(<-- Before Terraforming)
(<-- After Terraforming)
మానవ నివాసానికి అనుగుణంగా మార్స్ గ్రహాన్ని సంస్కరించడం అనేది ఓ బృహద్ ప్రయత్నం. ఆ ప్రయత్నంలోని మొదటి దశే కొన్ని దశాబ్దాలు, లేదా శతాబ్దాలు పట్టొచ్చు. భూమిని పోలిన పరిస్థితులు అక్కడ నెలకొనాలంటే కొన్ని సహస్రాబ్దాలు కూడా పట్టొచ్చని కొందరు అభిప్రాయపడుతున్నారు. తేమ ఛాయలైనా లేని ఎర్రని బంజరు లోకంలో, చెట్లు చేమలతో, పశుపక్ష్యాదులకే కాక మానవ నాగరక జీవనానికి ఆలవాలం కాగల హరితభూమిగా, ఓ కొత్త బంగారు లోకంగా రూపాంతరం గావించడానికి ఏంటి పద్ధతి? ఇందుకు శాస్త్రవేత్తలు మూడు మార్గాలు ఊహించారు:
1. అంతరిక్షంలో మార్స్ చుట్టూ పరిభ్రమించే పెద్ద పెద్ద అద్దాలని నిలపడం. ఆ అద్దాలు సూర్యకాంతిని గ్రహం మీదకి ప్రతిబింబించి, అక్కడి ఉష్ణోగ్రతని పెంచుతాయి.
వ్యోమనౌకలని చోదించడానికి సౌరతెరచాపలు అనే భావన కొంత కాలంగా ఉంది. వాటి గురించి అంతకు ముందు ఒక పోస్ట్ లో చెప్పుకున్నాం. కొన్ని కిలోమీటర్ల వ్యాసం ఉన్న సన్నని మేలిమి తెరల మీద కాంతి చేసే ఒత్తిడి వల్ల వ్యోమ నౌక చోదింపబడుతుంది. ఆ తెరలని మరో ప్రయోజనం కోసం కూడా వాడొచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ విశాలమైన మెరిసే తెరలని మార్స్ ఆకాశంలో కొన్ని వందల వేల మైళ్ల ఎత్తున స్థిర కక్ష్యలో నిలుపుతారు. అవి సూర్యకాంతిని ప్రతిబింబించి గ్రహం మీదకి ప్రసరించి, గ్రహోపరితలాన్ని వేడెక్కిస్తాయి. మైలార్ అనే పదార్థంతో చేసిన ఈ తెరలని 250 కిమీల వ్యాసం గల వాటిని వాడితే మేలని కొందరు శాస్త్రవేత్తలు సూచించారు. ఈ ’అద్దాల’ లో ఒక్కొక్క దాని బరువు 200,000 టన్నులు ఉంటుంది. అంటే వాటిని ఏకంగా భూమి నించి లాంచ్ చెయ్యడానికి వీలుపడదు. కనుక అంతరిక్షంలో దొరికే పదార్థాలతోనే వీటిని నిర్మించాలన్న ఆలోచన కూడా ఉంది.
ఇంత పెద్ద అద్దాలు కాంతిని గ్రహం మీద ఒక చోట కేంద్రీకరిస్తే ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రత కొన్ని డిగ్రీలు పెరుగుతుంది. ముఖ్యంగా ఆ కాంతిని ధృవాల మీదకి ప్రసరిస్తే అక్కడ ఘనరూపంలో ఉన్న CO2 కరిగి, ఆవిరై వాతావరణంలోకి ప్రవేశిస్తుంది. CO2 హరితగృహ వాయువు అని మనకి తెలుసు. దానికి సూర్యతాపాన్ని లోన దాచుకునే లక్షణం ఉంది. మార్స్ వాతావరణంలో CO2 పాలు పెరిగిందంటే, గాల్లో వేడి పెరిగి, దాని వల్ల ధృవాల వద్ద మరింత ఐసు కరగడం మొదలెడుతుంది. అంటే గాల్లోకి మరింత CO2, అంటే మరింత వేడి... ప్రస్తుతం మనకి అనుభవం అవుతున్న ’గ్లోబల్ వార్మింగ్’ (ధరాతాపనం) ని అక్కడ సృష్టించాలని ఆలోచన. ఏదైతే భూమి మీద జరిగితే దుష్పరిణామం అవుతోందో, సరిగ్గా అలాంటి పరిణామాన్ని కృత్రిమంగా సృష్టించి మార్స్ ని సంస్కరించాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
2. కనుక మార్స్ మీద ఉష్ణోగ్రత పెంచి, అక్కడ వాతావరణాన్ని పోషించడానికి మరో ఉపాయం పైన చేసిన దాన్నే మరింత సూటిగా చెయ్యడం – హరితగృహ వాయువులని ఉత్పన్నం చేసే కర్మాగారాలని అక్కడ స్థాపించడం. ప్రస్తుతం మనం వాడే ఏసీ, రెఫ్రిజెరేటర్ మొదలైన యంత్రాలు క్లోరోఫ్లోరో కార్బన్లని వాతావరణంలోకి వెలువరిస్తాయి. ఇవి హరితగృహ వాయువులు. వాతావరణ తాపనానికి ఈ వాయువులు తోడ్పడతాయి. అయితే ఇది ఆ యంత్రాల అనుకోని దుష్ఫలితమే గాని అది వాటి నిర్మాణంలోని ముఖ్యోద్దేశం కాదు. కాని మర్స్ మీద కేవలమ్ ఆ వాయువులని వాతావరణంలోకి వెలువరించడమే లక్ష్యంగా రూపొందించబడ్డ యంత్రాలని, కర్మాగారాలని స్థాపించి తద్వార అక్కడి వాతావరణంలో ఉష్ణోగ్రతని పెంచడం రెండవ ఉపాయం.
3. ఇక మూడవ పద్ధతి కాస్త దుడుకు పద్ధతి. చాలా వ్యయ ప్రయాసలతో కూడుకున్న పద్ధతి. కొంచెం ప్రమాదకరమైన పద్ధతి. దీన్ని సూచించిన వారు క్రిస్టఫర్ మక్ కే అనే ఖగోళవేత్త, రాబర్ట్ జుబ్రిన్ అనే నవలా రచయిత. మంచుకణికలతో ఆవరించబడి, అమోనియా పుష్కలంగా గల ఓ పెద్ద గ్రహశకలం (asteriod) తో మార్స్ గ్రహాన్ని ఢీ కొట్టిస్తే అనుకున్న పని నెరవేరుతుందని వీరి భావన. అణుధార్మిక రాకెట్ ఇంజెన్లని ఓ గ్రహశకలానికి తగిలించి బాహ్య సౌరమండలంలో ఉన్న గ్రహశకలాలని మార్స్ దిశగా మళ్లించాలి. సెకనుకి 4 కిమీల వేగంతో ఆ ఇంజెన్లు గ్రహశకలాలని చోదిస్తాయి. ఆ విధంగా ఓ పదేళ్లు తోస్తే, పది బిలియన్ టన్నుల బరువు ఉన్న గ్రహశకల రాశిని మార్స్ తో ఢీ కొనేలా ముందుకు తోయొచ్చు. ఆ విఘాతం వల్ల 130 మిలియన్ మెగావాట్ల శక్తి పుడుతుందని అంచనా.
ఇదంతా ఏదో సినిమాలలోను, కాల్పనిక విజ్ఞాన నవలలోను జరిగే వ్యవహారంలా కనిపించొచ్చు. కాని అదే నిజంగా జరిగితే మార్స్ ఉష్ణోగ్రత ఓ మూడు డిగ్రీల సెల్షియస్ పెరగొచ్చు. ఉన్నపళంగా ఉష్ణొగ్రత అంతలా పెరిగితే ధృవాల వద్ద ఐసు కరిగి ఓ ట్రిలియన్ టన్నుల నీరు విడుదల కావచ్చు. ఈ విధంగా ఓ 50 ఏళ్లు మళ్లీ మళ్లీ గ్రహం మీద విస్ఫోటాలు కలుగజేస్తే, ఆ తరువాత మార్స్ మిద వాతావరణం కాస్త వెచ్చగా మారి, గ్రహోపరితలం మీద 25% నీరు నిలువగలదు. కాని గ్రహం మీద అంత పెద్ద విస్ఫోటాలు సృశ్టించడం వల్ల వాతావరణం, పర్యవరణం అస్థిరం అవుతుంది. అది కుదుట పడే వరకు అక్కడ మానవ నివాసాలు నెలకొనడం వీలు కాదు.

శతాబ్దం నడిమి కాలంలో ఎప్పుడో మనిషి మార్స్ మీద అడుగుపెట్టే అవకాశం ఉంది. కాని అక్కడ మానవ సమాజాలు విలసిల్లే రోజు రావడానికి ఇంకా ఎంతో దూరం ఉందని మత్రం కచ్చితంగా చెప్పొచ్చు.
References:
http://science.howstuffworks.com/terraforming2.htm
http://www.redcolony.com/
(సశేషం...)
References:
http://science.howstuffworks.com/terraforming2.htm
http://www.redcolony.com/
(సశేషం...)
బాగుంది,చక్కని విజ్ఞానాన్ని అందించారు.
మీకు తెలిసిన పరిజ్ఞానాన్ని చక్కని,చిక్కని తెలుగులో అందిస్తున్నందుకు ధన్యవాదాలు శ్రీనివాస చక్రవర్తి గారూ!.