శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.



ఈ బ్లాగ్ లో ఈ మధ్యన ప్రచురించబడ్డ ఓ వ్యాసానికి,

http://scienceintelugu.blogspot.in/2012/10/blog-post_24.html?showComment=1351391583818

ఈ కింది కామెంట్ వచ్చింది.

Dr. Srinivas, do you want to make this "Science" blog like another other "Religious Science" blog? For that, there are tens of such blogs in the Telugu blogsphere, you dont need one more. Please stop this nonsense here.



అందుకు నా సమాధానం, వివరణ…

Dear Anonymous,

Your point is accepted. Even I am a bit concerned about the above article. There is an unnecessary admixture of modern science and traditional stuff. From here on I will try to make sure the articles in this blog are written according to proper standards of science writing. Normally I wouldn’t write such an article. But this time, though I didn’t write it myself, I published it. There is a reason behind this lenience. Let me explain. Firstly, let me reminisce a bit…



నేను యూ.ఎస్. లో పదేళ్ళు ఉండి ఇండియాకి తిరిగి వచ్చేశాను. అక్కడి సమాజంలో సైన్స్ చాలా లోతుగా వేళ్లూని ఉండడం చూసి ఆశ్చర్యం కలిగేది.



పాశ్చాత్య సమాజాల్లో సైన్స్

ఒక చిన్న ఉదాహరణ –

యూ.ఎస్. లో మేం ఉన్న ఊళ్లో ఒక అధ్యాత్మిక బృందం యొక్క కార్యక్రమాలలో భాగంగా మేం మా ఊళ్లో డౌన్ టౌన్ లో పేదవారికి అన్నదానం చేసేవాళ్ళం. ఒకసారి అలాగే సాండ్ విచ్ లు, అరటిపళ్ళు ఇస్తుంటే ఒక నిరుపేద వ్యక్తి అరటిపండు అందుకుంటూ, “Oh! Banana! It has potassium!” అన్నాడు. నేనైతే అదిరిపోయాను. అప్పటికి నేను PhD చేస్తున్నాను. నాకే ఆ విషయం పెద్దగా తెలీదు. అలాంటిది ఉండడానికి నీడ, కట్టుకోడానికి సరైన బట్టలు కూడా లేని ఈ వ్యక్తికి ఆ సంగతి ఎలా తెలుసు? మన దేశంలో చిన్న చిన్న పల్లెల్లో, పెద్దగా చదువుకోని వాళ్లకి కూడా రామాయణ, భారత కథలు ఎలాగైతే బాగా తెలిసి వుంటాయో, అక్కడ సైన్స్ విషయాలు అంత లోతుగా ప్రచారం అయి వుండడం గమనించాను. అక్కడ మరింత మెరుగైన జీవన పరిస్థితులకి ఈ రకమైన సామాజిక అవగాహన మూలం అనిపించింది.



మరొక ఉదాహరణ. నేను అక్కడ ఓ ఆయిల్ కంపెనీలో కొంత కాలం పని చేశాను. అదే కంపెనీలో ఓ పెద్దాయన (వయసు అరవై ఉంటుందేమో) ఓ సీనియర్ ఇంజినీరుగా ఉండేవాడు. అప్పడప్పుడు కలుసుకున్నప్పుడు సరదాగా సైన్స్ విషయాలు మాట్లాడుకునేవాళ్ళం. ఈ వ్యక్తి ‘సాపేక్ష సిద్ధాంతం’ ని నమ్మడు. అదంతా తప్పని, ఐన్ స్టైన్ పప్పులోకాసేశాడని అంటాడు. ఐన్ స్టైన్ కి ముందు, సాపేక్షతాసిద్ధాంతంలోని ఫలితాలైన length contraction మొదలైన ప్రభావాలకి కారణం అంతకు ముందు Hendrik Lorenz విద్యుదయస్కాతం సిద్ధాంతం పరంగా ఇచ్చిన వివరణే సరైనది అని వాదించేవాడు. ఆయన వరస చూస్తే మరొకరైతే “నువ్వేమైనా ఐన్ స్టైన్ నే ప్రశ్నించేటంత వాడివా?” అని నవ్వుతారు. నాకైతే చాలా విస్మయం కలిగేది. ఈ వ్యక్తి ఆ కంపెనో ఓ మామూలు ఇంజినీరు. వృత్తి రీత్యా భౌతిక శాస్త్రవేత్త కూడా కాడు. అయినా అసలు ఐన్ స్టైన్ తప్పయితే ఏంటి, రైట్ అయితే ఏంటి? దానికి ఈయన ఉద్యోగానికి కూడా ఎలాంటి సంబంధమూ లేదు. పోనీ ఈయన మాట ఎవరైనా సీరియస్ గా తీసుకోవడానికి ఈయన ఏ MIT లోనో, Stanford లోనో సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త కూడా కాడు. కాని ఈయనకి భౌతిక శాస్త్రం అంటే మరి అంత passion! దానికి తన ఉద్యోగానికి, తన సామాజిక స్థాయికి సంబంధం లేదు. అది కేవలం మనసుకి, బుద్ధికి సంబంధించిన విషయం!

మన దేశంలో వృత్తి రీత్యా భౌతిక శాస్త్రవేత్తలు అయిన వాళ్లలో కూడా ఎంతో మందిలో ఇలాంటి passion చూడము. (ప్రస్తుతం వేగంగా పరిస్థితులు మారుతున్నాయి. కొన్ని చోట్ల మెరుగుపడుతున్నాయి. అది వేరే సంగతి.) ఏదో మొక్కుబడిగా పాఠం చెప్పి ఇంటీకి పోతారు. ధ్యాసంతా పెన్షన్, టీయే. డీయే., ఎల్.టి.సి. మొదలైన abbreviations మీదే ఉంటుంది!



(యూ.ఎస్. లో ఎన్నో కుహనా శాస్త్రాలు చలామణిలో ఉంటాయి. క్రిస్టల్ హీలింగ్, రేకీ మొదలైనవి ఎన్నో ప్రచారంలో ఉంటాయి. కాని ఆధునిక వైజ్ఞానిక సమర్థన వాటికి లేదన్న అవగాహన సామాన్యంగా జనంలో ఉంటుంది. మన సమాజంలో అలాంటి విచక్షణ కనిపించదు.)



మన సమాజంలో సైన్స్


ఇలా ఎన్నో ఉదాహరణలు ఇస్తూ పోగలను. అక్కడ సమాజంలో సైన్స్ ప్రభావం, వైజ్ఞానిక విధానాల ప్రభావం బాహ్యప్రపంచం మీద అడుగడుగునా కనిపిస్తుంది. అది మన దేశంలో కొరవడుతుంది. మన దేశంలో వ్యవస్థాత్మకంగా చూస్తే ఎన్నో సైన్స్ సంస్థలు ఉన్నాయి – విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలు వగైరాలు ఉన్నాయి. కాని చుట్టూ ఉన్న సమాజం మీద వాటికి సజీవమైన, సంచలితమైన ప్రభావం ఉండదు. సైన్స్ అనే సజీవ శక్తి ఇక్కడ మన సంస్థలని గాని, వాటిని పోషించే సమాజాన్ని కాని ఉత్తేజపరిచి, ఉద్ధరించి, ఉద్దేపింపజేస్తున్నట్టు కనిపించదు.


మన సమాజంలో సైన్స్ బాగా వేళ్లూనడానికి ఓ పెద్ద ప్రతిబంధకం మన సాంప్రదాయబద్ధమైన భావాలు అని చాలా మంది అన్నారు. నేకు కొత్తగా చెప్తున్నది కాదు. మన దేశంలో సాంప్రదాయ భావాలు విపరీతంగా చలామణి అవుతాయి. ‘కుంపుపూవు పాలలో కలుపుకుని తాగుతే తెల్లబడతారు.’ ‘వెల్లకిల్లా పడుకుంటే దెయ్యాలు వచ్చి వాలతాయి.’ ఇలా కోకొల్లలు.


ఇక ఇప్పుడు ఓ ఫ్యాషను ఏంటంటే సాంప్రదాయ భావాలకి ఓ సన్నని, మేలిమి సైన్స్ పూత పులమడం. ‘మడి ఆచారాలకి అసలు కారణం పరిశుభ్రత. తాకితే అంటురోగాలు వస్తాయి అని డాక్టర్లు చెప్తారు. అందుకే వండేటప్పుడు మడిగా వండాలి.’ ఈ వాదనలో బోలెడు దోషాలు – 1) అంటురోగాలు ఉన్న పరిస్థితుల్లో తాకితే సమస్య, కాని ఇంట్లో అందరికీ అంతో ఇంతో ఆరోగ్యం వుందని తెలిస్తే అంత విపరీతంగా చర్యలు తీసుకోనక్కర్లేదు. 2) అంటురోగాలు రాకుండా చర్యలు తీసుకునేట్లయితే, కేవలం వండేటప్పుడే కాదు అన్ని వేళలా జాగ్రత్తలు తీసుకోవాలి. 3) ఈ పరిశుభ్రతా స్ఫూర్తి (!) ఇంటికే పరిమితం కాకూడదు, వీధిలో కూడా వర్తించాలి.


ఇంత కన్నా ఘోరమైన racket ఒకటి వుంది. సైన్స్ ని తప్పుగా వ్యాపారప్రయోజనాల కోసం వాడుకోవడం. ఆ మధ్యన ఓ తెలుగు చానెల్ ఓ ప్రోగ్రాం చూశాను. ఎవడో మణిమాణిక్యాలు అమ్ముతున్నాడు. అవి పెట్టుకుంటే ఎలాంటి ‘దోషాలు’ తొలగిపోతున్నాయో చెప్తున్నాడు. అక్కడితో ఆగిపోతే బాగుణ్ణు, వాణ్ణి పూర్తిగా క్షమించేసేవాణ్ణే! అందరిలాగా కాక, వాడు ఆ రంగురాళ్లని ‘సైంటిఫిక్ గా’ పరీక్షించి వాటి ‘నాణ్యత’ వెలకట్టి అమ్ముతున్నాడట. ఇక్కడ నాణ్యత అంటే రెండర్థాలు – వైజ్ఞానికంగా పరీక్షించి ఫలనా రాయి నిజంగా గోమేధికమేనా, నిజంగే కెంపేనా తేల్చి చెప్పడం ఒకటి. ఆ రాయి వల్ల నిజంగా ‘దోషాలు’ తొలగుతాయా, ధనలాభం ఉంటుందా, మగపిల్లలు పుడతారా, చక్కని చుక్క లాంటి పెళ్లాం వస్తుందా మొదలైనవన్నీ ‘సైంటిఫిక్’ గా తేల్చి చెప్పడం వేరు!


ఇలా ఉండగా ‘ఇవన్నీ వేదాల్లోనే ఉన్నాయిష’ అనే బాపతు జనం కుప్పలుతెప్పలు. ఆ మధ్య ఓ తెలుగు బ్లాగ్ లో చదివాను. చంద్రయాన్ మిషన్ పూర్తయ్యాక చంద్రుడి మీద నీరు ఉందని తెలిసింది. ఆ నేపథ్యంలో ఆ తెలుగు బ్లాగ్ లో ఒకాయన రాస్తున్నాడు. చందమామ మీద నీరు ఉందని మన పూర్వీకులకి ఏనాడో తెలుసునట. వాదన మహా పసందుగా ఉంటుంది వినండి. శివుడి తల మీద చందమామ ఉంటాడు, ఆ పక్కనే గంగ కూడా ఉంటుంది. ఉవ్వెత్తున ఎగసి పడుతున్న గంగ చంద్రుడి మీద కూడా పడగా, చంద్రుడు తడిసి ముద్దయిపోయాడు!



ఇంకా దారుణమైన ఓ ఉదాహరణ. ఈ మధ్య ఓ శాస్త్రవేత్త, ఓ సహోద్యోగి నాతో అంటున్నాడు. “అందుకే మన పూర్వీకులు బంగారం ఎప్పుడూ నడుముకి పైనే పెట్టుకోవాలని, వెండి మాత్రం నడుముకి కింద పెట్టుకోవాలని అంటారు.” ఇక్కడితో ఆగితే అదేదో ఆనవాయితీ అని సరిపెట్టుకోవచ్చు. కాని దీనికో ‘సైంటిఫిక్’ పూత – “ఎందుకంటే (!) బంగారం రక్త ప్రవాహాన్ని పెంచుతుంది, వెండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది!” నాకైతే కాసేపు నోట మాట రాలేదు. ఒంటిమీద పెట్టుకునే నగ రక్తప్రసారాన్ని ఎలా పెంచుతుంది, రక్తాన్ని ఎలా శుద్ధి చేస్తుంది? అసలు రక్తాన్ని ‘శుద్ధి’ చెయ్యడం అంటే ఏంటి?



ఇతర ప్రపంచ సంస్కృతులలో కూడా ఏవో పురాణాలు, ఇతిహాసాలు ఉంటాయి. వాటిని ఓ కళారూపంలా చూసి గౌరవిస్తాయి, ఆనందిస్తాయి గాని. కాని వాటిని మనం చేసినట్టుగా ఆధునిక విజ్ఞానంతో కలిపి, కలగాపులగం చెయ్యవు. అలా కలగా పులగం చేసినా అక్కడి వైజ్ఞానిక సమాజం అంతా ముక్తకంఠంతో అభ్యంతరం చెప్పి ఆ పొరబాటుని ఎప్పటికప్పుడు సరిదిద్దుతుంటుంది. కాని మన దేశంలో వైజ్ఞానిక సమాజం అసలు సమాజం అనేదే లేనట్టు ప్రవర్తిస్తుంది!



అలాగే మనిషి, మనసు ఉన్నంత కాలం అధ్యాత్మికత అనేది ఉంటుంది, ఆ రంగంలో ఏదో శోధన జరుగుతూనే ఉంటుంది. కాని సైన్స్ రంగం వేరు అధ్యాత్మిక రంగం వేరు. మన సమాజంలో కూడా ఈ రెండు రంగాలని కలగలిపి, అల్లకల్లోలం చేస్తాము.



జ్ఞాన సంకరం

ఇలాంటి జ్ఞాన సంకరం మన సమాజానికి మంచిది కాదని నాకపిస్తుంది.

సైన్స్ ని శుద్ధ రూపంలో అర్థం చేసుకోవాలి, ఆచరించాలి, ప్రకటించాలి, ప్రచారం చెయ్యాలి. ఇంగ్లీష్ లో అలా సైన్స్ ని ప్రచారం చేసే అద్భుత సాంప్రదాయం ఉంది. భారతీయ భాషల్లో అది లేదు. అలాంటిది ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బ్లాగ్ ని ప్రారంభించడం జరిగింది.



బ్లాగ్ ని ప్రారంభించిన కొత్తల్లో పైన చెప్పిన సమస్యలన్నీ ఏకరువు పెడుతూ కాస్త వ్యంగ్యంగా ఓ వ్యాసం రాశాను. అందులో - ‘మన సమాజంలో (తెలుగులో) సివిల్ ఇంజినీరింగ్ మీద పుస్తకాలు ఉండవు కాని, వాస్తు మీద పుస్తకాలు కోకొల్లలు,’ మొదలైన విసుర్లు విసిరాను. అది చదివి జనం మీద పడిపోయారు.

(http://scienceintelugu.blogspot.in/2009/07/blog-post_21.html )

‘నీకసలు మన సంస్కృతి మీద గౌరవం లేద’ న్నారు. ‘ఆయుర్వేదానికి, ఆధునిక ఫార్మకాలజీకి మూలాలు ఒక్కటే నని నీకు తెలీదా?’ అని నిలదీశారు. (అవునా? ఆయుర్వేదానికి మూలాలు వాత పిత్త కఫాలనే దోషాల సమతౌల్య సిద్ధికి చెందినవని, ఆధునిక ఫార్మకాలజీ కి మూలాలు biochemistry, cell and molecular biology లో ఉన్నాయని నే విన్నాను!) నీకసలు దేశభక్తి లేదన్నట్టు మాట్లాడారు. అలాంటి స్పందనకి నేను అదిరిపోయాను. ఆ వ్యాఖ్యానాలన్నిటికీ నాకు సహేతుకమైన జవాబులు ఉన్నాయి. కాని హేతువుని వినిపించుకునే పరిస్థితుల్లో ఉన్నట్టు కనిపించలేదు వాళ్ళు.


‘యోగం అంటే నీకేంతెలుసు?’ అని అడిగాడు ఒకాయన. అందుకు జవాబుగా మాత్రం భారతీయ అధ్యాత్మిక చరిత్ర అన్న అంశం మీద వరుసగా కొన్ని వ్యాసాలు రాసి ఊరుకున్నాను. బుద్ధుడి నుండి, శ్రీ అరొబిందో దాకా అధ్యత్మిక రంగంలో భావాల పరిణామ క్రమాన్ని వర్ణిస్తూ వచ్చాను. దానికి మళ్లీ ఒక్క సమాధం లేదు! ( ఆ వ్యాసాలు ఇప్పుడు నెట్ లో లేవు. ఈ సారి మళ్లీ ఎప్పుడైనా పోస్ట్ చేస్తాను. )

(ఆ వ్యాసమాలికలో నేను ‘శ్రీరామకృష్ణుల’ మీద రాసిన వ్యాసంలో భాగాన్ని ఎవడో కొట్టేసి ఇక్కడ పెట్టుకున్నాడు.

http://bhaktipustakam.blogspot.in/2011/08/19.html అది వేరే సంగతి!)



ఆ రోజు నా కళ్ళు తెరుచుకున్నాయి. సమస్య నేను ఊహించిన దాని కన్నా చాలా లోతుగా వుంది. ఇది అంత సులభంగా మారేది కాదు. ఎందుకంటే ఎక్కడో పల్లెల్లో, పూర్తిగా నిరక్షరాస్యులు అలాంటి భావాలు పట్టుకుని వేలాడితే అర్థం చేసుకోగలం. కాని ఇంటర్నెట్ లో ప్రవేశం ఉండి, చదువు ఉండి, మంచి ఉద్యోగంలో ఉన్న వారు కూడా ఇలా…



శాస్త్రవిజ్ఞానం బ్లాగ్ లో కూడా ఈ తీరులో కొన్ని సార్లు వ్యాఖ్యానాలు కనిపిస్తుంటాయి. అవి చూస్తే నవ్వు వస్తుంది, బాధ కలుగుతుంది, భయం వేస్తుంది. ఇదంతా ఎప్పటికి మారుతుంది?


శాస్త్రవిజ్ఞానం బ్లాగ్ లో కుడా ఒక సారి నా మిత్రులు శ్రీరాముడిజన్మ నక్షత్రం లోని ‘ఖగోళ విజ్ఞానం’ గురించి, వినాయక చవితికి సంబంధించిన ‘ఖగోళ విజ్ఞానం’ గురించి రాశారు. ఏదో కొంత అభ్యంతరం చెప్పినా మిత్రులు కనుక ఏమీ చెయ్యలేకపోయాను.



ఈ ‘శాస్త్రవిజ్ఞానం’ బ్లాగ్ మూడేళ్లకి పైగా నడుస్తోంది. మంచి స్పందన వచ్చింది. చాలా మంది రీడర్లు, ఫాలోయర్లు చేరారు.

కాని కామెంట్లు పెద్దగా ఉండవు. ఉన్నా ఏదో ‘nice’ అనో ‘keep it up’ అనో అతి క్లుప్తంగా ఉంటాయి! వ్యాసం మీద చర్చ ఉండదు. (ఇంగ్లీష్ లో సైన్స్ బ్లాగ్ లలో ఎన్నో సందర్భాల్లో వ్యాసం మీద చక్కని చర్చ కనిపిస్తుంది. )



కనుక నిజంగా ఈ వ్యాసాలలో బ్లాగర్లు ఏం చూస్తున్నారో తెలీదు. చాలా మంది సాంప్రదాయానికి నిర్ధారణ సైన్స్ లో ఉందేమో నని వెతుక్కుంటూ ఉంటారు. అంతే కాని సైన్స్ ని సైన్స్ లాగా చూడరు. ఈ బ్లాగ్ కి అందుకోసమే వస్తే ఒకవిధంగా దురదృష్టమే. ఇది చాలనట్టు వ్యాసకర్తని అతిగా పొగిడేవారు ఒకరైతే, అంతగా పొగడనక్కర్లేదని మరొకరు. దీనికి తోడు తెలుగులో మన “సాంస్కృతిక వారసత్వం” అయిన చవకబారు భాష ఇక్కడ కూడా ప్రత్యక్షమై నిరుత్సాహ పరుస్తుంది.

(ప్రతీ చర్చలోను ఒక వ్యక్తిని తిట్టడమో, పొగడడమో తప్ప, ఆ వ్యక్తి అన్న మాటలని వస్తుగత దృష్టితో చూసి విశ్లేషించి, చర్చించే సంస్కారం మన సమాజంలో ఇంచుమించు లేనట్టే. మరి ఏం చేద్దాం?)


ఇవన్నీ చూస్తుంటే ఒక్కొక్కసారి విసుగు పుడుతుంది. ఏం రాస్తే యేం? అనిపిస్తుంది. నచ్చింది రాస్తే సంతోషిస్తారు. నచ్చంది రాస్తే, వారి నమ్మకాలని ప్రశ్నించేది రాస్తే, అది నిజమైనా సరే, దుమ్మెత్తిపోస్తారు. ఇక అధికశాతం మంది ఏం రాసినా మౌనంగా ఉండిపోతారు.


అనానిమస్!

మీ కామెంట్ తో నేను పూర్తిగా ఏకీభవిస్తాను. నిజానికి అలాంటి ప్రమాణాల ప్రకారమే సైన్స్ రచన చెయ్యాలి. కాని అలాంటి ప్రమాణాలని ఎంత మంది ఒప్పుకుంటారు, ఎంత మంది కోరుకుంటారు? “మన పూర్వీకులు చెప్పిందల్లా శుద్ధవైజ్ఞానికం” అని నిరూపించుకోవాలన్న ఆత్రుతే మళ్లీ మళ్లీ కనిపిస్తుంది. అందుకే అప్పుడప్పుడు ‘ప్రాచీన భారత విజ్ఞానం’ మీద వ్యాసాలు రాస్తే బోలెడు స్పందన వస్తుంది! దాని మీద చాంతాడంత చర్చ వుంటుంది. నిజంగా ఎంతో ఆలోచించి ఓ చక్కని సైన్స్ వ్యాసం రాస్తే అందుకు ‘nice’ కి మించి స్పందన వస్తే గొప్ప! మనం కోరుకునేది విజ్ఞానం కాదు. మనం కోరుకునేది మనం గొప్ప, మన జాతి గొప్ప, మన పూర్వీకులు గొప్ప, మన సంస్కృతి గొప్పది అనే అర్థం లేని అహంకారానికి అర్థం లేని సమర్థింపు!



కాని మీ కామెంట్ చూశాక సంతోషం కలిగింది. నా విసుగు చెరిగిపోయింది. ఏది సైన్స్, ఏది కాదు అన్న sensitivity ఉన్న వారు బ్లాగ్ లోని వ్యాసాలు చదువుతున్నారని, చాలా నిశితంగా, critical గా వ్యాసాలని పరిశీలిస్తున్నారని అర్థమయ్యింది. అంతకన్నా సంతోషకరమైన విషయం మరొకటి లేదు.



ఇప్పట్నుంచి అత్యున్నత జన విజ్ఞాన సాహితీ ప్రమాణాలని అనుసరించి ఈ బ్లాగ్ లో సైన్స్ వ్యాసాలని రాయడానికి, ప్రచురించడానికి ప్రయత్నిస్తాను.

మీ కామెంట్ కి మరొక్కసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ,



-శ్రీనివాస చక్రవర్తి

26 comments

  1. Anil Dasari Says:
  2. Nice ;-)

    మీలా ఆలోచించేవాళ్లు ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్లందరికీ ఇక్కడ చర్చించేంత తీరిక ఉండకపోవచ్చు. వ్యాఖ్యలున్నా లేకున్నా మీరలా ముందుకు వెళ్లండి.

     
  3. Long time reader, first time commenting here. Sir, you are on right path. If a few bloggers shout at the top of thier lungs at a topic does not mean they are right & cannot be genaraliaed as entire public opinion. India might not be as open minded as that of the west, but I do see people questioning these 'rules' of religion. The problem comes when these open thoughts on one religion gets misinterpreted and misused by other rival religions to promote thier own religion as an aid towards religion conversions. So the average 'open' minded person stop the questioning and goes into a shell of 'protecting the religion' at all costs, at the expense of denouncing science itself. Thus the reasoning gets selective as in if science align along religious beliefs accept it, if not reject it. This intermediate period would last another couple of decades after which only we can expect India would embrace scientic reasoning to the same levels as that of the west.

     
  4. Anonymous Says:
  5. Now science had become an another religion

     
  6. Anonymous Says:
  7. మీ ఆవేదన అర్థం చేసుకోదగ్గది. ఇక మన ప్రాచీన అలవాట్లలో, ఆచారాలలో సైన్సు అనేది మరి అంత తీసేయదగ్గది కాదు. ఎందుకంటే, ఇప్పుడు మనల్నే తీసుకోంది. మనం చేసే పనులు ప్రస్తుతం మనకున్న విఙ్ఞానాన్ని భట్టి ఉంటాయి. మరో 200 సంవత్సరాల తరువాత, విఙ్ఞానం మరింతగా పెరుగుతుంది. అప్పుడు ఇప్పుడు మనం చేసే కొన్ని పనులు వారికి అర్థ రహితంగానూ, మూఢ నమ్మకాలుగానూ కనిపిస్తాయి. అలా అని ఇప్పుడు మన్మ్ పూర్తిగా అవివేకముతోనో, మూఢనమ్మకాలతోనో బతకడం లేదు కదా. మన కాలములో అందుబాటులో ఉన్న విఙ్ఞానాన్ని మనం కలిగి ఉన్నాం. మన పూర్వీకులు కూడా అంతే అని నా అభిప్రాయం.

