కాల్పనిక వైజ్ఞానిక సాహితీలోక పితామహుడు అని చెప్పుకోదగ్గ ఆర్థర్ సి. క్లార్క్ రాసిన ఓ కథకి అనువాదం ఇది. ఈ కథ పేరు Jupiter Five. జూపిటర్ ఉపగ్రహాల్లో అంతవరకు పెద్దగా ఎవరూ పట్టించుకోని, ఐదవ ఉపగ్రహం పేరు అది. ఆ ఉపగ్రహంలో మానవేతర సంస్కృతికి చెందిన అవశేషాలు, రహస్యాలు ఏవో ఉన్నాయన్న నమ్మకంతో, అదేదో తేల్చుకుందామని ఒక ప్రొఫెసర్ తన బృందాన్ని తీసుకుని బయలుదేరుతాడు. తీరా అక్కడికి చేరాక వాళ్లకి పోటీగా మరో ముఠా తయారవుతుంది. అప్పుడేం జరుగుతుందో ... కథ చదివితే తెలుస్తుంది. (కథ సహజంగా ఉండడానికి పాత్రల పేర్లు (చివరికి నౌకల పేర్లు కూడా) మార్చడం జరిగింది.)
బృహస్పతి పంచమం
ఆయనే ప్రొఫెసర్ విశ్వనాథం... మనిషి పొట్టివాడే గాని (ఎంత పొట్టివాడంటే ఆయన కోసం ప్రత్యేకంగా కొలతలు ఇచ్చి స్పేస్ సూట్ తయారుచెయ్యించాల్సి వచ్చింది) బుద్ధి మహా పదును. ఎవరికీ రాని ఏవో విచిత్రమైన ఆలోచనలు ఆయనకే వస్తుంటాయి. ఎప్పుడూ ఏదో చెయ్యాలని, ఏవో తెలుసుకోవాలని ఆరాటపడుతుంటాడు. ఒకసారి ఆయనకి ఏదైనా బుద్ధి పుడితే దాన్ని సాధించిన దాకా నిద్రపోడు. నిద్రపోడు గాని కలలు మాత్రం తెగ కంటాడు.
ఆయనదో విచిత్రమైన కల. ఓ కూతుర్ని పెంచినట్టు ఇరవై ఏళ్ల పాటు దాన్ని మురిపెంగా పెంచి పెద్దచేశాడు. ఆ కలని ఇప్పుడు సాకారం చేసుకునే సమయం వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ని సఫలం చేసుకోడానికి పెద్ద పెద్ద వైజ్ఞానిక సదస్సులని ఒప్పించి పెద్ద మొత్తంలో ’కట్నం’ డబ్బు తెచ్చుకున్నాడు. అంతే కాదు. పుష్పక విమానం లాంటి చక్కని అంతరిక్ష నౌకని కూడా ఎలాగో పట్టాడు. (దానికి రాజహంస’ అని ఓ పేరు కూడాను.) అయినా... ఇంత వివరం మాలిన వ్యవహారం కోసం ఇన్ని విరాళాలు ఏ వెర్రిబాగులోడు ఇచ్చాడో నాకైతే ససేమిరా అర్థం కాలేదు.
మొత్తం ఆరు మంది సిబ్బందితో ’రాజహంస’ పృథ్వీ వాతావరణాన్ని విడిచి అంతరిక్షంలోకి ప్రవేశించింది. సిబ్బందిలో అందరి కన్నా ముఖ్యుడు ప్రొఫెసర్ విశ్వనాథంగారే. ఆయనకసలే కాస్త మతిమరుపు. కనుక ఆయన విషయాలన్నీ చూసుకునే ఆయన అసిస్టెంట్ తిరుమల రావు కూడా మాతో వచ్చాడు. వీళ్లు కాక ప్రతీ నౌకలోను తప్పనిసరిగా ఉండాల్సిన ముగ్గురూ - బండి చలాయించడానికి ఓ పైలెట్, దారి చూపించడానికి ఓ నావిగేటర్, బండి దార్లో పేచీ పెడితే చూసుకోవడానికి ఓ ఇంజినీరు – ఉన్నారు. ఇక ఆఖర్లో మిగిలింది మా శేషాద్రి శర్మ, నేను. మేమిద్దరం ప్రొఫెసర్ వద్ద రీసెర్చి చేస్తున్నాం అన్నమాట.
శేషుకి, నాకు అంతరిక్షం లోకి రావడం ఇదే మొదటి సారి. ఇద్దరికీ ఈ యాత్ర భలే థ్రిల్లింగ్ గా ఉంది. అందుకే మేం తిరిగి భూమికి వెళ్లేసరికి మా క్లాసులు మొదలవుతాయన్న బెంగ కూడా లేదు. పనికిమాలిన క్లాసులు. ఎప్పుడూ ఉండేవేగా! అయితే అక్కడ మాకు పాఠం చెప్పిన ప్రొఫెసర్ కూడా అలాగే అనుకున్నాడో ఏమో. కాస్త సిఫారసు ఇయ్యవయ్యా పెద్దమనిషీ అంటే తిడుతున్నాడో, పొగుడుతున్నాడో అర్థం కాకుండా ఏదో సోది రాశాడు. ఎవరికీ అర్థం కాని సోది రాయడంలో ఆయన ఎలా దిట్టో, ఎవరికీ అర్థం కాని సోది చదవడంలో మేం దిట్ట. మార్షియన్ రహస్య లిపి చదవడంలో మంచి పాండిత్యం గల వాళ్ల సంఖ్య చేతివేళ్ల మీద లెక్కెట్టొచ్చు. వారిలో చిటికెన వేలు మా శేషు, చూపుడు వేలు నేను. అందుకే రాజహంసలో సీట్లు కొట్టేశాం.
కాని మేం వెళ్తున్నది మార్స్ కి కాదని, జూపిటర్ కి అని ముందు మాకు మాత్రం ఏం తెలుసు? మా అంతకి మేము కుక్కపాట్లు పడి తెలుసుకోవడమే గాని మా ప్రొఫెసరు మాకు విపులంగా విషయం చెప్పిందెప్పుడు? కాని ప్రొఫెసరు సిద్ధాంతాల గురించి మాకు బాగా తెలుసు కనుక, జూపిటర్ మీద పని ఏవై ఉంటుందో ఇద్దరం ఊహాగానాలు చెయ్యడం మొదలెట్టాం. భూమిని వొదిలి పది రోజు లయ్యిందేమో. మా ఊహలు నిజమేనని మెల్లగా అర్థం కాసాగింది.
అప్పుడప్పుడు మా ప్రొఫెసర్ కి మా ఇద్దరికి జ్ఞానభిక్ష పెట్టాలని బుద్ధి పుడుతుంది. అలాంటప్పుడు ఎంత దూరంలో ఉన్నా కను సన్న చేసి పిలుస్తాడు. ఆ పిలుపు మాకు బాగా తెలుసు. ఇప్పుడలాగే పిలిచాడు. ఇద్దరం వెళ్లాం... అంటే వెళ్లడానికి ప్రయత్నించాం. ప్రొఫెసర్ పిలవగానే పరుగుపరుగున వెళ్లడం మాకు కొత్త కాదు గాని, బొత్తిగా గురుత్వం లేని శూన్య లోకంలో పరుగులు పెట్టడంలో మాకంత అనుభవం లేదు. ఒక పక్క మా శేషుగాడు ర్యాకెట్ బాల్ లా నౌక గోడల మధ్య తుళ్లుతున్నా, నాకు నేల మీద కాళ్లు ఆనడమే గగనమై పోతున్నా, మా ప్రొఫెసర్ మాత్రం నిండు కుండలా తొణకకుండా ఉన్నాడు. జీవితంలో ’సెటిల్’ కావడానికి అవస్థ పడుతున్న మా ఇద్దరి కేసి ఓ సారి విచారంగా చూశాడు. భూమి మీద కూడా అలా మా కేసి ఎన్నో సార్లు చూశాడు. ఆ చూపులో కోటి ప్రశ్నలు. “వీళ్లసలు ఎలా పుట్టారు?” “ఎందుకు పుట్టారు?” “నాకే ఎందుకిలా తగులుకున్నారు?” “వీళ్ల నుండి నాకు విముక్తి ఎప్పుడు?” ఏంటో ఆయన ప్రశ్నలు మాకెప్పుడూ అర్థం కావు.
“భూమిని విడిచి బయలుదేరిన దగ్గర్నుండి మీతో పెద్దగా మాట్లాడడానికే వీలుపడలేదు.” గొంతు సవరించుకుంటూ అన్నాడు ప్రొఫెసర్. “ఈ యాత్రకి లక్ష్యం ఏంటో మీకు వివరంగా చెప్పాలి.”
(సశేషం...)

nice starting.
have u seen http://tesfic.com -?
very good effort. అసలు అనువాదం చదువుతున్నట్టు లేదు.
@Oremuna:
Nice website. There is an obvious need to encourage science fiction in Telugu.
kotta paaLee@
Thank you...