శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.

ఉదాహరణకి 1597 లో ఆంద్రియాస్ లిబావ్ అనే జర్మన్ పరుసవేది (ఇతడికి లిబావియస్ అనే లాటిన్ పేరు కూడా ఉంది) ఆల్కెమియా అనే పుస్తకం రాశాడు. గతంలో పోగైన పరుసవేద సారం మొత్తాన్ని ఆ పుస్తకంలో పొందుపరిచాడు. రసాయన శాస్త్రంలో అది మొట్టమొదటి పాఠ్యగ్రంథం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అందులో ఎలాంటి తత్వజ్ఞానాన్ని జోడించకుండా శుద్ధ వైజ్ఞానిక పరిభాషనే వాడాడు. పైగా పారాసెల్సస్ అనుయాయులు ప్రచారం చేసిన పాత, బూజుపట్టిన భావాల మీద దుమ్మెత్తి పోశాడు. అయితే పరుసవేదం యొక్క ముఖ్యలక్ష్యం బంగారం తయారుచెయ్యడం కాదని, వైద్య చికిత్సకి చేదోడువాదోడుగా ఉండడం అనే నమ్మకంలో ఇతడు పారాసెల్సస్ లో ఏకీభవించాడు.

హైడ్రోక్లోరిక్ ఆసిడ్, టిన్ టెట్రాక్లోరైడ్, అమోనియమ్ సల్ఫేట్ మొదలైన రసాయనాల తయారీని మొట్టమొదట వర్ణించిన వాడు ఈ లిబావియస్. అక్వారెజియా (“రాచనీరు”) తయారీని కూడా ఇతడు వర్ణించాడు. నైట్రిక్ ఆసిడ్, హైడ్రోక్లోరిక్ ఆసిడ్ ల మిశ్రమం అయిన ఈ ద్రావకం బంగారాన్ని కూడా కరిగించగలదు. అందుకే దానికా పేరు. ఒక ద్రావకం ఆవిరి అయినప్పుడు మిగిలే స్ఫటికాల (crystals) ఆకారాల బట్టి ఖనిజాలని వర్గీకరించొచ్చని కూడా ఇతడు భావించాడు.

అయితే లోహాల రూపాంతరీకరణ సాధ్యమేనని ఇతడు నమ్మేవాడు. కనుక బంగారం యొక్క తయారీకి సంబంధించిన రసాయనిక పద్ధతుల రూపకల్పన ఓ ముఖ్యమైన రసాయనిక లక్ష్యంగా భావించేవాడు.

1604 లో యోహాన్ థోల్డె అనే జర్మన్ ప్రచురణ కర్త మరింత సవిరమైన, ప్రత్యేకమైన పుస్తకాన్ని ప్రచురించాడు. (ఈ పుస్తక రచయిత అని తప్ప ఈ వ్యక్తి గురించి మరే ఇతర వివరాలు లేవు). ఈ పుస్తకాన్ని రాసింది బాసిల్ వాలెంటీన్ అనే సాధువు అని చెప్పుకున్నాడు ఆ ప్రచురణ కర్త. అయితే ఆ కలంపేరుతో ప్రచురణకర్తే ఆ పుస్తకాన్ని రాసి ఉండే ఆస్కారం కూడా ఉంది. “ఆంటిమనీ రథపు జైత్రయాత్ర (The triumphal Chariot of Antimony) అని పేరు గల ఈ పుస్తకంలో ఆంటిమనీ యొక్క వైద్య ప్రయోజనాల గురించి, దాని సంయోగాల (compounds) గురించి చెప్పబడింది.

ఆ తరువాత వచ్చిన యోహాన్ రడోల్ఫ్ గ్లౌబర్ (1604-1668) అనే జర్మన్ రసాయనికుడు సల్ఫరిక్ ఆసిడ్ కి, మామూలు ఉప్పుకి మధ్య జరిగే చర్య సహాయంతో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ పుట్టించే పద్ధతిని కనుక్కున్నాడు. ఈ పద్ధతిలో హైడ్రోక్లోరిక్ ఆసిడ్ తో పాటు సోడియమ్ సల్ఫేట్ అవశేషంగా మిగులుతుంది. దీన్నే నేటికీ మనం “గ్లౌబర్ సాల్ట్” అంటాం.
గ్లౌబర్ తను కనుక్కున్న ఈ కొత్త పదార్థాన్ని లోతుగా శోధించాడు. దాని విరేచనకారక (laxative) లక్షణాలని గుర్తించాడు. దానికి “సాల్ మిరాబీల్” (అద్భుత లవణం) అని పేరు పెట్టాడు. అది సర్వరోగనివారిణి అని, అమృతతుల్యమైన పదార్థమని చాటేవాడు. ఈ పదార్థంతో పాటి ఔషధ లక్షణాలు గల మరి కొన్ని పదార్థాలని కూడా భారీ ఎత్తున ఉత్పత్తి చేసే వ్యాపారంలోకి దిగాడు. ఆ విధంగా బాగా సంపాదించాడు. బంగారం ఉత్పత్తి కన్నా ఇది మరింత ఐహికమైన, వాస్తవికమైన వ్యాపకం కావడమే కాక, మరింత లాభదాయకం కూడా.

(సశేషం...)

3 comments

  1. Anonymous Says:
  2. పరుసవేది అనే మాటకున్న అర్థాన్ని మార్చి ప్రయోగించడం చూసి ఆశ్చర్యపోయాను. పరుసవేది మనిషీ కాదు. శాస్త్ర సిద్ధాంతమూ కాదు. అదొక వస్తువు. దాన్ని మనిషినీ, సిద్ధాంతాన్నీ చేసి ప్రయోగిస్తే మఱి పరుసవేదిని ఏమని పిలవాలి ? ఈ అర్థానికి అలవాటు పడ్డాక, పాత తెలుగుపుస్తకాల్లోని పరుసువేది అనే మాట తదుపరితరాలవాళ్ళకు కొఱుకుడు పడకుండా పోతుంది కదా ? Alchemy కి తెలుగులో రసవాదం అనే ఒక మంచిపదం ఉంది. దాన్ని అభ్యసించేవారిని/ ప్రయోగించేవారిని రసవాదులంటారు. పాత పదాలకు కొత్త అర్థాల అన్వయనం నిషిద్ధం కాదు. కానీ అలా అన్వయించేటప్పుడు మూలపదం ఏ అర్థాన్ని సూచిస్తుందో ఆ అర్థం పూర్తిగా మఱుగున పడకూడదు. ఆ పదానికి ప్రత్యామ్నాయం దొఱకని పరిస్థితి ఉత్పన్నం కాకూడదు.

     
  3. మీరు చెప్పింది నిజమే.
    అయితే పొరబాటు ఎలా వచ్చిందో చెప్తాను. Paulo Coehlo రాసిన Alchemist కి తెలుగు అనువాదం టైటిల్ పరుసవేది అని ఉండడం చూశాను. కనుక ఆల్కెమిస్ట్ ని పరుసవేది అంటారని అనుకున్నాను. ఆల్కెమీని పరుసవేదం ఆంటారని తెలుసు. ఈ వ్యాసాలలో కూడా అలాగే వాడుతూ వచ్చాను.

    మీ కామెంట్ చూశాక ఇందాకే రెండు నిఘంటువులు తిరగేశాను. నాకు అర్థమయ్యింది ఇది.
    Alchemist = రసవాది, స్వర్ణయోగి
    Alchemy = పరుసవేదం, రసవాదం
    Philosopher’s stone = పరుసవేది (నిమ్న లోహాలని బంగారంగా మార్చగల రాయి)

    విషయాన్ని స్పష్టీకరించినందుకు ధన్యవాదాలు.

     
  4. Karunakar Says:
  5. I deserved sir

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

  • Total Posts: 1105
  • Total Comments: 1561
Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts