శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

జన్యు శాస్త్రం 1

Posted by V Srinivasa Chakravarthy Monday, October 15, 2012
రసజ్ఞ గారు (http://navarasabharitham.blogspot.in/) తెలుగు బ్లాగ్ ప్రపంచంలో సుపరిచితులు. ‘జన్యు శాస్త్రం’ మీద ధారావాహికంగా కొన్ని వ్యాసాలు రాయడానికి ఆమె ముందుక్కొచ్చారు. దీం తరువాత మరి కొన్ని అంశాల మీద కూడా రాస్తానని హామీ ఇచ్చారు! ఇలాగే మరి కొందరు శాస్త్ర విజ్ఞానం గురించి రాయడానికి ముందుకొస్తే బావుంటుంది.


జన్యు శాస్త్రం మీద ధారావాహికలో ఇది మొదటి పోస్ట్…



---

జన్యు శాస్త్రం 1

రచయిత్రి - రసజ్ఞ

జీవుల ప్రాథమిక లక్షణాలు - పెరుగుదల, పోషణ మరియు ప్రత్యుత్పత్తి. ప్రతీ జీవీ తన సంతానాభివృద్ధి కోసం పాటు పడటం సహజం. ఆ క్రమములోనే తన వంశాన్ని కొనసాగిస్తూ వంశాభివృద్ది చేసుకుంటుంది. విత్తు ఏది వేస్తే మొక్క అదే వస్తుంది, పులి కడుపున పులే పుడుతుంది అన్నట్టుగా వాటి జాతి లక్షణాలను తరువాత తరాలకి పంచుతాయి జీవులు. వీటినే పోలికలు అంటారు. అలాగే గాడిదకి గుఱ్ఱానికి కంచర గాడిద పుడుతుంది. ఇందులో క్రొత్తగా పుట్టిన కంచర గాడిదలో మనకి అటు గాడిద జాతి లక్షణాలూ, ఇటు గుఱ్ఱం జాతి లక్షణాలూ రెండూ కనిపిస్తాయి. ఇందులో పోలికలూ (గాడిదతో పోల్చుకుంటే), విభేదాలూ (గుఱ్ఱంతో పోల్చుకుంటే) కూడా ఉన్నాయి కదా! పోలికలు లేదా విభేదాలు ఒక తరం నుండీ తరువాతి తరానికి ఎలా వస్తాయో చెప్పే శాస్త్రాన్నే జన్యుశాస్త్రం అంటారు.



ఇప్పుడంటే మనకి సాంకేతిక విజ్ఞానం బాగా అభివృద్ధి చెందటం వలన జన్యువులు, జన్యుశాస్త్రం అనే పదాలు వాడుతున్నాము కానీ, ఇవన్నీ తెలియక మునుపు ఈ పేర్లు ఎలా వచ్చాయి, ఈ జన్యుశాస్త్రం అనే శాఖ నుండీ మరికొన్ని సంబంధిత శాఖలు ఎలా ఏర్పడ్డాయి అనే విషయాలను చెప్పుకునేముందు ఈ జన్యుశాస్త్రానికి ఎనలేని సేవలను అందించిన మహనీయులని ఒకసారి తలుచుకుంటూ అంచెలంచెలుగా ఒక్కో విషయాన్నీ ఎలా వెలుగులోనికి తీసుకువచ్చారో చూద్దాము.



తల్లిదండ్రుల లక్షణాలు పిల్లలకు సంక్రమించడాన్ని"అనువంశికత" (inheritance) అంటారు. ఈ అనువంశికత ఎలా వస్తుంది అన్న విషయం తెలుసుకోవటం కోసం చాలా రకాల సిద్ధాంతాలను ప్రతిపాదించారు.



1. ఆవిరి మరియు ద్రవ సిద్ధాంతాలు :

పైథాగరస్ 500 బి.సి.లో పిల్లలకి తండ్రి పోలిక ఎలా వస్తుందో వివరిస్తూ స్త్రీ, పురుషుల కలయిక సమయంలో పురుషుని దేహములోని ప్రతీ అవయవము నుండీ వెలువడే ప్రత్యేకమయిన, తేమతో కూడిన ఆవిరే కారణమని చెప్పారు.



అరిస్టాటిల్ 350 బి. సి. లో ప్రత్యుత్పత్తి పదార్థము తల్లిదండ్రులలోని అన్ని భాగాల నుండీ సేకరించబడుతుందనీ, తల్లి సేకరించిన పదార్థానికి తండ్రి నుండి సేకరించిన పదార్థము చైతన్యమును కలుగచేసి జీవిగా మారుస్తుందనీ వివరించారు.



ఈ రెండు సిద్ధాంతాలలోనూ తండ్రిదే ప్రధాన పాత్రగా చూపారు.

2. ప్రీ – ఫార్మేషన్ (preformation) సిద్ధాంతాలు :

లియోనార్డో డావిన్సీ (1452 - 1519) పిల్లలలో ఉండే లక్షణాలకు తల్లిదండ్రులిద్దరూ సమానంగా అనువంశిక పదార్ధాన్ని అందిస్తారని చెప్పాడు కానీ ఆ పదార్ధం ఏమిటో చెప్పలేకపోయాడు.



లీవెన్ హాక్ 1677లో సూక్ష్మదర్శని సహాయముతో పురుష సంయోగ బీజాలయిన శుక్ర కణాలను కనుగొని, స్త్రీ - పురుష సంయోగ బీజాల కలయిక గురించి ప్రస్తావించాడు.



Swammerdam 1679లో పురుష సంయోగ బీజాలలో ఒక సూక్ష్మ ప్రాణి(హోమంకులస్, homunculus) ఉంటుందనీ, అది మాతృ గర్భంలోనికి ప్రవేశించాక జీవిగా వృద్ధి చెందుతుందని వివరించాడు. సూక్ష్మ ప్రాణి తల్లి గర్భంలోనికి ప్రవేశించే ముందే ఏర్పడుట వలన దీనిని ప్రీ - ఫార్మేషన్ సిద్ధాంతము అన్నారు.



హార్ట్సేకర్ 1695లో హోమంకులస్ సూక్ష్మ ప్రాణి ఊహా చిత్రాన్ని సూచించాడు. ఆ ప్రకారముగా, పురుష సంయోగ బీజము యొక్క శీర్ష భాగములో ప్రాణి ఉండి, తోక వంటి పరభాగము ఉంటుంది.



మరికొంతమంది మాత్రం ఈ సూక్ష్మ ప్రాణి అండములో ఉండి పురుష సంయోగ బీజముతో కలిసాక జీవిగా వృద్ధి చెందుతుందని అభిప్రాయ పడ్డారు.



Kolreuter - సంయోగ బీజాలు అనువంశికతకు భౌతిక ఆధారాలని (పరాగ రేణువులు - అండముల కలయికను పొగాకు మొక్కలలో) కనుగొన్నాడు.



ఫ్రెడరిక్ వొల్ఫ్ (Caspar Friedrich Wolff)  – ఎపిజెనెసిస్ (epigenesis) సిద్ధాంతాన్ని (1738 - 1794) ప్రతిపాదించాడు. పురుష - స్త్రీ సంయోగ బీజాల కలయిక తరువాత ఏర్పడిన జీవ పదార్థము మాత్రమే దేహాన్ని ఏర్పరచగలదని వివరించాడు.



మొత్తానికి వీటన్నిటిలోనూ ఆధునిక సిద్ధాంతానికి దగ్గరగా ఉన్నది మాత్రం వాల్ఫ్ చెప్పిన ఎపిజెనెసిస్ సిద్ధాంతం మాత్రమే!



3. అనువంశిక రేణువుల సిద్ధాంతాలు (Particulate theories of inheritance) : అనువంశికతను కలుగచేసే పదార్థము రేణువుల రూపంలో ఉండుట వలన వీటికి ఆ పేరు వచ్చింది.



Maupertuis (1689 - 1759) - జనకులు జన్యు పదార్థాన్ని రేణువుల రూపంలో అందిస్తారనీ, ఫలదీకరణ (fertilization) జరిగాక స్త్రీ నుండి ఎక్కువ రేణువులు వస్తే అమ్మాయి,పురుషుడి నుండీ ఎక్కువ రేణువులు వస్తే అబ్బాయి పుడతారని, ఈ విధంగా లింగ నిర్ధారణ జరుగుతుందనీ చెప్పారు.



లామార్క్ (1744 - 1829) పొడవుగా సాగిన జిరాఫీ మెడను ఉదాహరణగా చూపిస్తూ తల్లిదండ్రులు తాము సంపాదించుకున్న లక్షణాలను పిల్లలకి అందిస్తారని ప్రతిపాదించాడు. సరైన ఆధారాలు చూపలేకపోయినందున దీనిని ఎవ్వరూ ఆమోదించలేదు.



చార్లెస్ డార్విన్ అనే ప్రకృతి శాస్త్రవేత్త 1838లో అనువంశికతను కలిగించు రేణువులకు పాన్ జీన్లు (వీటినే జెమ్యూల్స్ అని కూడా అంటారు) అని పేరు పెట్టాడు. ఇవి ప్రతీ అవయవము నుండీ ఏర్పడే అతి సూక్ష్మ రేణువులు. ఇవి రక్తము ద్వారా ప్రత్యుత్పత్తి అవయవాలకు చేరి, సంయోగ బీజాలుగా మారి ఫలదీకరణం జరుపుతాయని వివరించాడు. ఈ పరికల్పనకు ఆధారం 400బి.సి. లో హిప్పోక్రేట్స్ ప్రతిపాదించినది.



(ఇంకా వుంది)

11 comments

  1. Unknown Says:
  2. This comment has been removed by the author.  
  3. Sravya V Says:
  4. Nice Intro ! Wish could read more interesting series ! Rasajna good luck !

     
  5. Anonymous Says:
  6. చిన్నిఆశగారు ఏ కామెంటు రాసినా క్షుణ్ణంగా భట్రాజులా పొగుడుతారు. అన్ని భాగాలు పరిపొర్ణణ్గా పొగడాలని, పొగడబోయే కామెంట్లకోసం విసుగెత్తినా ఎదురు చూస్తాము

     
  7. Anonymous Says:
  8. అనానిమస్ బాబాయ్ అంత కుళ్ళేంటి? నీ బ్లాగ్ ఎంటొ చెప్పు పోని చిన్ని ఆశ కి అక్కడికొచ్చి నిన్ను మోసేయమని చెప్తాను;) పండగ చేస్కుందు గానీ..

     
  9. Anonymous Says:
  10. టపా చదవి అందులో బాగా నచ్చిన ఆంశాన్ని చెప్పవచ్చు కాని, టపా చదవకుండా ఇలా చిరతలుచ్చుకుని 'హరిల్లో రంగ హరీ అని శాస్త్రవిజ్ఞానం లాంటి బ్లాగుల్లో కూడా వదలక వెంటపడటం అంత అవసరమా, అనామక బామ్మర్ది?;) ముత్యాలముగ్గులో రావ్గోపాల్రావ్ అరేంజ్మెంట్ చూశావా బామ్మర్ది?

     
  11. Unknown Says:
  12. This comment has been removed by the author.  
  13. Anonymous Says:
  14. ఇలాంటి ఉబుసుపోని పనికిమాలిన పొగడ్తలు ఎవరినో ప్రోత్సహిస్తాయి అనడం మీ భ్రమ. వ్యక్తిగతమైన అతి పొగడ్తలతో అ వ్యక్తికి బాగానే వుండొచ్చు కాని చూచే వారికి చిరాకు తెప్పించకమానవు. ఇలాంటి చెత్త పొగడ్తలను ప్రచురించడం, అసలైన శాస్త్రవేత్తల కనీస పేరు కూడా లేకుండా అలసట లేని పొగడ్తలు వారిని , వారి అవిష్కారాలను పరిహసించడమే.

     
  15. Anonymous Says:
  16. మీకు తెలియని విషయాలు చెప్పినంత మాత్రాన ఆవేశపడిపోయి ఇలా తెగబడి పొగడటం అంత మచి పద్దతి కాదు, ఆవేశాన్ని కొంచెం అదుపులో పెట్టుకొమ్మని మా విన్నపం.

     
  17. వ్యాసంతో సంబంధం లేకుండా కామెంట్ల మీద కామెంట్ చెయ్యడం మానుకోవలసిందని మనవి. ఇకపై అలాంటి కామెంట్లు తొలగించబడతాయి.
    అలాగే వ్యాసరచయితని ఊరికే పొగిడి అక్కడితో ఆపేయకుండా, వ్యాఖ్యాతలు వ్యాసాంశాన్ని కూడా చర్చిస్తూ మాట్లాడితే ఇంకా బావుంటుంది.

     
  18. Anonymous Says:
  19. dear sir can we find any link with genitic science and astro (jyothish)science .I hope there is a strong link between these two sciences .

     
  20. vagdevi Says:
  21. manchi vishayalu enno chebutunnamduku thanks andi

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts