http://magazine.maalika.org/2012/03/17/%e0%b0%a4%e0%b1%86%e0%b0%b2%e0%b1%81%e0%b0%97%e0%b1%81%e0%b0%b2%e0%b1%8b-%e0%b0%b8%e0%b1%88%e0%b0%a8%e0%b1%8d%e0%b0%b8%e0%b1%8d-%e0%b0%ab%e0%b0%bf%e0%b0%95%e0%b1%8d%e0%b0%b7%e0%b0%a8%e0%b1%8d/
postlink
Science in Telugu
శ్రీనివాస చక్రవర్తి గారూ,నమస్కారం.
చాలా వివరంగా, విస్తారంగా వ్రాసారు పై వ్యాసం. మీరన్న ఈ విషయాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
౧. రావణాసురుడి భార్య సీత అని రాస్తే రామాయణాన్ని గౌరవించేవారు ఎలా విలవిలలాడతరో, వైజ్ఞానిక నియమాలకి ఉప్పుపాతర వేస్తూ కథలు రాస్తుంటే సైన్స్ ని గౌరవించేవారు ఎంతైనా నొచ్చుకుంటారు మరి.
౨.అదృష్టాన్ని నమ్మినంత సులభంగా స్వశక్తిని, గొప్ప పట్టుదలతో, ప్రతిభతో కూడుకున్న స్వయంకృషిని నమ్మం. ఇలాంటి జీవనం సోమరుల స్వర్గం.
౩.నియమాలని నమ్మం కనుక అడ్డదోవలు తొక్కనిదే పని అసాధ్యం అనుకుంటాం. అందుకే మనం ఎంత వేగంగా వ్యవస్థలని నిర్మించుకుంటామో, అంతే వేగంగా వాటిని చేతులార సర్వనాశనం చేసుకుంటాం.
౪.ప్రతీ ఫలితానికి అందుకు అవసరమైన పరిశ్రమ చెయ్యక తప్పదు. ప్రతీ ఫలానికి చచ్చినట్టు మూల్యం చెల్లించక తప్పదు. చవకగా, ఉచితంగా ఏదీ దక్కదంటుంది. శాస్త్రీయ దృక్పథాన్ని స్వీకరించాలంటే వ్యక్తిత్వం ఉండాలి, నిజాయితీ ఉండాలి, దమ్ముండాలి.
౫.అధ్యాత్మిక విషయాలకి వైజ్ఞానిక సంజాయిషీ వెతికే ప్రయత్నం కూడా విఫలం అనిపిస్తుంది. అలాంటి ప్రయత్నం వల్ల అధ్యాత్మికతని దిగజార్చుకోవడం తప్ప మరేమీ ఉండదు.
చాలా మంచి వ్యాసం అందించినందుకు ధన్యవాదాలు.
మీరు చెప్పిన విదానం చలాబాగుంది మనస్సుకు హత్తుకునేటట్టు రాశారు . అయితే ప్రజలు అవి నమ్మడానికి సైన్సు గురించి తెలియదు అనుకొవాలా? అంతరిక్షంలొకి రాకెత్ పంపటాని స్రీహరికొట (పేరు గుర్తు లేదు) ప్రధాన అధికారి శ్రీ వెంకటేస్వర స్వామి ద్గ్గరికిపొయి విజయవంతం కావాలని మొక్కుకున్నానని తిరుమల కొండపైన చెప్పినాడు అది టీవీలలొను, పేపర్లలొను, వచ్చింది . మరి దీనికిఏమంటారు. మతాన్ని గాని సమాజంలొని మరేఇతర సమస్యను అర్దంచెసుకొవాలన్నా వర్గాల దగ్గరికి వెల్లాలి (పెట్టుబడిదారీ వర్గం, కార్మిక వర్గం) నేడు మతం ఒక వ్యాపారంగా మారిపొఇంది ఆవ్యాపారంలొ కొట్ల ఆదాయం వస్తుంది ప్రభుత్వమే దానికి పండగలకీ, ఉత్సవాలకీ, గణనీయమైన మొత్తంలొ కర్చు చేస్తుంది ఇదంతా బుద్దిపుర్వకంగానే చెస్తుంది .ఇది ప్రబుత్వం ద్వారాజరిగే పని .ఇక ప్రజలలొ నమ్మకాలు. ఒక నిర్దిష్ట మైన సమాజంలొ ఒక నిర్దిష్టమైన ఆచార వ్యెవహారాలు నమ్మకాలు, ఆ సమాజ అభివ్రుద్దిస్తాయినిపట్టి వుంటాయి .పుర్వం తక్కువకులాల వారిని చాలా హీనంగా చుచెవారు. ఉదా…………… ఊరిలొకివచ్చెటప్పుడు చెప్పులు వేసుకొకుడదు వాళ్ళనీడ గొడలకు తగలకుడదు మొహానికి ముంత కట్టుకొవలి ఇలాగ చెప్పాలంటె ఎనైనా వుంటాయి . ఒక డాక్టరు తక్కువకులాల వారిని చెతితొ తాకడు .ఆ మనిషికి సైన్సు తెలియదు అనుకొవాలా? మొదటిది చుపుకి ఆ మనిషికి ఆచారవ్యెవహారాలు నరనరాన జీర్నించుకపొయి వుంటాయి కనుక ఆ మనిషికి సైన్సు ఎంతతెలిసినా దానినుంచి బైట పడలేడు దానికి స్వలాభం కుడా ఒక కారణం . మన ఇంకొంచం లొతుకు వెళ్ళి పరిసీలిస్తె సమాజంలొ మనుషుల మద్య అసమానతలే కారణంగా కనపడుతుంది . ఒక వ్యెక్తి పరిచ్చలలొ పాసైతె వెట్రుకలు ఇస్తానని ముక్కుకుంటాడు .,మరొక వెక్తి ఉద్వొగము వస్తె ఇస్తానని ముక్కుకుంటాడు ఆ సమస్యలలొ దేవుడి అనిర్వర్యంగా నమ్ముకుంటాడు .సమాజంలొ వ్యెక్తి గత ఆస్తివుండటం వలన ఒకొక్కరివి వ్యెక్తిగత సమస్యలైపొయినాయి యవరివీలును బట్టి వాళ్ళు పరిస్కారాలు వెతుకుంటువుంటారు.
సైన్సు ను విస్రుతంగా వినియొగించుకొగలిగితె దారిద్యం పొతుందన్నారు ఆస్తి కొద్దిమంది చెతులలొ పొగుపడి వుంది ఎంత వినియొగించుకున్నా అది వాళ్ళకు లాభాలను తెచ్చిపెడుతుంది .
రాధేశ్యామ్ గారు, ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
రామ్ మోహన్ గారు, నిజమే అసమానతలు పెరుగుతున్నాయి. ఐతే అందరికీ సమానంగా పంచడానికి అంతో ఇంతో వీలున్న ధనం ఒక్కటే - అది జ్ఞానం. ఇంటర్నెట్ యుగంలో అది కొంత వరకు సాధ్యం అని మనకి తెలుసు. అయితే ఆ పరిజ్ఞానం స్థానిక భాషల్లో లేకపోతే అది ఉన్నా లేనట్టే.
అందుకే తెలుగులో పనికొచ్చే సాహిత్యాన్ని, సమకాలీన ప్రపంచం గురించి నేర్పే సాహిత్యాన్ని విస్తృత స్థాయిలో పెంచితే ఈ అసమానతలు కొంతవరకు తగ్గుతాయని ఓ నమ్మకం. ఆ జ్ఞానం అనే సోపానాన్ని పట్టుకుని ఎవరికి వారే పైకి ఎక్కే, ఎదిగే ప్రయత్నం చేస్తారు.