శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.



అయినా కాటన్ నిరుత్సాహం చెందలేదు. 1881 లో మడ్రాస్ ప్రెసిడెన్సీలో ఒక సదస్సులో తన భావాల గురించి మరొక్కసారి ప్రస్తావించాడు. ఆ ప్రసంగంలో భారతీయ నదులని కలిపేందుకు ఒక విస్తృత పథకాన్ని ఆ సదస్సు ముందు ఉంచాడు.

“కలకత్తా నుంచి [గుజరాత్ లో వున్న] కుర్రాచీ వరకు [ఒక శాఖ విస్తరిస్తుంది] – అది గంగా లోయ వెంట, జమునా, సట్లెజ్ నదుల ఉత్పత్తి స్థానాల మీదుగా, ఇండస్ లోయ వెంట కుర్రాచీ వరకు విస్తరిస్తుంది.



ఇందులో అతి కఠినమైన భాగం ఇప్పటికే నిర్మించబడింది. అదే శ్రీహింద్ కాలువ. ఇది సట్లెజ్ ని జమునతో కలుపుతుంది. అలాగే గోదావరిని పొడిగిస్తూ తపతిని గోదావరితో కలిపితే, కోకనాడ [కాకినాడ] నగరానికి సూరత్ కి మధ్య జలమార్గం ఏర్పడుతుంది. తుంగభద్ర, కాల నదీ లోయల వెంట సాగుతూ దార్వార్ వద్ద నదీ ఉత్పత్తి స్థానాన్ని దాటి (2000 అడుగుల ఎత్తున్న ఈ స్థానాన్ని జయించడం అతి కష్టం) కార్వార్ నగరం వద్ద సముద్రాన్ని చేరుకోవాలి. అలాగే నీలగిరులకి దక్షిణాన ఉన్న పాలఘాట్ నుండి బయల్దేరి, పొనాని లోయ మీదుగా సాగుతు, కోయమ్బత్తూర్ లో 1400 అడుగుల ఎత్తున్న నదీ ఉత్పత్తి స్థానాన్ని దాటాలి.



ఇక బెంగాల్ నుండి వచ్చే ‘తీర కాలువ’, కలకత్తా నుండి కేప్ కామొరిన్ (కన్యాకుమారి) వరకు (తూర్పు తీరం మీదుగా) విస్తరించి, అక్కణ్ణుంచి పశ్చిమ తీరం వెంట కార్వార్ వరకు విస్తరించాలి. ఈ కాలువ నిర్మాణం అతి తక్కువ ఖర్చుతో జరిగే అవకాశం వుంది. అంతేకాక ద్వీపకల్పం (peninsula) ప్రాంతం అంతా విస్తరించబోయే కాలువలు – మద్రాస్ నుండి బయల్దేరి కర్నాటక ప్రాంతం ద్వారా సాగుతూ పొనాని వరకు విస్తరించేది, మద్రాస్ నుండి బయల్దేరి నెల్లూర్ మీదుగా సాగుతూ, సీడెడ్ జిల్లా ద్వారా కార్వార్ వరకు విస్తరించేది, గోదావరి, వార్దాల మీదుగా తపతి వెంట సూరత్ వరకు విస్తరించేది – వీటన్నిటినీ కూడా సులభంగా నిర్మించడానికి వీలవుతుంది. వాటి వల్ల దక్కబోయే ఫలితంతో పోల్చితే వాటి నిర్మాణానికి అయ్యే ఖర్చు అత్యల్పం.



ఈ కాలువల వల్ల వేల మైళ్ళ పొడవున్న జలమార్గాలు దేశంలో నలుమూలలని కలుపుతాయి.



ఇది కాకుండా ఓ చుట్టుగీతని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇది శ్రీరంగపట్నంలో ఉండే కావేరి నుండి బయల్దేరి మైసూరు, సీడెడ్ జిల్లా మీదుగా, హైదరాబాద్ మీదుగా, గోదావరి మీదుగా ఎగువ ప్రాంతాల కేంద్రం వరకు విస్తరిస్తుంది. ఈ విధంగా తూర్పు-పడమర దిశలలో విస్తరించి వున్న కాలువలని, నదులని తీరం వెంట విస్తరించే కాలువలతో కలపడం వల్ల, దేశంలోని అంతరంగ ప్రాంతాలని ఇరు పక్కల తీర ప్రాంతాలతో కలపడానికి వీలవుతుంది. అలాగే (ఇటు తూర్పున ఉన్న) కలకత్తాని, గంగా తలాల మీదుగా (అటు పడమరన ఉన్న) పంజాబ్ తో కలపడానికి వీలవుతుంది.



లాహోర్ నుండి కార్వార్ వరకు, అంటే 3000 మైళ్ళ దూరం మీదుగా, ఒక టన్ను సరుకులని మోసుకుపోవడానికి 1/20 పెన్నీలు అవుతుంది. అంటే మైలుకి 6 రూపాయల చొప్పున ధాన్యం ఖర్చులో 10% మాత్రమే అవుతుంది.



ఈ రకమైన జల వ్యవస్థ వల్ల రవాణా రంగంలో ఈ ఉపయోగాలతో పాటు నీటి పారుదల లో కూడా అత్యుత్తమ సత్ఫలితాలు అందనున్నాయి.”

(ఇంకా వుంది)

http://www.mapsofindia.com/maps/india/india-river-map.htm

4 comments

  1. anrd Says:
  2. కాటన్ మహాశయుడు విదేశీయులైనా కూడా ఈ దేశప్రజలకు ఎంతో సహాయం చేసారండి. ఇటువంటి వ్యక్తులు ఎంతో గొప్పవారు.

     
  3. నిజమే. విదేశీయుడైనా మన దేశ భౌగోళిక వ్యవస్థ గురించి అంత క్షుణ్ణంగా తెలుసుకుని, మన దేశానికి మేలు చెయ్యడం కోసం శ్రమించడం చాలా గొప్ప విషయం.

     
  4. Anonymous Says:
  5. దేశ నదుల అనుసంధానం అనేది కవితావేశం అనుకున్నా... కె.ఎల్.రావు కన్నా ముందు కాటన్ దొరగారు ఈ ఆలొఛన ప్రవేశపెట్టారా! నిజంగా వర్కవుట్ అవుతుందా? ఎందుకంటున్నానంటే... జీవనదుల్లోనే నీళ్ళు చాలట్లేదు, పైగా గంగను హైద్రాబాద్ దాకా తెస్తే ఇమిరిపోగా చివరకు మిగిలేది అన్నది వేధించే ప్రశ్న. కాటన్ దొర ఇవన్నీ ఆకాలానికి లెక్క కట్టారో లేదో.

     
  6. Anonymous Says:
  7. ఈ ఐడియా అభినందణీయమే కానీ ఆచరణీయం కాదు. ఇది మింగేసే డబ్బు, మానవ వనరులు, శ్రమ, టైమూ అన్నీ లెక్కేసుకుంటే అనుసంధానం లేక మనం కోల్పోతున్నదానికంటే ఎక్కువ అనిపిస్తుంది.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts