శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

రచన – రసజ్ఞ



వైదిక ఆచారం ప్రకారం మనిషి పుట్టుక, జీవనంలోని వేరు వేరు దశలు, చావు అన్నీ దేవుడి చేత నుదుటిపై లిఖింపబడి ఉంటాయి అంటారు కానీ వాస్తవానికి ఒక మనిషికి సంబంధించినది ఏదయినా సరే మొత్తం సమాచారమంతా జన్యు చిప్ (Gene chip) రూపంలో నిక్షిప్తం అయ్యి ఉంటుంది. పిల్లల రంగు,ఎత్తు, ఆరోగ్యం అన్నీ కూడా తల్లిదండ్రుల నుండి, తాతముత్తాతల నుండి పిల్లలకు సంక్రమించే జన్యువుల మీదనే ఆధారపడి ఉంటాయి. పిల్లల పుట్టుకకు సంబంధించిన ఈ వీడియోచూడండి. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక కొన్ని విషయాలను తెలుసుకుంటూ మనకున్న అపోహలను తొలగించుకోవాలి.

కుంకుమ పువ్వుతో పిల్లలు తెల్లగా పుడతారా?

గర్భిణీ స్త్రీలకు పుట్టబోయే పిల్లలు మంచి రంగుతో పుట్టాలని కుంకుమ పువ్వు తినిపించటం లేదా పాలల్లో కలిపి పట్టించటం మనం చూస్తూనే ఉంటాం. నిజంగానే కుంకుమ పువ్వుకి ఇంతకముందే నిర్దేశింపబడిన జన్యువులని మార్చే శక్తి ఉందా? అని ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే శిశువు శరీర రంగుని నిర్ణయించేవి జన్యువులు. మేని ఛాయను నిర్ణయించేది బహుళ జన్యువుల పరస్పర చర్య (polygenic interaction) మరియు సంచాయిక ప్రభావము (cumulative effect). Nelson and Ehley అను శాస్త్రవేత్తలు ఈ శరీర రంగుకి సంబంధించిన పరిశోధనల కోసం నీగ్రోలకు అమెరికన్లకు సంపర్కం జరిగేలా చేసి బహిర్గత జన్యువుల సంఖ్య ఆధారంగా మనిషి రంగు నిర్ణయింపబడుతోంది అని కనుగొన్నారు. వీరి ప్రయోగాల ప్రకారము నీగ్రోలలో నాలుగు బహిర్గత జన్యువులు (మెలనిన్ హెచ్చు స్థాయిలో ఉన్నవి), కొంచెం నలుపు తక్కువగా ఉన్నవాళ్ళల్లో మూడు బహిర్గత జన్యువులు (dominant genes), చామనఛాయగా ఉన్నవాళ్ళల్లో రెండు బహిర్గత జన్యువులు, తెల్లగా ఉన్నవాళ్ళల్లో ఒక బహిర్గత జన్యువు, బాగా తెల్లగా ఉండే అమెరికన్ల వంటివారిలో అసలు బహిర్గత జన్యువులే లేకుండా అన్నీ అంతర్గత జన్యువులే (recessive genes) ఉన్నాయనీ ప్రయోగాత్మకంగా నిరూపించారు.దీనిని బట్టీ రంగుని నిర్ణయించేది జన్యువులే అని స్పష్టమవుతున్నది కనుక కుంకుమ పువ్వు వాడినంత మాత్రాన పిల్లలు తెల్లగా పుడతారు అనేది ఒక అపోహే అని తెలుస్తున్నది కదా! (కుంకుమ పువ్వుకి జన్యువులని మార్చే శక్తి లేదు కానీ గర్భస్థ శిశువులో శ్లేష్మం (mucus) పేరుకోకుండా చూసుకుంటూ బిడ్డని ఆరోగ్యంగా ఉంచుతుంది కనుక రంగు కోసం కాకుండా మామూలుగా (పరిమిత మోతాదులో) తీసుకుంటే మంచిది. *)

1) Principles of Genetics by E. Sinnut, L. Dunn and T. Dobzhansky - Pages 142 to 144 (Telugu edition)
2) Genetics by B.D.Singh, Kalyani publishers – Pages 226 to 229
3) http://fx.damasgate.com/the-nature-of-disease-and-the-doctrine-of-the-four-humors/



(*ఈ విషయం మనం సాంప్రదాయబద్ధంగా నమ్మే విషయం కావచ్చు గాని, నాకు తెలిసి ఆధునిక వైద్య విజ్ఞానంలో దీనికి ఋజువు లేదు. ఆధునిక వైద్యానికి తెలీనంత మాత్రాన అది నిజం కాదని కాదు. కనుక ఆ వాక్యాన్ని బ్రాకెట్స్ లో పెట్టడం జరిగింది. ఈ విషయం మీద ఎవరికైనా మరింత సమాచారం తెలిస్తే నలుగురితో పంచుకోగలరు. – శ్రీనివాస చక్రవర్తి)





పుంసవనం వలన మగపిల్లలు పుడతారా?

పున్నామ నరకం నుండి తప్పించేవాడు పుత్రుడు కనుక కొడుకు పుట్టవలెనన్న బలీయమయిన కోరికతో గర్భస్థ శిశువు యొక్క మూడు లేదా నాల్గవ నెలలో పుష్యమీ నక్షత్రం రోజున పుంసవనం అనే కార్యక్రమం జరపటం ఒక సాంప్రదాయం. ఈ కార్యక్రమంలో మఱ్ఱి ఆకులను పచ్చి ఆవుపాలతో కలిపి బాగా నూరించి(పదేళ్ళ లోపు ఆడపిల్లలతో), వేదమంత్రాల నడుమ, వీణా నాదాలతో గర్భిణీ స్త్రీ యొక్క ముక్కు కుడి రంధ్రములో సిల్కు గుడ్డ ద్వారా (వాతావరణ గాలి సోకకుండా జాగ్రత్తగా) పోస్తారు.ఇది చూసిన/విన్న వెంటనే మళ్ళీ అదే ప్రశ్న తలెత్తుతుంది, వీటికి (మఱ్ఱి ఆకులు, పచ్చి ఆవుపాలు) ఇంతకముందే నిర్దేశింపబడిన జన్యువులని మార్చే శక్తి ఉందా? అని. ఎందుకంటే మనం ముందుగానే జన్యుశాస్త్ర చరిత్రలో చెప్పుకున్నట్టుగా లింగ నిర్ధారణ చేసేవి జన్యువులు కదా! పైగా మూడు, నాలుగు నెలలప్పుడు అంటే అప్పటికి శిశువు లింగ నిర్ధారణ జరిగిపోయి,ఎదుగుదల కూడా మొదలవుతుంది. కనుక పుంసవనం తదితర కార్యక్రమాల ద్వారా మగ పిల్లలు పుడతారనేది కూడా అపోహే.

(మరయితే మఱ్ఱి ఆకులను పచ్చి ఆవుపాలతో కలిపి నూరిన లేహ్యం ఏమి చేస్తుంది? అంటే ఈ లేహ్యం గర్భస్థ పిండం చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి, గర్భాశయంలో ఉండే ఇతరేతర పదార్ధాల ద్వారా కలిగే చెడు ప్రభావాలేమీ పిండం మీద పడకుండా ఒక రక్షణ కవచంలా ఉంటుంది. అదే కాక, ప్రసవ సమయములో బిడ్డ క్రింది వైపుకు చురుకుగా కదలడానికి కూడా సహాయపడుతుంది. శిశువు బయటకి వచ్చేసిన తరువాత వాతావరణములోని ఆక్సిజనుతో కలిసి ఘనీభవించటం వలన కత్తెర అవసరం లేకుండానే ఈ పొర శిశువు నుండీ వేరుగా వచ్చేస్తుంది. కనుక ఈ పుంసవన కార్యక్రమం వలన మగపిల్లలు పుడతారు అనే హామీ లేకపోయినా పిల్లలకి ఎటువంటి హానీ ఉండదు, పైపెచ్చు మంచిదే అని కూడా శాస్త్రవేత్తలు నిరూపించటం వలన ఈ కార్యక్రమం చేయించుకోవటం వలన వచ్చే ప్రమాదమయితే లేదు. **)

