
బ్లాగర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.ఈ సందర్భంలో ఆధునిక భారతంలో ప్రథమ వైజ్ఞానికుడు అని చెప్పుకోదగ్గ ఓ అసమాన శాస్త్రవేత్త గురించి ధారావాహిక శీర్షికని మొదలుపెడుతున్నాం. ఆధునిక భారత విజ్ఞానం చాలా మటుకు పాశ్చాత్యులు వేసిన బటలలోనే నడవడం కనిపిస్తుంది. ఎక్కడైనా గొప్ప సామర్థ్యం, ప్రతిభ కనిపించినా అది పాశ్చాత్య ప్రమాణాలలోనే ఇమిడి ఉంటోంది. భారతీయ విజ్ఞానానికి దానికంటూ ఒక ప్రత్యేక పంథా లేదా? పాశ్చాత్య మేధావులు నేర్పిన పాఠాలని బుద్ధిగా వల్లెవేయడంతోనే...

“తేలే అద్దం” ని ఎలా కనుక్కున్నారు?పరోపకారం చేస్తే దేవుడు మేలు చేస్తాడంటారు. బ్రిటిష్ ఇంజినీరు అలిస్టేర్ పిల్కింగ్టన్ విషయంలో అదే జరిగింది.1952 లో ఓ రోజు పిల్కింగ్టన్ కి ఎందుకో పాపం భార్యకి వంటగదిలో పనిలో సాయం చెయ్యాలని అనిపించింది. చొక్కా చేతులు పైకి లాక్కుని సింకు వద్ద పాత్రలు తోమడానికి సిద్ధపడ్డాడు. సింకులో సబ్బు నీళ్లలో గిన్నెలు మునిగి ఉన్నాయి. నీటి మీద నురగ బుడగలు తేలుతూ, పేలుతూ ఆటలాడుతున్నాయి. పనిలో చిన్న బ్రేక్ తిసుకుని ఆ నురగ లాస్యం...

సింహాలు, హైనాలు, వేటకుక్కలు మొదలైన జంతువులు గుంపులుగా వేటాడతాయి. ఒక రకం వేటకుక్కలు (Cape hunting dogs) వంతులవారీగా, వ్యూహాత్మకంగా జింకలని వెంటాడి, ఆ జింకలు అలసిపోయి ఇక కదలలేని పరిస్థితికి చేరుకున్న దాకా తీసుకువెళ్తాయి. హైనాల దండులు వేటాడబోయే జంతువుని బట్టి వాటి దండు యొక్క పరిమాణాన్ని మార్చుకుంటూ ఉంటాయి. క్రూక్ అనే శాస్త్రవేత్త బృందం చేసిన అధ్యయనాల బట్టి జీబ్రాలని వేటాడే హైనాల గుంపుల్లో సగటున 10.8 హైనాలు, దున్నలని వెంటాడే గుంపుల్లో సగటున...

కేవలం హెచ్చరికతో ఆగిపోకుండా కొన్నిసార్లు కొన్ని జంతువుల మందలు వ్యూహాత్మకంగా ఆత్మరక్షణ చేసుకోగలవు.కస్తూరి ఎద్దు (?) (musk ox) ఉత్తర అమెరికాలో అలాస్కా, కెనడా మొదలైన అతిశీతల ప్రాంతాలకి చెందిన టండ్రా బయళ్లలో జీవిస్తుంది. వత్తయిన బొచ్చు గలది కనుక తీవ్రమైన చలికి తట్టుకోగలదు. దీని కళ్ల కింద ఉండే గ్రంధుల నుండి ఒక విధమైన పరిమళం వెలువడుతుంటుంది. అందుకే వాటికా పేరు... అవి ధృఢమైన శరీరం కలిగి, దట్టమైన కొమ్ములు గల బలిష్టమైన జీవాలు. శత్రువు వీటిని అటకాయించినప్పుడు...

ఎంపరర్ పెంగ్విన్ జంటల అన్యోన్యతఅంటార్కిటికాలో జీవించే ఎంపరర్ పెంగ్విన్లు అనే జాతి పెంగ్విన్ల జంటలలో అద్భుతమైన అన్యోన్యత కనిపిస్తుంది. వాటి సంతతనికి సాకడంలో అవి చూపించే త్యాగనిరతి చూస్తే జంతు లోకం మీద గౌరవం పెరుగుతుంది.ఎంపరర్ పెంగ్విన్లు మామూలు పెంగ్విన్ల కన్నా బాగా పెద్దవి. వీటి ఎత్తు 120 cm ఉంటుంది. బరువు సుమారు 34 kg ఉంటుంది. ఎంపరర్ పెంగ్విన్ల నివాస విధానాలు కూడా చాలా విచిత్రంగా ఉంటాయి. పెద్ద పెద్ద గుంపులుగా పోగై గుడ్లు పెడతాయి. ఈ సమిష్టి...

మందగా బతకడం వల్ల శత్రువుల నుంచి రక్షణ మరింత కట్టుదిట్టం అవుతుంది. మందలో ఉన్నప్పుడు ఒకరు కాకపోతే మరొకరు అప్రమత్తంగా ఉంటారు కనుక శత్రువు రాకని ఎవరో ఒకరు గుర్తించక మానరు. శత్రువుని ఒకరు గుర్తించగానే, రకరకాల కూతలతో, కేకలతో మంద మొత్తానికి ఆ వార్త ఇట్టే తెలిసిపోతుంది. మందలో అన్ని కళ్లు శత్రువు కోసం కనిపెట్టుకుని ఉంటాయి కనుక, సగటున మందలో ఉన్న జంతువు మరింత ఎక్కువగా, మరింత నిర్భయంగా మేయగలుగుతుంది.ఈ సత్యాన్నే ఎర్రని ముక్కున్న వీవర్ పక్షులలో (red-billed...

Normal 0 false false false EN-US X-NONE X-NONE ...

(Mars city - artist's impression) మరో గ్రహంపై మహానగరాలుమార్స్ మీద కొంత కాలంగా వస్తున్న పోస్ట్ లలో ఇది ఆఖరి పోస్ట్. ఇందులో మార్స్ మీద నగర నిర్మాణం గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.మార్స్ మీద మనిషి పాదం మోపిన మర్నాటి నుండి నగర నిర్మాణం ఆరంభం కాదన్నది స్వయం విదితం. మొదటి చిన్న సంఖ్యలో మనుషులు అక్కడ నివసించడం మొదలుపెడతారు. వారి నివాసానికి మత్రం చిన్న చిన్న స్థావరాల ఏర్పాటు జరుగుతుంది. ఈ ప్రథమ నివాసాన్ని ’ఆల్ఫా’ అన్న పేరుతో వ్యవహరిస్తుంటారు....

మానవ జాతి భవిష్యత్తు నాచు మీద ఆధారపడి ఉందా?మార్స్ గ్రహం మానవ నివాస యోగ్యం కావాలంటే అక్కడి పర్యావరణం సమూలంగా మారాలి. ఆ మార్పులో కొన్ని దశలని కిందటి పోస్ట్ లో గుర్తించాం. 1) ముందు వాతావరణపు ఉష్ణోగ్రత పెరగాలి. దాని వల్ల ఘనరూపంలో ఉన్న CO2 ఆవిరై, వాతావరణంలోకి ప్రవేశించాలి. ఆ విధంగా ఉష్ణోగ్రత మరింత పెరగాలి. 2) పెరిగే ఉష్ణోగ్రత వల్ల మంచు కరిగి జలాశయాలు ఏర్పడాలి. 3) ఇక ఈ మధ్యలో అక్కడి వాతావరణంలో మనగల వృక్షరాశిని ప్రవేశపెడితే దాని ప్రభావం చేత CO2...

(<-- Before Terraforming) (<-- After Terraforming) మానవ నివాసానికి అనుగుణంగా మార్స్ గ్రహాన్ని సంస్కరించడం అనేది ఓ బృహద్ ప్రయత్నం. ఆ ప్రయత్నంలోని మొదటి దశే కొన్ని దశాబ్దాలు, లేదా శతాబ్దాలు పట్టొచ్చు. భూమిని పోలిన పరిస్థితులు అక్కడ నెలకొనాలంటే కొన్ని సహస్రాబ్దాలు కూడా పట్టొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. తేమ ఛాయలైనా లేని ఎర్రని బంజరు లోకంలో, చెట్లు చేమలతో, పశుపక్ష్యాదులకే కాక మానవ నాగరక జీవనానికి ఆలవాలం కాగల హరితభూమిగా, ఓ కొత్త...

అంగారక లోకపు "ధరాసంస్కరణ"భూమి తరువాత మనుషులు పెద్ద సంఖ్యలో నివసించదగ్గ గ్రహం అంటూ ఏదైనా ఉంటే అది మార్స్ గ్రహమే నని స్పష్టమయ్యింది. ఎందుకంటే మార్స్ కి భూమికి మధ్య కొన్ని పోలికలు ఉన్నాయి. - మార్స్ మీద రోజు వ్యవధి - 24 గంటల 37 నిముషాలుభూమి మీద రోజు వ్యవధి - 24 గంటల 56 నిముషాలు- మార్స్ అక్షం యొక్క వాలు - 24 డిగ్రీలుభూమి అక్షం యొక్క వాలు - 23.5 డిగ్రీలు- మార్స్ గురుత్వం భూమి గురుత్వంలో మూడో వంతు- భూమి మీద లాగానే మార్స్ మీద కూడా ఋతువులు ఉంటాయిఅయితే...

(Deimos)అంగారక చందమామలుపేరుకైతే మార్స్ కి రెండు చందమామలు. కాని వాటిని చూపిస్తే పిల్లలు బువ్వ తినడం మాని కెవ్వు మంటారు. ప్రేయసి మోముని వాటితో పోల్చితే వొదిలేసి వెంటనే భూమికి తిరిగెళ్లిపోవడం ఖాయం!అయినా సరే... మార్స్ మీద సెటిలయ్యే ఉద్దేశం ఉన్నప్పుడు, మరీ అక్కడి సాటిలైట్ల గురించి తెలీకపోతే ఎలా?మార్స్ కి చెందిన రెండు ఉపగ్రహాలూ గ్రహానికి చాలా దగ్గరలో తిరుగుతుంటాయి. (భూమి నుండి చంద్రుడి దూరం కన్న వీటి దూరం చాలా తక్కువ). వీటిలో కాస్త చిన్నదైన డెయిమోస్...

మార్స్ లోకపు కొసలుమార్స్ ఉపరితలాన్ని పరిశీలించాం. ఎన్నో ముఖ్యమైన ప్రదేశాలు చూశాం. గుట్టలు, మిట్టలు, కొండలు, బండలు, అగాలు, అగడ్తలు, హిమవన్నగాలు, హిమానీనదాలు... అంగారక అవనీతలాన్ని అంగరఖాలా ఆవహించే అగమ్యమైన అరుణానిలాలతో అందరం ఆ లోకాన్ని ఆలోకించాం. ఇక ఆ ప్రపంచపు అంచులే మిగిలాయి. అవే శాశ్వత హిమావృతమైన ఉత్తర, దక్షిణ ధృవాలు.మార్స్ ధృవాల వద్ద పైపొరలో ఉన్నది గడ్డకట్టుకున్న కార్బన్ డయాక్సయిడ్ అని ముందు చెప్పుకున్నాం. అయితే దాని అడుగున కొంత గడ్డ కట్టిన...

మార్స్ మీద రెండు బహుచక్కని ఉల్కాబిలాలుమార్స్ కి వెళ్లినప్పుడు అక్కడ తప్పనిసరిగా చూడదగ్గ రెండు ఉల్కాబిలాలు ఉన్నాయి. ఈ ఉల్కాబిలాల ప్రత్యేకత ఏంటంటే గతంలో నాసా పంపిన రెండు మార్స్ పర్యటనా వాహనాలు (వాటి పేర్లు Spirit మరియు Opportunity - కుక్కపిల్లల పేర్లలా ఉన్నాయంటారా?) అక్కడే వాలాయి. ప్రాచీన కాలంలో మార్స్ మరింత వెచ్చగా ఉండేదని, మరింత జలమయంగా ఉండేదని తేల్చడానికి సాక్ష్యాధారాలు కూడా అక్కడే దొరికాయి.గసేవ్ ఉల్కాబిలం (Gusev crater)(Sunset from Gusev...

ఒలింపస్ మాన్స్థార్సిస్ కుంభ ప్రాంతంలో మొత్తం నాలుగు అగ్నిపర్వతాలు ఉన్నాయి. వాటిలో అన్నిటికన్నా పెద్దది ఒలింపస్ మాన్స్ . తక్కిన మూడింటి పేర్లు - ఆర్సియా, పావోనిస్, ఆస్క్రియస్ మాంటిస్. పృథ్వీ ప్రమాణాలతో చూస్తే మూడూ బృహన్నగాలే. ఇక ఒలింపస్ మాన్స్ అయితే అది నగలోకపు రారాజే. ఈ పర్వతం యొక్క పాదం నుండి చూస్తే దాని ఎత్తు అంతగా తెలిసి రాదు. ఎందుకంటే దాని ఎత్తు 27 కిమీలు అయినా, దాని వెడల్పు 500 కిమీలు! ఈ ఒలింపస్ మాన్స్ఎలాంటి రాకాసి కొండో అర్థం కావాలంటే...

మార్స్ గ్రహం మీద కాలువలు ఉన్నాయా?పందొమ్మిదవ శతాబ్దం అంతంలో మార్స్ ఉపరితలాన్ని దూరదర్శినితో పరిశీలించిన ఇటాలియన్ ఖగోళశాస్త్రవేత్త జియొవానీ షియాపరెల్లీకి మార్స్ గ్రహోపరితలం మీద పొడవాటి రేఖలు కనిపించాయి. వాటిని ఇటాలియన్ లో canali అని పిలుచుకున్నాడు. ఇటాలియన్ లో canali అన్న మాటకి అర్థం channel (సహజ కాలువ). కాని ఇంగ్లీషు వాళ్లు దాన్ని canal (కృత్రిమ కాలువ) గా అనువదించుకున్నారు. తను చూసిన ఆ కాలువలని చిత్రిస్తూ ఎన్నో మాపులు కూడా గీశాడు (చిత్రం)....
postlink