శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in other Indian Languages. Please Click here.

ప్రకృతికి ఇంజినీర్లు ఎంతో ఋణపడి ఉన్నారు. గబ్బిలాలని చూసి రాడార్లు తయారు చేశారు. చేపలని చూసి సబ్మెరిన్లు. చీమల ఆహారాన్వేషణా వ్యూహాలని చూసి ’ఆంట్ అల్గరిథమ్స్.’ ఇలా ఎన్నెన్నో... ఇటీవలి కాలంలో biomorphic engineering (జీవలోకం నుండి స్ఫూర్తి గొన్న ఇంజినీరింగ్) అని ఓ పూర్తి శాస్త్రమే ఉద్భవించింది. అలా జీవలోకం నుండి నేర్చుకున్న మరో ఇంజినీరింగ్ పాఠం...

మొక్క జొన్నలకి ఒక ప్రత్యేకత ఉంది. యాభై ఏళ్లు నిలువ ఉంచిన తరువాత తీసి తడినేలలో పాతినా కూడా అద్భుతంగా మొలకలు మొలుస్తాయి. మరి మామూలుగా గాలిలోని తేమతో సంపర్కం ఉన్నప్పుడు వాటిలోని అంతరంగ అంశాలు అలా అర శతాబ్ద కాలం పాటు కూడా చెడిపోకుండా ఉండడంలో ఏంటి రహస్యం?

ఎన్నో ఏళ్ల వ్యవసాయ పరిశోధనలు ఈ రహస్యాన్ని ఛేదించలేకపోయాయి. అయితే 1980 లలో గుట్టు బయటపడింది. మొక్క జొన్న గింజల దీర్ఘాయువుకి కారణం వాటి చుట్టూ ఉండే ఓ ప్రత్యేకమైన, నీటిని చొరబడనీయని తొడుగే. ఈ తొడుగులో ముఖ్యంగా ఉండేది చక్కెర – అంటే సుక్రోస్ (sucrose). ఇది కాక చక్కెరకి సంబంధించిన రఫినోస్ (raffinose) అనే మరో పదార్థం కూడా ఉంటుంది. గింజ పొడిగా ఉన్నంత కాలం ఈ తొడుగు గాజుకవచంలా చక్కని రక్షణ నిస్తుంది. కాని గింజ తడి కాగానే చక్కెర తొడుగు కరిగిపోతుంది. నీరు గింజ లోకి చొరబడి గింజ మొలకెత్తుతుంది.

ఈ విత్తు మహత్యాన్ని చూసి అబ్బురపడ్డ బయోమెడికల్ ఇంజినీర్లు ఈ పద్ధతిలో ఓ కొత్త ఔషధ సరఫరా పద్ధతిని (drug-delivery system) ని రూపొందించారు. డయాబెటిక్ పేషెంట్లు తమకి కావలసిన ఇన్సులిన్ ని, ఇంజెక్షన్లు తీసుకుని అవస్థ పడకుండా, శ్వాస ద్వారా సునాయాసంగా తీసుకునే పద్ధతిని ఈ ఇంజినీర్లు రూపొందించారు. ఈ మందు చేసే పద్ధతి కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఇన్సులిన్ ని చక్కర పదార్థాలతో కలిపి ద్రావకంలా చేసి, ఆ ద్రావకాన్ని సన్నని తుంపరగా వచ్చేట్టుగా ఓ nozzle (సన్నని నోరు ఉన్న నాళం) లోంచి పంపిస్తారు. అలా గాల్లో తుంపరగా వెలుడుతున్న మందు బిందువులు ఠక్కున ఎండిపోతాయి. చక్కెర పూతగల అతి సూక్ష్మమైన ఇన్సులిన్ గుళికలు పొడిలా కింద పడతాయి. ఈ పొడిని డయాబిటిస్ ఉన్న పేషెంట్ పీల్చినప్పుడు ఆ పొడి రేణువులు ఊపిరితిత్తుల లోకి ప్రవేశిస్తాయి. ఊపిరితిత్తులలో తడి గల గాలి తిత్తుల (air sacs) మీద ఈ రేణువులు పడ్డప్పుడు వాటి చుట్టూ ఉండే తొడుగు కరిగిపోతుంది. ఇన్సులిన్ ఆ గాలితిత్తులలో ఉండే రక్తనాళాలలోకి ప్రవేసిస్తుంది. రక్తంలో అధికంగా ఉన్న చక్కెరతో పోరాటం మొదలెడుతుంది.

2006-2007 ప్రాంతాల్లో అమెరికాలో ఈ ఉచ్ఛ్వసనీయమైన ఇన్సులిన్ (inhalable insulin) మార్కెట్లో విడుదల చెయ్యబడింది. ఇంజెక్షన్ ద్వారా ఇవ్వబడే ఇన్సులిన్ లాగే ఈ కొత్త రకం ఇన్సులిన్ కూడా పని చేసినా, దీని ఖరీదు మరీ ఎక్కువ కావడంతో మార్కెట్ లో ఈ మందు ఎక్కువ కాలం నిలదొక్కుకోలేకపోయింది. కాని ఈ రకం మందులని మరింత తక్కువ ఖర్చుతో తయారు చేయడానికి మందుల కంపెనీలు పరిశోధనలు కొనసగిస్తున్నాయి.
References:
1. William Agosta, Thieves, deceivers and killers: Tales of chemistry in Nature, Princeton University Press, 2001.
2. http://en.wikipedia.org/wiki/Inhalable_insulin

6 comments

 1. what is ఆంట్ అల్గరిథమ్స్.? I tried to get it from google.. but no use..

   
 2. Ant Algorithms నేనేప్పుడొ 90 లలో వాడా. జెనెటిక్ ఆల్గరిధం లలో. Not really fresh in my mind but lemme try to scribble a few lines:

  నేను వాడీనది ఒక రోబాట్ ని నడిపించడానికి.


  1. ముందుగా ఒక చీమని సృష్టించాలి
  2. ఆ చీమ ముందుకి, కుడి ప్రక్కకి, ఎడమకి లేక వెనకకి తిరగగలిగి ఉండాలి - లేఖ్క్పోతే ఏమి చెయ్యకుండా ఉండాలి
  3. అక్కడక్కడ చీమకోసం తిండి ఏర్పాటు చేసి, ఆ చీమ తిండిని వెతుక్కునేలా చెయ్యాలి
  4. ఇవ్వబడీన సమయంలో చీమ ఎంత తిండి వీలయితే అంత తిండి అతి తక్కువ సమయంలో తినేలా చెయ్యడమే నా ఏంట్ ఆల్గరిధం.

  మొదటిసారే చీమ మొత్తం తినలేకపోవచ్చు. కానీ కొద్దికొద్దిగా మార్పులు ( మ్యుటేషన్స్) చేసుకుంటూ పోతే ఒకనాటికి చీమ మొత్తం తినగల్గే సామర్ధ్యం సంపాదించే అవకాశాలు ఉన్నాయి

   
 3. Anonymous Says:
 4. Inhalable insulin is withdrawn from market because of so many deaths not because of cost. It caused abnormal blood sugar control.

   
 5. @అశోక్ చౌదరి: ఈ టపాలు చదవండి:

  1. http://scienceintelugu.blogspot.com/2010/04/blog-post.html

  2. http://scienceintelugu.blogspot.com/2010/04/blog-post_04.html

   
 6. Insulin is a dose dependant hormone, abnormal intake can lead to extreme hypoglycaemic conditions... that simply leads to immediate brain death followed by heart failure.. due to which one can not use such non-standardised or side effect oriented drug delivery system.. people were thinking of insulin banana in olden days.. there also same thing can happen but first of all insulin should be able to reach circulation intact restoring its functional efficiency which is hindered by the action proteolytic enzymes in digestive tract and another thing to be considered is that.. a large peptide can't be assimilated into the hepato/renal portal system with such a great ease.. and it varies from person to person, but the activity of insulin would be similar and it depends on dose again.. so no standardization..
  I believe every scientific output may also have an outburst of side effect too, that's the reason why out of 1 million drugs that are designed at an instance only few are released into the market.. still they're not ideal enough.. but just least worst..

  --
  by
  Chandramouli M
  (Ph.D., Dept. of Biochem, University of Hyderabad)

   
 7. Happy to see so many informed and insightful comments. Always felt that this is how a science blog must be.


  Regarding the cause of withdrawal of inhalable insulin, my reference is the wiki article mentioned above. I did not know that even side effects were a reason. I should have looked up more literature to get a broader picture. Thank you very much for the info.

   

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts

Follow by Email