1) Sushrutha - The book of Sushruta Samhita

2) https://www.trsiyengar.com/id156.shtml

3) http://www.exoticindia.es/article/hindu-samskaras/

4) http://www.dalsabzi.com/Books/Hindu_customs/childbirth_pg1.htm

(**ఇది కూడా సాంప్రదాయక విషయమే. ఆయుర్వేదంలో దీనికి ఏవైనా వివరణ ఉందేమో గాని, నాకు తెలిసి ఆధునిక వైద్య విజ్ఞానంలో దీనికి ఋజువు లేదు. ఈ విషయం మీద ఎవరికైనా మరింత వైజ్ఞానిక సమాచారం తెలిస్తే నలుగురితో పంచుకోగలరు. – శ్రీనివాస చక్రవర్తి)





పుట్టిన పిల్లలలో లోపాలన్నీ జన్యుపరమయినవేనా?

పిల్లలలో లోపాలకు అధిక శాతం జన్యువులే కారణమయితే, ఇతర కారణాలు కూడా ఉంటాయి. పుట్టిన పిల్లలకి వచ్చిన/వచ్చే ప్రతీదీ జన్యుపరమయినవి కానవసరం లేదు.



గర్భములో శ్వాసక్రియ సరిగా అందని పిల్లలకి 1940లో బాహ్యముగా ఆక్సిజన్ అందించి శ్వాసక్రియా ప్రమాణాలను సరిచేయగలిగారు. కానీ 1953లో బాహ్యముగా ఇచ్చే ఆక్సిజన్ స్థాయిని పెంచినపుడు పిల్లలు అంధులు అవటం గమనించారు. అదే విధముగా 1954లో ఆక్సిజన్ స్థాయి సమతుల్యతతో ఉన్నప్పుడు రెటినా (Retina) మామూలుగా పెరగటాన్నీ, ఆక్సిజన్ స్థాయి పెరిగినప్పుడు రెటినా pre mature స్థాయిలో ఉండటాన్నీ, ఆక్సిజన్ స్థాయి తగ్గినప్పుడు మెదడుకి హాని కలిగి, పిల్లలు జీవాన్ని కోల్పోతున్నారని తెలిసింది. Bill Silverman అనే శాస్త్రవేత్త 2004లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రయోగాత్మకంగా అందించారు. బాహ్యముగా అందించే ఆక్సిజన్ వలన కూడా పిల్లలకి ఇంత ప్రమాదం పొంచి ఉందనమాట!

1) Environmental Influences on Gene expression by: Ingrid lobo, Ph.d (Write science right) (c) 2008 Nature Education, citation: Lobo,1.(2008) Environmental influences on gene expression, Nature education
2) Silver man W.A. A cautionary tale about supplemental oxygen the albatross of neonatal medicine pediatrics 113, 394 to 396 (2004)
3) http://www.jameslindlibrary.org/essays/cautionary/silverman.pdf
4) http://www.neonatology.org/classics/parable/ch04.html



అలాగే గర్భము దాల్చిన తొలి నెలలలో వేవిళ్ళు (Morning sickness) సర్వసాధారణం. ఈ వేవిళ్ళను నియంత్రించడానికి 1950లలో ఒక మందు (Thalidomide) వాడేవారు. 1961లో ఈ మందు వాడటం వలన వంకరపోయిన చేతులు, పొట్టిగా (మరగుజ్జులా) ఉండే కాళ్ళతో పిల్లలు పుట్టడమే కాక అధిక మోతాదులో వాడటం వలన పిల్లలు చనిపోవటం కూడా జరుగుతోందని కనుగొన్నారు. పిండాభివృద్ధి (embryonic development) జరిగేటప్పుడు ఈ మందు - సంబంధిత కణములను సరిగా అభివృద్ది చెందనీయకపోవడమే దీనికి కారణం.

1) Environmental Influences on Gene expression by: Ingrid lobo, Ph.d (Write science right) (c) 2008 Nature Education, citation: Lobo,1.(2008) Environmental influences on gene expression, Nature education.
2) Bartlett, J.B, et al. The evolution of thalidomide and its IMID. derivatives as anti cancer agents; nature reveiews, Cancer 4, 314 to 320 (2004)



వీటిని బట్టీ జన్యులోపాలు లేకపోయినా కూడా పిల్లలు పుట్టేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి అని తెలుస్తున్నది కదా!



