
(ఎప్పుడే నేనే ఏదో సోది రాయడం కాకుండా తెలుగులో సైన్సు రాయాలనుకునే ఔత్సాహికుల రచలనని ఈ బ్లాగ్లో పోస్ట్ చెయ్యాలనే కార్యక్రమంలో మొదటి మెట్టుగా ‘సర్ ఐజాక్ న్యూటన్’ జీవితం మీద ఓ వ్యాసం… శ్రీ.చ.)సర్ ఐజాక్ న్యూటన్ (డిసెంబరు 25, 1642 - మార్చి 20, 1727) ఒక ఆంగ్లేయ భౌతిక, గణిత, ఖగోళ శాస్త్రవేత్త, ఒక సిద్ధాంత కర్త మరియు తత్వవేత్త కూడా. ఈ ప్రపంచంలొ అందరి కంటే గొప్ప శాస్త్రజ్ఞుడని కొనియాడదగిన వాడు. "ప్రకృతిసిద్ధమైన తత్వశాస్త్రం మరియు అది...

http://www.andhrabhoomi.net/intelligent/darwin-katha-3-610దీర్ఘకాలం పట్టే పరిణామ ప్రక్రియ చేత జీవకోటి వికాసం చెందుతోంది అనే సిద్ధాంతం నిజం కావాలంటే అందుకు రెండు కనీస అవసరలు తీరాలి. మొదటిది, భూమి వయసు సుదీర్ఘం కావాలి. రెండవది జీవలోకానికి కూడా సుదీర్ఘమైన గతం ఉండాలి. (ఈ రెండూ కూడా ఒక దాని మీద ఒకటి ఆధారపడే విషయాలు అన్నది గమనించాలి.)పాశ్చాత్య ప్రాచీన సాంప్రదాయంలో సృష్టి ఆరువేల ఏళ్ల క్రితం జరిగిందని అనుకునేవారని కిందటి సారి చెప్పుకున్నాం. ఐర్లండ్...

http://www.andhrabhoomi.net/more/sisindri ఆ విధంగా యాభై ఆరేళ్ల వయసులో కొలంబస్ తన నాలుగవ యాత్ర మీద బయలుదేరాడు. ఈ సారి ఎలాగైనా ఇండియా, చైనాలని కనుక్కోవాలన్న ధృఢ సంకల్పంతో బయల్దేరాడు. హైటీ కి మాత్రం వెళ్ళరాదని రాజు, రాణి పెట్టిన షరతుకి ఒప్పుకున్నాడే గాని కొలంబస్ కి ఆ షరతుకి కట్టుబడే ఉద్దేశం లేదు. మళ్లీ హైటీకి వెళ్లి తనని హింసించిన వారి మీద ప్రతీకారం తీసుకోవాలని తన మనసు ఉవ్విళ్లూరుతోంది. కనుక నేరుగా తన ఓడలని హైటీ దిశగా పోనిచ్చాడు. తీరానికి...

http://www.andhrabhoomi.net/intelligent/ship-builder-093బ్రిటిష్ పరిపానలలో ఉన్న పందొమ్మిదవ శతాబ్దపు భారత దేశంలో జీవించిన ఓ గొప్ప మెరైన్ ఇంజినీరు ఆర్దశీర్ కుర్సట్జీ (1808-1877). ఇతడు ఫార్సీ జాతికి చెందినవాడు. ప్రపంచంలో అన్ని ప్రాంతాల్లో బ్రిటిష్ వారు తమ ఆధిపత్యాన్ని చూపించుకోగలగడానికి కారణం వారి సాంకేతిక నైపుణ్యం. ఆవిరి యంత్రం మొదలైన ఆవిష్కరణల వల్ల వచ్చిన పారిశ్రామిక విప్లవం బ్రిటిష్ వారి ప్రాబల్యానికి హేతువయ్యింది. ఆ సాంకేతిక బలంతోనే మన...

http://www.andhrabhoomi.net/intelligent/darwin-katha-2-100తక్కిన దేశాల ప్రాచీన సాంప్రదాయాలతో పోల్చితే ప్రాచీన భారత సాంప్రదాయంలో కాలమానం చాలా భిన్నంగా ఉంటుంది. అతి క్లుప్తమైన వ్యవధుల దగ్గరి నుండి ఊహించరానంత దీర్ఘమైన యుగాల వరకు భారతీయ కాలమానం బృహత్తరంగా విస్తరించి ఉంటుంది. ఉదాహరణకి మనం సామాన్య సంభాషణల్లో ‘తృటిలో జరిగిపోయింది’ అంటుంటాం. ఆ తృటి విలువ ఆధునిక కాలమానంలో సెకనులో 3290 వంతు. అంత కన్నా చిన్న వ్యవధి ‘పరమాణు’. దీని విలువ 16.8 మైక్రోసెకన్లు...

http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-656“కొత్త లోకం”లో చెలరేగుతున్న నిరసనలని కొలంబస్ అదుపు చెయ్యలేకున్నాడు అన్న కారణం చేత స్పెయిన్ రాజు ఫెర్డినాండ్ పరిస్థితిని చక్కబెట్టుకు రమ్మని బోబడియా అనే అధికారిని పంపాడు.బోబడియా వెంటనే పయనమయ్యాడు. అయితే బోబడియా హైటీని చేరుకునే సరికే కొలంబస్ అక్కడ పరిస్థితులని చక్కబెట్టాడు. సమస్యకి కారణమైన రోల్డాన్ తో రాజీ కుదుర్చుకుని ఆ ప్రాంతంలో తిరిగి శాంతి నెలకొనేలా చేశాడు. బోబడియా హైటీ తీరం...

http://www.andhrabhoomi.net/intelligent/parimaman-992విశ్వం ఎప్పుడు, ఎలా, ఎక్కణ్ణుంచి పుట్టింది? భూమి ఎలా ఆవిర్భవించింది? భూమి మీద జీవజాతులు ఎలా పుట్టాయి? మానవుడు ఎలా అవతరించాడు?... ఆలోచన పుట్టిన నాటి నుండి మనిషి మనసులో ఇలాంటి ప్రశ్నలు మెదుల్తూనే ఉన్నాయి. ఖగోళం, అందులోని వస్తువుల పుట్టుపూర్వోత్తరాల మాట ఎలా ఉన్నా, మనిషి పుట్టుకకి గురించిన ప్రశ్నలు వాటి సమాధానాలు ప్రతీ మనిషికి మరింత అర్థవంతమైనవిగా, ముఖ్యమైనవిగా అగుపిస్తాయి. ఈ విషయంలో సామాన్య...

http://www.andhrabhoomi.net/intelligent/munchu-991ఇటీవలి కాలంలో 2012 సంవత్సరం ఓ ప్రత్యేకతని సంతరించుకుంది. ప్రాచీన మాయన్ కాలెండరు ప్రకారం వచ్చే ఏడాది లోకం అంతమైపోతుంది అన్న వదంతి కొంతకాలంగా ప్రచారంలో ఉంది. ఆ యుగాంతానికి రకరకాల కారణాలు ప్రతిపాదించబడ్డాయి. భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటాలు, ఉల్కాపాతాలు, ధృవాలు తారుమారు కావడాలు – ఒకటా రెండా, బోలెడు భీభత్సమైన కారణాలు. ఇవి కాకుండా మంచు వల్ల మానవ జాతి నాశనం కానుంది అన్న విచిత్రమైన భావన ఇంచుమించు...

కొలంబస్ యాత్రల పట్ల స్పెయిన్ రాచదంపతులలో సందేహం కలగడం వల్ల అతడి యాత్ర ఆలస్యం కాసాగింది. కాని రాణి ఇసబెల్లా కి మొదటి నుండి కొలంబస్ పథకాల పట్ల నమ్మకం ఉండేది. కనుక మంచి మాటలు చెప్పి విముఖంగా ఉన్న రాజు ఫెర్డినాండ్ ని కొలంబస్ పట్ల సుముఖంగా అయ్యేట్టు చేసింది. దాంతో కొలంబస్ యాత్రకి కావలసిన నిధులు మంజూరు అయ్యాయి. ఆరు ఓడలతో, తగినంత మంది సిబ్బందితో, సంభారాలతో మే 12, 1498 నాడు కొలంబస్ తన మూడవ యాత్ర మీద పయనమయ్యాడు. కొలంబస్ యాత్రల పట్ల రాచదంపతులే కాక,...

ఈ విషయాలన్నీ పొందుపరుస్తూ లెవోషియే 1789 లో ఓ పుస్తకం ప్రచురించాడు. తన కొత్త సిద్ధాంతాలని, పరిభాషని ఆధారంగా చేసుకుని అందులో రసయనిక విజ్ఞానం అంతటికి ఓ సమగ్రరూపాన్ని ఇచ్చాడు. ఆధునిక రసాయనిక విజ్ఞానంలో అది మొట్టమొదటి గ్రంథం అని చెప్పుకోవచ్చు. ఆ పుస్తకంలో అంతవరకు తెలిసిన రసాయనిక మూలకాల పట్టిక ఇచ్చాడు లెవోషియే. బాయిల్ చాటిన నిర్వచనం ప్రకారం (“మరింత సరళమైన అంశాలుగా అవిభాజనీయమైన పదార్థాలు మూలకాలు”) తాను ఏవైతే మూలకాలు అని నమ్మాడో వాటన్నిటినీ ఆ...

http://www.andhrabhoomi.net/intelligent/balli-979 “దొంగలు, స్పైడర్ మాన్, బల్లులు – ఈ ముగ్గురిలోను సామన్య లక్షణం ఏంటో చెప్పు చూద్దాం,” తన ఎదురుగా ఉన్న చాంతాడంత క్యూని లెక్కచెయ్యకుండా పక్కనే ఉన్న మస్తాన్ రావు మీదకి అలవోకగా ఓ పజిల్ విసిరాడు కాషియర్ సుబ్బారావు. తలెత్తకుండా పని చేసుకుంటున్న మస్తాన్ రావుని ఓ సారి రుసురుసా చూసి, “గోడలెక్కడం!” అని సమాధానం చెప్పి తనే నవ్వేసుకున్నాడు. గోడలెక్కే సామర్థ్యం మనకి ఓ పెద్ద వైజ్ఞానిక విశేషంలా కనిపించదు....

http://www.andhrabhoomi.net/sisindri/lokam-chuttina-veerudu-487
స్పెయిన్, రాజు రాణుల మద్దతుతో కొలంబస్ రెండవ యాత్ర మొదలయ్యింది. ఈ సారి యాత్ర లక్ష్యం బంగారం. ఈ సారి వచ్చేటప్పుడు “కొత్త లోకం” నుండి మణుగుల కొద్ది బంగారం తెచ్చిస్తానని కొలంబస్ వాగ్దానం చేశాడు. తనతో వచ్చిన వెయ్యిన్నర సిబ్బంది ఆ ఆశతోనే ఈ దారుణ యాత్ర మీద బయలుదేరారు.
క్రిందటి యాత్రలో తాము సందర్శించిన దీవులన్నిటినీ సందర్శిస్తూ వాటిలో పెద్దదైన హైటీ (దాన్ని కొలంబస్ హిస్పానియోలా...

http://www.andhrabhoomi.net/intelligent/srinivasa-207
ఎప్పుడూ ఒకే సమస్యని పట్టుకుని వేలాడకుండా, ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకుంటూ, తనకి పరిచయం లేని వైజ్ఞానిక రంగాల్లో చొచ్చుకుపోతూ, పరిశోధనలు చెయ్యడం అంటే మేటి అమెరికన్ భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత, రిచర్డ్ ఫెయిన్మన్ కి సరదా. ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయంలో పని చేసే రోజుల్లో ఒక సారి, తను ఎప్పుడూ పని చేసే సైద్ధాంతిక భౌతిక శాస్త్రాన్ని వదిలిపెట్టి సరదాగా జీవశాస్త్రంలో వేలు పెట్టి...
postlink