
అరవింద్ గుప్తా రాసిన 'The Story of Solar Energy' అనే కామిక్ బుక్ యొక్క అనువాదం నిన్ననే పూర్తయ్యింది.పుస్తకం చివర్లో సూర్యుడి మీద ఓ తమాషా పద్యం ఉంది. దాని అనువాదం ఇక్కడ ఇస్తున్నాను.సూర్యస్తుతిశక్తి నిపుణులుఅరుస్తుంటారుఅయిపోతాయనిబొగ్గు, చమురు. హిమధృవాలు కరుగుతాయని,గడ్డు కాలం వచ్చేస్తోందని.జపనీస్ అణు సంస్థలుఅంతే లేని అవస్థలు.కరెంటు పోతే చెప్పాపెట్టకఫరవాలేదు బెంబేలు పడకఉచితంగా రవిశక్తి వాడుకోహాయిగ వంటలు వండుకోగాలిని పట్టి బంధించుఇంట్లో దీపం...

అతి క్రూరంగా ప్రవర్తించి జామొరిన్ మీద, స్థానికుల మీద ప్రతీకారం తీర్చుకున్న వాస్కో ద గామా మార్చ్ 5, 1503, నాడు తిరిగి పోర్చుగల్ కి పయనమయ్యాడు. సెప్టెంబర్ 1 నాడు నౌకాదళం లిస్బన్ ని చేరుకుంది. మహారాజు మాన్యుయెల్ వాస్కో కి ఘనస్వాగతం పలికాడు. పెద్ద మొత్తంలో ధనం బహుమానంగా ఇచ్చి ఆదరించాడు. ఈ డబ్బుతో వాస్కో ద గామా ఎవోరా లో ఓ పెద్ద భవంతి కట్టుకున్నాడు. అయితే ఏనాటికైనా తన చిన్ననాటి ఊరు ‘సైన్స్’ (Sines) ని సొంతం చేసుకోవాలన్న కల మాత్రం తన మదిని వీడలేదు....

కొన్ని సార్లు గదిలో ఒంటరిగా ఉన్న సమయంలో కూడా అదే గదిలో మరెవరో కూడా ఉన్నారనిపిస్తుంది. మనకి తెలియకుండా గదిలో మరెవరో అదృశ్య వ్యక్తి ఉన్నారన్న ఊహకే ఒళ్లు జలదరిస్తుంది. కొందరు ఇది వట్టి భ్రాంతి అని కొట్టిపారేస్తే, మరి కొందరు ఇది దయ్యాలు, భూతాలు ఉన్నాయని తెలిపే ఆధారం అనుకుని బెదురుతుంటారు.కాని ఈ విచిత్రమైన అనుభూతిని అర్థం చేసుకునే విషయంలో నాడీవిజ్ఞానం కొంత పురోగతి సాధించింది. స్విట్జర్లాండ్ లో ‘ఎకోల్ పాలితెక్నీక్ ఫెదరాల్ ద లోసాన్’ (EPFL) అనే...

ప్రతుల కోసంమంచిపుస్తకం ప్రచురణలుప్రచురణ కర్త - సురేష్ కొసరాజు (kosaraju.suresh@gmail.c...

ప్రతుల కోసం:Address: Manchipustakam Publications H.No 12-13-450, Street No:1, Tarnaka, Secunderabad- 500 017.kosaraju.suresh@gmail....

భూమికి మల్లె అక్కడా దట్టమైన వాతావరణం ఉంటుంది. ఆ వాతావరణంలో పుష్కలంగా నైట్రోజెన్ ఉంటుంది. అక్కడా ఆకాశంలో మబ్బులు ఉంటాయి. ఆ మబ్బులు వర్షిస్తుంటాయి. చక్రికంగా మారే ఋతువులు ఉంటాయి. నదులు, సముద్రాలు ఉంటాయి. ఎత్తైన తిన్నెలు, పర్వతాలు ఉంటాయి. కాని పోలిక అక్కడితో ఆగిపోతుందండోయ్! ఎందుకంటే అక్కడి మబ్బులు వర్షించేది నీరు కాదు. ద్రవ రూపంలోని మీథేన్. అక్కడి పర్వతాలలో ఉండేది రాయి కాదు, రాతి కన్నా కఠినమైన ఘనీభవించిన నీరు. మనం ప్రస్తావించే విచిత్ర లోకం...

అంతరిక్షం నుండి భూమి ఫోటోలు తియ్యాలంటే ఏ శాటిలైట్ ద్వారానో సాధ్యం అవుతుంది. లేదాఓ రాకెట్ నుంచో, షటిల్ నుంచో తియ్యాలి. కాని కేవలం $150 (Rs 7500) ఖర్చుతోఅంతరిక్షం నుండి భూమిని ఎలా ఫోటోలు తియ్యారో కనిపెట్టారు. ఆ కనిపెట్టింది ఏ తలలు పండినశాస్త్రవేత్తలో కారు. అమెరికాలో ఎమ్. ఐ.టి విశ్వవిద్యాలయంలో చదువుకునే ఇద్దరు విద్యార్థులు.జస్టిన్ లీ, ఆలివర్ యే అనే ఆ విద్యార్థులు రూపొందించిన విధానానికి కావలసిన సరంజామా చాలాసింపుల్! సాఫ్ట్ డ్రింక్స్ చల్లగా ఉంచుకోవడానికి...

దృగ్గోచర కాంతి మితి – 10వ క్లాసు పాఠంలో దోషాలు91 పేజీలో“ 1 ల్యూమెన్ = 1 ఎర్గ్/సె/స్టెరేడియన్/ కాండెలా/స్టెరేడియన్ అవుతుంది” – (1)అని వుంది. ఈ సూత్రం తప్పు.ల్యూమెన్ = కాండెలా X స్టెరేడియన్, (2)అన్నది సరైన సూత్రం.పై సూత్రం అచ్చుతప్పు అయ్యుంటుంది అనుకోవాలా?1 ల్యూమెన్ = 1 ఎర్గ్/సె = కాండెలా X స్టెరేడియన్, (3)అని వుండాల్సింది అలా తప్పుగా అచ్చయ్యింది అనుకొవాలా? కాని (3) కూడా పూర్తిగా సరైనది కాదు.ల్యూమెన్ కి ఎర్గ్/సె (=సామర్థ్యం లేదా power) కి...

ఈ పోస్ట్ లో రాండీ పాష్ రాసిన ‘Last Lecture’ అన్న పుస్తకం నుండి ఒక వృత్తాంతాన్ని వర్ణిస్తాను. రాండీ పాష్ కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో ప్రొఫెసర్ గా ఉండేవాడు. 2008 లో పాంక్రియాటిక్ కాన్సర్ తో మరణించాడు. తన చివరి రోజులలో రాసిన Last Lecture అనే ఆత్మకథకి చాలా మంచి పేరు వచ్చింది.అందులో ఒక అధ్యాయంలో రాండీ ఒక కోర్సులో తన స్టూడెంట్లతో జరిగిన అనుభవాన్ని వర్ణిస్తాడు. కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే చాలు విద్యార్థులు తమకి మామూలుగా...

అధ్యాయం 15 ఎట్టకేలకు స్నెఫెల్ పర్వతంఐదువేల అడుగుల ఎత్తున్న పర్వతం స్నెఫెల్. దీనికి రెండు శిఖరాగ్రాలు ఉన్నాయి. ఈ ద్వీపం మీద స్ఫుటంగా కనిపించే ట్రాకైటిక్ పర్వతశ్రేణికి ఒక కొసలో ఉందీ పర్వతం. మేం ఉన్న చోటి నుండీ చూస్తే ధూసరవర్ణపు ఆకాశపు నేపథ్యంలో ఈ పర్వతపు రెండు తలలు పొడుచుకొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఆ శిరస్సులకి ఎవరో హిమాభిషేకం చేసినట్టు పక్కల నుండి తెల్లని మంచు జాలువారుతోంది.ఇక ఇక్కడి నుండి దారి ఇరుకుదారి. అందరం ఓ వరుసలో ముందుకి సాగాం. మా...

దృగ్గోచర కాంతి మితి అన్న అంశం మీద లోగడ ఒక పోస్ట్ లో (http://scienceintelugu.blogspot.com/2011/12/blog-post_13.html)నీటి ప్రవాహానికి, కాంతి ప్రవాహానికి మధ్య పోలిక గురించి చెప్పుకున్నాం. నీటి ప్రవాహం విషయంలో మూడు భావనలని పరిచయం చేశాము. అవి – ప్రవాహం – దీన్ని cc/sec (క్యూసెక్కులు) లో కొలుస్తాం.తీవ్రత = ప్రవాహం/కోణం. ఇది జనకం యొక్క ‘తీవ్రత’ని తెలుపుతుంది.“ధాటి” = తీవ్రత/r. ధాటి అన్నది జనకం యొక్క తీవ్రత బట్టి పెరుగుతుంది, జనకం నుండి దూరం బట్టి...
postlink