
అధ్యాయం 16పాతాళానికి ముఖద్వారంబాగా ఆకలి మీద ఉన్నామేమో అందరం ఆవురావురని తిన్నాం. విశ్రాంతి తీసుకోడానికి ఆ అగ్నిబిలం లోనే తలో చోటూ వెతుక్కున్నాం. ఆ రాత్రికి ఆ బండరాతి తల్పం తోనే సరిపెట్టుకున్నాం. సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో పెద్దగా కంబళులు లేకపోయినా సర్దుకుపోయాం. ఆశ్చర్యం ఏంటంటే ఆ రాత్రి నాకు బాగా నిద్ర పట్టింది. అసలు అంత గాఢంగా నిద్రపోయి చాలా కాలం అయ్యింది అనిపించింది. ఒక్క కల వస్తే ఒట్టు.మర్నాడు ఉదయం మేలుకునే సరికి సగం గడ్డకట్టుకుపోయాం....

ఆర్కిమిడీస్ కనిపెట్టిన స్టోమకియాన్ (stomachion) అనే గణిత క్రీడ గురించి రెండు వ్రాతపత్రులు శిధిలావస్థలో దొరికాయి. వాటిలో ఒకటి అరబిక్ అనువాదం. పదవశతాబ్దానికి చెందిన రెండవ వ్రాతపత్రి గ్రీకులో రాయబడినది. ఇది 1899 లో కాస్టాంటినోపుల్ నగరంలో దొరికింది. అసలు ఆర్కిమిడీస్ ఈ ఆటని కనిపెట్టాడా లేక అందులోని జ్యామితి (geometry) సంబంధమైన అంశాలని గణితపరంగా విశ్లేషించాడా అన్న విషయం మీద స్పష్టత లేదు. ప్రాచీన రచనలలో మరి కొన్ని చోట్ల కూడా ఈ ఆట గురించిన ప్రస్తావన...
చిన్నప్పట్నుంచి కూడా నాకు సున్నితమైన, ఉదారమైన స్వభవం ఉండేదట. ఆ లక్షణం నాకు మా అక్క చెళ్లెళ్ల నుండి, వాళ్ల శిక్షణ వల్ల వచ్చి ఉంటుందని అనుకుంటాను. ఇది స్వతహాగా నాలో ఉండే లక్షణం అయ్యుండదు. నాకు పక్షి గుడ్లు సేకరించడం అంటే చాలా ఇష్టం ఉండేది. అయితే ఎప్పుడు తీసినా గూడు లోంచి ఒక్క గుడ్డే తీసేవాణ్ణి. అయితే ఒక్క సారి మాత్రం గూడులో ఉన్న గుడ్లన్నీ తీసేసాను. ఆ గుడ్ల విలువ దృష్టిలో పెట్టుకుని కాదు, ఏదో దుడుకుతనం వల్ల అలా చేశానని అనిపిస్తుంది.ఎర వేసి చేపలు పట్టటం అంటే నాకు చాలా ఇష్టం ఉండేదట. ఏటి గట్టునో, నదీ తీరం లోనో గంటల తరబడి ఎర కోసం వచ్చే...

ఆర్కిమిడీస్ భౌతిక శాస్త్ర సూత్రాలని కనుక్కోవడమే కాక ఎన్నో అద్భుత సాంకేతిక పరికరాలని కూడా రూపొందించాడు. అలాంటి పరికరం ఒకటి ‘ఆర్కిమిడీస్ స్క్రూ’. ఈ పరికరంతో నీళ్లు తోడడానికి వీలవుతుంది. దీని రూపకల్పనకి కూడా ఒక విధంగా రెండవ హీరో రాజే కారణం. నౌక్రాటిస్ కి చెందిన ఎథెనేయియస్ అనే రచయిత ఈ కథనం అంతా ఓ పుస్తకంలో వర్ణించాడు. అందులో 600 మంది ప్రయాణించగలిగేవారట. అందులో ఓ క్రీడారంగం (జిమ్నేషియమ్) ఉంటుంది. గ్రీకుల ప్రేమదేవత అయిన అఫ్రొడైటీ కి అంకితం చెయ్యబడ్డ...

ఆర్కిమిడీసె సూత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నంలో వస్తువులని నీట్లో ముంచి, తీసి, తూచి తిప్పలు పడ్డ అనుభవం చాలా మంది తెలియనితనంలో పొందే వుంటారు. అలాగే స్నానాల తొట్టెలో దీర్ఘంగా ఆలోచిస్తుండగా స్ఫురించిన ఆలోచనకి సంబరం పట్టలేక ఇబ్బందికరమైన వేషంలో నగర వీధుల వెంట ‘యురేకా’ అంటూ ఉరకలు వేసిన ఆర్కిమిడీస్ గురించి చాలా మంది వినే వుంటారు.పాశ్చాత్య గణితలోకంలో త్రిమూర్తులుగా మూడు పేర్లు చెప్పుకుంటారు – వాళ్లు ఆర్కిమిడీస్, న్యూటన్, గౌస్. వీరిలో న్యూటన్,...

కొన్ని చోట్ల కొండ వాలు 36 డిగ్రీలు మించి ఉంటుంది. దాన్ని ఎక్కడం అసంభవం అనిపించింది. కాని ఎలాగో కష్టపడి ఆ బండరాతి కొండని ఎక్కుతూ పోయాం. కట్టెలతో ఒకరికొరం సహాహపడుతూ పైపైకి సాగిపోయాం.మామయ్య మాత్రం ఎప్పుడూ నన్ను అంటిపెట్టుకునే ఉన్నాడు. నేను ఎప్పుడూ తన దృష్టిని దాటిపోకుండా కనిపెట్టుకుని ఉన్నాడు. ఎన్నో సంకట పరిస్థితుల్లో చటుక్కున నా చేయి పట్టుకుని నిలుపుతూ వచ్చాడు. కాని తను మాత్రం ఎప్పుడూ తొట్రువడడం, తబ్బిబ్బు కావడం చూడలేదు. ఇక మాతో పాటు వచ్చిన...

శ్రీనివాస రామానుజన్ ఇంగ్లండ్ లో ఉండే రోజుల్లో పి.సి. మహలనోబిస్ అనే మరో ప్రఖ్యాత భారతీయ గణితవేత్తతో పాటు కలిసి ఒకే ఇంట్లో ఉండేవాడు. మహలనోబిస్ కి ఒక రోజు స్ట్రాండ్ అనే ఇంగ్లీష్ పత్రికలో ఒక గణిత సమస్య కనిపించింది. వెంటనే తెచ్చి రామానుజన్ కి చదివి వినిపించాడు. ఆ సమయంలో రామానుజన్ వంటగదిలో కూరలు వేయిస్తున్నాడు. మహలనోబిస్ వర్ణించిన సమస్యని జాగ్రత్తగా విన్నాడు. రామానుజన్ కి అత్యంత జటిలమైన లెక్కలు కూడా మనసులోనే చెయ్యగలిగే అలవాటు ఉండేది. ఆ సమస్య...

భౌతిక శాస్త్రానికి ఐన్ స్టయిన్ ఎంతో, జీవశాస్త్రానికి డార్విన్ అంత అని చెప్పుకోవచ్చు. డార్విన్ ఎనలేని కృషి వల్ల పరిణామ సిద్ధాంతం జీవశాస్త్రంలో ఓ ముఖ్య స్థానాన్ని ఆక్రమించింది. పరిణాత్మక దృష్టితో చూడకపోతే జీవశాస్త్రంలో ఏదీ కచ్చితంగా అర్థం కాదనేంత ఎత్తుకు పరిణామ సిద్ధాంతం ఎదిగింది. డార్విన్ కృషి గురించి లోగడ కొన్ని వ్యాసాలు ఈ బ్లాగ్ లో పోస్ట్ చెయ్యడం జరిగింది. అందులో డార్విన్ యొక్క వైజ్ఞానిక చింతన గురించి, ఆ చింతనకి ఊపిరి పోసిన పూర్వుల చింతన...

ఐస్లాండ్ నేలలో ఒండ్రుమట్టి ఇంచుమించు లేదనే చెప్పాలి. ఈ భూమి అంతా అగ్నిపర్వతాల నుండి పెల్లుబికిన రాళ్లు రప్పల సమూహం. అగ్నిపర్వతాలు విస్ఫోటం చెందక ముందు ఇక్కడ భూగర్భ శక్తుల ప్రభావం వల్ల నెమ్మదిగా పైకి లేచిన అగ్నిశిలల సమూహమే ఉండేది. అప్పటికి ఇంకా భూగర్భంలోని అగ్ని ఇంకా పైకి తన్నుకురాలేదు.కాని తదనంతర దశలలో దక్షిణ-పశ్చిమం నుండి ఉత్తర-తూర్పు దిశలో, దీవి యొక్క కర్ణం (diagonal) వెంట, ఓ పెద్ద అగాధం ఏర్పడింది. ఆ అగాధం లోంచి ట్రాకైట్ శిల పైకి తన్నుకొచ్చి...

సోవియెట్ ప్రచురణ సంస్థ మీర్ పబ్లిషర్స్ మన దేశంలో విజ్ఞాన ప్రచారంలో ఎంతో సేవ చేశాయి. ఆ పుస్తకాలు ప్రస్తుతం మనకి, ముఖ్యంగా ప్రస్తుత యువ తరానికి లభ్యం కాకపోవడం విచారకరం.మీర్ పబ్లిషర్స్ యొక్క గణిత ప్రచురణల్లో నేను చిన్నప్పుడు చదువువున్న పుస్తకం, బాగా గుర్తుండిపోయిన పుస్తకం ఒకటుంది. దాని పేరు “Lines and curves: A practical Geometry Handbook.” సరళ రేఖల గురించి, రకరకాల వక్రాల గురించి ఆసక్తికరమైన కథలతో, అందమైన బొమ్మలతో ఆ పుస్తకం లెక్కల పుస్తకంలా...
మూడవ సారి వాస్కో ద గామా ఇండియాకి పయనమయ్యాడు. కొత్తగా వచ్చిన జాన్ – III నియమించగా పోర్చుగల్ ప్రతినిధిగా. గోవాకి వైస్రాయ్ గా వెళ్లాడు. 1524 ఏప్రిల్ నెలలో 14 ఓడలతో 3000 సిబ్బందితో బయల్దేరాడు. మొసాంబిక్ దాకా యాత్ర భద్రంగానే సాగింది. మరమ్మత్తుల కోసం మొసాంబిక్ లో ఆగారు. అక్కడ ఒక్కసారిగా పరిస్థితులు తిరగబడ్డాయి. ఓ పెనుతుఫాను తీరం మీద విరుచుకుపడింది. ఆ దెబ్బకి మూడు ఓడలు నీటిపాలయ్యాయి. ఆ ఓడలలోని సిబ్బంది అంతా ప్రాణాలు కోల్పోయారు. మరొక ఓడలో సిబ్బంది...
postlink