందంటే, ఆ ధాటికి దాని పరిసరాలు వేడెక్కగా, ఆ వేడిమే జ్వాలగా వ్యక్తం అవుతోంది, అని భావించాడు స్టాల్. కాని తుప్పు పట్టేటప్పుడు ఫ్లాగిస్టాన్ మెల్లమెల్లగా బయటపడుతుంది. అందుచేత మంట కనిపించదు. ఇదీ వాదన.ఇలాంటి వాదనల పట్ల బోర్హావే విమర్శల మాట ఎలా ఉన్నా పద్దెనిమదవ శతాబ్దంలో ఫ్లాగిస్టాన్ సిద్ధాంతానికి బాగా ప్రాచుర్యం పెరిగింది. 1780 కల్లా ప్రపంచ వ్యాప్తంగా...

నిన్న సోమవారం నాడు ఆంధ్రభూమిలో ప్రచురితమైన వ్యాసం.ఇమేజ్‌పై నొక్కితే పెద్దగా కనిపిస్తుంది.
...
postlink