12 comments

  1. Anonymous Says:
  2. Nonsense

     
  3. anrd Says:
  4. నిజమేనండి. జన్యులోపాలు లేకపోయినా కూడా పిల్లలు పుట్టేదాకా చాలా జాగ్రత్తగా ఉండాలి .
    ..........

    నాకు తెలిసినంతలో కొన్ని విషయాలను రాస్తున్నానండి.


    శిశువు శరీర రంగుని నిర్ణయించేవి జన్యువులు. అనే విషయం నిజమేనండి. అయితే,
    జన్యువులపై ఆహారం యొక్క ప్రభావం కూడా ఉంటుందనిపిస్తుంది.

    1. ఉదా..ఆజానుబాహులైన పెద్దవాళ్ళు ఉన్న వంశాలలోని పిల్లలైనా, చిన్నతనం నుంచి సరిపడా ఆహారం తీసుకోకుంటే , సరైన పోషకాలు అందని కారణంగా వారు పీలగా , పొట్టిగా, ఎదగని శరీరాలతో ఉండే అవకాశం ఉంది.

    ( ఇక్కడ జన్యువుల ప్రభావం కన్నా తీసుకునే ఆహారం యొక్క ప్రభావమే శరీరంపై ఎక్కువగా కనిపిస్తోంది. )

    ఈ ఉదాహరణను పరిశీలిస్తే తీసుకునే ఆహారం యొక్క ప్రభావం శరీరంపై ఎంతో ఉంటుందని తెలుస్తోంది. అలాగే , బహుశా కుంకుమ పువ్వులో శరీరానికి తెల్లటి చాయ ఇచ్చే లక్షణం ఉండి ఉండవచ్చు.

    2. గర్భిణీ స్త్రీకి చక్కటి ఆహారాన్ని ఇవ్వటం ద్వారా పుట్టబోయే బిడ్డకు జన్యుపరంగా సంక్రమించే వ్యాధులను అరికట్టవచ్చేమో ? ఆధునిక విజ్ఞానం కూడా తల్లి కడుపులో ఉండగానే బిడ్డకు ఏర్పడే జన్యు వ్యాధులను గుర్తించి , వ్యాధిని తగ్గించే ప్రయత్నాలను చేస్తోంది కదా!

    ఉదా...ఆస్త్మా వంటి జబ్బులున్న వంశాలలోని స్త్రీలు గర్భం ధరించినప్పుడు, " చ్యవనప్రాశ " వంటి ఔషధాలు తగు మోతాదులో వాడటం వల్ల పుట్టబోయే పిల్లలకు ఆ వ్యాధి వచ్చే అవకాశాలు కొద్దిగా తగ్గుతాయని నా అభిప్రాయం.
    ...........

    " శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి చరిత్ర ' .... గ్రంధములో గర్భధారణ గురించిన ఎన్నో విషయాలను తెలియజేసారు.
    ..............

    " ఆరోగ్య సుధాకరము " అనే గ్రంధంలో ప్రకృతి వైద్యులు వ్రాసిన కొన్ని విషయాలను ఇక్కడ రాస్తున్నానండి.....గర్భిణి తీసుకునే ఆహారం వల్ల పుట్టబోయే బిడ్డల శరీరచాయ మారే అవకాశం ఉందని తెలియజేసారు.

    తెల్లని శరీరచ్చాయ గల బిడ్డలు పుట్టాలంటే, కొబ్బరి, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ , మామిడి .... వంటి పండ్లను ఎక్కువగా తినాలి. అన్నము కొద్దిగా తగ్గించి కూరలు అధికంగా తినాలి. పులుపు, ఉప్పు కారములను వీలైనంత వర్జించాలి.

    పచ్చళ్ళు, ఉప్పు కారములు, మసాలాలు ఉన్న పదార్ధాలు వంటి తామసాహారం వల్ల నల్లని బిడ్దలు కలుగుతారని సుశ్రుతుని శరీరశాస్త్రం చెబుతోంది.


    అయితే తల్లితండ్రుల దేహచ్చాయలను బట్టి , మనోతత్వములను బట్టి గూడా శరీరచ్చాయలలో తేడాలుండవచ్చును. వంశానుగతంగా వచ్చే జన్యుజనిత లక్షణములను బట్టి కూడా చాయలలో మార్పులుండవచ్చును.

