శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.
అలాగే ఒకసారి లార్డ్ స్టాన్ హోప్ (Lord Stanhope)(చరిత్రకారుడు) ఇంట్లో మకాలే (Macaulay)ని కలుసుకున్నాను. ఆయన మాటలు వినే సదవకాశం దొరికింది. చూడగానే చాలా నచ్చారు. ఆయన పెద్దగా మాట్లాడలేదు. అయినా అలాంటి వాళ్లు ఎక్కువగా మాట్లాడరు కూడా. ఇతరులు మాట్లాడిస్తే మాట్లాడేవారు అంతే.


మకాలే జ్ఞాపకశక్తి ఎంత కచ్చితంగా, ఎంత సంపూర్ణంగా ఉంటుందో ఋజువు చెయ్యడానికి లార్డ్ స్టాన్ హోప్ ఒక వృత్తాంతం చెప్పారు. లార్డ్ స్టాన్ హోప్ ఇంట్లో ఎంతో మంది చారిత్రకులు సమావేశం అవుతుండేవారు. కొన్ని కొన్ని అంశాలు చర్చిస్తూ కొన్ని సందర్భాలలో మకాలే తో విభేదించేవారు. సందేహం వచ్చినప్పుడు ఎవరిది నిజమే తేల్చుకోడానికి పుస్తకాలు తిరగేసేవారు. కాని లార్డ్ స్టాన్ హోప్ గమనించింది ఏంటంటే క్రమంగా ఆ పద్ధతి మారిపోయింది. చారిత్రకులు పుస్తకాలు చూడడం అనవసరం అని అర్థం చేసుకున్నారు. ఎందుకంటే మకాలే చెప్పిందే ప్రతీ సారి నిజమయ్యింది.

మరో సారి కూడా లార్డ్ స్టాన్ హోప్ ఇంట్లో జరిగిన ఓ సమావేశానికి వెళ్లాను. ఎంతో మంది చారిత్రకులు, సాహితీకారులు వచ్చారు. అక్కడే మోట్లీ (Motley)ని, గ్రోట్ (Grote) ని కలుసుకున్నాను. భోజనం తరువాత చీవెనింగ్ పార్క్ లో మోట్లీ తో పాటు ఓ గంట సేపు షికారుకి వెళ్లాను. ఆయన నిరాడంబరత, కల్ల కపటం లేని ప్రవర్తన నాకు బాగా నచ్చాయి.

చాలా కాలం క్రితం చారిత్రకుడు ‘ఎర్ల్’ యొక్క తండ్రితో కలిసి భోజనం చేశాను. ఆయన ఓ విచిత్రమైన మనిషి. కాని బాగా నచ్చాడు. ముక్కుకు సూటిగా, స్నేహపూర్వకంగా మాట్లాడే స్వభావం ఆయనది. చామన ఛాయగా ఉంటాడు. ప్రస్ఫుటమైన ముఖ కవళికలు ఉంటాయి. నేను చూసిన రోజు గోధుమ రంగు బట్టలు వేసుకున్నాడు. ఇతరులకి నమ్మశక్యం కాని విషయాలని కూడా అమాయకంగా నమ్మే మనిషి. ఓ రోజు నాతో అన్నాడు – “ఇదుగో చూడు, నువ్వు ఈ భౌగోళిక శాస్త్రం, జంతు శాస్త్రం మొదలైన పనికిమాలిన కాలయాపన అంతా పక్కన పెట్టి తంత్రవిద్య లోకి దిగరాదూ?” ఆ పక్కనే వున్న లార్డ్ మహోన్ ఆ మాటలు విని అదిరిపోయాడు. సౌందర్యరాశి అయిన ఆయన సతీమణికి కూడా ఆ మాటలు వినోదం కలిగించినట్టు ఉన్నాయి.




ఇక చివరగా కార్లైల్ (Carlyle, పై చిత్రం) గురించి చెప్తాను. మా తమ్ముడి ఇంట్లో ఎన్నో సార్లు ఈయన్ని కలుసుకున్నాను. రెండు, మూడు సార్లు ఆయన మా ఇంటికి కూడా వచ్చారు. ఆయన మాటల్లో మంచి పదును ఉంటుంది, ఆసక్తికరంగా ఉంటాయి. కాని ఆయన రచనలలో లాగానే ఒకే అంశం మీద ఆగకుండా మాట్లాడుతూనే ఉంటాడు. మా తమ్ముడి ఇంట్లో ఓసారి ఓ తమాషా విందు జరిగింది. ఆ విందుకి చాలా మంది ప్రముఖులు వచ్చారు. వారిలో బాబేజ్, లయల్ లు కూడా వున్నారు. ఇద్దరికీ మాట్లాడడం అంటే ఇష్టమే. కాని కార్లైల్ మాత్రం నిశ్శబ్దం వల్ల జరిగే మేలు గురించి ఏకధాటిగా మాట్లాడుతూ మరెవ్వరికీ మాట్లాడే అవకాశం లేకుండా చేశాడు. భోజనం తరువాత బాబేజ్ (మనసులోనే తిట్టుకుంటూ) నిశ్శబ్దం మీద అంత పెద్ద ఉపన్యాసం ఇచ్చినందుకు కార్లైల్ కి సభాముఖంగా కృతజ్ఞతలు తెలిపాడు.



కార్లైల్ అందరినీ చిన్నచూపు చూసేవాడు. ఓసారి మా ఇంటికి వచ్చినప్పుడు ఆయన గ్రోట్ రాసిన “చరిత్ర” గురించి మాట్లాడుతూ అది “ ‘కుళ్ళిన మురికి గుంట, అందులో అధ్యాత్మిక సారం అనేది లేనే లేదు” అన్నాడు. ఆయన రాసిన ‘జ్ఞాపకాలు’ (reminiscences) పుస్తకం అచ్చయిన దాక ఆయన పరిహాసం అంతా విందుల్లో వినోదం కలిగించే సాధనాలు అనుకున్నానే గాని, ఇప్పుడు నాకు సందేహం కలుగుతోంది. ఆయన ఔదార్యం నిజమే అయినా దాని మీద నల్లని అసూయ చారలు ఉన్నట్టు అనిపిస్తుంది. మనుషుల స్వభావాలని సునిశితంగా, సజీవంగా చిత్రించే ఆయన అసమాన శక్తి మాకలే ప్రతిభ కన్నా గొప్పదని ఎవరూ సందేహించలేరు. కాని ఆ చిత్రాలు సత్యమైనవా కావా అన్నదే ఇక్కడ ప్రశ్న.


కాని మనుషుల మనసుల్లో కొన్ని మౌలిక నైతిక సత్యాలు ముద్రపడేలా చెయ్యడంలో ఆయన శక్తి అమోఘం. కాని అదే విధంగా బానిసత్వం మీద ఆయన అభిప్రాయాలు వింటే అసహ్యం కలుగుతుంది. ఆయన దృష్టిలో బలవంతుడు చేసిందే సరైనది. ఆయన తృణీకరించిన వైజ్ఞానిక విభాగాలని పక్కన పెట్టినా కూడా, ఆయనది సంకుచిత మనస్తత్వం అని చెప్పొచ్చు. అలాంటి వాణ్ణి పట్టుకుని శాస్త్రపురోగతి సాధించడానికి తగ్గ అర్హత గల వాడని కింగ్ స్లీ (Kingsley) పొగడడం ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. వెవెల్ (Whewell) లాంటి గణితవేత్త కాంతి మీద గోథే (Goethe) వ్యక్తం చేసిన భావాలని వెలకట్టగలడు అంటే వెక్కిరింతగా నవ్వాడాయన. హిమానీనదాలు (glaciers) అసలు కదులుతాయా లేదా, కదిలితే వేగంగా కదులుతాయా, నెమ్మదిగా కదులుతాయా మొదలైనవన్నీ పనికిమాలిన తాపత్రయాలని హేళన చేసేవాడు. వైజ్ఞానిక పరిశోధనకి ఇంతగా అనర్హమైన మనసు గల మనిషిని ఇంతవరకు నేను ఎక్కడా చూళ్లేదు.

(ఇంకా వుంది)

0 comments

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts