
కాంతి కిరణం (Light ray)- కాంతి సరళ రేఖా మార్గాలలో ప్రయాణం చేస్తుందని మనకి తెలుసు. ఒక కాంతి జనకం నుండి వచ్చే కాంతి కిరణం సరళ రేఖలో ప్రయాణిస్తుంది. చిత్రం (**)లో కిరణాన్ని ఓ సరళ రేఖతో సూచిస్తాం. కాంతి ప్రయాణించే దిశని బాణంతో సూచిస్తాం. కాంతి పుంజం (light beam) - ఎన్నో కిరణాల కట్ట లాంటిది కాంతి పుంజం. వాస్తవంలో ఆదర్శవంతమైన కాంతి కిరణం అనేదే లేదు. ఉన్నవి కాంతి పుంజాలు మాత్రమే. కాంతి పుంజం బాగా సన్ననిదైతే దాన్నే కాంతి రేఖ, లేదా కాంతి కిరణం (light...

అధ్యాయం - 13ఆర్కిటిక్ వృత్తం వద్ద మజిలీ (పాతాళానికి ప్రయాణం - 36)అది రాత్రి కావలసిన సమయం. కాని 65 అక్షాంశ రేఖ వద్ద నడిరేయి ధృవకాంతిలో లోకం అంతా తేటతెల్లంగా కనిపిస్తోంది. జూన్, జులై నెలలలో ఐస్లాండ్ లో సూర్యాస్తమయం అనేది జరగని పని.కాని ఉష్ణోగ్రత బాగా తక్కువగా ఉంది. నాకైతే చలి తీవ్రత కన్నా ఆకలి తీవ్రత మరింత యాతన పెడుతోంది. మాకు ఆతిథ్యం ఇవ్వడానికి ఒప్పుకున్న రైతు ఉండే ఇల్లు అల్లంత దూరంలో కనిపించగానే నాకు ప్రాణం లేచొచ్చినట్టు అయ్యింది.పేరుకి...

జాన్ హోల్ట్
(1923- 1985) ఓ పేరు మోసిన
అమెరికన్ విద్యావేత్త.
అతడు పిల్లలని
ఎంతగానో ప్రేమించాడు. పిల్లలు తమ చుట్టూ ఉండే ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం కోసం, దాని
గురించి నేర్చుకోవడం కోసం చేసే ప్రయాసని బాగా అర్థం చేసుకున్నాడు. ఆ ప్రయాసే అసలు చదువు
అని తెలుసుకున్నాడు. పిల్లలు తమ పరిసరాల గురించి నేర్చుకోవడంలో కాస్తంత దోహదం చెయ్యడమే
పెద్దల కర్తవ్యం అంటాడు. అంతకు మించి పిల్లల సహజ వృద్ధి క్రమంలో పెద్దలు అతిగా జోక్యం
చేసుకుంటే పిల్లల ఎదుగుదలకి...

కాంతి యొక్క ఓ ముఖ్య లక్షణం ప్రకాశం. ప్రకాశాన్ని కొలిచే విధానమే, శాస్త్రమే ‘దృగ్గోచర కాంతిమితి.’దీని గురించి తెలుసుకోవాలంటే దానికి ఆధారమైన కొన్ని ప్రాథమిక భావాలని పరిచయం చెయ్యాలి. ఆ భావాలని వరుసగా కొన్ని పోస్ట్ లలో పరిశీలిద్దాం.కాంతి జనకాలు – వాటి ప్రకాశం (Light sources and luminescence)కాంతిని వెలువరించే వస్తువులని కాంతి జనకాలు అంటాం.సూర్యుడు, బల్బు, కొవ్వొత్తి, మిణుగురు పురుగు మొదలైనవి మనకి బాగా తెలిసిన కాంతిజనకాలు. వీటిలో కొన్నిటికి ప్రకాశం...

ఇంతవరకు ఈ బ్లాగ్ లో ఎన్నో రకాల సైన్స్ వ్యాసాలని పోస్ట్ చెయ్యడం జరిగింది. అయితే అవన్నీ సైన్స్ విషయాల మీద సామాన్యమైన ఆసక్తి పెంచే దిశలోనే ఉన్నాయి. విద్యార్థులకి కూడా అందులో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నా కూడా, ప్రత్యక్షంగా బడి చదువులకి, బళ్లో చెప్పే సైన్స్ కి సంబంధించిన పోస్ట్ లు పెద్దగా లేవు. బళ్లో చెప్పే సైన్స్ పాఠాలతో సూటిగా సంబంధం ఉన్న సమాచారాన్ని అందిస్తే ఈ బ్లాగ్ స్కూలు పిల్లలకి కూడా ఉపయోగకరంగా ఉంటుంది.ఆ ఉద్దేశంతో పదోక్లాస్ భౌతికశాస్త్రం...
ఈ మధ్య ‘మాలిక’ వెబ్ జైన్ లో రెండు కథలు ప్రచురించబడ్డాయి. ఈ బ్లాగ్ కేవలం సైన్స్ కోసమే కనుక అవి ఇక్కడ పూర్తి రూపంలో ఇవ్వడం లేదు. లింకులు మాత్రమే ఇస్తున్నాను. వీలుంటే ఓ సారి చూడండి…ఏ రాయి అయితేనేం?ఇద్దరు మిత్రుల దాంపత్య జీవితాలని పోల్చుతూ చెప్పే ఓ సరదా సెటైర్ ఈ కథ. విదేశాల్లో ఉండేవాడు తన ‘వెస్టర్నైజేషన్’ వల్లనే తన కాపురం ఇలా ఉందని బాధపడుతుంటాడు. కాని ఇండియాలో ఉంటూ బాగా ‘సాంప్రదాయంగా’ ఆలోచించే తన మిత్రుడి పరిస్థితి కూడా అంత మెరుగ్గా ఏమీ లేదని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు. కథ అంతా ఓ టెలిఫోన్ సంభాషణ…http://magazine.maalika.org/2011/08/17/%e0%b0%8f-%e0%b0%b0%e0%b0%be%e0%b0%af%e0%b1%88%e0%b0%a4%e0%b1%87%e0%b0%a8%e0%b1%87%e0%b0%82/నిన్న...
ఇండియాకి దారి చూపగల సమర్థుడైన మార్గగామి దొరికాక వాస్కో ద గామా పరిస్థితి మెరుగయ్యింది. ఆ మార్గగామి పేరు అహ్మద్ బిన్ మజిద్. అరబ్ లోకంలో గొప్ప నావికుడిగా ఈ మజిద్ కి మంచి పేరు ఉంది. ఇతడి పూర్వీకులకి కూడా నౌకాయానంలో ఎంతో అనుభవం ఉంది. నౌకాయానం మీద ఇతడు నోరు తిరగని పేరున్న ఓ అరబిక్ పుస్తకం కూడా రాశాడు. సముద్రాల మధ్య తేడాలని వర్ణిస్తూ సముద్ర శాస్త్రం మీద కూడా ఓ పుస్తకం రాశాడు.అంతకు ముందు వాస్కో నౌకాదళానికి దారి చూపిస్తానని వచ్చిన ఓ అరబిక్ నావికుడు ఈ బృందాన్ని ఆఫ్రికా తూర్పు తీరం వెంట పైకి కిందకి తిప్పించాడు. పెను తుఫానులలో ఇరికించాడు....

సైన్స్ ఫిక్షన్ ప్రియులకి ప్రతీ శనివారం రాత్రి ఓ చక్కని విందు – టెరా నోవా సీరియల్. సైన్స్ ఫిక్షన్ రంగంలో సినిమాలే తక్కువ. ఇక టీవీ సీరియళ్లు మరీ అపురూపం. గతంలో బాగా ఆదరణ పొందిన, ఒక మొత్తం తరాన్నే సైన్స్ దిశగా ప్రభావితం చేసిన సీరియల్ స్టార్ ట్రెక్. ఈ కొత్త సీరియల్ ఆ ఎత్తుని చేరుకుంటుందో లేదో గాని, ‘పవిత్ర రిష్తా’లని, ‘మొగలి రేకుల’ ని చూపించి, చూపించి కృంగి కృశించిపోయిన మా టీవీ ఈ కొత్త షో వల్ల ఏదో కొత్త వన్నె తెచ్చుకున్నట్టయ్యింది.క్లుప్తంగా...

ఫిబ్రవరి 24 నాడు మళ్లీ యాత్ర మొదలయ్యింది. ఉత్తర-తూర్పు దిశలో ఓడలు ముందుకి సాగిపోయాయి. మార్చి 2 నాడు ఆఫ్రికా తూర్పు తీరం మీద ఉన్న మొజాంబిక్ దేశంలోని మొసాంబిక్ రేవుని చేరుకున్నాయి. ఆ రోజుల్లో మొసాంబిక్ రేవు ఆఫ్రికా పశ్చిమ తీరంలో ఓ ముఖ్యమైన రేవు. ఇండియా, చైనా, అరేబియా, మలయా మొదలుకొని ఎన్నోదేశాల ఓడలు అక్కడికి వస్తుంటాయి. అరేబియా, ఇండియన్ మహాసముద్రం ప్రాంతంలో అదో పెద్ద వ్యాపార కేంద్రంగా విలసిల్లేది. ఆ ప్రాంతం వారు ఎక్కువ శాతం ముస్లిమ్లు. వీరికి...

ఇంకా ముందుకు పోతే ఎలాంటి భయంకర అగ్నిపర్వత శిలా ప్రాకారాలని చూడాల్సి వస్తుందోనని కొంచెం ఆదుర్దా పడసాగాను. కాని అప్పుడు ఓల్సెన్ మ్యాపుని పరిశీలించగా ఒక విషయం అర్థమయ్యింది. తీరం వెంట ముందుకి పోతే ఈ అగ్నిపర్వత శిలలు ఉన్న ప్రాంతాన్ని తప్పించుకోవచ్చు. అసలు అగ్నిపర్వత విలయతాండవం అంతా ద్వీపం యొక్క కేంద్రభాగానికే పరిమితం అని తరువాత తెలిసింది. ఆ ప్రాంతంలో లావాప్రవాహం ఘనీభవించగా ఏర్పడ్డ ట్రాకైట్, బేసల్ట్ మొదలైన శిలా జాతులన్నీ కలగలిసి అతిభీషణ పాషాణ...

http://www.andhrabhoomi.net/intelligent/da-893మాల్థస్ భావాలని అర్థం చేసుకున్న డార్విన్ కి జీవపరిణామాన్ని ఒక ప్రత్యేక దిశలో ప్రేరిస్తున్న అదృశ్య శక్తేమిటో అర్థం అయ్యింది. జనాభాని ఎలాగైతే వ్యాధి, మృత్యువు, యుద్ధం మొదలైన శక్తులు అదుపు చేస్తున్నాయో, ఆ శక్తుల ‘సహజ ఎంపిక’ చేత కొంత జనాభా ఏరివేయబడుతోందో, అదే విధంగా జీవపరిణామంలో కూడా పరిమితమైన ప్రకృతి వనరుల కోసం పోటీ పడడం, మారుతున్న పృథ్వీ పరిస్థితులకి తట్టుకోవడం, అనే ‘సహజ ఎంపిక’ వల్ల కొన్ని జీవాలు,...

1. కాస్తంత తెలివి ఉన్న ఏ మూర్ఖుడైనా విషయాలని మరింత పెద్దగా, సంక్లిష్టంగా మార్చేయగలడు. పరిస్థితిని అందుకు వ్యతిరేక దిశలో తీసుకెళ్లడానికి మేధస్సు కావాలి. దమ్ము ఉండాలి.2. దేవుడి ఆలోచనలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇక తక్కినవన్నీ చిన్న చిన్న వివరాలే.3. ఈ లోకంలో కెల్లా అర్థం చేసుకోవడం అత్యంత కఠినమైన విషయం ఆదాయపు పన్ను.4. బాహ్య ప్రపంచం ఓ భ్రాంతి. సులభంగా వదలని భ్రాంతి.5. దేవుడు పాచికలు ఆడడని నాకు పూర్తి నమ్మకం ఉంది.6. భగవంతుడిది సూక్షబుద్ధి,...

http://www.andhrabhoomi.net/intelligent/darawin-katha-066డార్విన్ కి తన యాత్రల నుండి తిరిగి తెచ్చుకున్న సరంజామాని, సమాచారాన్ని విశ్లేషించగా ఒక్క విషయం మాత్రం తేటతెల్లంగా కనిపించింది. జీవపరిణామం అనేది వాస్తవం. జీవజాతులు క్రమంగా మార్పుకి లోనవుతున్నాయి. అయితే ఆ మార్పుని కలుగజేస్తున్న శక్తి ఏంటో తనకి మొదట అర్థం కాలేదు. అందుకు కారణాల కోసం ఆలోచించగా తనకి తట్టిన మొట్టమొదటి కారణం ఇది.ఎన్నో రకాల భూభౌతిక శక్తుల ప్రభావం వల్ల భూమి యొక్క ఉపరితలం, పర్యావరణం...

(చాలా కాలం క్రిందట నిలిపేసిన ‘పాతాళంలో ప్రయాణం’ సీలియల్ ని మళ్లీ కొనసగిస్తున్నాం.)అధ్యాయం 12నిర్జన భూమిఆకాశం మేఘావృతమై ఉంది. కాని నిశ్చలంగా ఉంది. మరీ వెచ్చగానూ లేదు. అలాగని వర్షం కూడా లేదు. ఇలాంటి వాతావరణం కోసమే పర్యాటకులు పడి చస్తారు.ఈ కొత్త, విచిత్ర ప్రపంచంలో గుర్రం మీద స్వారీ అంటే నాకు మొదట్నుంచి భలే ఉత్సాహంగా అనిపించింది. ఓహో, ఏం హాయి? ఎంత ఆనందం? అందుకే ఈ అశ్వారూఢానందంలో పీకల్దాకా మునిగిపోయాను!“అసలైనా ఆలోచించి చూస్తే, గుర్రం మీద స్వారీ...

http://www.andhrabhoomi.net/sisindri/vasco-da-gama-719వాస్కో ద గామా తన సిబ్బందితోపాటు అక్కణ్ణుంచి పలాయనం చిత్తగించాడు.నౌకాదళం ఇంకా ముందుకి సాగిపోయింది. వాతావరణంలో క్రమంగా మార్పులు రాసాగాయి. సముద్రంలో కూడా పోటు ఎక్కువగా ఉంది. ఉవ్వెత్తున కెరటాలు లేచి ఓడలని ఎత్తి పడేస్తున్నాయి. గతంలో దియాజ్ దళం కూడా సరిగ్గా ఇక్కడి నుండే వెనక్కి వెళ్లిపోయారని వాస్కో సిబ్బంది అర్థం చేసుకున్నారు. డిసెంబర్ 16వ తారీఖుకల్లా దియాజ్ బృందం పాతిన ఆఖరు ‘పద్రావ్’ని దాటారు....

అలా ఐదేళ్ళ పాటు సాగిన వైజ్ఞానిక యాత్రలో డార్విన్ అపారమైన సమాచారాన్ని సేకరించాడు. ఆ సమాచారాన్ని విశ్లేషించి జీవజాతుల వికాస క్రమం గురించి కొన్ని సూత్రాలని గుర్తించగలిగాడు.దక్షిణ అమెరికాలో డార్విన్ కి ఆర్మడిల్లో అనే రకం జంతువులు ఆసక్తి కలిగించాయి. ఈ జంతువులు మూడు, నాలుగు అడుగుల పొడవు కూడా ఉంటాయి. రూపురేఖల్లో కాస్త పందిని, ఎలుకను పోలి ఉంటాయి. ఒంటి మీద కవచం (ఆర్మర్) లాంటి దట్టమైన చర్మపు పొర ఉంటుంది కనుకనే వాటికి ఆ పేరు వచ్చింది. వీటిలో కొన్ని...
postlink