    కాని ఆహారప్రభావము మాత్రము బిడ్డల మీద ప్రధానంగా ఉండునని నా స్వానుభవంలో చెప్పే సత్యవాక్కు.

    ఉదా...మావద్ద సంతానము లేక ప్రకృతిచికిత్స చేసి సంతానమును కన్న అనేకమంది నల్లని దంపతులకు కూడా తెల్లని బిడ్డలు పుట్టుట జరిగినది.
    ..............

    ( అయితే, వైద్యులు తినమన్నారు కదా అని , మరీ పళ్ళరసం మాత్రమే అదేపనిగా తీసుకున్నా, " c " విటమిన్ ఎక్కువై సమస్య వచ్చే అవకాశం ఉందని నాకు అనిపించిందండి. ఏదైనా తగినంత మోతాదులో తినాలి. )
    ............

    రుతుమతియైన స్త్రీ .. సరిదినములలో ( 4,6,8 10, 12 ) గర్భధారణ జరిగినచో మగబిడ్డలు, బేసిదినములలో ( 5, 7, 9, 11, 13 ) గర్భధారణ జరిగినచో ఆడపిల్లలు పుట్టుదురని చెప్పుదురు.

    14, 15, రోజుల తరువాత గర్భధారణ జరుగదనియు, ఒకవేళ జరిగినా అనారోగ్యకరమైన బిడ్దలు పుడతారని..... ఇలా ఎన్నో విషయాలను పెద్దలు తెలియజేసారు.
    ..............

    పుంసవనం వలన మగపిల్లలు పుడతారా?.....మీరు వ్రాసిన ఈ ప్రక్రియను గమనిస్తే, బహుశా మూడవ నెలలో పిండం యొక్క ఆడ బిడ్డ లేక మగ బిడ్డ అనే లక్షణాలను ప్రభావితం చేసే లేక మార్చే ప్రక్రియలు కూడా పూర్వీకులకు తెలుసునేమో ? అనిపిస్తోంది.

     
  5. Anonymous Says:
  6. Dr. Srinivas, do you want to make this "Science" blog like another other "Religious Science" blog? For that, there are tens of such blogs in the telugu blogsphere, you dont need one more. Please stop this nonsense here.

     
  7. Anonymous Says:
  8. Please don't let "anrd" propagate her pseudoscience here. Let her do that in her own blog.

     
  9. Anonymous Says:
  10. అజ్ణాత,
    ఆమే చెప్పినదానిలో తప్పేమిలేదు. ఎప్పుడో ముక్కి పోయిన కాలం నాటి న్యుటన్, ఐన్ స్టిన్ సైన్స్ ఇంకా సైన్స్ అని నమ్ముతున్నట్లు ఉన్నారు. అవి పాతబడి చాలా రోజులయ్యాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తం గా ఎక్కువ గా మైండ్,కాన్షియస్ నెస్ మీద పరిశొధనలు చేస్తున్నారు. శాస్రవేత్తలు ఎప్పుడైతే వాటి మీద ప్రయోగాలు చేయటం మొదలు పెట్టారొ ఆసైన్స్ సూడో సైన్స్ గా మారుతుంది. మైండ్,కాన్షియస్ నెస్ కి ఆది అంతం లేదు. వాటిని 1000 కోణాలలో పరిశిలీంచి 1000 సిద్దాంతలను, అన్ని నిరూపణలను చేయవచ్చు.

     
  11. Anonymous Says:
  12. ఎప్పుడో ముక్కి పోయిన కాలం నాటి న్యుటన్, ఐన్ స్టిన్ సైన్స్ ఇంకా సైన్స్ అని నమ్ముతున్నట్లు ఉన్నారు
    -----
    సైన్సు మక్కి పోడమేమిటయ్యా అజ్ఞాత మహాశయా!!! పైథాగరస్, ఆర్కిమిడీస్ BCల్లో చెప్పినవి ఇప్పటికీ పనిచేస్తున్నాయి కదా.
    అవేమన్న సర్కారు రేషన్ షాపులో ఇచ్చే సబ్సిడీ బియ్యమా!

     
  13. Anonymous Says:
  14. పని చేయట్లేదని అనలేదు. సైన్స్ పేరు తో మనిషి చేసే అన్వేషణ అంతా చివరికి నాకేమిటి లాభం అనేదే లక్ష్యంగా ఉంట్టుంది. అచ్చంగా సైన్స్ ను ప్రేమించే వారు అందులో లాభం లేకపోతే ఎవరు ఉండరు.
    సున్నా ఎలా కనుకొన్నాడు, న్యుటన్/ ఐన్ స్టిన్ సిద్దంతాలగురించి ఎంత తెలుసుకొన్నా (సైన్స్ చరిత్ర)దాని వలన ఎవరికి ఇప్పుడు ఆర్ధిక లాభం ఉండదు, కనుకనే సైన్స్ పేరు చెప్పుకొని కొత్త విషయాలు కనుకొనే మిషతో, నేటి శాస్రవేత్తలు టేక్నాలజి అభివృద్దిచేసుకొని అమ్ముకొంట్టుంటారు. ఇప్పుడు సైన్స్ వలన టేక్నాలజి రూపంలో ప్రభుత్వాలకు,వ్యాపారులకు, డబ్బులు అధికారం ఉన్న వారికి లాభాలు, మేలు జరుగుతున్నాది గదా! ఈ సైన్స్ & టెక్నాలజి అని గొప్పగా చెప్పుకొనే ప్రతి ఒక్కటి మొదట మిలటరి అవసరాలు తీర్చడానికి కనుకొన్నవేగదా! సైన్స్ మీద ప్రేమ తో దానిని అధ్యాయనం లాభం లేకపోతే ఎవరు చేయరు. అలా ఎవరైనా చేసేరు అంటే వాడు అయాన్ రాండ్ ఫౌంటెన్ హేడ్ నవలలో హీరో గురువు గారిలాగా దుర్భర దారిద్రం తో పేరు ప్రఖ్యాతులు లేకుండ బతుకును వేళ్లదీయాల్సిందే.

    ఇలా రాసి మీలాంటి వారిని నిరుత్సాహ పరచటం ఉద్దేశం కాదు. సైన్స్ & టేక్నాలజి వలన కలిగే లాభాలను, ప్రతి ఒక్కరు వారి వారి స్థాయిలను బట్టి దానిని స్వప్రయోజనాలకు వాడుకోవలని చూస్తారు. ప్రభుత్వాలు యుద్దాల కోసం,వ్యాపారులు వర్క్ ఫోర్స్ తగ్గించి, కంపెని ఎఫ్ఫెక్టివ్ గా పని చేయటం కోసం ఉపయోగించుకొంటారు. సామాన్యులు తమకు తెలిసిన విషయాలను సైన్స్లో ఎలా చెప్పారు అని పోల్చి చూసుకొంటారు. పాపం, ఆమే ఎవరో ఆమేకి తెలిసిన జ్ణానం తో ఇంటార్ ప్రిట్ చేస్తే దానిని సూడో సైన్స్ అని అంట్టున్నారు. మీరు రాసే వ్యాసాలన్నిటి లక్ష్యం కనీసం సామాన్య ప్రజలలో సైన్స్ గురించి అవగాహన పెంచటం లక్ష్యం కనుక అటువంటి గృహిణుల ఆసక్తిని నిరుత్షాహ పరచకండి. తిన్నగా మీస్థాయిని అందుకొంటారు.
    నేను రాసిన దానిలో ఎమైనా తప్పులు ఉంటే ఒగ్గేయండి.

     
  15. Anonymous Says:
  16. ఆమె చెప్పిందీ ఓ సైంటిఫిక్ స్టడీ లాంటిదే.
    ఎన్ని అర్థంలేని సైటిఫిక్ స్టడీలు రావట్లేదు, పోవట్లేదు. మొన్నటి వరకూ రోజుకు 8గ్లాసులు నీళ్ళు తాగాలి అనేవారు, నిన్న TOIలో అబ్బే అది నిజం కాదు అన్నారు. కొరియా సైంటిస్ట్ స్టెమ్ సెల్స్తో ఏదేదో చేసేస్తా అంటే ఆకాశానికి ఎత్తేశారు, ఆ తరువాత అతనో ఫ్రాడ్ అని బయట పడింది, జైల్లో వూచలు లెక్కెట్టుకున్నాడు.

     
  17. anrd Says:
  18. This comment has been removed by the author.  
  19. anrd Says:
  20. This comment has been removed by the author.  
  21. anrd Says:
  22. * శాస్త్రవిజ్ఞానము బ్లాగులో నేను సాంప్రదాయ విజ్ఞానం గురించి రాయటమేమిటని అజ్ఞాత ఆవేశపడిపోతున్నారు. అయితే, పుంసవనం ప్రక్రియ గురించి, కుంకుమపువ్వు వాడకం గురించి ప్రాచీనులు తెలియజేసిన విషయాలను శాస్త్రవిజ్ఞానము బ్లాగులో రాసారు కదా !

    * ఆధునిక విజ్ఞానం వల్ల కొన్ని లాభాలు కలుగుతున్న మాట నిజమే కానీ, ఎన్నో అనర్ధాలు కూడా జరుగుతున్నాయి.

    * రోగులు యాంటిబయాటిక్స్ను విపరీతంగా వాడటం వల్ల , క్రమంగా రోగకారక బాక్టీరియా మందులకు కూడా లొంగని ప్రమాదకర పరిస్థితి పొంచి ఉంది.

    * ఆధునిక విజ్ఞానం కనుగొన్న రసాయనాల వాడకం వల్ల భూమి, నీరు, కలుషితం అయిపోతోంది. ఇంకా, జీవజాతులెన్నో అంతరించిపోతున్నాయని ఈ మధ్యనే జరిగిన జీవవైవిధ్య సదస్సు ద్వారా అందరూ గగ్గోలు పెట్టారు కదా !

    * అభివృద్ధి అంటూ ప్రపంచాన్ని , పర్యావరణాన్ని, జీవజాలాన్ని అతలాకుతలం చేసే హక్కు ఎవరికైనా ఎలా ఉంటుంది ?

    * ఆధునికవిజ్ఞానం అందించిన ప్లాస్టిక్, సెల్ టవర్స్, అణు విజ్ఞానం .........ఇలాంటి వాటి వల్ల ప్రపంచానికి, జీవులకు ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి.

    * ఆధునిక పరికరాల ( ఎలెక్ట్రానిక్ ) నుంచి వెలువడే వాయువుల వల్ల ఓజోన్ పొర దెబ్బతినటం, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం ........ వంటి ఎన్నో అనర్ధాల గురించి అందరికి తెలుసు .

    * విపరీతమైన యాంత్రీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది.

    * ఆధునికవిజ్ఞానం అయినా ప్రాచీన విజ్ఞానం అయినా ఏదైనా ప్రపంచానికి , పర్యావరణానికి, సమాజానికి ఉపయోగపడటం ముఖ్యం.

    * ప్రాచీనులకు ఏమీ తెలియదు అనుకోవటం ఇప్పటివాళ్ళ దురదృష్టం.

    * ప్రాచీనులది పర్యావరణానికి హాని చెయ్యని విజ్ఞానం. ప్రాచీనుల విధానాల వల్ల ప్రపంచానికి హాని కలగలేదు.

    * ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించిన ఈ కొద్ది కాలంలోనే సహజవనరుల నాశనం, పర్యావరణం కలుషితం అయిపోవటం వంటి అనర్ధాలెన్నో జరుగుతున్నాయి.*

    *ప్రాచీనులు అందించిన విజ్ఞానాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

    * నాకు ఆధునిక విజ్ఞానం అన్నా గౌరవమే. అయితే, ప్రపంచానికి నష్టం కలుగని విధంగా ప్రపంచానికి ఉపయోగపడే ప్రయోగాలు జరిగితే అందరికీ ఆనందమే. అలాంటి ఆవిష్కరణలు జరగాలని అందరము కోరుకుందాము.

    * మీ బ్లాగులో ఎంతో ఎక్కువ స్థలాన్ని వాడినందుకు దయచేసి క్షమించండి.

     
  23. Anonymous Says:
  24. It is very clear u r not interested to hear the other version and removing all other comments except the comments supporting u :)

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts