శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

పక్షుల తలలో దిక్సూచి

Posted by శ్రీనివాస చక్రవర్తి Tuesday, February 23, 2010పక్షులు ప్రతీ ఏటా గొప్ప దూరాలు వలస పోయి, కొన్ని నెలల ఎడం తరువాత మళ్లీ తిరిగి తమ ఇంటికి చేరుతుంటాయి. అంత చిన్న జీవాలకి అది ఎలా సాధ్యం? వాటి తలలో ఉంటూ వాటికి దారి చూపే దిక్సూచి ఏమిటి? వరుసగా కొన్ని పోస్ట్ లలో ఈ ప్రశ్నలకి సమాధానాలు చర్చించుకుందాం.

అది జూన్ 3, 1952. లండన్ విమానాశ్రయం నుండి ఓ విమానం బయలుదేరింది. అందులో ప్రయాణిస్తున్న ఓ అమెరికన్ వద్ద ఓ వింతైన పెట్టె ఉంది. ఆ పెట్టెలోంచి ఉండుండి ఏవో కూతలు వినిపిస్తున్నాయి. కూతలు వినిపించిన ప్రతిసారి తోటి ప్రయాణీకులు విసుగ్గా ఆ పెట్టెవైపు చూస్తున్నారు.


విమానం బాస్టన్ విమానాశ్రయంలో వాలింది. విమానం దిగగానే ఆ అమెరికన్ తను తెచ్చుకున్న పెట్టెని విమానాశ్రయం సరిహద్దు వరకు తీసుకెళ్ళి, అక్కడ పెట్టె తెరిచి అందులో అంతవరకు బందీగా ఉన్న పక్షిని విడిచిపెట్టాడు. ఆ పిట్ట
రివ్వున ఆకాశంలోకి లేచి, సముద్రం మీదుగా ఎగురుతూ కాసేపట్లోనే కనుమరుగయ్యింది.
పన్నెండున్నర రోజుల తరువాత అదే పక్షి 3,050 మైళ్లు ప్రయాణించి, అట్లాంటిక్ మహాసముద్రాన్ని దాటి, తన గూటికి చేరుకుంది. దాని సొంతిల్లు ఇంగ్లండ్ తీరం మీద ఓ చిన్న దీవి. సగటున రోజుకి 245 మైళ్లు ఎగురుతూ, అంత చిన్న పులుగు రెక్కలల్లారుస్తూ, అలుపు తెలియకుండా, దారి తప్పకుండా తన ఇంటికి చేరుకోగలిగింది అంటే పరమాశ్చర్యం కలుగుతుంది!

ఆ పక్షి మాంక్స్ షేర్వాటర్ అనే జాతికి చెందింది. ఇదో సముద్ర విహంగం. ఈ పక్షులు సామాన్యంగా పశ్చిమ యూరప్, ఉత్తర ఆఫ్రికా తీరాల సమీప దీవుల మీద నివసిస్తాయి. కాని చలికాలంలో బయలుదేరి, అత్యంత దూరాలు ప్రయాణిస్తూ, దక్షిణ అట్లాంటిక్ వరకు కూడా వలస పోతాయి. ఎంతో అరుదుగా మాత్రమే అమెరికా ఖండంలో కూడా ఈ పక్షులు కనిపిస్తాయి. పైన వృత్తాంతంలోని పక్షి అమెరికాకి చూడడం అదే మొదటి సారి అయ్యుంటుంది. అయినా అంత దూరంలో ఉన్న తన సొంతింటికి క్షేమంగా చేరగలిగింది. ఆ అధ్బుతం ఎలా సాధ్యం?

దక్షిణ అట్లాంటిక్ సముద్ర జలాలలో జీవించే ఓ పెద్ద, ఆకుపచ్చని తాబేలు రెండు మూడేళ్లకి ఒకసారి ఆ సముద్రం నడిబొడ్డులో ఉండే అసిన్షన్ ద్వీపం మీద గుడ్లు పెట్టడానికి వెళ్తుంది. అలా ఆ ద్వీపం మీద కనిపించిన ఓ తాబేలు తదనంతరం అక్కడి నుండి 1,400 మైళ్ల దూరంలో ఉండే బ్రెజిల్ తీరం వద్ద కనిపించింది. సముద్రపు లోతుల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆ తాబేటికి దారి చూపిన “దిక్సూచి” ఏమిటి?

వలస పోవడంలో ఇలాంటి నమ్మశక్యం గానంతటి నైపుణ్యం ప్రకృతిలో ఎన్నో జీవజాతుల్లో కనిపిస్తుంది. ఇలాంటి అధ్బుత సామర్థ్యం కొన్ని సార్లు చిన్న చిన్న కీటకాలలో కూడా కనిపిస్తుంది.

అమెరికాలో ఎన్నో చోట్ల కనిపించే మోనార్క్ అనే జాతి సీతాకోకచిలుక వసంతంలో, ఎండాకాలంలో దక్షిణ కెనడా వరకు కూడా ప్రయాణిస్తుంది. అక్కడ శీతాకాలంలో భయంకరమైన చలికి తట్టుకోలేక భద్రంగా తిరిగి అమెరికా కి వచ్చేస్తుంది. కొన్ని సందర్భాలలో ఇంకా వెచ్చగా ఉంటుందని కాబోలు, ఈ రకం సీతాకోక చిలుక ఇంగా దక్షిణంగా ప్రయాణించి మెక్సికో వరకు కూడా అలసిపోకుండా వలసపోయిన దాఖలాలు ఉన్నాయి.ఖండాలు, సముద్రాలు దాటకపోయినా కొన్ని చిన్న పురుగులు ఇరుగు పొరుగు పొలాలలో, బయళ్లలో తమ దారి తెలుసుకుని మసలుకుంటాయి. తుట్ట నుండి పూల వద్దకి ప్రయాణించే తేనెటీగలు, పుట్ట నుండి తీపి వద్దకి ప్రయాణించే చీమలు అందుకు ఉదాహరణలు. ఇవి కొలిచే దూరం చిన్నదని చులకన చెయ్యకండేం? వాటి శరీరాల పరిమాణంతో పోల్చితే అవి కొలిచే దురాలు చాలా ఎక్కువేనని గుర్తించాలి.ఈ జీవాల శరీరంలో వాటికి దారి చూపించే దిక్సూచి మీద శాస్త్రవేత్తల దృష్టి మళ్లింది. ఒక బాహ్య పరిణామాన్ని అర్థం చేసుకోబోయే ముందు సామాన్యంగా శాస్త్రవేత్తలు దాని గురించి వీలైనన్ని వివరాలు రాబడతారు, దాని గురించి కచ్చితమైన కొలతలు తీసుకుంటారు.

వేల మైళ్లు వలస పోయే పక్షుల చలనాల గురించి తీసుకున్న కొలతల్లో ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి.

(సశేషం...)

2 comments

  1. ప్చ్, మీరింకా ఎలా వలస పోతాయో చెబుతారనుకున్నా. సస్పెన్స్ లో పెట్టారు. మీ తదుపరి టపా కోసం ఎదురుచూస్తూ.....

     
  2. ఈ ’పిట్ట’కథ కొంచెం పెద్దది. కాస్త ఓపిక పట్టాలి :-)

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Total Pageviews

There was an error in this gadget
There was an error in this gadget

విజ్ఞానులు

GuestBooker 2.5

Recent Posts

Popular Posts

Follow by Email