శాస్త్ర విజ్ఞానము ఇప్పుడు మిగతా భారతీయ భాషల్లో కూడా... ఇక్కడ నొక్కి చూడండి. For Science in Tamil Language. Please Click here.


పుస్తకం సారాంశం:


ఒకానొకప్పుడు భూమి పరిమాణం గురించి కూడా మనుషులకి సరిగ్గా తెలిసేది కాదు. మధ్యలో నేల, చుట్టూ అనంతంగా విస్తరించిన సాగరం ఉందని అనుకునేవారు. తదనంతరం పరిమిత పరిమాణం గలదే అయినా, భూమి బల్లపరుపుగా ఉందని అనుకునేవారు. తరువాత భూమి గోళాకారంలో ఉందని తెలుసుకుని దాని చుట్టుకొలతని అంచనా వేశారు. భూమిని కొలిచాక, ఆ జ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని చందమామ దూరం కొలిచారు. చంద్రుడి దూరాన్ని బట్టీ సూర్యుడి దూరాన్ని కొలిచారు. అలాగే క్రమంగా గ్రహాల దూరాలు, సన్నిహిత తారల దూరాలు, సుదూర తారల దూరాలు, పొరుగు గెలాక్సీల దూరాలు, సుదూర గెలాక్సీలు... ఇలా అంచెలంచెలుగా ఖగోళశాస్త్రవేత్తలు చూడదగ్గ విశ్వం యొక్క అంచుల వరకు కొలుస్తూ పోయారు.

విశ్వంలో వివిధ దూరాలలో ఉన్న వస్తువులని కొలవడానికి శాస్త్రవేత్తలు వాడిన పద్ధతులని గమనిస్తే, 100 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వస్తువులని కొలవడానికి ఓ పద్ధతి, ఆపై 100 మిలియన్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న వస్తువులని కొలవడానికి ఇంకో పద్ధతి, ఆంతకన్నా ఎక్కువ దూరంలో ఉన్న వస్తువుల విషయంలో మరో పద్ధతి - ఇలా మొత్తం మూడు పద్ధతులతో, ’అడుగుల’తో అపర వామనుల్లా విశ్వాన్ని కొలవగలిగారు.


ఎన్నో శతాబ్దాల పాటు ఎన్నో వందల పాత్రలతో అద్భుత ప్రతిభతో కూడుకున్న ప్రయత్నాలతో సాగిన ఈ విశ్వాన్ని కొలిచే కథ – ఈ పుస్తకం చెప్పే కథ – మహా ఆసక్తికరంగా ఉంటుంది.

ప్రచురణ కర్తలు:
1. జన విజ్ఞాన వేదిక
జి. మల్యాద్రి, కన్వీనర్, ప్రచురణల విభాగం,
162, విజయలక్ష్మీ నగర్,
నెల్లూరు – 524 004
ఫోన్: 94405 03061

2. మంచి పుస్తకం
12-13-439, వీధి నెం. 1,
తార్నాక, సికింద్రాబాదు 500017.
ఫోన్: 94907 46614
Email: info@manchipustakam.in

8 comments

  1. సంతోషం. అభినందనలు.

     
  2. gaddeswarup Says:
  3. Sounds wonderful. Congratulations and I look forward to more such books.
    Swarup

     
  4. gaddeswarup Says:
  5. Chakravarti garu,
    At one stage I was thinking of topics like Bernoulli effect which have connections with everyday life ( like planning roofs in windy areas, flying planes etc) and topics like how we can conclude that Mercury has molten core. But my background is in mathematics and I cannot write with confidence on other topics. I hope that you will consider such topics too. Thanks.

     
  6. మీ సమాచారం బాగుంది
    తా0జా సమాచారం కోసం ప్రతీ రోజు చదవండి
    http://www.apreporter.com

     
  7. Swarup garu
    Yes, I too have been thinking about Bernoulli's principle. I was not clear about certain aspects of it and didnt find time to complete my homework. BUt will try to write about it at the earliest.

    Since you are a mathematician, can you pl lead me on to some useful popular literature in maths? Will try to write about it in the blog.
    Thank you...

     
  8. gaddeswarup Says:
  9. Chakravarti garu,
    My email address is anandaswarupg@gmail.com
    My yahoo account is compromised, please ignore it. If you write to me at that address, I can send the information I have. I must add that I have been trying to read about poverty and development and have done very little mathematics in the past few years. But I am trying to complete a small introductory book on Algebraic Topolgy.

     
  10. G K S Raja Says:
  11. జనవిజ్ఞాన వేదిక కృషి అభినందనీయం. శ్రీనివాస చక్రవర్తి గారూ! మీ అనువాదాలు పిల్లలకు, వారి తల్లితండ్రులకు చక్కగా అర్ధమయ్యేలా సరళంగా ఉండడం చాలా ఉపయోగంగా ఉంది. అభివందనాలు.
    రాజా.
    gksraja.blogspot.com

     
  12. రాజా గారు. నిజమే జనవిజ్ఞాన వేదిక వాళ్లు ఈ రంగంలో మంచి కృషి చేస్తున్నారు.
    తెలుగులో సైన్స్ సాహిత్య రంగంలో మరింత మంది ప్రచురణ కర్తలు ముందుకు వస్తే బావుంటుంది.

     

Post a Comment

postlink

సైన్సు పుస్తకాలు ఇక్కడ నుంచి కొనవచ్చు.. click on image

అంతరిక్షం చూసొద్దాం రండి

"తారావళీ సూపర్ ట్రావెల్స్" తరపున స్వాగతం... సుస్వాగతం!" "తారావళీ సూపర్ ట్రావెల్స్" గురించి ప్రత్యేకించి మీకు చెప్పనవసరం లేదు. తారాంతర యాత్రా సేవలు అందించడంలో మాకు 120 ఏళ్ల అనుభవం ఉంది. మా హెడ్ క్వార్టర్స్ భూమి మీదే ఉన్నా, సౌరమండలం బయట మాకు చాలా బ్రాంచీలు ఉన్నాయని మీకు బాగా తెలుసు. అంతరిక్షానికి వెళ్ళడానికి ఇక్కడ నొక్కండి

Printer-friendly gadget

Print

ఈ బ్లాగులోని పోస్ట్ లు ఆటోమేటిక్ గా మీ మెయిల్ ఇన్బాక్స్ లోకి చేరడానికి మీ ఈ-మెయిల్ ఐడీని ఎంటర్ చేసి చందాదారులు కండి Enter your email address:

Delivered by FeedBurner

Total

Blogumulus by Roy Tanck and Amanda FazaniInstalled by CahayaBiru.com

Label Category

Followers

archive

Popular Posts