    మన పూర్వీకులు చేసిన/ఆచరించిన వాటిలో, ఇప్పటికీ పనికి వచ్చేవి ఏవన్నా ఉంటే, ఆచరించడములో తప్పులేదు. అలానే పనికిరానివాటిని వదిలేయమని అడగడములోనూ తప్పులేదు. అలా జరగాలంటే, సైన్సును సైన్సులానే చదవాలి. అప్పుడే మనకు ఏవి పనికొస్తాయి, ఏవి పనికిరావు.. అసలు ఏవి సత్యాలు, ఏవి అసత్యాలూ అన్న విషయం అవగతమవుతుంది.

     
  8. Anonymous Says:
  9. మీరు ఆ అజ్ఞాతకు ఓపిగ్గా ఇచ్చిన సమాధానం నచ్చింది. :)

    మత నమ్మకాలు, సైన్సు ఒకదానినొకటి పొడుచుకు చావక్కరలేదు. రెండూ అలా వుండొచ్చు. నమ్మకాలను ప్రచారం చేసుకోవడానికి సైన్సును వాడుకుంటున్నారంటే అది సైన్స్ విశ్వసనీయతను ఇన్-డైరెక్ట్‌గా ఒప్పుకోవడమే. సైన్స్ మాత్రం ఇలాంటి నమ్మకాల విషయంలో 'చట్టం తనపని తాను చేసుకు పోతుంది ' అన్నట్టు నిర్వికారంగా సాగాలి.

    దేవుడిని ఈక్వేషన్ల ద్వారానో, ప్రయోగాల ద్వారానో నిరూపించే వరకూ(అనంతం వరకూ) అన్వేషణ అలా కొనసాగుతుంటుంది ... , అనేలా సైన్స్ స్పూర్తి వుండాలి. :)

    / “సాంస్కృతిక వారసత్వం” అయిన చవకబారు భాష /
    'అని గట్టిగా అనరాదు. ' :) కొద్దిగా విభేధిస్తున్నా.
    శాస్త్రవేత్తలు కూడా మనుషులే, సంఘజీవులే, ఏదో దేశానికి చెందిన వారే, ఏదో నమ్మకాలు వగైరా కలవారే. బ్లాగులు వగైరాలు రాసేది తమ ఆలోచనలను నలుగురితో పంచుకోవాలనే. కామెంట్లు నచ్చినవి వస్తే అదో తృప్తి శాస్త్రవేత్తలకు కూడా కలుగుతుంది.

    /ఇప్పట్నుంచి అత్యున్నత జన విజ్ఞాన సాహితీ ప్రమాణాలని అనుసరించి ఈ బ్లాగ్ లో సైన్స్ వ్యాసాలని రాయడానికి, ప్రచురించడానికి ప్రయత్నిస్తాను/
    చేయండి, కాని ఎవరిని వుద్దేశించి రాస్తున్నారో, వారి ఆవరేజ్ శాస్త్రీయ అవగాహన ఎంతనో అనేది దృష్టిలో పెట్టుకోండి. :)

    I believe, Science and Religion can co-exist, no need to be mutually exclusive.

     
  10. Anonymous Says:
  11. Excellent article. I read and like your articles. Never commented before. Keep going. Don't change anything.

     
  12. శ్రీనివాస చక్రవర్తి గారు మీ రచనలు మీరు అనుకునే ప్రమాణాలతో నే రాయండి.
    ##'ప్రమాణాల ప్రకారమే సైన్స్ రచన చెయ్యాలి. కాని అలాంటి ప్రమాణాలని ఎంత మంది ఒప్పుకుంటారు,
    ఎంత మంది కోరుకుంటారు? ' -
    చాలా ఎక్కువ మంది ఒప్పుకున్నంత మాత్రాన అసత్యం సత్యం గా మారిపోదు కదా!
    ప్రాచిన సమాజానికి కాని, ఆధునిక సమాజానికి కాని సత్యం ఎప్పుడు గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. సమాజమే 'సత్యానికి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. ఈ రోజు కాకపోతే రేపు సత్యానికి/సైన్స్ కి సత్కారం తప్పకుండా లిభిస్తుంది.
    ##'ఇప్పట్నుంచి అత్యున్నత జన విజ్ఞాన సాహితీ ప్రమాణాలని అనుసరించి ఈ బ్లాగ్ లో సైన్స్ వ్యాసాలని రాయడానికి, ప్రచురించడానికి ప్రయత్నిస్తాను'
    మీరు చేస్తున్న ఈ కృషికి మా లాంటి వారి సదా తోడుంటుంది. వ్యాఖ్యానం చేయనంత మాత్రాన మీ రచనలను ఆదరించటం లేదనుకోకండి.

     
  13. పాతుకుపోయిన (మూఢ)నమ్మకాల ముళ్లు విప్పుకుంటూ, ప్రయాణం సాగించండం నిజంగా కత్తి మీద సామే.
    స్లాట్ ల పేరు తో టివి లలో రాజ్యమేలుతున్న అశాస్రీయతను ప్రశ్నించే వారు కూడా లేరు. మా ఊరిలో ఒకామె వచ్చి కుభేరయంత్రానికి డబ్బు కట్టమంటే,..అర్థం చేసుకోవచ్చు,..పరిస్థితిని, అదే విధంగా డాక్టర్ టీ,వాస్తు యంత్రాలు, రుద్రాక్షలు... ఇలాంటివన్ని,.ఎందుకనో జనవిజ్ఞాన వేదిక లాంటివి కూడా వీటి పైన మాట్లడారు.మీడియా తో మనకెందకనమో,..మొత్తం పైన ఒక చర్చ జరగడం మంచిదే,.
    సైన్స్ మీద తెలుగు లో వున్న బ్లాగుల సంఖ్య నాకు తెలిసి ఇంకా రెండంకలకు చేరకపోవడానికి కారణం కూడా, మీరు చెప్పిన సైన్స్ పట్ల ఫాషన్ లేక పోవడమే,....సైంటిఫిక్ మెథడ్ పట్ల సరైన అవగాహన లేక పోవడమే..
    మీరు చెప్పినట్లు పూర్వీకులు చెప్పిందంతా శుద్ద వి్జ్ఞానం కాకపోవచ్చు, కావచ్చు కూడా వాళ్లు చెప్పినట్లు,..ఏదైనా తేల్చుకోవడం మాత్రం ఖచ్చితంగా సైన్సే,...ఆ వైపు గా శాస్త్రీయంగా ప్రయత్నించే వారిని ప్రోత్సహించడం కూడా మంచిదేమో అనిపిస్తుంది,...సైన్స్ పట్ల మీ ప్రేమకు మా పూర్తి మద్దతు ఎప్పుడూ వుంటుందండి.

     
  14. Dear Friends
    మీ స్పందనకి, ఆదరణకి, స్నేహపూర్వక ప్రోత్సాహానికి ధన్యవాదాలు.
    ఈ మధ్యన జరిగిన పొరబాట్ల నుండి తగిన పాఠాలు నేర్చుకుని శాస్త్రవిజ్ఞానం బ్లాగ్ సజావుగా ముందుకి సాగిపోతుంది...

     
  15. Anonymous Says:
  16. sir

    Now you can understand 50% of Malnutrition in infants and 44% poor (Govt lekkalu may be reality inka chala ekkuva vuntay) only india lone endukunnaro arthamayyinda.......memu (Indians) ila daridramtone batukutam maku swamijilu,rangurallu,vastu,kulalu,vedalu etc lanti sakala daridrala mundu a UNO lekkalu oka matter kadu.. what ever it may be india great

     
  17. Anonymous Says:
  18. *50% of Malnutrition in infants and 44% poor, స్వామిజిలు,రంగురాల్లు,వాస్తు,కులలు,వెదాలు మొద|| లంతి సకల దరిద్రల ముందు అ యూ .యన్. ఓ లెక్కలు ఒక సంగతి కాదు *

    మీకు యు.యన్.ఓ. లెక్కల గురించి మాట్లాడే అంత తెలివి లేదని తెలుస్తున్నాది. సైన్స్ ని స్వామిజీలు ఎమైనా అడ్డుకొన్నారా? లేక 44% పేద ప్రజలు ఉంటే స్వామిజిలు దానికి కారణమ? సైన్స్ కి స్వామీజిలకి లింక్ పెట్టటమేంది? తెలివి తక్కువ తనం కాకపోతేను? ప్రభుత్వాన్ని బాధ్యులను చేయకుండా స్వామిజిల మీదపడటం ఎమీటి?

     
  19. Anonymous Says:
  20. మతం శాస్త్రీయ విజ్ఞానాన్ని ఒప్పుకోదన్న మాట పాశ్చాత్య దేశాలవారిదే. వారిని మీరు అనుసరిస్తున్నారు భారత ప్రజలు వెర్రి వాళ్ళు కాదు, అరటి పండును చూసి ఓ! పొటాసియం అన్నవాడు, ఒక స్త్రీని చూసి కంఫర్ట్ ఆబ్జక్ట్ అనికూడా అనగలడు, వారికి ఉన్నది పరిమిత జ్ఞానం, అదే సర్వస్వం, అంతకు మించి ఏమీ లేదనుకుంటున్నారు, మీరూ అదేదారిలో శాస్త్రీయ విజ్ఞానమే సర్వస్వం, ఇతరమేమీ లేదనుకుంటూ కొత్త మతం స్థాపించుకున్నారు. అంతే తేడా.భారతీయమయినదానిని దేనినీ మీరు హర్షించలేరు, అది మీమతం.

     
  21. anrd Says:
  22. * నిజమేనండి. సామాన్యులతో మాట్లాడితే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. అంతగా చదువుకోని వారికి కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి.

    * భారతదేశంలో కూడా అంతగా చదువుకోని వారికి కూడా చాలా విషయాలు తెలుసండి.

    * పూర్వం చదువుకోని రైతుల వంటివారికి కూడా సేద్యానికి సంబంధించిన ఎన్నో మెలకువలు శాస్త్రవేత్తల కన్నా ఎక్కువగానే తెలిసేవి.

    * శాస్త్రవేత్తలది పుస్తక విజ్ఞానం అయితే , సామాన్య ప్రజలది అనుభవంతో వచ్చిన విజ్ఞానం. తరతరాలనుంచి పరంపరగా నేర్చుకున్న అనుభవాల వల్ల వారికి అలా తెలిసేవి.

    * అయితే, ఇప్పుడు బహుళజాతిసంస్థలు రంగంలో ప్రవేశించి ఎరువులు, విత్తనాల వ్యవస్థ యొక్క రూపురేఖలను మార్చివేసి సేద్యాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవటం వల్ల రైతులు తమ ప్రాచీన సేంద్రియ ఎరువులు, విత్తనాల వ్యవస్థకు దూరమై , గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

    *వ్యవసాయం మాత్రమే కాదు సాంప్రదాయ వృత్తివిద్యలు వంటి అనేక రంగాల్లో పరిస్థితి ఇలాగే ఉంది. కొందరు పెట్టుబడిదారుల గుప్పిట్లో వ్యవస్థలు ఉన్నాయి.

    * ఏ రంగంలోనైనా శాస్త్రవేత్తలు, సామాన్య ప్రజలు కలిసి పనిచేస్తే మరింత మెరుగైన ఫలితాలను సాధించవచ్చు.

    * ప్రాచీన గ్రంధాలలో కూడా ఎంతో సైన్స్ ఉందండి.. ఆధునికులు చెప్పేది మాత్రమే సైన్స్ కాదండి. పూర్వీకులు ఏర్పరిచిన ఆచారవ్యవహారాల్లో ఎంతో సైన్స్ ఉంది.

    * ఆయుర్వేదం వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతున్నాయి. అది వైద్యశాస్త్రమే కదా ! యోగా వల్ల వ్యాధులు తగ్గిన వారెందరో ఉన్నారు.

    * ఇప్పటి వాళ్ళు పరికరాల సహాయంతో గ్రహణాల గురించి చెప్తే . పూర్వీకులు గణితం సహాయంతో లెక్కవేసి, సంవత్సరానికి ముందే పంచాంగంలో గ్రహణాల గురించి చెప్పగలుగుతున్నారు కదా !

    * సిమెంట్ వంటివి వాడకుండా పూర్వీకులు నిర్మించిన ఎన్నో దేవాలయాలు ఇప్పటికీ ఉన్నాయి. ఆ ఇంజనీరింగ్ పనితనం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

    * ప్రాచీనులకు గణితశాస్త్రం, ఖగోళశాస్త్రం, ఇంకా ఎన్నో శాస్త్రాలు చక్కగా తెలుసు.

    * పూర్వీకులు ఎంతో కష్టపడి మనకు అందిం,చిన విజ్ఞానాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

    * ఆధునిక వైద్యులు రకరకాల పరికరాల సాయంతో రోగాలను కనుక్కుంటే , పూర్వకాలంలో రోగి యొక్క ముఖాన్ని పరిశీలించే శరీరంలోని రోగాలను కనిపెట్టే గొప్పవైద్యులు ఉండేవారు. అప్పుడు సుశ్రుతుడు వంటి ఎందరో గొప్పవాళ్ళు శస్త్రచికిత్సలు కూడా చేసారని గ్రంధాలలో ఉంది.

     
  23. anrd Says:
  24. This comment has been removed by the author.  
  25. UG SriRam Says:
  26. *50% of Malnutrition in infants and 44% poor, స్వామిజిలు,రంగురాల్లు,వాస్తు,కులలు,వెదాలు
    మొద|| లంతి సకల దరిద్రల ముందు అ యూ .యన్. ఓ లెక్కలు ఒక సంగతి కాదు *

    Please watch this interview
    Devinder Sharma "Silent Tsunami of Hunger" in Global Food Crisis.
    http://www.youtube.com/watch?v=uk3Zy0ZYQsQ&feature=player_embedded


    SriRam

     
  27. anrd Says:
  28. * శాస్త్రవిజ్ఞానము బ్లాగులో నేను సాంప్రదాయ విజ్ఞానం గురించి రాయటమేమిటని అజ్ఞాత ఆవేశపడిపోతున్నారు. అయితే, పుంసవనము ప్రక్రియ గురించి, కుంకుమపువ్వు వాడకం గురించి ప్రాచీనులు తెలియజేసిన విషయాలను శాస్త్రవిజ్ఞానము బ్లాగులో రాసారు కదా !

    * ఆధునిక విజ్ఞానం వల్ల కొన్ని లాభాలు కలుగుతున్న మాట నిజమే కానీ, ఎన్నో అనర్ధాలు కూడా జరుగుతున్నాయి.

    * రోగులు యాంటిబయాటిక్స్ను విపరీతంగా వాడటం వల్ల , క్రమంగా రోగకారక బాక్టీరియా మందులకు కూడా లొంగని ప్రమాదకర పరిస్థితి పొంచి ఉంది.

    * ఆధునిక విజ్ఞానం కనుగొన్న రసాయనాల వాడకం వల్ల భూమి, నీరు, కలుషితం అయిపోతోంది. ఇంకా, జీవజాతులెన్నో అంతరించిపోతున్నాయని ఈ మధ్యనే జరిగిన జీవవైవిధ్య సదస్సు ద్వారా అందరూ గగ్గోలు పెట్టారు కదా !

    * అభివృద్ధి అంటూ ప్రపంచాన్ని , పర్యావరణాన్ని, జీవజాలాన్ని అతలాకుతలం చేసే హక్కు ఎవరికైనా ఎలా ఉంటుంది ?

    * ఆధునికవిజ్ఞానం అందించిన ప్లాస్టిక్, సెల్ టవర్స్, అణు విజ్ఞానం .........ఇలాంటి వాటి వల్ల ప్రపంచానికి, జీవులకు ఎన్నో నష్టాలు కలుగుతున్నాయి.

    * ఆధునిక పరికరాల ( ఎలెక్ట్రానిక్ ) నుంచి వెలువడే వాయువుల వల్ల ఓజోన్ పొర దెబ్బతినటం, ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోవటం ........ వంటి ఎన్నో అనర్ధాల గురించి అందరికి తెలుసు .

    * విపరీతమైన యాంత్రీకరణ వల్ల ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది.

    * ఆధునికవిజ్ఞానం అయినా ప్రాచీన విజ్ఞానం అయినా ఏదైనా ప్రపంచానికి , పర్యావరణానికి, సమాజానికి ఉపయోగపడటం ముఖ్యం.

    * ప్రాచీనులకు ఏమీ తెలియదు అనుకోవటం ఇప్పటివాళ్ళ దురదృష్టం.

    * ప్రాచీనులది పర్యావరణానికి హాని చెయ్యని విజ్ఞానం. ప్రాచీనుల విధానాల వల్ల ప్రపంచానికి హాని కలగలేదు.

    * ఆధునిక విజ్ఞానం ఆవిర్భవించిన ఈ కొద్ది కాలంలోనే సహజవనరుల నాశనం, పర్యావరణం కలుషితం అయిపోవటం వంటి అనర్ధాలెన్నో జరుగుతున్నాయి.*

    *ప్రాచీనులు అందించిన విజ్ఞానాన్ని పరిరక్షించుకోవలసిన అవసరం ఎంతో ఉంది.

    * నాకు ఆధునిక విజ్ఞానం అన్నా గౌరవమే. అయితే, ప్రపంచానికి నష్టం కలుగని విధంగా ప్రపంచానికి ఉపయోగపడే ప్రయోగాలు జరిగితే అందరికీ ఆనందమే. అలాంటి ఆవిష్కరణలు జరగాలని అందరము కోరుకుందాము.

    * మీ బ్లాగులో ఎంతో ఎక్కువ స్థలాన్ని వాడినందుకు దయచేసి క్షమించండి.

     
  29. Anonymous Says:
  30. anrd gaaru మీరు చెప్పింది చూస్తే, అన్ని అనర్థాలకు మోడరన్ సైన్సే కారణమనిపిస్తోంది. కంప్యూటర్ వైర్స్‌లే కొత్త కొత్త రోగాలు పుట్టుకొస్తున్నాయి. ఇంటర్నెట్ వాడకం తగ్గిస్తే ఆరోగ్యంగా వుంటామట. :)

     
  31. anrd Says:
  32. పేదరికం పెరిగిపోయినా పట్టించుకునేదెవరండి. వేల కోట్లు ఆయుధపోటీలకు , అంతరిక్ష పోటీలకు ఖర్చుపెడుతున్నారు కదా !
    ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆహారం సరిపోక చస్తున్నా, ఇంకా ఆహారపంటలను కూడా తినటానికి కాకుండా వాహనాలు నడపటానికి పరిశోధనలు చేసి వాహనాలు నడుపుతున్నారు.

    ఆధునిక శాస్త్రపరిశోధనలలో చాలా పరిశోధనలు , సామాన్యుల కన్నా , ధనవంతుల విలాసాలకే ఎక్కువగా ఉపయోగపడుతున్నట్లు అనిపిస్తోంది.

     
  33. anrd Says:
  34. నిజమేనండి. కంప్యూటర్, సెల్ ఫోన్లు. వంటివి ఎక్కువగా వాడటం వల్ల కూడా వెన్ను నెప్పులు, మెడ నొప్పులు, నరాల బలహీనత, తల తిరగటం .... వంటి వ్యాధులు వస్తున్నాయని పరిశోధకులు చెప్తున్నారు.

    ఆధునిక టెక్నాలజీ ద్వారా అంధులకు చూపును తెప్పించటం గురించి. ఈ మధ్య ఒక వార్త చదివాను. నాకు చాలా సంతోషం కలిగింది. ఆధునిక విజ్ఞానం ఇలాంటి పరిశోధనలు చేస్తే అందరికీ సంతోషమే.
    పూర్వం కూడా ఎన్నో గొప్ప వైద్య విధానాలు ఉండేవట. అయితే, మన దురదృష్టం, నిర్లక్ష్యం వల్ల ఎన్నో ప్రాచీన గ్రంధాలను కోల్పోయాము.

    ఆధునిక శాస్త్రవేత్తలు ప్రకృతి నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుని ఎన్నో వస్తువులను తయారుచేస్తున్నారు. ఉదా...పక్షిని గమనించి విమానం తయారుచేయటం వంటివి.

    * ఇంత అద్భుతమైన సృష్టిని సృష్టించిన దైవమే గొప్ప శాస్త్రవేత్త.

     
  35. Anonymous Says:
  36. anrdగారు మీరు ఆధునిక సామగ్రి ఇంట్లో అసలు వాడరా? కంప్యూటర్ నుంచి వచ్చే కిరణాలు మెదడులో కేన్సర్ కలుగజేస్తాయట, దానికి కనీసం 10అడుగుల దూరం వుండాలట.

     
  37. Anonymous Says:
  38. u r hecklin her which is not correct. she is arguing on apoint. why don't u do that?. u r not amenable to discipline and not interested to hear the other version.

     
  39. Anonymous Says:
  40. పై అజ్ఞాత లేనిపోనివి వూహించి, శకునిలా విషాన్ని నోరి పోస్తూ anrd గారి మనోభావాలను దెబ్బతీస్తున్నారు. కష్టపడి అన్ని పాయింట్లు రాసి వుంటే ఒక పాయింట్ పట్టుకున్నారని heckle చేయడం గమనించకపోలేదు. కంప్యూటర్, టివి మానిటర్ల నుండి తీక్షణమైన కిరణాలు వస్తాయన్నది నిజంకాదా? ఎందుకు వ్యాపార లాభాలకోసం నిజాలు దాస్తారు?

     
  41. anrd గారు చెప్పిన వాటిల్లో మీకు ఏమయినా నచ్చకపోతే, ఎందుకు నచ్చలేదో కారణాలతో విశదీకరిస్తే బాగుంటుంది అంతేగానీ పాతుకుపోయిన మూఢ నమ్మకాలంటూ తోసిపుచ్చటం బాగాలేదు.

     
  42. anrd Says:
  43. నేను ఆధునిక పరికరాలను తక్కువగా వాడటానికి ప్రయత్నిస్తున్నాను.

    పిచ్చుకలు సెల్ ఫోన్స్ వాడకపోయినా మనుషులు వాడే సెల్ టవర్ల వల్ల పిచ్చుకలు వంటి పక్షులకు హాని కలుగుతోంది కదా !

    సిగరెట్ పొగ త్రాగే వారితో పాటు ప్రక్కన ఉన్న వారికి కూడా హాని కలిగిస్తుందట. అలాగే కొందరి చర్యల ప్రభావం ఎందరికో హాని కలిగించే అవకాశం ఉంది.

    కంప్యూటర్ మొదలైన వాటిని తయారుచేయటానికి lead, mercury, arsenic and cadmium,............మొదలైనవి ఉపయోగిస్తారట.

    వాడిపడేసిన e-waste వల్ల భూమి, భూగర్భనీరు కూడా కలుషితం అవుతుందని, ఇందువల్ల మనుషులు, జంతువులకు ఎంతో హాని కలుగుతుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇందువల్ల లోపాలతో ఉన్న బిడ్దలు పుట్టటం, ఇంకా కాన్సర్ వంటి ఎన్నో రోగాలు వచ్చే అవకాశం ఉందంటున్నారు.

    ఇవన్నీ నేను పరిశోధించి కనుగొనలేదండి. ప్రపంచం బాగుండాలని కోరుకునే శాస్త్రవేత్తలు ఎందరో ఉన్నారు. వారు కనుక్కుని చెప్పిన విషయాలివి. అంతర్జాలం లోనే ఈ వివరాలు కూడా ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు చదవవచ్చు.

     
  44. anrd Says:
  45. నా వ్యాఖ్యలో,... " పూర్వం చదువుకోని రైతుల వంటివారికి కూడా సేద్యానికి సంబంధించిన ఎన్నో మెలకువలు శాస్త్రవేత్తల కన్నా ఎక్కువగానే తెలిసేవి. " ...అని రాసాను. ఇక్కడ నా అభిప్రాయాలను సరిగ్గా వ్యక్తీకరించలేకపోయాను అనిపించిందండి.

    అంటే , పెద్దల ద్వారా తెలుసుకున్న, ఇంకా తమ సొంత అనుభవం ద్వారా తెలుసుకున్న విషయాలు .... అని నా అభిప్రాయం.

    ఇలాంటి కొన్ని చిట్కాలను శాస్త్రవేత్తలు నమ్మకపోయినా అవి బాగా పనిచేస్తాయి....ఆ విధంగా వారికి ఎన్నో మెలకువలు తెలుసు..... అన్న అభిప్రాయంతో అలా రాసాను.

    అయితే ..." శాస్త్రవేత్తల కన్నా ఎక్కువగానే తెలిసేవి ...." అని రాయకుండా ఉంటే బాగుండేది . అని తరువాత అనిపించిందండి. నాకు శాస్త్రవేత్తలంటే ఎంతో గౌరవం. ..ఇలా రాసినందుకు ఎవరికైనా బాధ కలిగితే దయచేసి క్షమించండి.
    .............................
    శాస్త్రవేత్తలు కూడా ప్రపంచానికి మేలు చేయాలన్న అభిప్రాయంతోనే పరిశోధనలు చేస్తారు. అయితే , కొన్నిసార్లు ఏమవుతుందంటే. మంచిది అని కనుక్కున్న విషయం యొక్క దుష్ప్రభావాలు ఆలస్యంగా తెలుస్తాయి.

    ఉదా........ప్లాస్టిక్ వల్ల ఎన్నో లాభాలు ... అని మొదట అనుకున్నారు. ఎన్నో సంవత్సరాల తరువాత నిదానంగా ప్లాస్టిక్ యొక్క దుష్ప్రభావాలు తెలిసాయి.

     
  46. Anonymous Says:
  47. Sure you won't reply.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts